Friday, October 24, 2008

పదముల పయనం

నడక లో వేగం పని తో పరుగు
అలుపన్నది లేదు కనక
ఆనందం అందులోనే వుంది
కవయిత్రి నవుదామంటే పద్యాలు రాయను
కాని కలం కదిపితే పదాలు ఆగవు
కవిత అని చేపుదామంటే అది భావం మాత్రమె

Thursday, October 9, 2008

స్ఫూర్తిదాయక కవిత

పలుకులతో ఆగిపోకుండా ప్రహసనం మొదలెడదాం
వట్టి మాటలు కావు మావి గట్టి చర్యలు అని చాటుదాం
నిరాసక్తత నిస్సహాయత దరి చేరనీయక విజయానికి పోరాడదాం
నవ యువ భారతావనిని నిర్మిద్దాం
అనుభవం మాత్రమే కలిగిన రాజకీయ నాయకత్వానికి
మన జవసత్వాలు జోడిద్దాం
మన దేశ కీర్తి పతాకాలు అన్ని చోట్లా నిలుపుదాంకోట్లాది
ప్రజల కలలు పండిద్దాం

భావుకత

వీచే పువుకి ప్రాణం పోసే సూర్యుడిని కాను
నవ్వే పుష్పానికి జీవం ఇచ్చే నీటిని కాను
విరులని నిలిపే వృక్షాలు నిలబడే మట్టిని కాను
వీటన్నిటినీ అందించే హృదయాన్ని నేను
కనుకనే ఆనందాన్ని పొందుతాను
అందాన్ని ఆస్వాదిస్తాను
మంచి తనాన్ని పెంపొందిస్తాను
సంతోషాన్ని ఆహ్వానిస్తాను

నా అక్షరీకరణ

మౌనాన్ని భాష గా మార్చలేని నాడు
భావాన్ని నలుగురికీ పంచని నాడు
అక్షర కిరణాలతో జనుల తలుపు తటుతూ
నిజాల వెలుగులు నిమ్పలేని నాడు
ఈ కలం నాకు వద్దు
సాహిత్యపు తేనెలు రుచి చూపిస్తూ
స్వచ్ఛమైన మనసులు తాకే కలమే ముద్దు

తాత్త్విక చింతన

1. కరిగిపోయిన కలల మీద రాయనా కవితని
కలిసిరాని కాలం మీద కదపనా కలాన్ని
కరువైన కరుణ గురించి విప్పనా గళాన్ని
దూరమైన మంచితనం మీద వల్లించనా పాఠాన్ని
కవితల పలక మీద చెరిగిపోతున్న అక్షరాలూ
మనోఫలకం పైన నిలిచిపోయిన భావాలూ
మనవి కావనుకుని వేరయిన బంధాలూ
పలకరించని స్నేహపు సుగంధాలూ

మాపటి పూటంటి మాటున జేరగ

సాయం సంధ్యపు చీకటి చాటున దూరగ

వర్ణన లేవీ వర్ణమాలలు ఏవీ పర్ణశాలలు ఏవీ

నా పద, పద్య పాకశాలలో వీటన్నిటి మాటశాలలో!!

2. పచ్చని చీరను చుట్టిన పుడమిపై

నును వెచ్చని కిరణపు పలకరింపుతో
పక్షుల గానము వీనులవిందుగ
మన అందరికీ మనసులు నింపగ

పరుగులు ఆపీ ప్రతి లిపిని దీసీ

ప్రతినిత్యము పద, పద్యములు వ్రాసీ

పసివారికీ పాఠకులకూ కధలను అల్లీ

అవి అందించిన రచయితలకు జవాబుల మాలను పంచీ

పొద్దు గడిచాకా ఝాము దాటాకా

పడమటమ్మ నుదుటిని మొత్తం పరిచే
కమలముల నేస్తం కనుమల నుంచి జాలువారగా

మంచు బిందువుల‌ కన్నా మిన్నగ

మంచితనముతో కరిగే మనసును

కమలముల రేడు నిశి రాతిరి రాజూ

మబ్బుల మాటున దాగిన వెన్నెల


చల్లని స్పర్శ నుదుటిని దాకగ
ఇలపైనే ఇంటి వద్దనే  నిలిచే చెట్ల‌నీడన
నిదురించాలీ అనునిత్యమ్మూ
ఇవ్విధముగ సాగాలీ అనుదినమూ

God

World is created from GOD
HeyLord,

You have created us...
But we have not located U...
U have given us nature to enjoy...
But we have never made U part of our Joice...


I pray that still U should always be with us...
In tears, in fears, in pressure in trouble to help us...
And also in Happiness in Loneliness with everything with nothing...

Hey Lord Please be with us...