Saturday, May 28, 2022

1000కీ స్తుతులు

1. స్రగ్విణీ, ర, ర, ర, ర యతి 7

దక్షిణా మూర్తి! మా దైవమీవేనయా

రక్షణీయంగనే రాగదే ధాత్రికిన్

శిక్షలే వద్దయా శ్రీకరా నీకృపా

వీక్షణల్ చాలులే! భీతినిం ద్రోలుమా


2. గణనాథ వృత్తము, భ, య, భ, య యతి 7

శంకర సుతా ! నీ సన్నిధిని జేరన్

జంకితిని రావా సజ్జన సుపోషా !

యింకయును మాపై యీ యలక లేలా

సంకట వినాశా స్వామి దయనిమ్మా


3. ఖచరప్లుతము 34 43 న భ భ మ స స వ యతి 12

ధరణిఁ మోయు మహా బల నాగేంద్రా హరి తల్పమువైతివే

పరుగుతో జనుచుండగ దారిన్ ప్రాకెడి నిన్ను స్పృశించినన్ 

సరగు కాటును వేయక దీవింౘన్ దయ చూపగ కోరెదన్  

తరము ముందుకు సాగుట కై సంతానపు భాగ్యమునీయుమా

4. పంచ చామరము జ ర జ ర జ గ యతి 10 

నదీమ తల్లి గంగ నాథ! నంది వాహనా భవా

సదా శివా యనుగ్రహమ్ము చాలు నాదిదేవుడా 

ముదాన నిమ్ము శంకరా తపో ధనమ్ము పొంద నీ

పదంపు నీడ వేడినాము భక్త వత్సలా హరా

5. వాణీ వృత్తము, 146 మ భ న న య న గ 10

అమ్మా నీ నామము దలచు నపుడును మా మానసమునన్

గ్రమ్మే చీకట్లను గని యలుగకు భవానీ నయముగన్

రమ్మా భూ లోకమునకు సరగున కపర్థీ సతి! సదా

నమ్మేమమ్మా నిను మనమున విడువక గొల్చేము! హిమజా


119 చంపకమాలి భ మ స గ 7

శ్రీ రఘు రామా! యాశ్రిత పోషా

శూర! కిషోరా! హే సుర పూజ్యా

భారము నీదే! పావన నామా

చేరిక నిమ్మా యో స్మిత రూపా

6. 36 96 ప్రియవచనము న య మ గ 7

జనక సుతా భాస్వత్సచ్ఛీలా

వని కనియున్ విధ్వంసశ్రేణిన్

వినుత గుణాఢ్యా విశ్వాసంబున్

వనజ ! యిడమ్మా వాత్సల్యమ్మున్

7. మృత్యుంజయ వృత్తము, త, మ, ల గ గణములు, యతి లేదు

శ్రీ ఆంజనేయా చిన్నదౌ

ప్రాయంబునే పూర్ణమ్ముగన్

వ్రాయించినావే బ్రహ్మ తో

నీయాయు రేఖన్! దేవరా

8. . మేదురదన్తమ్ (కిరీట వృత్తము), భ, భ, భ, భ, భ, భ, భ, భ యతి 13

మానిని! మా కడ లోపములెంచకు 

మా! నిను గొల్చెడి వేళల యందున

మానసమందున యిద్ధరి లో గల మాయని బాధల దల్చుట గాంచుచు!

మానవ జాతికి నైజము శోకము  మానక యుండుట యేనని తల్లిగ

తేనెల పల్కుల చిల్కుచు బాధల  దీర్చుచు జ్ఞానమొసంగుమ శాంభవి


9. సావిత్రీ వృత్తము మ, మ గణములు యతి లేదు

మాణిక్యమ్మౌ విద్యా

రాణీ శర్వాణీ హే

వీణా పాణీ తల్లీ 

వేణీ జ్ఞానమ్మిమ్మా


10. 180 మణిరంగము ర స స గ 6


కింక లేలనొ కేశవ పుత్రా

పంకజోద్భవ బ్రహ్మ! సదా మా

వంక జూడుమ! ప్రాణ ప్రదాతా

శంక లేలనయ సన్నిధినిమ్మా

Friday, May 27, 2022

పరిష్కరింౘ బడినవి - 1000 భాగవతము

1 రుచిరము, జ, భ, స, జ, గ యతి 9


హిరణ్య కశ్యపుడు మహేంద్ర వైరి యీ

ధరాతలమ్మునకును దైవమంచు తా

మురారి భక్తులకును ముప్పు తెచ్చుచున్

విరోధి భావము మది పెంచె సూను పై


2.శ్యేని ర జ ర వ 7 

తాను గాక వేరు దైవమెవ్వఱో

భానుడై జ్వలించు వాసుదేవుడా

దానవాంతకుండు దైత్య హారికిన్

హాని జేయపూనె  నాగ్రహమ్ముతో


3. 173 119 మణిభూషణము ర న భ భ ర 10

ఉక్కు కంబమును జేరి మహోజ్వల శూరుపై

నొక్క వేటునట వేయగ నుగ్ర ముఖమ్ముతో

మ్రొక్కు వారలను గాచెడి మూర్తి నృ సింహుడే

దిక్కులన్నియును నింపె సుదీర్ఘ  నఖమ్ములన్


4 అలసగతి న స న భ య 10 

కరయుగళి బట్టె ఘన గర్జనల తోడన్

నరహరి రిపున్ బలమున న్ దితి సుతుండున్

శరము గద నాయుధము శస్త్రములు వీడెన్

నరములను ద్రుంచి యరి నాశమొ నరించెన్


పైది మార్చండి 


5. సుగంధి, ర జ ర జ ర యతి 9


వేఱుమాటలేల ధీరవీరుడైన దేవుడౌ

నాఱసింహ గాథ విన్ననాశమౌను కష్టముల్

తీఱుగాను గొల్చినంత! తీరు దుష్ట పీడలున్

జాఱకుండ పట్టరండి సన్నుతించి స్వామినే 


గజేంద్ర మోక్షము

6. 176 151 రథోద్దతము (శాంతిక) 

ర న ర వ 7

ఆజి = యుద్ధము ఏజనము = కాంతి, చలనము

[ప్రాసాక్షర పద కోశము] 


రాజసాల కరి రాజు దీర్ఘ ఘో

రాజి మేని పస యంత నాశమై

యేజనమ్ముడుగ నేడ్చి నిర్బలుం

డై జగాధిపుని నార్తి వేడె తాన్


7. 45 134 మనోజ్ఞ న జ జ భ ర 10

ప్రాసాక్షర పద కోశము

పరములు = కనుబొమ్మలు, మురి = గర్వము 

శరణము వేడె రమేశుసాయము కోరుచున్ 

కరము పదమ్ములు డయ్యగన్ కడు దీనుడై

చెర విడిపించుమటంచు శీఘ్రమె రమ్మనెన్ 

గరువము దించెను రెండు కన్నుల మూయుచున్

8. 117 108 భూతిలకము 

భ భ ర స జ జ గ 12 

నాదను దంతయు శూన్యమే యని నమ్మినంతనె వచ్చునే

ఖేదము బాపెడి దైవమౌ హరి కీడుఁ ద్రోలును సృష్టిలో

నాదియు నంతము తానె యైన దయాంబుధుండగు ధీరుడున్

వేదము గొల్చెడి విష్ణువీతడుఁ వేగమే చనె చెంతకున్

9. నలిని వృత్తము, 5 స గణములూ, యతి 10వ అక్షరము. 

కరి దుస్థితి గాంచుచు చక్రము వేసెను యా

హరి యే మకరమ్మును తా హతమార్చగనే

చెర వీడినదై తరలెన్ సెరగుల్ కరుగన్

పరమేశుని వాక్కువలన్; పరమంది ౘనెన్ 

10. భూనుతము ర న భ భ గ గ 10 

తుచ్ఛమౌ తలపు లేవియు తోచని వాడౌ

స్వచ్ఛమైన మది గల్గిన బాలుని జూచి తా

నిచ్ఛ తోడ! ధృవుకై కడు హేలగ నిచ్చెన్

గుచ్ఛమై పరగు హస్తము గోరిన రీతిన్

11. 137 95 ప్రహర్షిణి మ న జ ర గ 8

అన్నా యాదుకొనెడునాప్త బంధువా ర

 మ్మ న్నీ నీవెననుచు నార్తి తోడ వేడన్

కన్నీరై కరగిన కంజ నేత్ర గాచన్

కన్నయ్యే కరుణను కాన్క చీరెలిచ్చెన్


12. 99 115 మందర భ న భ న భ న ర యతి 13

పాడి నొసగెడి గోవులను తన బాల్య మందున ను గాచెనే

కీడు సలిపెడి రక్కసులనిట కేళి వలెను జయించెనే

మూడడుగులకు చోటునడుగుచు భూమి గగనము నింపగన్

ఱేడు తదుపరి వంచె శిరమును! శ్రీ హరికిడిన మాటపై

13 కోకనదము భ భ భ స యతి 7

తామస నాశుడు! దైత్యుల దరిమెన్

మామగు కంసుని మత్సరమణచెన్

భామిని కుబ్జకు స్వస్థత నొసగెన్

సోముని పాలను జూచియు గెలిచెన్


14. మదన దర్పణ ఛందము

 భ స జ ర జ గ 11

వేదములను గాచె మత్స్య రూపియైన విష్ణువే

యీది జలము లందునద్రి హాయిగన్ వహించె తా

నాది పురుషుడైన యా వరాహ మూర్తి యొక్క యా

పాదములను కొల్చు వారి పాప రాశి నాశమౌ

15. నారాచ త, ర, వ, 

యతి లేదు

కాళింది లోతు నుండి పా

తాళమ్ము చెంతకంపె నా

వ్యాళున్ భుజంగరాజు నీ

కేళీ వినోది కృష్ణుడే

16. తన్వి  భ త న స భ భ న య 13 

దేవకి పుత్రా యదుకులమునకే దీపమువై వెలిగితివయ కృష్ణా

ఆవుల రక్షించితివి గిరి సునా యాసము గా నిలిచెను నఖమందున్

రేవున స్త్రీలందఱి వలువలఁ లే లేత కరమ్ముల గొనుచును దాచం  

గా వనితల్ చూచి భయమును పొందంగా నిను వేడుచు నడిగిరి! చీరల్

17. సుముఖి న జ జ ల గ 7 

విలవిల లాడు వియోగముతో

వలచిన యింతి వరించుటకై

తెలుపగ శ్రీపతి! వచ్చితివే

కలికిని పొందగ! రుక్మిణికై

18. ఇల స జ న న స 8 

కలశాబ్ధి పుత్రిక! కలికి! యగు సిరి తా

వలచెన్ సుభవ్య విభవములకు నెలవై

యలరారు దేవునిహరిని ముదముగనే

నిలిచెన్ రమాధవుని హృదిని స్థిరముగన్


19. జలోద్ధతగతి, జ, స, జ, స యతి 8

యశోద తనయా! దయార్ద్ర హృదయా

కిశోరుడవు నంద కృష్ణ! మది నీ

వశమ్ము సతతమ్ము! పాండవ సఖా

విశాల నయనా యభీష్ట వరదా


20.   53 సుకేసరము న జ భ జ ర 11

ధనరజతమ్ము స్వర్ణముల దాటు సంపదౌ

మునులు తపించు దృశ్యములు మోదమీయగన్

జనని యశోద గన్గొనెను సర్వ లోకముల్

మనసున మాయ కమ్మగనె మాయమాయెనే

Thursday, May 19, 2022

1000 - పరిష్కరింౘ బడినవి - భారతమూ

 1 నిశ ఛందము, ప్రాస కలదు,

 న, న, ర, ర, ర, ర యతి 9

నలుడు నిషధ రాజ్య నాథుండు రాయంచ పల్కంగనే

లలిత సుగుణ శీలి లావణ్య సౌందర్య రత్నంబునై

వెలుగు వనిత యైన భీష్మాచలా ధీశ పుత్రిన్ మదిన్

వలచుచు దమయంతి పై చింతతో నుండ సాగెన్ సదా


2. సింహరేఖ / ర, జ, గ, గ, యతి లేదు

రాజహంస నింగిదారిన్

రాజకన్య చెంత కేగెన్

రాజపుత్ర వీర గాథల్

రోజు తాను దెల్ప సాగెన్


3.తోదకము భ, భ, భ, గ, గ యతి - 7

అంతట నా దమయంతి దలంచెన్

పొంతము నా గుణ భూషణుతోడన్

కంతువ నందున కాంచుచునుండెన్

కాంతునిగా నలు కంజనిభాస్యున్


4. మంగళగీతి, 4 ఇంద్ర గణములు, 3వ గణాద్యక్షరము యతి

సురులను వలదని సుదతియె వలచుచు

నరుఁడగు నరపతి నలునకు వేసెను

వరమాల గొని స్వయం వరమున ముదమున

కరముల పట్టిన కామిని దమయంతి


5. గగనమణి/ న, న, న, భ, న, లగ, యతి - 10

అలిగిన కలి పురుషుడంతట కసిగ మదిన్

బలిగ నలుని చెఱను పట్టగ తలచు కొనెన్

విలువలనెపుడు విడని వీరుడు నలుడగుటన్

కలి యతనిని పడయగందినములు గడిచెన్


6. పృథ్వి జ, స, జ, స, య, వ యతి - 12

ప్రమాదకరమౌ యశౌచమును పట్టె! పాదమ్మునన్!

తమో గుణము నిండె జూదమున దమ్ముతో నోడగన్

సమస్తమగు రాజ్యభోగములు శాంతియున్ కోల్పడెన్

శమించుట యసాధ్యమౌ సరళిఁ సర్వమున్ పోవగా.


7. నాగర / భ, ర, వ - యతి లేదు 

హానెను = విడచెను

కానలకేగె పత్నితో

దీనత నిండగా మదిన్

మేనును గాచు వస్త్రమున్

హానెను భుక్తికై యిటన్


8. మధురాక్కర / 

1 సూ + 3 ఇం + 1 చం, 

యతి - 4వ గణాద్యక్షరము 

కలిపురుషుని ప్రభావమ్ము కలుగంగ తలపునందున్

లలిత సుకుమారియు హృదయ రాణియు నని జూడక

నలుడు దమయంతిని వనమున విడచి యొంటరిగా

వెలుగు కంటె ముందె విడిచి వెడలెను నిస్పృహతో


9. అంతరాక్కఱ / 1 సూ + 2 ఇం + 1 చం, యతి 3వ గణాంత్యక్షరము 

అంత నిదుఱ మేల్కొన్న యా దమయంతియె

చింత పడుచు లేచి నడచి సాగుచుండ

వింత సీదరమొకటి విషాదముగ

అంతమొందింౘ బోయెనపుడు వచ్చిన


10. స్వాగతము / 

ర, న, భ, గగ - యతి 7


వేటగాడొకడు వేటును వేసెన్ 

కాటుకై నిలుచు కర్కటి పైనన్

మాటునుండియును మానిని గాచెన్

చేటొనర్చ తలచెన్ మదిలోనన్



11. అల్పాక్కర / 2ఇం + 1 చం - 3వ గణాద్యక్షరం యతి


వలచి పొందెడి ఆశ పడి ఆతను

నలుని పత్నిని చేర నడచి వచ్చెన్

ఫలితమాతనికి శాపమునిచ్చిన

కలికి! ముందుకు సాగె కాన నుండి


12. మధ్యాక్కఱ /

 2ఇం + 1 సూ + 2 ఇం + 1 సూ 

4వ గణాద్యక్షరం యతి


అనల కీలలచిక్కి నట్టి యహిరాజు కర్కోటకమును

వనమున కావల చేర్చ  పాము నలుని కాటు వేసె

తనకుదంష్ట్రా హతి నీయ తగదను నలునితో పలికె

మనుగడ కొఱకు నయోధ్య క్ష్మాపతి ఋతుపర్ణు జేరు

13.

మహాక్కఱ / 1 సూ + 5 ఇం + 1 చం యతి 5వ గణాద్యక్షరం 

అతని కొలువు నందున జేరి నేర్పునీ వశ్వ హృదయమును! శుభ వేళన 

క్షితిని దరిమి రక్షణనొసగి సతము క్షేమము నిచ్చు నక్ష హృదయము

బ్రతుకునందు పట్టిన శని వదులును భావిలో నెనలేని మేలు కల్గు

సుతులు సతితోడ జేర్చును శీఘ్రము శోభ దక్కును రాజ్యమును దొరుకు


14. మనోరమ / న ర జ గ 7 యతి

అని యొసంగి మాయ వస్త్రమున్

మనుజనాథ నీవు దీక్షతో

తనను దల్చినంత తొల్లిదౌ

తనువు రూపమంద వచ్చనెన్


15. చంద్రవర్త్మ / ర న భ స యతి 7 

యంత = రథ సారథి, కంత = గడుపు

అంత నా నలుడు నా పలుకులతో

చింత వీడి నృపు చెంతకు వెడలెన్

యంతగా నట దయన్ కొలువిడగా

కంత సాగెనిక కాలము వడిగన్

16. మంజు భాషిణి / స జ స జ గ యతి 9

సుమనోహరాంగి కడు శోభనాంగి యౌ

దమయంతి కానలను సాగు వేళ లో

మమకార రక్ష లిడె మాతృమూర్తి యో

కమలాక్షి జీవితము కమ్మగా చనన్


17. హరిహర / భ జ న త యతీ 7

తారి = సూత్రధారి 

చేరెను విదర్భ చెదరె కష్టమ్ము

చారులను పంపె సఖుని కోసమ్ము

తారిగ సమస్త ధరను గాంచంగ

పారె పథకమ్ము పతియె దక్కంగ

18. బంధురము న న న న స భ భ భ గ యతి 16

ఖలత = దుష్టత్వం ప్రాసాక్షర పద కోశము

నలుడు రథము నడుపు విధము గని యానందముగా ఋతుపర్ణుడనెన్

తెలిపెదనిపుడొక ఫలములనిడు విద్దెన్ విను నామము యక్ష హృదియౌ

నలత కలత లలత ఖలత లవి యేనాటికి నింకను రావుదరిన్

మలచుకొనుమమనుగడనిక యని ప్రేమన్నిడె నశ్వ హృదిన్ శుభమై


19. కమల విలసితము / న న న న గ గ యతి 9 59/26


కలిసిరి యిరువురు కరగెను బాధల్

గెలిచెను రణమున కిలకిల మ్రోగెన్

పలుకుల నగవులు పగలును రేయిన్

ఫలశ్రుతి దలచిన ఫలితము దక్కున్


20.  ఫలసదనము న న న న స గ యతి 10 

నలునిచిలునిదలచిన కలిపురుషుండున్

తొలగి తరలి వెడలు దొఱకును ఫలమ్ముల్

కలిమి కలుగు త్వరిత గతిని నను వాక్కున్

పలికిరి సురులు సులభ గతి నరులొందన్

Wednesday, May 11, 2022

1000 - పరిష్కరింౘ బడినవి - రామాయణమూ

రామాయణము

1. డిండిమ జ, స, న, జ, ర, ప్రాస కలదు, యతి 11

అయోధ్యయను రాజ్యమున ధరాధినాథుడై 

సుయోధుడగు పంక్తిరథుడు శోభతో దయా

పయోనిధి తనర్చు తనదు! వంశ వృద్ధి కొ

క్క యాగమును చేసె సుతుల కాంచు కాంక్ష తో

2. తరలి వృతము, భ, స, న, జ, న, ర , యతి 11

ఆ దశరథుడే గురువుల నానతి గొని వేగమే

వైదికులను పిల్చి మదిని భక్తి నిలిపి కోరికల్

వేదనలను దీర్చుటకయి వేలుపునతి శ్ర ద్ధతో

పాదముల భరించి బ్రతుకు పావనముగ చేసెదన్


3. మందర, భ, భ, న, న, గ యతి 7

యాగము జేయగ నజుని తనయుడున్

జాగును సేయక స్వయము ననలుడే

వేగమె వచ్చెను! ప్రియ వదనముతో

స్వాగతమిచ్చె దశరథుడు ముదముగన్


4. హరిహయము న స న భ న గ యతి 10

నపుడు ననలుండు కడు హర్షమున యొసగెన్

తపము ఫలమౌ యొక సుధా కలశము నా

నృపు కలల దీర్చుటకు నిండు మనసుతో

తపన విడె సంతసమునన్ సుతల వడసెన్


5. ఆట వెలఁది

రాముడును భరతడు లక్ష్మణుండు శతృఘ్న 

నామములను పెట్టి! నయము మీర

ప్రజలు వారి గనుచు రాగము పంౘగ

పెరిగినారయెధ్య పురమునందు...

6. కుసుమ న ర ర యతి లేదు 

చదువు నేర్చుచున్ బాలురు

న్నెది గిరెంతయో వేగమై

కొదవ లేదు ధైర్యంబునకున్ 

ముదమునొందిరా పెద్దలున్

7. ద్రుతవిలంబితము న భ భ ర యతి 7 

గడచె వేగముగా ధర వత్సరాల్ 

వడిగ శస్త్రము వాడు విధమ్ములున్ 

నడత యందున నమ్ర గుణమ్ములున్ 

బడప లేకనె పట్టెను రాముడున్


8. చంద్రశేఖర న జ ర జ ర ౧౩ యతి

పురమున గొల్వు తీర భూధవుండు పొల్పుగా 

గురువుగు కౌశికుండు యాగ రక్షకుండుగా 

నరులను కూర్చు శక్తశాలి వీరుడైన దా

శరథిని వెంట పంపమంచు గోరె సౌమ్యుడై

9 చంద్రిక  న న ర వ     ౭ యతి

అనిన చనెను హ్లాదమొప్పగా 

వనములకును వారి జాక్షుడే 

మునుల సవనములను కాయగా

ననుజుడయిన  నాదిశేషుతోన్


మూ.పా గణములను సరి చేశాను ఛందం ప్రకారం

అనిన చనెను హ్లాదమొప్పగా 

వనములకును వారి జాక్షుడే 

మునులకు తను మోదమీయగన్

ననుజుడయిన  నాదిశేషుతోన్


10. కామేశ భ భ న జ న గ ౧౧ యతి

జాణగు తాటకి విడువక చంపు తలపుతోన్ 

రాణము చేయుచు కదలెను రాముడు వడిగా

బాణములంపుచు నసురుల పాలిటి యముడై 

ప్రాణము లన్ బలిగొనెను శరమ్ముల పటిమన్


11. *ప్రియంవద న, భ, జ, ర, 8, ప్రాస కలదు*

అడవిలో నుపలమంట రాము కా

లడరి సుందరి యహల్య యయ్యెతాన్

బిడియ మొప్ప తెలిపెన్ లతాంగియున్

తడబడన్ గళము ధన్యవాదముల్


మొ.పా యతి సరి చేశాను ఛందం ప్రకారం

అడవిలో నుపల యగ్ని రాము కా

లడరి సుందరి యహల్య యయ్యెతాన్

బిడియ మొప్ప తెలిపెన్ లతాంగియున్

తడబడన్ గళము ధన్యవాదముల్


12. *సురభూజ రాజము, న, భ, ర, న, న, న, ర, యతి 12*

అనల నేత్రుని విల్లు పట్టియు నతి సులభముగ ద్రుంచె తా

ఘనము గా మిథిలా పురమ్మున! కమలనయన కరమ్ముతో

జనము మెచ్చగ చేరె రాజ్యము!సవతి జన ని కుయుక్తులే

తనకు కష్టము దెచ్చి కానకు దరిమె ధరణిజతోడుగా


13. శివశంకర (సురభి) స న జ న భ స యతి 11

ఖర దూషణుల వధించిన ఘన వీరుని గని సో

దరి శూర్పణఖకు కామము తగిలెన్ రఘువరుతో 

నెరవేర్చమనెను కోర్కె వినిన లక్ష్మణుడు భయం

కరుడై చెవులును ముక్కును కసితో నరికె పడన్

14.*సుందరి భ భ ర స వ 9*

బంగరు వర్ణమృగమ్ము పర్వులు తీయుచున్  

ఛెంగున దూకుట గాంచి సీత ముదమ్ముతో

పొంగుచు తెమ్మనియెన్ విభుండు వడిన్ చనెన్

రంగము సిద్ధము చేసె రావణ మాయకున్ .

15. *అపరాజితము న, న, ర, స, వ యతి 9*

ధరణిజ చెర పట్టె! దానవుడే పగన్

కరకుగ గొని కామగాముడు శత్రువుల్

చొరని పురిని లంక చొచ్చి వనమ్ములో

తరుణి నిలిపె దైత్య తన్వులకాపుతో

16. *అశ్వగతి, భ, భ, భ, భ, భ, గ యతి 10*

వానర వీరులు రాముని భార్యను జూచుటకై

యానతి గైకొని వెంటనె అందఱు బాధ్యతగన్

పూనికగా కొనసాగెను భూమికి నల్దెశలన్

కానలు కొండలు దాటిన గానక నాఖరునన్

17. *జలదము భ ర న భ గ ప్రాస కలదు యతి 10*

కారణ జన్ముడౌ ఘనుడు కాంచనుడున్

మారుతి వేగమే యెగిరి మానసమున్

ధారుణి పుత్రి జాడ గన దక్షతతో

నోరిమి గాను లంక చనె నొంటరిగన్

18. *పద్మకము న భ జ జ జ గ ప్రాస కలదు యతి 11*

భరువు = ప్రభువు, ప్రాసాక్షర పద కోశము

మరలె రాఘవుని చెంతకు మారుతి వేగమే

తరువు నీడన ధరాత్మజ దైన్యము దెల్పగన్

సరగు వారధిని గట్టుచు సాగెను నీటిపై

భరువు లక్ష్మణుని గూడియు వానర సేనతో

19.*ఘారిన = రాత్రి వేళ క్షోణము = నేల, ఆంధ్ర భారతి నిఘంటువు*

*ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము*

*ప్రతి పాదమునందు భ , భ , భ , భ , ర , స , వ(లగ)*

*అంబురుహము*

శ్రీ రఘు రాముని పత్నిని గన్గొనె శీఘ్రమే వనమందునన్

ఘారిన జూచిన తల్లికి నాథుని గాథ పాడుచు దూకి తా

చేరెను చెంతకు! నుంగరమిచ్చెను చిన్నివాడుగ మారి! యీ

శూరుడు పాఠము జెప్పెను రావణు క్షోణినంతయు గాల్చుచున్

20. శార్దూల లలితము మ న జ న త న ప్రాస కలదు యతి 13

హంకారము = గర్వము

లంకాయానము కొఱకై వడివడి రాముడు కడలి

హంకారమ్మున దశకంఠుని తగు యస్త్రము నతని

యంకమ్మునిలను ముగించుచు తన యాలిని గలిసి

సంకోచమ్ముల దరిమెన్ తరలెను స్వంత భువికిని