Monday, September 30, 2013

ఆమె మీద వర్ణన

నిశి రాతిరి ఆ కురులలో దాగుంది
జాబిల్లి ఆ వదనం లోంచి తొంగి చూస్తోంది
రేయి తెలవారుతున్నట్టుగా భానుడు పొడసూపిట్టుగా
ఆ నుదురు కుంకుమ తో మెరుస్తోంది
ఆదిత్యుడి కిరణాల అంత వెచ్చగా ఆ స్పర్స పలకరిస్తోంది
వీచే గాలి లో లేని చల్ల దనాన్ని   సైతం ఆ కన్నులు కురిపిస్తున్నాయి



గగనమున తొలి సంధ్యలో నిండే స్వర్ణ వర్ణమూ
సంద్రాన లభియించు ముత్యంపు అందమూ
మిళితమై దర్శనమిచ్చే నీ పాదముల యందు
లయమై ముగ్ధ మనోహర నిలయమై

మౌనం - కవిత, సహనం

ఎందుకే మనసా నీకింత మౌనం

వైపు సాగుతోంది నీ పయనం

ఎన్నాళ్ళిలా నిన్ను నువ్వు మరవటం

కలం సాగటానికి పదాలు కరవా
కవిత్వం రాయటానికి భావం బరువా
ఎద పొలము పై పదం పండలేదేమి
వాడిపోని అందం వున్నా ప్రకృతి
అక్షరాల విత్తులు నాటను అంటున్నదా
సప్త వర్ణాల హరివిల్లుల ఆకాశం
వాటికి చినుకులు అందించను అంటున్నదా


సర్దుకుంటే పోయేదానికి సఖులతో సమరమేలా
సాకులెతికి ఉతకనేలా సహనమే సమర్థత కాదా
సంధి ఎప్పుడూ హితమే సుమా
సమస్యలన్నవి ఉండవు వినుమా


ప్రతీ దానికీ పంతమేల
ప్రతీకారానికి అంతమేది
ప్రశాంతతకు మూలం కాదది
ప్రగతి బాటకు తీసుకుపోదది

సమర్ధత అంటే సంధి అనెను కృష్ణుడు
సహనమె సిసలైన ఆయుధం అనెను విదురుడు
సహేతుకమైన ఇట్టి సిద్ధాంతముల్ సడి చేయవే మానవులారా
స్టడీ చెయ్యండి ఈ సత్యాన్ని ఓ మేధావులారా

ఆమె కన్నీళ్ళు

నీలాల ఆమె కళ్ళు వర్షించే మేఘాలను తలపిస్తున్నాయి
కాటుక సరిహద్దుని దాటిన ఆ ధార ముందు కు ఉరకటం తో
నునుపైన చెక్కిళ్ళు నీటి ప్రవాహాలయ్యి
కోయిలకు పాట నేర్పే కంఠాన్ని చేరినాయి