Sunday, August 30, 2020

అచల వృత్తము

 [08/08, 22:24] Durgamadhuri1: అచల వృత్తము



తలచిన మనసున

పలికెడి జననికి

కరుణను సరగున

మనకును యొసగెడి

విమలకు ప్రణతులు

వగచెడి మనసుకు

నగవుల వదనపు

అభయము నొసగెడి

విమలకు ప్రణతులు

[08/08, 22:26] Durgamadhuri1: కలిమియు బలిమియు

తనకుయె కలదని

ఎగసెడి మనుషులె

అధికమ జగతిన

[08/08, 22:27] Durgamadhuri1: కెరటము లెగసిన

జలనిధి నెపుడును

మురియదు ముదమున

యెరుగును యెరుకను

[09/08, 11:50] Durgamadhuri1: కరివలె సతతము

కరిగెడి కలిములు

పరిపరి విధముల

పరుగిడు బ్రతుకులు

మనకిక వలదని

మననము సలిపెద

మనమున నిలిపెద

జననిని సతతము

[09/08, 11:54] Durgamadhuri1: ఝరివలె నెపుడును

కరిగెడి కలిములు

పరిపరి విధముల

పరుగిడు బ్రతుకులు

మనకిక వలదని

మననము సలిపెద

మనమున నిలిపెద

జననిని సతతము

[09/08, 16:51] Durgamadhuri1: సరగున చనియెను

సిరులకు పతియగు

హరి కరి కొరకును

మకరిని దునిమెను

[09/08, 17:16] Durgamadhuri1: తరువులు ఝరులను

ధరణిని సిరులట

సిరులను గనకనె

నరులును పరుగున

చనెదరు పనులకు