Friday, October 23, 2009

శ్రీ సరస్వతి మాత

పదాల వాణి నిన్ను ఏ నామాలతో పిలువను
స్వరాల రాణి నిన్ను ఎన్ని రాగాలతో రంజింపజేయను
శ్వేతా వస్త్రధారి నిన్ను పీతాంబరాలతో అలంకరించనా
సకల జగత్తుకు మూలమైన బ్రహ్మ కళత్రా
నిన్ను ఏ కలలతో కొలువను కల్యాణి
సుమధుర భాషిణి సుహాసిని విరించి హృదయవాసిని వాసిని
విద్యాదాయినీ వినయ ప్రదాయిని విజయ కారిణి
మంగళ రూపిని మహిమాన్విత సరస్వతి
సదా నీ కృప ప్రసరించు నీ సర్వ రూపార్చన మా చేత గావించు
-- నాగిని



పల్లవించిన వాణీ పలుకుల తేనెల రాణీ
ప్రతిభా పాటవాల ప్రాజ్ఞీ సకల విద్యా ప్రదాత్రీ ప్రణామమ్ములు గైకొనుమా




హిరణ్య గర్భస్థ హృదయవాసినీ

హరి కృపా విలాసినీ హంస వాహినీ
హిమవర్ణ వస్త్రధారిణీ హాలాహరధరుని సహోదరీ
హ్రీం కార శబ్ద మూల ప్రకాశినీ
కచ్ఛపీ మము కరుణించుమా
కైతలెల్ల మాచే వ్రాయించుమా

కలములనెల్ల బ్రోచుమా కచ్ఛపీ
పలుకులను సలుపుమా వాగ్దేవీ
విద్యలకెల్ల వినుతికెక్కిన శ్రీ భారతీ
విరించి సృష్టిని లిఖించిన శ్రీ వాణీ

వాణీ పలుకుల రాణీ
చదువుల పూబోణీ
అన్నింట నొసగుమా
యుత్తమ శ్రేణీ
ధవళ వస్త్ర! తిమిర వర్ణ కురుల వేణీ