Saturday, July 25, 2020

వేమన పద్యములకు అనుకరణ - ఆటవెలది

1.

21/07, 04:13] Durgamadhuri1:


అంతరంగమందు అపరాధములు చేసి... పద్యమునకు నా క్రింది పద్యము అనుకరణ ప్రయత్నము

[21/07, 04:21] Durgamadhuri1:



మదిని తెరిచి చూడ మలినమై యుండును
పలువు రెదుట పలుకు పంచదార
లోకు లెరుగరేమొ లోకేశుడెరుగడె
జగతి సత్యమిదియె జానకీశ



2.

[21/07, 18:46] Hamsa Geethi:


అంతరంగమందు నభవు నుద్దేశించి పద్యము నకు నా అనుకరణ


చర్మ చక్షువులకు  శంభుడు జిక్కడు
కర్మ ఫలము బట్టి కాంచ గలము
మర్మమెరిగి యెపుడు మసలుటే మోక్షము
జగతి సత్యమిదియె జానకీశ!!

3.

[23/07, 14:14] Durgamadhuri1:


అడవిదిరుగజిక్కదాకసమున లేదు పద్యము నకు నా అనుకరణ

 క్షేత్రమందె గలడె కేశవుడు మనసా
మాయ పొరలు విప్పి మరలి చూడు
తిరుగుటేల నోయి‌ తీర్థంబు లన్నియు
జగతి సత్యమిదియె జయము కలుగ

4.

[23/07, 17:37] Hamsa Geethi:

బ్రహ్మ పథము మనకు బంగారు బాటరా
చేరు కొనగ  నేమి చేయ వలయు
స్మరణ తోడ గలుగు సాయుజ్య మోక్షంబు
జగతి సత్యమిదియె జయము గలుగ!!


5.
[24/07, 10:43] Durgamadhuri1:

అదిమి మనసులో నిలిపి పద్యము నకు నా అనుకరణ


ఇంద్రియములు వల్ల యిక్కట్లు వచ్చును
వాటినదుపు జేసి భవుని జేరు
తెలిసికొనిన నరుడు తెలివైన జీవుడు
జగతి సత్యమిదియె జయము కలుగ

6.


[25/07, 22:28] Durgamadhuri1: 

కంకుభట్టుయనంగ కాషాయంబు గట్టె
కొలిచె ధర్మరాజు కోరి విరటు
కాలకర్మగతులు కనిపెట్టవలెనయ
విశ్వదాభిరామ వినురవేమ


పై వేమన పద్యము నకు నా అనుకరణ

[26/07, 10:28] Durgamadhuri1:

రాజు యైన గాని రాజీకి రావలె
కాల గతిని బట్టి కదల వలయు
ధర్మజునకె యోర్మి దప్పలేదుగదర
జగతి సత్యమిదియె జయము కలుగ

7.


[25/07, 22:35] Durgamadhuri1:

 కాశి నీళ్లు మోసి కాళ్ళు మొగము వాచి
ఎందు సుఖము లేక ఎండి యెండి
చచ్చి వెనుక ముక్తి సాధింపగలరొకొ
విశ్వదాభిరామ వినురవేమ



పై వేమన పద్యము నకు నా అనుకరణ

[26/07, 10:18] Durgamadhuri1

: గంగ నీరు దెచ్చి కడలియందు గలిపి
శివుని దలచినంత చింత పోదు
విషయ వాంఛ లన్ని విడనాడ వలెనురా
జగతి సత్యమిదియె జయము కలుగ

8.

హీన గుణము వాని నిలు చేరనిచ్చిన
ఎంత వానికైన నిడుము కలుగు
ఈగ కడుపు జొచ్చి ఇట్టిట్టు సేయదే
విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యము నకు నా క్రింది పద్యము అనుకరణ


ఈర్య్ష గుణము యుండి యింట జేరినవాడు
బంధములను చెరచి పాడు సేయు
చుక్క విషము చెరచు చక్కని పాలను
జగతి సత్యమిదియె జయము కలుగ

9.

తాను మాయ యిలను తనవారు మాయయే
బ్రతుకు నిత్య మనుట భ్రాంతి యేర
సత్య మేది యనిన శంకరుండేనురా
జగతి సత్యమిదియె జయము కలుగ.

ఆలి సుతులు మాయ అన్నదమ్ములు మాయ
పద్యము నకు నా అనుకరణ ప్రయత్నము పై పద్యము


10.

ఎన్ని జన్మ లైన యెరుక నందని యాత్మ
ముక్తి పదము నెట్లు పొంద గలదు
కామ్యమున్న మరిక కలుగునే జ్ఞానంబు
జగతి సత్యమిదియె జయము కలుగ

ఎన్ని తనువులైన మృతికి నడ్డము గావు
మృతిని గెలువలేని యెరుకలేల
దొంగరీతి గాక దొరకునా మోక్షంబు
విశ్వదాభిరామ వినురవేమ
అనే పద్యము నకు అనుకరణ ప్రయత్నము


11.

కపట బుద్ధి వాడు కలిపిన స్నేహంబు
యదును జూచి చెరచు హాని జేయు
పాము పక్కనున్న వైరి గాకుండునే
జగతి సత్యమిదియె జయము కలుగ

చంపదలచు రాజు చనవగ్గలంబిచ్చు
చెరుప నున్న పగర చెలిమి సేయు
కరువ నున్న పాము నెరిగాచుకొని యుండు
విశ్వదాభిరామ వినురవేమ

యను వేమన పద్యము నకు అనుకరణ ప్రయత్నము


12.

[14/09, 00:07] Durgamadhuri1: 

హాని చేయు వైరి యల్పుడై యందినన్
విడువ వలయు గాని వ్రేటు తగదు
మత్సరమును వదిలి మంచి జేయుటె రీతి
జగతి సత్యమిదియె జయము కలుగ

చంపదగిన యట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు
విశ్వదాభిరామ వినురవేమ

ఈ పద్యము నకు పై పద్యము అనుకరణ
_________________________________________

13.

విద్య లెన్నొ నేర్చి విజ్ఞాన మనరాదు
ఈశు నెరుక లేక యింకి పోవు
జనని గూర్చి దెల్పు చదువుయే చదువయా
జగతి సత్యమిదియె జయము కలుగ

చదివి చదివి చదివి చావంగ నేలను
చావు లేని చదువు చదువ‌ వలయు
చదువు మర్మమెరిగి చదివిన చదువురా
విశ్వదాభిరామ వినురవేమ

ఈ పద్యము నకు పై పద్యము అనుకరణ

_____________________________________

14.

గతులు లేని వేళ గాయంబు సేయునె
యల్పు లైన వారు హాని జేయు
శక్తి దప్పె నేని జారిపోవు ను యంత
జగతి సత్యమిదియె జయము కలు గ

చిక్కి యున్న వేళ సింహంబు నైనను
బక్క కుక్క కరచి బాధ పెట్టు
బలిమి లేని వేళ పంతంబు జెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ

ఈ పద్యము నకు పై పద్యము అనుకరణ అమ్మా

___________________________________________

15.

[15/09, 11:33] Durgamadhuri1:

బాహ్య మందు జూచి భ్రమ నొంద వలదు
బ్రహ్మ మనిన నెరుక పడుటె నరుడ
ముక్తి యనిన గాదు మూడంచు దేహము
జగతి సత్యమిదియె జయము కలుగ

[15/09, 11:34] Durgamadhuri1: 

చినుగు బట్ట గాని చీనాంబరము గాదు
మురికి యొడలు గాదు ముక్తి గాని
పరమ యోగి మహిమ పరికింప నరుడురా
విశ్వదాభిరామ వినురవేమ

పద్యమునకు అనుకరణ

16.

[20/10, 01:32] Durga Madhuri: 

పాము పక్క నున్న భయము కలుగునట్లు 

దుష్ట జనుల చెలిమి దోష మంటు

పడని వారి తోటి బంధ మేల!

జగతి సత్యమిదియె జయము కలుగ


కాని వారి తోటి గలసి మెలగుచున్న

గాని వాని వలె కాతురవని

తాడి క్రింద బాలు త్రాగిన చందమౌ

విశ్వదాభి రామ వినుర వేమ

17.


[20/10, 13:02] Durga Madhuri: 


దర్పణమ్ము గాని తలపుల మదిగాని

పగిలెనేని యతుకు పడదు నిజము

బాధ పెట్ట బోకు పరుల మనసు నెప్డు

జగతి సత్యమిదియె జయము కలుగ




ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు

గాచి యతుకవచ్చు గ్రమముగాను

మనసు విరిగెనేని మరి చేర్హ్చరాదయా

విశ్వదాభి రామ వినుర వేమ


పద్యమునకు అనుకరణ

18.

సత్యమెరుక యగును సర్వేశ్వరునికేను

లోక రీతి నిదియె రోదనేల

అంతరాత్మ గుట్టు  నాదిశంకరుడెరుగు

జగతి సత్యమిదియె జయము కలుగ



కల్ల నిజములెల్ల గరళ కంఠుడెరుగు

నీరు పల్లమెరుగు నిజముగాను

తల్లి తానెరుగు తనయుని జన్మంబు

విశ్వదాభిరామ వినురవేమ

19.

దోష గుణము కలిగి దూషణ సేయు పరులన్
సవ్య గుణము కాదు సత్యమిదియె
వేలు యొకటి తెరువ విజ్ఞత యెటులౌను
జగతి సత్యమిదియె జయము కలుగ

The above is Vemana padyam imitation

20.

పికము గొంతు వినిన ప్రీతి కరము గాదె
వర్ణమెపుడు జాడ వలదు నరుడ
యుత్తములకు నుండు యుజ్వల గుణంబు
జగతి సత్యమిదియె జయము కలుగ

మిరప గింజ చూడ మీద నల్లగుండు
కొరికి జూడ లోన జూరుమౌచు
సజ్జనులగు వారి సారమిట్లుండు
విశ్వదాభిరామ వినురవేమ

ఈ క్రింద ఉన్న పద్యమునకు పై పద్యము అనుకరణ 

Kindi poem ki pai poem imitation


21.

ఆగ్రహమ్ము వలదు యాలకించు నరుడ
నాశమొందు గుణము నయము గాదు
యొక్క పరి కలిగిన యోడెద వెప్పుడును
జగతి  సత్యమిదియె జయము కలుగ 


కోపమునను ఘనత కొంచెమైపోవున్

కోపమునను మిగుల గోడు గల్గు 

కోపమడచెనేని కోర్కెలీడేరు

విశ్వదాభి రామ వినుర వేమ


అను పద్యమునకు అనుకరణ

22.

తరచి జూడ మేలె ధరణిని మరి తాము 

ముళ్లు వైన చేదు మొక్క లైన

దుష్ట బుద్ధి వాని తోడ ఫలము లేదు

జగతి సత్యమిదియె జయము కలుగ



ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు

బరగ మూలికలకు బనికి వచ్చు

నిర్ణయాత్మకుండు నీచుడెందులకౌను

విశ్వదాభి రామ వినుర వేమ


అను పద్యమునకు అనుకరణ

ఈ క్రింద ఉన్నది నా సొంత పద్యము
నా భావము అనుకరణ కాదు

[05/11, 18:32] Durga Madhuri: 

*చాప క్రింద నున్న సర్పము వోలె నీ*
*చెంత చేరి  చెరచు చెలిమి కన్న*
*పోరు సల్పు చుండు వైరి మిన్న గదరా*
*జగతి సత్యమిదియె జయము కలుగ*

23.

నీచ గుణము తప్ప నిల్చునె మంచివి

దుష్ట జనుల గుణము దోషముండు

గాలి కేగు యాకు గాలితోటె పరుగు

జగతి సత్యమిదియె జయము కలుగ



నీటి లోని వ్రాత నిలువక యున్నట్లు

పాటి జగతి లేదు పరము లేదు

మాటి మాటి కెల్ల మారును మూర్ఖుండు

విశ్వదాభి రామ వినుర వేమ


పద్యమునకు అనుకరణ

ఇక ఈ క్రింద వన్నీ నా స్వంత పద్యములు 


24.

పాము పక్క నున్న భయము కలుగునట్లు
దుష్ట జనుల చెలిమి దోష మంటు
పడని వారి తోటి బంధము తగదయ
జగతి సత్యమిదియె జయము కలుగ


25.

పత్ని మాట వినిన భాసిల్లు పతి నెప్డు
కష్ట పెట్ట బోకు కలికి నెపుడు
నీవె దైవ మంచు నిన్ను జేరె గదయూ
జగతి సత్యమిదియె జయము కలుగ 

26.

పదను లేని వాక్కు పదివేలు వద్దయా
పరుష వాక్కు లసలు పలుకనీకు
మంచి బెంచు వాక్కు మచ్చుకొక్కటి చాలు
జగతి సత్యమిదియె జయము గూర్చు



27.

[18/12, 21:38] Durga Madhuri:

బతుకు బాటలోన పరుగిడు నరులకు
తృప్తి పడుట యంటె తెలియదెపుడు
ముక్తి కోరు బతుకు మోహము త్రుంచును
జగతి సత్యమిదియె జయము గూర్చ

28.

[18/12, 21:38] Durga Madhuri:

ఈతి బాధ తోడ యెదను నింప వలదు
విషయ వాంఛ లెపుడు వెంబడించు
జనని నామ జపము చల్లగ జూచును
జగతి సత్యమిదియె జయము గూర్చ


29.


[18/12, 21:39] Durga Madhuri:

శాంతి సహనమెపుడు చల్లని సంపదే
క్రోధ గుణము నెపుడు రోత దెచ్చు
కలత చెంద వలదు కలహము కలిగిన
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

30.


[31/12/2020, 22:38] Durga Madhuri: 

సత్య వాక్కు రక్ష సతతము నిక్కము
వాక్కు దోషమెపుడు వలదు వలదు
శాశ్వతమ్మగు సిరి సచ్ఛీలతేనయా
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

31.

[31/12/2020, 22:38] Durga Madhuri: 

ఓర్మి కూర్మి పేర్మి యుత్తమ గుణములు
సంతసమ్ము నిచ్చు సద్గుణములు
వీడ వలదు నిట్టి విలువైన వాటిని
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

32.

[02/01, 10:04] Durga Madhuri: 

ధర్మ మార్గ మందె దక్కును విజయము
తప్పి తిరుగు వారు తాళలేరు
కర్మ యిచ్చు ఫలము ఘనమైన శిక్షను
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు...

వైరి సమాసమూ, మకుటమూ సది చేశానండీ

33.

[02/01, 10:04] Durga Madhuri: 

పేర్మి పంచు నరుడ ప్రీతి గుణమె మేలు
పేర్మి లేని చోట విషమె కుఱియూ
పేర్మి యున్న నాడు పెరుగును సిరులెల్ల
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

34.

ప్రేమ క్షమల మించు పెన్నిధి లేదిలన్
యొక్క క్షణము నెపుడు యోర్చుకొనిన
నిలుచు యాప్తులిలన నెఱుఁగవలె నరుడ
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు


35.

[02/01, 10:12] Durga Madhuri: ఓ... నిజమే కదా

ఆశ తీరకూన్న నాశ లెట్లు తొలఁగు
యాశ వెంట యాశ యంతు గలదె
యాశ పాశమన్న యమ యాతన గద
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

36.


[02/01, 10:42] Durga Madhuri: 

ఆట పాట లందు యాసక్తి యుండిన
పిల్లలెదఁగ గలరు పేర్మి మీర
చదువు తోడ సంతసంబులుండవలెను
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు


37.

[29/01, 21:43] Durga Madhuri: 

పక్క వాని సొమ్ము పైన మోజు విడుమ!
నీది కాని దంత నిప్పనెఱుఁగు
అప్పు తీర్చకుండ యాస్తులనుట కీడె!
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

38.


[29/01, 21:47] Durga Madhuri: 

నీతి లేని బ్రతుకు నీచమనెఱుఁగుమా
నీతి యున్న చోట నిలుచు పరువు
నీతి మాలినోళ్ళ నెయ్యము వలదురా
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

39.

[29/01, 21:51] Durga Madhuri: 

పరుల కొంప గూల్చి బాగు పడుట కల్ల
స్వంత గూటి బాగు సంగతొదిలి
తనకు మాలి నట్టి ధర్మము తగదుర
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు


40.

[22/01, 18:17] Durga Madhuri: 


ప్రకృతి వనరులెపుడు వ్యర్థము సేయకు
మితము హితమనెరిగి మేలు వొందు
కలుషితమ్ము జేస్తె గమనముండదిలను
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

41.

[22/01, 18:17] Durga Madhuri: 

తేట తెనుఁగు ఘనత తెలిసికొను యువత!
ప్రాచ్య భాష కొఱగు పరుగు వలదు
మాతృ భాష పట్ల మక్కువ హితముర
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు


42.

విద్య నేర్చినంత విలువలు తెలియును
విద్య లేని యెడల వేదనేర
విద్య తోటి వొందు విజయ సోపానము
గతి సత్యమిదియె యముఁ గూర్చు


[18/03, 12:29] Durga Madhuri: 

43.

భార్య సుతులు మాయ బ్రతుకు మాయ
తోడు వుండరెవరు తుది క్షణమున
పండి పోవు వేళ పరమేశు దలువుమ
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

44.

[18/03, 12:50] Durga Madhuri: 

చావు బ్రతుకు మాయ సర్వమూ మాయరా
ధనము జనము మాయ తపము మాయ
స్మరణ మొకటి జేసి సర్వేశుఁ నొందుమా
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

45.


తనకు బిడ్డ గన్న తల్లిని సైతము
గారవించినంత గలుగు ముదము
మాతృమూర్తులనిన మమత నింపు ధరణిన్
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

46.

రూపు రేఖ జూచి లోపము నెంచకు
మోసకారి యెపుడు ముచ్చు వోలె
పైకి యగుపడకనె! వంచన జేయును
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు


47.

ఆత్మనందె గలడు నాది పూరుషుడురా
వేరు చోట్లనేల వెదకులాట
తన్ను దెలియు వాని స్థైర్యమ్ము గెలుచురా
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

48.

మాయ జేయు నరుల మర్మమెఱుంగక
నమ్మినంత తుదకు నశ్యమొందు
వివరము దెలియక వినబోకు వారల
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

49.

అంతరంగమందు నాత్మశుద్ధియు లేక
నవతరించు వాడు! యరుల సమము
చెంత చేరవలదు చెరచ గలరు నిన్ను
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

50.

ధనము కొఱకు జనులు దైత్యులై చెలరేగు
యెంత పోసియున్న యెంచు నిన్ను
కాని వారికెపుడు కాసులీయవలదు
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

51.

మెతుకు మింగనీరు మేడలు గడతారు
నీదు సొమ్ము లాగి నిన్ను గొట్టి
నింద వేయు వారి పొందు రానీయకు
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

52.

విశ్వమంత దిరిగి వీధి పాల్జేశేరు
నిన్ను మాత్రమేను! నిశిని నిలిపి!
విధిని నమ్మి యున్న వేగమే మేలౌను
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

53.

నీ గృహమును మ్రింగు నీతి లేని జనుల
నీడను పడనీకు నీకు చేటు
యూరకున్న వాని యుసురు తగులు తుదన్
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

54.

రూపు రేఖలిలను చూపల వరకేను
విత్తమీయబోవు వినుము నరుడ
చిత్తశుద్ధి యొకటె చివఱకంట నిలుచు
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

55.

పిల్లలన్న మనకు పెన్నిధి లౌనురా
కల్ల కపటమసలు కలుగని మది
వారి కెపుడు మనము బాధ పెట్టవలదు
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

56.

శ్వాస సమము మనకు సంద్రము వృక్షముల్
నరుకవలదు నరుడ! నాట వలయుఁ
నపుడె ముందు తరములన్ని నిలుచు ధరన్
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

57.

పెద్దలాడు మాట పెడ చెవి పెట్టిన
వారి యనుభవముల పాఠములను
పొందలేవు నరుడ! పొదివి పట్టుకొనుమ
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

58.

రూపమేది యైన లోపమెంచ వలదు
గుణము చూసి మెలుగు! గుచ్చటేల!
సాటి వానికెపుడు! సాయమందించుమా
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

59.

నీతిమాలినట్టి నీచ గుణము గల్గి
పాపభీతి లేక పాపములను
జేయుటేల నరడు! హేయము; మానుమా
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

60.

పేర్మి జూపుటెపుడు పేదరికము గాదు!
కారణమ్ము లేక కలహమేల
కోటి గుణములందు క్రోధమ్ము కీడయా
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

61.

ఓర్పు యున్న వాడె ఓటమి నెఱుఁగడు/ ఓటమెఱుఁగడయ్య
తగ్గుటెపుడు మేలు తగవులందు
మాట పెరిగెనేని మలినమౌ బంధముల్
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

62.

రెచ్చగొట్టు వాని ఱెక్క విరుచుటేల
లెక్క చేయబోకు! యొక్క నాడు!
తప్పు జేయు వాడు తగిన శిక్షను వొందు
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

63.

మౌనమెపుడు మేలు! మానుమా పంతముల్
గొంతు పెంచు వాని కోసమీవు
పాటు పడుట వలదు! పాహి యనిన మేలు
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

64.

నేడు తప్పు జేసి నేరమ్ము తోసేసి
విర్రవీగు వాని విధియె వంచు
వారి తోటి తగవు పరువు చేటగు సుమీ
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు





09.

మాయ మాటలు చెప్పెడి మనుజులెల్ల
నమ్మరాదు ధరణినందు! నశ్యమొందు!
వివరమును కనుగొనకుండ వినుట చేటు!
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

65.

పాలు పోసి పెంచి పాము వంకను జూసి
కాటు వలదు యనిన కాలదన్ను
దుష్ట బుద్ధి వాని తోడంటు వీడరా
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

66.

బాలుడన్న వాడు పాలింప బడునయ
పాలు ద్రాగు వాని పాలిటెపుడు
దైత్యుడవ్వ వలదు! దైవమ్ము జూచురా
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

67.

చెట్లు భవిత కొఱకు మెట్లురా మానవా
భావి తరముకవియె వనరులింక
మ్రింగబోకు వాని క్రుంగి పోవు ధరణి
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

68.

వనరులన్ని గాల్చి వల్లకాడును జేసి
ధరణి పాడు చేసి దయను మరచి
చనిన కీడు కలుగు సత్వరమిక మారు
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

68.

దైవమెవ్వఱన్న ధరణియే నిక్కము
గాల్చినావొ నిలయె కాల యముడు
నీవు జేయు కర్మ నీకు ఫలితమిచ్చు
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

69.

Thursday, July 9, 2020

పద్యము కూర్చవలసిన భావాలు

ఓంకార పంజర శుకీం...
రమ్య'కపర్దినీం'

దుర్గ శతకంలో అష్ట ఆయుధాలు

తప్పులు ఎన్నక దిద్ది మేము రక్షించమ్మా

కృష్ణ పరమాత్మ, పనీ, ఫలితం, భావం అన్నీ నీవే



Krsnaa, u r not just the supreme but u r everything పండిత పామర మేలు కీడు భేదము మాకే కానీ మీకు కాదు కదా!

స్థూలమున నున్న నీకు మావి సూక్ష్మ విషయాలు, లెక్క కాదు; నీవు సూక్ష్మ మైతే ఇక యంతకన్నా సూక్ష్మ ము కనుక ఇది అసలు విషయమే కాదు

భక్తులలో అగ్రగణ్యుడు కాదు, భగవంతుడు కేవలం హనుమంతుడు

మోక్షమును స్వీకరించగల శక్తి మాకు ఉన్నదా తల్లీ! నిజముగా నీ లోకము మేమెరుగుదుమా! మా యందు ఈ శక్తీ, చైతన్యము కూడా నీవే కాదా!? మాకు ఈ సమర్థత ఉంటే అది నీ అనుగ్రహమే కాదా!

గ్రహములరన్నింటిలోకీ యుత్తమమైన గ్రహం నీ అనుగ్రహమే కాదా తల్లీ

దుర్గమ్మా! మాయ పొరలు మోసిన మాకు మా బిడ్డలకూ సిసలు మాతవు నీవే కదమ్మా!




హనుమా! నీవు భక్తుడవో అగ్రగణ్యుడవో కాదు భగవంతుడవు. ఇంకెవరికీ లేదు కదా ఈ ఘనత! పంచభూతములు యందూ అష్టదిక్పాలకులు యందూ నీవొక్కడివే పేరొందిన తనయుడవు

అయ్యా అంజనాసుతా! అమ్మగా మేము ప్రేమను మాత్రమే ఇవ్వగలము కానీ అండగా నీవు రక్షణ ఇస్తావన్నదే కదా మా ధైర్యం, భరోసా! పిల్లల పట్ల మా ఇతర చర్యల్లో లోపాలు రాజీలూ ఉండవచ్చుననే మో కానీ వారికై మేము మిమ్మల్ని ఆర్తితో పిలవటంలో మాత్రం అద్వితీయమయ్యా


ఆమె మీనాక్షి, అన్నయ్య మత్స్య అవతారుడు, అంటే ఆమె కన్నుల లో లోన్నయ్య! 

ఆమె సరసిరుహాక్షి, ఆయన నీరజనాభుడు అంటే ఆమె కన్నులలో భర్త 




గజరాజు అడిగాడని పొట్టలో దూరాడొకడూ
గజరాజుని ముఖం మీద పెట్టుకున్నాడొకడు
గజరాజుకై మకరిని దనిమాడొకడు ఆతడు గరుడుని ఎక్కుతాడు ఆ గరుడుని తమ్మడొకని సారథి
గజములనటునిటు నిలబెట్టుకొన్నదొక రాణి
ఈ రాణి గుడ్లగూబ నెక్కినదట
ఈ రాణి కోడలు హంస నెక్కిందట
సింహమెక్కినదొకరాణి నందినెక్కాడామె భర్త
పులి మీదెక్కాడొకాయన నల్ల బట్టలు వేసుకుని
ఎలుకను చంపకుండ ఎక్కి కూర్చొననె నొకడు!
నెమలినెక్కనాతని యనూజుడూ
కాకి మీద ఎక్కాడో గ్రహమయ్య
చేప, కూర్మ, వరాహ నృసింహుడొకడు
ఉడుతను తల నిమిరాడొకడు
నెమలి పింఛము నెత్తికెత్తుకున్నాడొకడు
పశువుల పైనేనా పాశం అంటే 
తపము చేసిన మార్కండేయునికీ
యుద్ధమున సాయము చేసిన విభీషణునికీ, సుగ్రీవునికీ అభయమున్నది కదా!
మేమేమీ చేయలేమనా మా పై ఈ చులకనా!