Wednesday, April 29, 2020

Essay on Corona

కల్పన కాదు ఇది ఈ కాలపు ఘటన
కవితా వస్తువు కాదు కళ్ళ ముందరి సంఘటన
పుడమి అంచుల నుంచి అంతర్భాగం దాకా... లోయల నుంచి విపణి చివర్ల దాకా... సాంకేతికత, అభివృద్ధి, జీవితంలో సౌకర్యం కొరకు... ఇత్యాది పేర్లతో వంకలతో ఇంతకాలం మానవుడు సాగిస్తూ వచ్చిన పయనం ఇప్పుడు ఒక కీలక మజిలీ తీసుకుంది. మన గురించి మనకే తెలియని విషయాలను, ఒక తల్లిగా మనకు తెలియచెప్పింది.
కాలు కదపకుండా కార్యాలయం పనులు చక్కబెట్టుకోవచ్చుననీ,
"రోబో"లూ పనివారూ లేకుండానూ బ్రతకవచ్చుననీ,
"రాకెట్లు" ఇతర ప్యాకెట్లూ ఆపేసినా బ్రతుకు బండికి ఢోకా లేదనీ,
మానవత్వం దాతృత్వం ఇంకా మరుగున పడలేదనీ
కుటుంబం అంతా కలిసి గడిపితే వచ్చే‌ ఆనందం అమోఘమనీ
కరుణ చూపి అందరినీ ఆదుకుంటే కలిగే ఆనందం అమూల్యమనీ
అవని మనకు నేర్పెనూ తన
అలసట ఇటుల తెలిపెనూ
అంతటా అన్నింటినీ సరిదిద్దుకొన సాగనూ
అలుక కాదిదని అమరిక మాత్రమే ననీ స్పష్టీకరించెను
అమ్మకు ఉండదు మనతో వైరం
అంతిమమైనా చేయదు దూరం
అర్థం చేసుకొనుమా ఆమె మమకారం
అవగాహనతో పూడ్చుకొనుమా అహంకారం
అదుపూ పొదుపుతో సాగితేనే అలంకారం
అటుల కాదనిన మిగులును అంధకారం

కాదంటారా చెప్పండి.‌‌ మనకి సామాజికంగా కలవటం మాత్రమే ఆగింది కానీ జీ

ఆగింది సామాజికంగా కలవటం మాత్రమే కానీ, మన నిత్యావసర సేవలు కాదు. దూరదర్శిని, ఆకాశవాణి, చరవాణీ, అంతర్జాలం, మంచినీళ్ళు, విద్యుత్, విద్య, వైద్య, ఇంధన, కనీస రవాణా, వార్తా సేకరణ, పోలీసులు - ఇలా మన జీవాతానికి కావలిసినవి అన్నీ అమరుతున్నాయీ, ఇంకా కొన్ని కొత్త ఒరవడులు నిర్మితమవుతున్నాయీ.


పుడమి అంచుల నుంచి అంతర్భాగం దాకా... లోయల నుంచి విపణి చివర్ల దాకా... సాంకేతికత, అభివృద్ధి, జీవితంలో సౌకర్యం కొరకు... ఇత్యాది పేర్లతో వంకలతో ఇంతకాలం మానవుడు సాగిస్తూ వచ్చిన పయనం ఇప్పుడు ఒక కీలక మజిలీ తీసుకుంది. మన గురించి మనకే తెలియని విషయాలను, ఒక తల్లిగా మనకు తెలియచెప్పింది.
కాలు కదపకుండా కార్యాలయం పనులు చక్కబెట్టుకోవచ్చుననీ,
"రోబో"లూ పనివారూ లేకుండానూ బ్రతకవచ్చుననీ,
"రాకెట్లు" ఇతర ప్యాకెట్లూ ఆపేసినా బ్రతుకు బండికి ఢోకా లేదనీ,
కుటుంబం అంతా కలిసి గడిపితే వచ్చే‌ ఆనందం అమోఘమనీ.. ఇలా మనపై మాతకు కాకపోతే ఇంత ప్రేమ పూరిత శ్రద్ధ, జాగ్రత్తతో కూడిన హెచ్చరిక తల్లి కాకపోతే ఇంకెవరు ఇస్తారు.

అవని తనకు కినుక లేదనెనూ తన
అలసట ఇటుల తెలిపెనూ
అంతటా అన్నింటినీ సరిదిద్దుకొన సాగునూ
అలుక కాదిదని అమరిక మాత్రమే ననీ స్పష్టీకరించెను
అమ్మకు ఉండదు మనతో వైరం
అంతిమమైనా చేయదు దూరం
అర్థం చేసుకొనుమా ఆమె మమకారం
అవగాహనతో పూడ్చుకొనుమా అహంకారం
అదుపూ పొదుపుతో సాగితేనే అలంకారం
అటుల కాదనిన మిగులును అంధకారం

కనుక ఓ మనీషీ!
కాస్త విశ్రాంతి నొందుమా
అపుడు మరెంతో ఉత్తేజం నిండునూ
వినుమా పుడమి సందేశం
ఇది సదా మనకు హితోపదేశం


కరోనా లోన కళ్యాణంబె యడిగె
కన్యకా మణి ఖర్చు తగ్గించ
కన్న వారికిన్ కనకంబు సాధించ‌తనకిన్
కినుకకు యవకాశము దీసేయ కాబోవు వారికిన్

Sunday, April 26, 2020

తారంగం - తాండవం

కాళింది పైనా కృష్ణుడు ఆడెను తారంగం
సర్పముతోటీ శివుడూ చేసెను తాండవం

గోలోకమున వేణుగాన లోలుడు ఆడెను తారంగం
కైలాసమునా ఢమరుక నాధుడు చేసెను తాండవం

రాధాదేవితో రమణీ పతి ఆడెను తారంగం
రాకేందువదనతో రుద్రుడు ఆడెను తాండవం

నందుని తనయుని రస నర్తనమే తారంగం
నందివాహనుని మధురసభరిత నాట్యమే తాండవం

నళినదళేక్షుని నటనా కౌశలం తారంగం
నటరాజుని నర్తనా పటిమా తాండవం

నీరజనాభుని పద వినోదమె తారంగం
నీలకంఠుని లయ విన్యాసమె తాండవం

శ్రీ కాళహస్తి కవితలు రాగం

హస్తి  (కాలం కాని కాలంలో కోయిల పాటలెందుకనో... రాగంలో)

భాగవతం లోని గాధలలో మా కరుల గాధలున్నవిగా
భగవంతుడే తానొచ్చీ మకరుల నుంచి మమ్ము కాచెనుగా

గజముఖ వదనుడు నీ తనయుడే
గజలక్ష్మీ మరి నీ సోదరే

గజ ఉదరంలోనే కొలువున్న గౌరీపతి వందనమిదిగో
గంగాదేవితో జలరూపాన నిను అభిషెకించేముగా

అందుకోవయ్యా మా అర్చనా అంబాపతి ఆనందంగా
అలంకరించేను నిను నేనూ అరవిరిసిన విరి కాంతులతో

కాళ (వేయి సుఖములు కలుగు నీకూ రాగంలో)

వేయి పడగలు కలవు నాకూ కాని వర్ణింప అలవి కాదూ
వేన విధముల కొలుతు నిన్ను నన్ను ధరించిన శ్రీ కంఠా

భూషణమును నీదు వారలకు బహు విధములుగా
భవానీకీ కేశము నేనూ లంబోదరునీ యజ్నోపవీతమును

వల్లీ పతికీ రూపం నాదే అస్తీక మునిని కాదే
వైకుంఠ వాసునకూ నే తల్పమును కానా

కాళిందీ మడుగునై నే కొలనులోనూ నిలిచితీ
వాసుకిగా పాలకడలిని చిలికి విషమును గ్రక్కగా

చక్కగ పట్టీ మెడకు చుట్టీ నన్ను నీవూ కాస్తివే
చేయి కాలు విడిగ‌ లేవు నాకు ఐనా నిను నే సేవింతునూ

విడువకయ్యా నన్ను ఎన్నటికీ విషము కలదానననీ
వినుము నా ఈ మనవి స్వామీ ఆదరించుమా నన్నూ

శ్రీ: వేయి సుఖములు కలుగు నీకూ రాగంలో

అన్యులలె లేదు నాకు ఎట్టి చరిత్రా అమరేశ్వర
ఆదరించవయ్యా నన్ను నిన్ను నే అభిషేకింతునూ

అన్ని అంశలూ నీవే కదా మరి అప్పుడు నేనైననూ
అలవి కానీ దాననైనా అంతరంగమున స్మరియింతునూ

శ్రీ భోళాశంకర భక్తురాలు

బెజ్జ మహాదేవి వోలె భజనలు వ్రాయగా లేదామె
భక్తబాంధవులను పిలిచి భోజనాలు‌ వడ్డించలేదామె

శివ సాన్నిధ్యం చేరే ముందర ఉసురు పోయిన
శరీరమునకు పూసిన బూడిద విభూది సమమామెకు

సకల చరాచర వస్తువులందూ సదాశివునే దర్శించే
సనాతన నమ్మిక ఆమెది సగుణోపాసన నిర్వచించెను

రాతిలో స్వామిని అనుభూతించెను రోలి రోకలినే అర్చించెను
నీటిని గంగని అభిషేకించెను సైకతమె విభూతి అని అలంకరించెను

నుదుటిపై జారే జలములకడ్డుగ త్రినేత్రుని
నయనముల కాచగ తన హస్తములనే హద్దులు చేసెను

అర్ధనారీశ్వరుడని పసుపు కుంకుమ పువ్వును పెట్టెను
అన్నీ స్వామి అంశలే అని ఆకులు ఫలములు నైవేద్యమనెను

శిరమున నిలిచిన శశి వోలే నేత్రమైన దినకరుని వోలె
ప్రియ పుత్రులైన వక్రతుండ వల్లీపతి వోలే

పుడమి అంతా తిరిగి ప్రదక్షిణ చేయలేనని నీరుగారలేదు
కపటం లేని భక్తి ఉంటే సాధ్యం కానిది లేదని తలచెను

తానున్న చోటే కైలాసమనెను ఆత్మ ప్రదక్షిణ గావించెను
కరములు చేసే ప్రతి పని స్వామికి చేసే సేవేననుకొనె

కలముతొ వ్రాసే పదములు ఢమరుకం లోనివె
కనుకే అంతా కామేశునికే అర్పణ‌‌ అనుకొనె

పదములు వేసే ప్రతి అడుగూ పర్లీనాధుని వైపే ననుకొనే
మనమున వచ్చే తలపులు అన్నీ మాహేశుని గూర్చే చేసే

ఇంతకన్నా భాగ్యం ఇలన ఇంకేమున్నదనే
ఇహపరములన్నీ స్వామి ఇచ్చే అని తెలుసుకొనే

Friday, April 24, 2020

శ్రీ శరవణ

పల్లవి:

శ్రీ శరవణునికీ కృత్తుకల లాలి
శీఘ్ర ఫలదాతకీ శైలజమ్మ లాలీ
గణపతానుజుడికి గంగమ్మ లాలి
జయకేతనుడికీ జంగమయ్య లాలి ||శ్రీ శరవణునికీ||

చరణం:

1.

శూలాయుధునికీ శార్వాణి లాలి ||2||
హరిహర సుతునికి సురులందరి లాలి
తారకాసురుని అణిచినవానికి తెలుగింటి లాలీ || శ్రీ శరవణునికీ||
శిరోమణిధారికీ శివకేశవ లాలి ||2||

2.

శ్రీ వల్లీశ నాధునికి కుముదయ్య లాలి
దేవసేనుని చేపట్టు స్వామి కీ దేవేంద్రుని లాలి ||2|| || శ్రీ శరవణునికీ||
పితరునికె జ్ఞానమునూ పంచేటి స్వామికీ ||2||
పగడాల ముత్యాల పన్నీటి జోల ||2||
శిశువులను వరముగా ఇచ్చేటి స్వామికీ రతనాల లాలి

శ్రీ రామాయణం

పుత్ర కామేష్టితో పుడమి కేతెంచావు
పున్నమి వెలుగుల కాంతి పంచావు

దినదినమూ ఎదుగుతూ విద్యలనూ నేర్చావు
దశరథుని కంట వెలుగువై నిలిచావు

గురువాజ్ఞతో యాగరక్షణ చేసినావు
గౌతమ పత్నికి శాప విమోచనం గావించావు

మిధిలకేతెంచి మిన్ను విరిగేలా
మహాదేవ చాపాన్ని అలవోకగా విరిచావు

సిగ్గిల్లుతున్న సీమంతిని మది దోచావూ
సీతమ్మను చేపట్టి జనకుడినీ కాచావూ

భార్గవ రాముని విల్లునీ నిలువరించి
భంగమొనర్చినా భువిపైనేనాతని నిలిపావూ

కైక కొరకై కానలకేగినావూ
కనకపు సింహాసనం కాదనుకున్నావు

లలనా లక్ష్మణులు వెంటరాగా
లలితమైన అంతఃపురం వీడినావు

లాలించి ప్రజలను అందులకొప్పించినావూ
లయబద్ధంగా వనముల చేరావూ

గుహుడిని బ్రోచీ నెలవున్నావూ
గమ్యము ఇది కాదంటూ అచట నుంచి కదలీనావూ

కబంధ బాహువులను సంహరించావూ
కష్టపెట్టే వారిని ఉపేక్షించేది లేదన్నావూ

శూర్పణఖనూ సాగనంపినావూ
శూలం దండం వాడకనే

మాయ లేడికై పరుగిడినివూ
మగువను కోల్పోయి విలపించావూ

శరభంగ శబరి సేవలనందగ
సేదతీరుట నెపముతొ కృప చూపినావూ

సుందరుడైన హనుమ నిను చేరగానే
సుగ్రీవునితో చెలిమిని చేశావూ

వాలిని పడగొట్టి క్షాత్ర ధర్మం నిలిపావూ
వరమునాతనికొసగీ మోక్షమునిచ్చావు


చూచితిని సీతను అంటూ హనుమ
చెప్పినది విని పొంగిపోయి నావు

వారధిని కట్టించీ లంకను చేర
వానర సేనతొ సాగినావూ

కళత్రము కొరకై కయ్యమందినావూ
కదనరంగమున ధీరుడవై నిలిచావు

రావణుని నిలువరించినావూ
రాఘవుల బలము తెలిపినావూ

భరతునికై త్యాగమొనర్చగలవీవూ ఆ
భ్రాత కొరకే‌ రాజువైనావూ

సాయం చేయ వచ్చిన వారందరికీ
సగౌరవ స్వాగతం చూపావూ

సాకేతధామా సరళ హృదయా
సేవలు చేయగ‌ రాలేని మము

నీ భక్తుల దయ చూడుమయ
నీరజపత్రేక్షణ నీలమేఘ శ్యామా


భద్రపురినివాసా మా భక్తి నీవు గొనుఁమా
తన్మయత్వముననే తరియించు పాట వ్రాయుచుంటీ
నిన్ను గొలుచు భాగ్యం నీరజాక్ష నాకు ఈయమంటీ
నిక్కమైన నిధియన్న నీదు నామమయ్యా...

తక్కువేమి మనకూ ట్యూన్ లో అల్లుకున్నాను

Wednesday, April 22, 2020

కరోనా కీ భగవంతునికీ అనుసంధానం చేస్తూ వ్రాసిన పాట

తిరుమల వాసా శ్రీశైలేశా
విశ్రాంతి పొందగ రారండీ
శుచి యే స్వర్ణమని సూక్ష్మం సూచన
ఈ భక్తులకెల్లా తెలపండీ

భువినందేనా మరి మదినందు
లేరా మీరెల్లా ||2||
భగవంతుడిని చూచుటయంటే కాదే అది మన తరమెల్లా

ఇసుకకు సైతం జాగా లేక క్షేత్రాలు
ఇరుకైపోయీ జరుగుచుండే తోపులాటలూ
ఇబ్బందులు సైతం వదిలీ మేమంతా
ఇహపరమైన కోర్కెల చిట్టా విప్పేమే మరి మీ వద్దా

ఇందుకనేనా స్పందించారూ మీరంతా
ఇలయందందరిని కూర్చోపెట్టీ
ఇళ్ళల్లోనే నిలిపారూ
ఇంతటి కధనూ నడిపారూ

పునఃప్రారంభం అంటే మామూలూ కాదే
పురిటీ వంటిదీ పుడమీకీ
చిత్తశుద్ధితో ఇకపై మరి మనమంతా
ఇంపుగా నిలిపీ అందిద్దామూ ముందు తరాలకూ

Tuesday, April 14, 2020

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వర్ధంతి ఏప్రిల్ 14

విజ్ఞాన ఖని విద్వాన నిధి
విశ్వమెల్ల వినుతించిన పెన్నిధి
విధాత గని కోరుకున్న సన్నిధి
వీడి వెళ్ళెను మనను వినయశీల ప్రతినిధి


ఛందోబద్ధమైన ప్రయత్నం


విజ్ఞానపు ఖనిగాదె విద్వత్తుల నిధియేగ
విశ్వమెల్ల వినుతించె విలక్షణ పెన్నిధియె
విధాతయె చకితుడై వేడుకున్న సన్నిధియె
వీడెకడ కుమనను వినయశీల ప్రతినిధి


ఛందం గుణింతం
...


ఈశ్వరీ చూడవమ్మా ఈదిశన్ పదార్చితా
నీదయ మాకొసగుమా నిఖిల లోకమాతా


భగవతీ భోళాశంకరులు భక్తులను బ్రోచుగాక
భ్రమరమ భ్రమణము బొందినవారు మము కాచుగాక


శ్రీ కృష్ణుని పై పాట

శ్రీ పాండురంగ మహాత్మ్యం లోని "కృష్ణ ముకుందా మురారీ" పాట రాగంలో


[10/04, 14:18] Durgamadhuri1: మురిపాలా ముకుందా మురారీ
[10/04, 14:20] Durgamadhuri1: మది దోచే ఓ చోరా రాలేరా
మురిపాల ముకుందా మురారీ
[10/04, 15:04] Durgamadhuri1: దేహము పైన మోహము శూన్యం
[10/04, 15:07] Durgamadhuri1: ధేనువు వెంట నువ్వు తిరిగేవు అంటా
వ్రేపల్లె అంతా గోపాల సిరులేను అంతా
సహస్రాక్షుడైనా నీకు సరి రాడు కాదే
సమరాన సైతం ఇది చాటేవు నీవూ
[10/04, 15:15] Durgamadhuri1: వెన్నను మదినీ దోచేటి నీవు
వెన్నెల ముదమును చూపెట్టి నావూ



బృందావనానికి ఈ అందం ఎక్కడిది
భక్తుల బ్రోచే కృష్ణునితో బంధంతోడిది
సెలయేరూ సిరిమల్లె శశి వెన్నెల
తరుశాఖలు తరుణీమణి తరగని గని
వర్ణించతలమౌనే నిను కొలిచే
పదసంపదే మాకు సదా వరమగునే
వాణీశుడు వేయి పడగల నాగేశుడు
పలుకగలరే నీ ప్రేమ ప్రతిభ గూర్చి


విరించికే పితరుడవో నీవు
విమలాపతి సహచరుడివో
వీణాధారుని గానామృత గమ్యానివో నీవు
విరజా తీరస్థ వాసుడివో వైకుంఠ నిలయా
వేణుగానలోలా నీ పాటతో మా మంది మెరయా
వెన్నెలలోనా విహరించే విలాసమే నీదయా
వన్నెలు చిందే చిన్నదానను మురిపించే రసహృదయా
వేడిన వెంటనే వెతలను తీర్చే కరుణా వరద వయా
వేడుకనున్నా విన్నావంటే మా విలాపమునూ
విన్నావంటే వెంటనే లేచీ వేగిరమే వచ్చెదవూ మా
వేదనలన్నీ నీ వేటుతో తీసే మా వేలుపువీవూ
వేదము గానీ వేయి పడగల శేషుడు కానీ
వర్ణించగలరే నీ వెలుగుల చరితనూ  ఓ
వేదాద్రి వాసా వేంకటేశా వైనతేయారోహా
విరోధి మర్దన విను మా మనవి వింధ్యాద్రి వాసిని భ్రాతా
విజయము విషయము విద్యా వినయము ఒసగుము విడువక మాకు సతతము దేవా స్తోత్రము చేసెదమూ మి
విపంచి నాదము వినోద కేళియ రూపము ఏదైనా
వినుతించెదమో నిన్ను వివరించెదము నీ గాధలే
వేంచేయి మా హృది గదిలోకీ వేరు చేయకు మమ్మూ

మురుగేశా మయూర‌ వాహన
మానస సోదర మాతృకల తనయా
మాననీయా మము దయ చూడవయా
మా కష్టముల బాపుమయా
మహేశ జ్ఞాన బోధకా మయూఖ సోదర
మహి మండలమున ఉదయించిన
మహామహిమాన్విత దేవా
మము దీవించుమా కరుణావరదా



భద్రమొనర్చే బలరామకృష్ణులు
భయములు దీరుచును ఈ
భ్రమరాంబ సహోదరులు
భక్తులను బ్రోచే ప్రసన్న వదనులు


నల్లనయ్య వాడు అల్లనల్లన
పిల్లనగ్రోవిని ఊదుతాడు
చల్లనయ్యగా ఉడిపిలోన ఉన్నాడు
మెల్లమెల్లగా అందరి మదినీ దోచుతాడు




పత్రం పుష్పం ఫలం తోయం
ఏమి పెట్టగలను నీకు నైవేద్యం
ఓ శిఖి పించ మౌళీ శ్రీ హరీ
సమస్తమూ నీ ఆధీనమే కదా!


స్వామి సదా రక్షింతురు మనను
స్మరణయొకటె కావలిసినది
సిరికీ భువికీ పతియై ఆతండు
సంతానమైన మనను కాచుచుండును



చల్లని వెన్నెల పరవగ
మెల్లగ పవనము వీచగా
పిల్లన గ్రోవిని ఊదుచు
అల్లరి చేసెడి కన్నయ
అలనల్లన కానవచ్చే
మదిని గిల్లుచు దోబూచులాడె
మరి యిల్లు జేరడె సందియ వేళకు
గోపెమ్మ చేయు అందియ నాట్యము జూడగ

శ్రీ శార్వరి నామ‌ సంవత్సరం

శాంతమును కూర్చుతూ
శాకపాకాలను అద్దుతూ
శార్దూల వాహిని కృపనొసగుతూ
శ్రేయోదాయకమైన జీవితాన్నందించాలని కోరుతూ

శ్రీ శార్వరీ నామ సంవత్సర శుభాకాంక్షలు

కరోనా

[14/04, 15:49] Durgamadhuri1: కరోనా... ఓ కరోనా...
ఎంత పని చేశావే
ఎచటివారనచటనే నిలిపావే
ఎంతటి వారలైన నీకు దిగదుడుపు
ఏ మందులైన నీకు అలుసని తెలిపావే
ఏమీ ఎరుగని దాని వోలె నిలిచావే
ఎంతో భయమును మాకు గొలిపావే
ఎవ్వరైన లెక్కలేదన్నావే
ఎదలో సొదలెట్టేవే
ఏకఛత్రమును సాధించేవే
ఏరులై పారి అందరినీ కరిగించే
ఏడుపును సైతం తెచ్చేవే
ఎత్తు చూస్తే అసలు లేవే
ఎకసెక్కాలెన్నో నీ వలెనే పుట్టేనే
ఎప్పటికీ కనమనుకున్నవి చూసేమే
ఎన్నటికి మమ్ములనొదిలేవే
ఏహ్యభావం మోసిన పురుగువులే
ఎరువులేసి నిను పరిగెత్తించేములే
[14/04, 15:49] Durgamadhuri1: కమ్మని నిద్రలోకొచ్చేవే
కలలన్నీ చెదర్చేవే
కరమున సైతం ఇమడవులే
కర్ణమును మాత్రం తాకేవుగా
కలతలు కష్టాలు తెచ్చేవుగా
కరుణ అన్నదే చూపవుగా
కడలిని సైతం దాటేవూ
కోవిడ్ పేరుతో తిరిగేవూ
కోరని బాధలు తెచ్చావూ
[14/04, 15:49] Durgamadhuri1: మా పరుగులనన్నీ నిలిపేవూ
పనులను నీ చెర పట్టేవూ
పుడమికి ఊరట అంటూనే
పూరుషాళిని బెంబేలెత్తించేవూ
కుటుంబాలనింట్లో ఉంచావూ
కుదరదనుకున్నవి చూపేవూ
కీడై వచ్చీ మేలై నిల్చినావూ
కీలకమైన దశనిలపై నడిపినావూ