నిశి రాతిరి ఆ కురులలో దాగుంది
జాబిల్లి ఆ వదనం లోంచి తొంగి చూస్తోంది
రేయి తెలవారుతున్నట్టుగా భానుడు పొడసూపిట్టుగా
ఆ నుదురు కుంకుమ తో మెరుస్తోంది
ఆదిత్యుడి కిరణాల అంత వెచ్చగా ఆ స్పర్స పలకరిస్తోంది
వీచే గాలి లో లేని చల్ల దనాన్ని సైతం ఆ కన్నులు కురిపిస్తున్నాయి
గగనమున తొలి సంధ్యలో నిండే స్వర్ణ వర్ణమూ
సంద్రాన లభియించు ముత్యంపు అందమూ
మిళితమై దర్శనమిచ్చే నీ పాదముల యందు
లయమై ముగ్ధ మనోహర నిలయమై

No comments:
Post a Comment