వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
23.09.2024 సోమవారము
అంశము: సబ్బు బిళ్ళ
ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని)
ప్రక్రియ: పద్యములు
//తేటగీతులు
మోక్షగుండము వారు సమూలముగను
ౘదివి సాంకేతికతను! ప్రజలకు మేలు
చేయు తలపున మొదలిడె జిడ్డు రాని
మురికి వొదిలింౘు సాధనమ్మును ఘనముగ
దేశ సరిహద్దు దాటుౘు దెలిసికొనె
వారి సహచరుండు మన గర్వము నిలుపు
విధముగ సవాలు పూరించె విద్యనంది
యటుల సబ్బు బిళ్ళయె పుట్టె నద్భుతముగ
అని చెప్తూ హరికథలో, "ఆ రకముగా భారతావనికి చేరిన సబ్బు బిళ్ళ, ఎల్లలు లేక, పాత్రలకూ, రేవు లోనూ, ఇళ్ళల్లోనూ బట్టలకూ, దేహ శుభ్రతకూ ఉపయోగ పడుతూ ఎందఱికో ఉపాధినీ, దేశానికి ఆదాయమీయటమే కాక, దాని తయారీ కార్యకలాపాలకూ సాఫ్ట్వేర్ ను వాడుతూ మరింతగా దూసుకు పోతోంది", అని ముగించారు.
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
24.09.2024 మంగళవారము
అంశము: దత్తపది: నిండిక ముండిక శిండిక పిండిక
ఇరువంటి దుర్గా మాధురీ దేవి [నాగిని]
హైదరాబాద్.
ప్రక్రియ: కంద పద్యము
ఏమాయెను? (నిండి క)రుణ
చా(ముండి క)నులు దెరువగ; జనులకు శుభమే
యా మాత వ(శుండిక) యే
కామాంధుడకైన (పిండి క)న్నులు; ద్రుంౘున్
(కామము అంటే ఎటువంటి కల్మషం తో కూడిన కోఱిక యైనా అని పెద్దల ఉవాచ)
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
26 September 2024 గురువారము
సమస్య 4893
తేటగీతి
నాటి వేమన మొదలుగ నేటి వఱకు
పలువురు ఘనులు జీవిత పాఠములను
దెలిపె గనుక నూతనముగ కలము పట్టి
యల్లు వారలు మానగ నట్టి విధము
వెదకి జూచిన గాని యా విధము నూత్న
కవుల కవనమ్ములో నీతి గానరాదు
25.09.2024 బుధవారము
అంశము: సమస్యా పూరణము
ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
నవ్వులు విరియని గృహమున
పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్
మువ్వల సవ్వడి చేసెడి
దివ్వెలగు వనితలు యున్న తీర్థమునందున్
భార్గవి కళా పీఠము విజయవాడ కేంద్రము
26.09.2024 గురువారము
అంశము: చిత్ర కవిత (తిరుపతి లడ్డూ)
ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని)
ఇతరములేవియు లేవా
మతులకు ప్రాధాన్యత గల మంటలు గలవే
ప్రతి ఘటనలు వానిని మన
బ్రతుకుల నుండి దరుమరను ప్రశ్నలు గలవే
బదులుగ తెలిపెద వినుమా
యుదరము గైకొను సమస్త యుత్పత్తులనే
ముదముగ నర్పణ చేసిన
కదలు తరంగములు నిౙము! కష్టము రాదే
భారత వచనము విడౘుౘు
ధారగ నితరుల పలుకులు తప్పక నమ్మే
వారలకేమని చెప్పుట!
ప్రేరణ నికనైనను గొని వేదము వినుమా
కనులకు నగుపింౘనిచో
నగుబాటు వలదు! మనమున నమ్మిన గలుగున్
చిగురులు జ్ఞానమునదియే
సెగలేలన నీ పరిధి నిశీధి! యెదుగుమా
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
27.09.2024 శుక్రవారము
అంశము: న్యస్తాక్షరి
ఇరూవంటి దుర్గా మాధురీ దేవి (నాగిని)
(బు)ల్లి పాపాయి పలుకులు ముద్దులొలుకు
కల్ల కపటము లెఱుగరు! గ(డు)సు తనము
యూహ కందదు! (మే)టిగ స్నేహ గుణము
ౘూపుౘుందు(రు)! నవ్వులు శోభ చిలుకు
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
21.10.2024 సోమవారము
అంశము: వర్ణన - విద్యుత్తు
ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని)
హైదరాబాద్
ప్రక్రియ: తేటగీతి మాలిక
ౘదువు రాదు బాలునకని సాగనంపి
పత్రమంద చేసిన ఘన పాఠశాల
తలను వంౘునట్లు తనదు చేతల నందు
పట్టుదలను ౘూపుౘు బాలుడైన
సుతుని మేధావిగా నిల్పి జ్యోతి నింపె
నేడు విశ్వమంతటికిని ఱేడు యతడు
యెడిసనుడు నాన్సికి జయము నిచ్చె! ఘనుడు
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
22.10.2024 మంగళవారము
అంశము: దత్తపది
ఇరువంటి దుర్గా మాధురీ దేవి (నాగిని)
హైదరాబాద్
ప్రక్రియ: కంద పద్యము
పాణిన పట్టెను వీణను
వాణి! సరస్వతి! విరించి పత్ని శిరమ్మున్
వేణియ నీలపు వర్ణము!
రాణింౘును మది జననిని ప్రార్థించినచో
గురువులు పెద్దలు దోషములున్న మన్నించి తెలుప మనవి
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
04.11.2024 సోమవారము
అంశము: వర్ణన (కార్తిక సోమవారము)
ఇటువంటి నాగ దుర్గ మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
మా తల్లి యుమా సహితము
భూతలమున జీవుల గన! ముగ్ధయు హరుడున్
శీతలమగు శిఖరము విడి
యేతెంచెడి వారము యిది! హితమును గూర్చన్
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
05.04.2024 మంగళవారము
అంశము: దత్తపది
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
(ముద్దు)లొలుకు బాలలతో
(ప్రొద్దు) సుళువుగా ౙరుగును మువ్వల సడితో
(బొద్దుగ) పెంౘుట మోదము
మొద్దుగ నుంౘ వలదు గద మోహము తోడన్
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
బుధవారము 06.04.2024
అంశము: సమస్యాపూరణము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
హైదరాబాద్
కలికాలపు మాయ జనుల!
చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్
కలమును పట్టిన కవి మది
తలపులనందున! హతవిథి! తగునా హయ్యో
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
07.11.2024 గురువారము
అంశము: చిత్ర కవిత
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
హైదరాబాద్
అమ్మ వారి ముందఱాడు వారు మదిని
భక్తి నిండి యుండు! వత్సరముల
పాటు వీడరసలు పోటు! కళను పట్టు
పోతురాౙు లండి! పుణ్యధనులు
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
08.11.2024 శుక్రవారము
అంశము: న్యస్తాక్షరి కార్తికము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
(కా)మిత ఫలముల నొసగే
భామిని కామాక్షి యా(ర్తి) బాపుౘు పథమున్
స్వామిని చేర్చుచు మన (క)ల
ప్రేమగ దీర్చుచు (ము)దమును పెంౘును ధర పై
[12/11, 19:29] Durga Madhuri Devi Nagini: వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
11.11.2024 సోమవారము
అంశము: వర్ణన
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి నాగిని హైదరాబాద్
కార్తిక మాసము దీపము
మూర్తిగ నిలువని శివునకు మోదము గాదే
కీర్తియు కామ్యములన్నియు
పూర్తిగ దీరిన పిదపన మోక్షము గలుగున్
[12/11, 19:44] Durga Madhuri Devi Nagini: వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
12.11.2024 మంగళవారము: దత్తపది
అదుపు కదుపు పదుపు మదుపు
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
(అదుపు) లేని పలుకు హాని కలుగ చేయు
(కదుపు) లేని బ్రతుకు కలదె? ధరణి?
(పదుపు) ముందు యింటి పరువు దీయ వలదు
(మదుపు) మేలు గూర్చు! మనకు భువిని
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
బుధవారము 13.11.2024
సమస్యాపూరణము
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
లోక వాక్కు యిది సతిని రొష్టు పెట్టి
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకు మేలు
యత్తమామల నారళ్ళు నతిగ పెట్టి
దెయ్యమై యాడు కోడలు తీపి నేడు!
వాగ్దేవి కళా పీఠము విజయవాడ కేంద్రము
14.11.2024 గురువారము
అంశము: చిత్ర కవిత
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని) హైదరాబాద్
పూతరేకు రూపు పోలు పలు విధముల
వంట లెన్నొ నేడు పండుౘుండె
జనుల నోళ్ళనందు గనగ దాని రుచియు
మాత్రమందలేవు సూత్రమైన!
పిన్నపెద్దలంట వేనోళ్ళ మెౘ్చు యీ
ధవళ వర్ణమునకు తగిన రీతి
నిరుపమానమగు గనిగ వెల్గు రేకుకు
సమము లేదు సుమ్మి! శైలి వేరు