Monday, October 19, 2020

ఇతర పద్యములు

కన్నకు బెట్టెద కమ్మగ
యన్నము చంద్రుని గగనము నందున గనుచున్
యన్నుల మిన్నగు సుతునకు
యున్నతి నొసగును జననిడు యోరిమి! గనగన్


కందం
కరుణించుమయా మమ్ముల
కరోన రక్కసిని దరిమి కాపాడుమయా
సురముని వందిత దేవర
పరమదయాకర! నృసింహ! పన్నగ శయనా

ఆటవెలది
పనస తొనలు తిన్న బహురుచి గానుండు
వదలకుండ దిన్న వహ్వ యనుచు
పసిమి ఛాయనుండు బంగరంపు సొబగు
స్వస్థతిచ్చు నిజము సతము మనకు

తేటగీతి
తేటగీతి
తల్లి చరణము పట్టిన దక్కు మనకు
మోక్ష పథము; ధ్యానింపరే ముదిత లార
మర్త్య జన్మయుండదిక పై మంగళంబు
లిచ్చు జనని నీడన విహరించెదమిక


తోటకము
హరిపత్నిగదా సదయాంబుధియే
సురవందితగా తనచూపులతో
వరమిచ్చెడియా మధుబాలకునే
కరమోడ్తుసదా గజగామినికే

హరిగతి రగడ
బాలుని బ్రోచిన దేవుని గారము పట్టెడి భాగ్యము నిమ్మని వేడెద
మేలుని గూర్చెడి ధర్మపురాధిపు మిన్నగు భాగ్యము నిమ్మని వేడెద
తాళని బాధను దీర్పెడి సింగము తండ్రగు భాగ్యము నిమ్మని వేడెద
వేలిని పట్టుకు ముందుకు రమ్మని బిల్చెడి భాగ్యము నిమ్మని వేడెద

న్యస్తాక్షరి, యతి స్థానము లోనె అక్షరాలతో

ఆటవెలది
పాల జలధి నందు పాతాళ వాసుల
లాగుచుండె సురులు రాగ వెంట
బాగ నొక్కి పట్టి వాసుకిని! యపుడు
లాస్యమాడు పడతి రంభ వెడలె!


మానిని
భావన సేసెద పావన మూర్తిని భార్గవి నాథుని భక్తిగ నే
సేవలు జేసెద చిన్మయ రూపుకు సేమము నిచ్చెడి శ్రీహరి యే
దీవెన లందలి తేజము నందెద దీక్షగ గొల్చెద దేవుడినే
గోవుల పాలుని! గోటిన! ధాటిగ కొండను నిల్పిన కుబ్జ పతిన్

మానిని
మానస మందున మంగళ దాయిని మాతను గొల్చెద మంత్రముతో
దీనుల బ్రోచెడి తీయని పల్కుల దేవత బాధను దీర్చుననీ
మేనక పుత్రిని మీనుని యన్నల మిన్నగు తల్లిని మేదిని నే
గానము జేసెద కామిత దాయిని కష్టము బాపెడి గౌరిని నే


పతినే దైవమనెడి భా
రత నారిని దుఃఖ పెట్టు రాక్షస గుణముల్
సతతము యుండిన భర్తకు
సతతము సంతసమొసంగు సతితో గొడవల్


తేటగీతి
లోకమంత నిండిన భాషరొక్కములను
పొందుటకు పయోగమనుచుపొందుఁ గోరు
నిత్య నూతనమాక్స్ఫర్డ్కునింగి హద్దు
క్రొత్త పదము జేర్చుటలోనకుంటు వడదు

అమ్మ యన్న పలుకు నమృతము
 మించును
తేనె లూరు పిలుపు తీయగుండు
సాటి రాదు మరిక జగతిన వేరేది
కన్న తల్లి మాట వెన్న మూట

ఆటవెలది
ఇంటి పనుల లోన యిసుమంత సాయము
కోరఁ లేము మనము కొద్దిగైన
యింతి పనుల జూడ యింతింత గాదయా
కొలిచినంత కొలది యలసి పోవు

ఆటవెలది
సానుభూతి దప్ప సాయమీయగ లేను
బాల! దిగులు చెంద వలదు నీవు
కలత వల్ల నేమి కలుగు కరుగు శక్తి
కుదుట పడుము తల్లి! కోమలాంగి
పంచ చామరమూ. యతి 10వ అక్షరము. గణములు. జ,ర,జ,ర,జ,గ
శివా! హరా! గిరీశ! చంద్ర శేఖరా నమస్కృతుల్
భవాంతకా హలాహలమ్ము బాధనే భరింతువే
దవాక్షుడా దయా స్వభావ! దైవమీవె గావుమా
స్తవమ్ము జేసెదన్ చిదాత్మ! సాధు పోషకా ప్రభూ

తేటగీతి
పాల సంద్రమందు మునిగె పాండు రంగ
డేల యన పాత్రలన్ని తా నేల తోమి
గడుగ వలెనని జూపించె గడుసు దనము
పత్ని లక్ష్మికి శ్రీహరి! బాగు బాగు




ఆటవెలది
రాడు రాడు భవుడు లాస్యమాడు సతితో
తాండవమ్ము సేయు తా విభుండు
జనుల కొఱకు రాడు సత్యవాక్కు గనుమ
దీన బంధు గాడు త్రిపుర హరుఁడు

ఆటవెలది
వెండి కొండ పైన విహరించు టేలయా
యని యడుఁగ కపర్ధి! యంట్లు గడుఁగు
బాధ లేలన పడవలెనని హిమగిరి
నందు యుంటి ననెను! నయము గాను



తేటగీతి
విసపు క్రిమిబారి పడి మేము వేడినాము
బిల్వ పూజ్య! మాకై నీవు వేగ రావ
గరళ కంఠుడ వను మాట కల్పనేమొ
యని తలచవలయు నిక హే యాది పురుష



సంధ్య వేళ లోన జాబిలి కురిపించు
వెన్నెలందు చిలిపి వెన్న దొంగ 
వేణువూదు చుండ వెలగులీనెగ రాధ
మోము చక్కగాను మదము తోడ

మేదురదన్తమ్
తాండవ మాడెడి పార్వతి నాథునితామస నాశుని ప్రార్థన జేసిన
గండము లేవియు నీదరి జేరవుగావున శంభుని గొల్వరె నిత్యము
పాండవ మధ్యముడెన్నియొ పొందెనుపాశుపతాస్త్రము గూడను; మేదిని
భాండము నంతయు గాచెడి శంభునిపాడుచు స్తోత్రము జేయరె! నిత్యము

ఆటవెలది
రోలుఁ దెచ్చి పెట్టి లోగిలి ముంగిట
దంపి జూడ వలెను తరుణులంత
పప్పు దెచ్చి రుబ్బ వడల పిండి యగును
పచ్చి మిఱప యేమొ పచ్చడాయె

తేటగీతి
నాకు నిత్యము పేర్మితో నడక నేర్పి
పద్య రచన యందు వలయు ప్రతిభ పెంచు
రీతి మార్గ దర్శకమును ప్రీతి తోడ
పంచు గురువగు మీకిత్తు ప్రణతులమ్మ

ఆటవెలది
బిడ్డ కంటి నీరు వేదన తల్లికి
కనుక పలుక దెపుడు కఠిన వాక్కు
యుల్లి పాయ సేయు యుపకారముర! కన్ను
తుడిచి మేలొనర్చు తొలచు దుమ్ము


ఆట పాట తోడ నలసి సొలసి నాడు
యాద మరచి నిదుర నందె బాబు
ఎంత ముద్దు గొలిపె నితడు! గోపాలుడు
సద్దు సేయ వలదు స్వామి చెంత



ఆటవెలది
కరిగి పోయెనిట్టి సిరులు కనుల ముందు
కాలమేల యింత కఠినమాయె
మరలి రావు !యిట్టి మధుర క్షణములిక
కర్మ ఫలములివిక కలత వలదు

మేదురదన్తమ్
రాజ్యము వీడుచు కానల కేగిన రాఘవ! మంధర మాటలు నగ్నికి
యాజ్యము పోయగ కైకకు నీవుగ హర్షము పంచుట కోసము రాజగు
భోజ్యము త్యాగము జేసిన వాడిగ పూజ్యుడ వైతివి లోకుల దేవర!
యాజ్యము కోసము బంగరు బొమ్మను యాలిగ నిల్పిన నీకిదె మ్రొక్కెద
[14/06, 15:22] Durga Madhuri: అల్పాక్కర

సుతులు సలుపు సేవ శుభమొసంగు
సతము వదలకున్న జయమునందు
పతనమెన్నడు గారు బంగరమ్ము
హితము గలుగును మహిని! నిజము
[18/06, 15:39] Durga Madhuri: వృద్ధుల బల్కులన్ విడచి పెట్టుట క్షేమక రమ్ముగా దనెన్
బుద్ధిగ శాంతిగో రుటయె మోదము పంచును! పూరుషా ళికిన్
సిద్ధుడు స్వీకరిం చెనట శ్రేయము జేసెడి నీవిష యమ్మున్
యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందె నిద్ధరిన్

ఎన్ని యుగములైనను నీవెనెన్న దగిన
దైవమయ్య! రామ! సుగుణ ధామ!
వైరి పక్షమైన శరణని పలికినంత
నభయమొసగెడి వాడ! దయార్ద్రుడవయ!


మేదురదన్తమ్
పుట్టుట గిట్టున మధ్యన యున్నది మోయగ లేనిదె భారము యందురు
పట్టిన పట్టును వీడక యాత్మలు బంధము మధ్యన వేగుచు యుండును
వట్టిది లోకము మాయయు భ్రాంతియు వద్దని వేడెద నిన్నని నేనిట
మట్టపలీశుడ బ్రోవుమ నిత్యము మమ్మిట నిర్వృతి నీయుమ దేవర
తేటగీతి
పరమ భాగవతోత్తముల్ బాధ పడిన
దుఃఖ పెట్టిన వారగు దోషులెల్ల
వదలబోదు విధియెపుడు! పట్టుకొనును
గనుక వైర గుణము మాని ఘనముగుండు


ఆటవెలది
ధర్మ రీతి నెఱుఁగ ధర్మపురి నివాస
కర్మ ఫలము బాపి కరుణ జూప
వేడు కొంటి మయ్య వినతి వినుమ దేవ!
జాగు సేయకుండ జయము నిమ్మ



దండ అనే పదము నాలుగు మార్లుపయోగించి పద్యము


కందం
దండమిడుదునయ యండయు
దండయు నీవైన రామ! దాశరథీ! కో
దండము కరాబ్జ సొబగుల
దండనలంకరణ సేతు తాటకి నాశా


ఇతర పద్యములు


కందం
వినడుగ మొఱలను శుంభుఁడు
ఘనకీర్తి కొఱకు కపర్థి గరళము మ్రింగెన్
జన సేమముకై కాదట
మన రక్షణ సేయడెపుడు మహితాత్మ


ఆటవెలది
జయము జయములయ దశరథ నందన రామ
లక్ష్మణాగ్రజ! హరి! లవకుశ పిత!
జానకీశ! సతము జగదోద్ధరణ సేయు
శక్తి యుక్తి రక్ష సర్వమీవె


ఆటవెలది : 97%(28/29)
గణ విభజన
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U |U |U U |U U |
స న్నుతిం తుని న్నుస ర్వే శ్వరీ మ మ్ము
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U || | |U |U || | |
నా దుకొ న గరా వయం బజ న ని
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
| | |U |U || | | || | | |
స త మువీ డనీ దుచ ర ణ కమ ల ము లు
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U |U || | || | |U |
త ల్లిభ క్తసు ల భద య నుజూ పు












ఆటవెలది : 97%(28/29)
గణ విభజన
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U |U |U | || | U |
ఓ డిపో తిన య్యనో రి మిక ర వా యె
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U |U || | |U |U |
చే వలే దుప ను లుఁజే యలే ను
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U |U |U | U| | U |
స న్నగి ల్లిపో యెశ క్తి నీఱ స మొ చ్చె
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
| | |U || | || | |U |
నె టు లసా గుబ తు కుయె ఱుఁ కలే దు












ఆటవెలది
తలుపు మూలనుండి తరుమునలక్ష్మిని
జ్యేష్ఠ రూపమైన సిరికి యక్క
బయలి వెడలు నంట బయటికి వెంటనే
దుమ్ము ధూళి నిలవదు నిజము గద

గంగమ్మ పై మకుటముతో

తేటగీతి
విష్ణు పుత్రిగ నీవుద్భవించినావు
విశ్వమంతయు గంగగ వెలసినావు
వేణియగ దిక్కులను పాఱు వేల్పువమ్మ
వందనమ్ములు నీకివే పాప నాశి! !
తేటగీతి
పోతన కలముఁ కురుపతి పోరుఁ గోరె
గాని విశ్వ శాంతి కొఱకు కలము కదిపి
వ్రాసెడి రచనన వినూత్న పద్ధతినను
సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె


తిరుపతి పదము న్యస్తాక్షరి


తేటగీతి
తిప్పలు గలిగెను వినుము దేవ వినతి
రుణపడి జనులిట దలతురు మరి విడరు
పక్కి వాహనా! కారుణ్య వరద! శ్రీప
తి! మనమున నిలిపెదరయ తిరుమలపతి



తేటగీతి
తిరుమల గిరిపై వెలసిన దేవ దేవ
సిరులను గురిపించెడి హరి! శ్రీనివాస
పరి పరి విధముల నుతింతు భక్త సులభ
యడిగితి నయ నీ రక్షణ నంబుజాక్ష



ఆటవెలది
పూల మాల గట్టి పూజకై భక్తిగా
తాను వేసికొనెను తరుణి మొదట
దర్పణమున జూడ దర్శన మిచ్చెను
స్వామి బింబమల్లె! చక్కగాను


ఆటవెలది

నీరు లేని బ్రతుకు నిలుచునె ధరణిన

జలము నిండు కున్న జయముఁ చెదురు

సలిలమవసరమయ జంతు జాలమునకు

మ్రింగ హక్కు పడమిని మనకే


దత్తపది:


కదనమందు దాడి గాదయ దోషము

పాడి సేయుటందు వలదు భయము

వేడి కోలు యేల భీరువు గాకుమ!

మహిని చెఱఁచు వాని మాడనిమ్మ!


పాడి= న్యాయము అని ఆంధ్రభారతి లో చూశాను.


దత్తపదికి నా ఆటవెలది పూరణ ప్రయత్నము, గురువులు, పెద్దలు దోషములున్న మన్నించి తెలుప ప్రార్థన


[25/03, 22:48] Durga Madhuri: 


హరీ నిన్ను నిత్యంబు యర్చించ భాగ్యంబు

వరంబీయవా మాకు పద్మాక్ష! వైకుంఠ

పురాధీశ! మాకిమ్మ! మోక్షంబు! మాదేవ!

ధరానాథ! కారుణ్య ధామా! సతీ భ్రాత!


కంద వృత్తము గురువర్యా

[25/03, 22:50] Thompella Bala Subramanyam


 Acharya: 

భుజంగ ప్రయాత్తము

హరీ నిన్ను నిత్యంబు నర్పించు  భాగ్యంపు

వరంబీయవా మాకు పద్మాక్ష! వైకుంఠ

పురాధీశ! మాకిమ్మ! మోక్షంబు! మాదేవ!

ధరానాథ! కారుణ్య ధామా! సతీ భ్రాత!


గ్రీష్మ తాపము మొదలాయె గాడ్పు వీచె

యంబుధిని నిలిపిన రామ యాదు కొనుమ!

జలము లేక జీవము లెండె శరము దీసి

కడలి గొట్టి తీపి పయఁము పంచుమిలను



డిండిమ వృత్తము

ఆటవెలది


తేనె లొలుకు భాష తెనుగు భాష జనులా

తేనె చిందు ఘనత తెనుగు దేను

తేనె తీపి పొందు తెనుగు వలన గాదె

తేనె పలుకు లన్న తెనుగు పనుకె


[01/04, 18:54] Durga Madhuri:

మాయ లోన పడెను మాధవ పౌత్రుఁడు

రూపు మారి పోయి రోదనొందె;

కుండమందు మునిగి గోల్పోయినది పొందె 

యహము శిక్ష వేయు నణగ దొక్కు

[01/04, 18:59] Durga Madhuri: 


మాయ కారణంబు మహతి ధారునికిట

యహము తోటి వచ్చె నంతరంబు

నేను యన్న భావనెంత ననర్థమో

నెఱిగి మసలుకొనుటట నెంత మేలు!


కేవలం "న" తో పద్యము


కందం
నానా నిన్నననన్నా
నా నే నిన్న; నిను నన్న నని నే నేనే
నా నిను నన్నని నీనను
నీ నేనననీ ననునిను నేనననీ నా



సప్త స్వరాలతో క్రింది కందము

కందం
నీనామమునే గానము
పానము సేసెదను నేను పామరుఁ నైనన్
మానని పాపము నాదని
రానని మారామమొద్దు! రామా రామా


స్వర కందం

నీనామమునే గానము
పానము సేసెదను నేను పామరుఁ నైనన్
మానని పాపము నాదని
రానని మారామమొద్దు !రామా రమ్మా


తేటగీతి(మాలిక)
తేటగీతి
బాలుడడిగె మాతను సుప్రభాత వేళ
నేమి సేయుచుండెనని దానికి బదులుగ
పెట్టె సర్దుచుంటినని చెప్పెను యశోద
ఐన యందునేమున్నదో యనెను తాను
తల్లి యాజ్ఞ జేసె నిక కదలి వెడలనె
యాడు కొనవలయును గాని యడుగ వలదు
తక్కిన విషయములనిన తాను బెట్టు
జేసె ముద్దుగ చిలిపిగ చిన్ని కృష్ణ







శర్వరీ శివరాత్రి, March 2021, Thursday 


[11/03, 11:23] Durga Madhuri: 


ఈశ! నీ దివ్య నామమే యెఱుఁక నాకు!

శ్రీ గిరీశ! జగతికి నీ చిరు నగవులె

వెలుగు రేఖ! నీకె శరణు బిల్వ పూజ్య

వెతలు దీర్ప మనవి తండ్రి! వేద పురుష



[11/03, 12:47] Durga Madhuri: 


నియమముగ పూజ సల్పుట నేర్వ లేదు

షడ్రుచుల మాను కొనియుండు శక్తి లేదు

చేయ గలిగిన దొక్కటే! చిద్విలాస

నిత్య నామ స్మరణమయ్య నీలకంఠ


[06/03, 21:15] Durga Madhuri: 


పసివాని జేసి యందరు

కసిగా నాపై బలికిరి కల్పనలు కధల్

యుసిగొలిపిరి నిను నాపై

మసి పూసిరి జనని! నే యమాయకుని గదా


[06/03, 21:47] Durga Madhuri:


అమ్మో కట్టుట వలదని

సమ్మోహనుడనని వదిలి శాంతించమ్మా

మమ్మేలు జనని! నాపై

నమ్మకమిక వమ్ముగాదు! నళిన నేత్రా








[09/03, 21:20] Durga Madhuri:


రాముని నమ్మిన వారికి నెన్నడు రాదట యోటమి నిక్కము

భామిని సీతకు నాథుఁని గొల్చిన బాధలె యుండవు నెన్నడు

యామని కోయిల పంజర చిల్కయు యార్తిగ బిల్చెడి దైవము తీయని

నామము మారుతి స్వామియె! ధర్మమె నైజము భక్తుల రక్షణ వీడడు

మధ్యలో "భా" ప్రత్యేకత

బ్రహ్మ పత్ని! శ్రీ భారతి! వందనమ్ము
నీరజాక్షి! హే భార్గవి! నిన్ను కొలుతు
నాదు రక్షణ భారము నీదె యనుచు
వేడెదను మృదు భాషిణి వేగ రావ!

శర్వరీ గణపతి చవితి, 2020

ద్విజునకు శరణు! ద్విముఖ! యో! దేవ‌ దేవ!
విఘ్నములను నాశమొనర్చు విమల పుత్ర!
యాది పూజ్య! యనింద్య వా హనుడ! నాకు
చదువు నొసగమని మనవి! స్కంధ గురువ

అష్ట లక్ష్మిగ నిచ్చట యవతరించి
బిడ్డల యభీష్టములు నింక విన్నపములు
దీర్చి శుభములు కలిగించు దీవెనలను
వరము లను యిచ్చు శుభలక్ష్మి! ప్రణతులమ్మ


పద్య విద్య నేర్చె పడతి దుర్గ గురువుల్
చెంత చేరి; వారు చేరదీసి
సాన పట్టు చుండె సహృదయులై! భళి
వ్యసనమొదలలేక వ్రాయుచుండె

నేడు రేయిఁ బవలు నిత్యము నామెయే
[04/07, 17:42] Durgamadhuri1:

 అచల నిలయే జగమునకు ఆది అంశ
శేష శయనుని సోదరి శైల శీలి
భాను శశి వహ్ని నయనిమా బాధ లెల్ల
దీర్చి దుఃఖములు దరుము దయను దుర్గ


[04/07, 17:57] Durgamadhuri1:

 అచల నిలయే జగమునకు ఆది అంశ
శేష శయనుని సోదరి శైల శీలి
భాను శశి వహ్ని నయనిమా బాధ లెల్ల
దయను దనుమాడి కాచుమమ్ము కామాక్షీ

క్రింద వి కంద పద్యములు


ఈ పద్యము శైల వృత్తములో ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు 

[19/09, 00:30] 9963998955: 

శారద దేవీ! కోరెద

ధారగ వ్రాసెడి వరమును!  దైవము నీవే

భారతి! యని నీపై నిట

భారము పెట్టుచు నుడివెద  పావని! తల్లీ


19/09, 15:12] 9963998955: 

సత్యము మారదు నెన్నడు

సత్యము యొక్కటె నిలుచును సతతము దేవా!

సత్యము విలువను నెరుగరె

సత్యము నమ్మిన గలుగును సఖ్యత దేవా


బంధము సృజన కాలేదు



11/09, 12:02] Durgamadhuri1: 


తిమిరమందున వెలిగెడి దివ్వె వీవు

తల్లి! నీదు శిరము పైన తాను జేరి

కలువ రేడు మెరుపు పొంది కాంతు లీనె

నిన్ను జూచుటే భాగ్యము నీరజాక్షి


అంపశయ్య నున్న భీష్ముని పై పద్యము 

శరము లన్ని వైచి జలము దెచ్చె కిరీటి
తాత కిచ్చి తనను త్రాగమనెను
పెద్ద లనగ నెంత పేర్మి ఫల్గుణునకు!
వినయ మున్న వారె విజయులుకద!

సందియ వేళలో పల్కెద చక్కగ చోరుని గాధలే హరీ
యందియ గట్టి యో స్త్రీపడు యాతన గాధ పరాహ్ణ వేళలో
యందరు యాడుయా జూదము యాటను వేకువ వేళలోన్ హరీ
చందన మద్దుచున్ జెప్పెద సత్యము నిత్యము నీసుధా కధల్

ఇది రివ్యూ చేసి శ్రీ మాతా వృత్తములో ప్రయత్నము చేయచ్చు 





[18/01, 19:16] Durga Madhuri:

తేట తెనుఁగు లోన సుళువు తేటగీతి
యాట వెలది యలతిగ వ్రాయగలమయ
ప్రాస కోరని యుపజాతి పద్యములివి
కనుక యల్లిక తేలిక కవులకెల్ల


[18/01, 21:18] Durga Madhuri: 

ధన్యవాద శతములయ తమకు నివియె
పద్య వేదిక నిచ్చినారు వందనంబు
శిక్షణను పొందెద నిచట స్థిరముగాను
నేర్చుకొనెద వ్రాయుట యును నిత్యమిటుల


[18/01, 21:27] Durga Madhuri: 

పదములల్లిన గావవి పద్యములును
యతులు ప్రాసలు గూర్చిన యద్భుతమగు
ఛందమంటే చదువుటకు చక్కనైన
శృతిని యిచ్చు సరళి గద! చదువవలయు


[18/01, 22:32] Durga Madhuri: 

నాద స్వరము బూరించు నాథుఁడితడు
నాగులను శిరమున గల్గినట్టి వాడు
ప్రణవ రవమునకీతఁడె ప్రథముడయ్యె
ప్రమథ గణములు కొలుచు భక్త గమ్య!!


[18/01, 22:34] Durga Madhuri:

కృష్ణ స్మరణ సేయరె హరి కృపను వొంద
రుక్మిణీ పతి నుడువరే లోకులెల్ల
వెతలు దీర్చు బంధువితడు వేణు గాన
లోలుని గన చాలవు వేయి లోచనములు


[18/01, 23:04] Durga Madhuri:

ఆఖరు పాదము సమస్యగా ఇస్తే ఈ పద్యములు నా పూరణ

చతురాననుడెవరనినా
చతురత తోడ తలరాత చక్కగ వ్రాసే
స్థితి కారుని పుత్రుఁడు భా
రతి పతి మన్మధుఁడు గాడు బ్రహ్మయె తలఁపన్

శాస్త్ర విద్య నేర్చి నరుడు జనుల కొఱకుఁ
పాటు పడక కీడును గూర్చు పనులు నెఱపి
తాను చదివినందుకు ఫలితమిదనన్న
విద్య నాశనకరము వివేకమడఁచు

కందం

జగమంత శతృవులనుకొని
వగచుట తగదయ! మనుగడ వలెననిన సదా
భగభగ లాడక యరులగు
పగవానికి సేవఁ జేయవలె మేల్లలుఁగున్


పనస తొనలు సులభముగ వలుచు విధము
కలఁదొకటి మహినందని గనుమఁ నరుడ!
భక్ష్య ఖండము సుళువుగ వచ్చునింక
కడుగవలయుఁ దైలంబునఁ గరయుగమును

తేటగీతి

స్వామి భక్తుల గాంచుచు చరణ సేవ
భాగ్యమందలేదని తాము బాధఁ పడుఁచు
నట్టి వారి పొందైనను యందదనుచు
యీశు గల్గు నరుల మెచ్చు నీశ్వరుండు


అనఘా పతి వివరించెను
తనకు గురువులు పలువురని దైవంబులనిన్
ఘనమగు యాజీవులలో
శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గూన్


జీవితపు పరమార్థము శిశువు నిలకు
దెచ్చు భాగ్యమే కద! పడతికి! వరమ్మె
పుట్టగానె తల్లి తలచు బుడుత గట్టి
ఏడ్పు విని మోదమందితి హృదయమందు


మదిని చెఱచు నింద్రియములు మాయ జేయు
యున్న సంపద మించిన యన్నతి యని
తఱిమి పరుగు పెట్టించిన తలకు మించు
విభవములు పెక్కు దక్కును బిచ్చమెత్త

పడతి మహిళ యింతి వనిత! యతివ నారి
స్త్రీయె వదిన యక్క చెల్లి తల్లి
యత్త పిన్ని యామ్మ యమ్మమ్మ బామ్మగ
మఱదలు తనయగను మసలుచుండు



కన్న బిడ్డలు స్థిర పడి కళ్ళ ముందె
పెళ్ళి జేసి పిదప తమ పిల్ల పాప
తోడి యుండిన నెదిగిన దుహితలు గని
ముదిమినిం గన్నె పిల్లల ముద్దిడఁ దగు

తేటగీతి
రక్కసుల గూర్చి కథలనల్లవలెనన్న
పోటి యొకటి పెట్టి విచిత్ర ముగననిరట
నిజము కానిది చెప్పమని యని వ్రాసె
శూర్పణఖ సాధ్వి లోకైక సుందరాంగి


కందం
శాసన మేదియు లేదుగ
శ్వాసను మఱఁపించు విరులె శాశ్వత మనిలన్
హాసపు మోమునఁ బూసెడి
వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్


కందం
పరులెల్లరు కష్టములను
బరువులు మోయవలెననెడి స్వార్థపు తలపుల్
వరముగ యడిగిన దుష్టులు
పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్

*యడిగిన/యడుగుచు

గ,ణ,ప,తి నిషిద్థాక్షరి, గణపతి స్తుతి

కందం
హిమజ కుమారుడ! నందీ
ప్రమథ గణములు గొలిచిన శివానందకరా
నమములు విద్యకు యొజ్జవు
దమనుల దరుముట కొఱకును దయ సేయుమయా

[13/01, 12:57] Durga Madhuri:

భోగి రోజు పిల్లలకును పూలు పండ్లు
సంకురాత్రి నాడు పతంగి సంబురాలు
కనుమ పూట నుండు మనకు గారెలరిసె
మూడు దినముల వేయరే ముగ్గులన్ని
బంధు మిత్రుల తోటిదే పండుగంటె


[18/01, 19:08] Durga Madhuri:

లింగ మూర్తి! మా వెలుగుల రేఖవీవు
తిమిరములనెల్ల తరుమెడి దివ్య జ్యోతి!
నీ దయ నడిగితిని! హర! నీలకంఠ
నిరతము నిను భజింతు! నే గిరీశ

మాత పాలు తనకు మంత్రమని యెఱిఁగి
దూడ జేఱుఁ తల్లి తోడ! నరుల
కొఱకు గూడ పంచు గోవు క్షీరము గాని
మనము చేర దీయ మఱచినాము

శార్వరీ: నాగుల చవితి పండుగ రోజున వ్రాసిన పద్యము:

వేడెద గిరిజా సుత నిను
వేడెద నయ పన్నగేశ పిల్లలనిమ్మా
వేడెద పాపము బాపుమ
వేడెద తొక్కిన తొలగుచు వేగమె పొమ్మా

మట్టి తిని నోరు చూపగ
చిట్టి మురారి జనని మురిసె చిలిపి లీలన్
గట్టిగ యడగదు కద నిను
పట్టిన పట్టును విడుమయ బంగరు తండ్రీ


ధర్మజుడొనరించె భానుకై తపము తాను
యార్కుడగుపించి తల్లెను యందజేసి
ధర్మ బద్ధుడయ్యె రవిలా తన తనయుని
వైరులని భేదమెంచక వరముఁ నొసగి

ఉత్సాహము
మన్ను తింటి వేల నోయి మాయఁ జేయు బాలకా
వెన్న ముద్ద తిందువోయి వేగ చెంత రమ్మయా
సన్నిధీయవేల మాకు శాజ్ఞ్గధారి! శ్రీహరీ
సన్నుతింతునోయు రంగశాయి! దేవ మాధవా


××××××××××××××××××××××××××××××××××××××××

బ్రతుకు కొరకు మెతుకు బ్రతుక వలదెపుడు
మెతుకు కొరకు యంచు మిగిలె మాట
తిండి తినిన కలుగు తిప్పలు పడతికి
పడతి గతిది గదర పార్వతీశ


×××××××××××××××××××××××××××××××××
ఆటవెలది
బతుకు బాట లోన పరుగిడి నిత్యము
అలసి సొలసి యుంటి యంతిమాన
చేరితిపుడు బడుగు జీవి నైతి యడుగు
పడదు యవయవములు పట్టు తప్పె

ఆటవెలది
అన్యమెరుగ నయ్య! యద్భుత దైవమా!
నార సింహ! నిన్ను నమ్మి నాను
విన్నవించుకుంటి వేదన లన్నియు
గావుమయ్య నన్ను కల్ప తరువ!


కందం
తనయ మరలి పోవు గదా
తన వారింటికి పతి తన దైవము యనుచున్
ఘనమగు వేడుక నుండియు
మనమున బాధన వగచుచు మరలును మగువే


ఆటవెలది
పోపు దినుసు తోడ పొందుమా రోగ్యము
వంట యింట నిధికి వందనమ్ము
విడువ కుండ నెపుడు వేయవలెను సుమా
యన్ని వంట లందు యమరునివియు

చంపకమాల
విడువ క నిన్ను గొల్తుగద! బిల్వ దళేక్ష ణ! యీశ్వరా హరా
తడబ డు నాదు పల్కుల కు తండ్రి గ దోషము లెన్నవద్దయా
యడుగులు నీదు సన్నిధిని యందుకొనేట్లు వరంబు నీయుమా
కడపటి నాదు ప్రాణము న గానము సేసె ద నిన్ను దైవమా

విడువ క నిన్ను గొల్తుగద! బిల్వ దళేక్ష ణ! యీశ్వరా హరా
తడబ డు నాదు పల్కుల కు తండ్రి గ దోషము లెన్నవద్దయా
యడుగులు నీదు సన్నిధిని యందుకొనేట్లు వరంబు నీయుమా
కడపటి నాదు ప్రాణము న గానము సేసె ద నిన్ను దైవమా


తేటగీతి
విరుల సోయగముఁ గనరే వింత గొలిపె
కొమ్మ పైన ముచ్చటగవి కూర్చునుండె
పక్కి బోలి తఱిఁ ని! యాహ బాగు బాగు
ప్రకృతి సృష్టి తరచి జూడ పరమ మాయ




కందం
విద్యలనొసగే దేవా
పద్యమ్మిదియే గణేశ! ప్రమథా నాథా
హృద్యమగు నీదు గాధలు
నుద్యమముగ సదువుచునిను నుడివెద! ప్రాజ్ఞా

విద్యలనొసగే దేవా
పద్యమ్మిదియే గణేశ! పార్వతి తనయా
హృద్యమగు నీదు గాథల
నుద్యమముగ జదివెద! గృప నున్నతి నిమ్మా


వాణి! నిన్నెరిగిన వారు వ్రాయగలరు
కవనములును కావ్యములను గద్యములను
మంచి వాక్కుతోడ నిలను మసులునట్లు
మమ్ము దీవించ మనవి కమలజ పత్ని

అదిరెను టమోట పచ్చడి యద్భుతమ్ము
చేయవలెను నేనిక జాగు సేయకుండ
లొట్ట లేయుచు విడువక రొట్టె యిడ్లి
యన్న ములలోకి తిందురు యాహ యనుచు

రామ! దశరథ సుత! రణరంగ ధీమ
యుత్తమ పురుష! శస్తాస్త్ర యోధుడవయ!
ధర్మ నిరతికి రూపము త్యాగ గుణము
స్వంతము జగతి నందీవె సౌమ్యుడవయ

శంకరాభరణము వారి సమస్యాపూరణము

తోడొకరుండిన బ్రతుకులు
వేడుక యౌనని తనయకు ప్రియముగ దెల్పెన్
వాడన పెద్దలు వారికి
కోడలివని పల్కెనొకఁడు గూతురితోడన్


నిన్న కలను గంటి నేను నిన్ను నిజము
నిన్ను తలవకుండ మిన్నకున్న
నేను యసలు లేను నిన్ను నింపితి మది
నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను

కాలికి వేలికి తెలివిగ
గాలము వేయుచు సవాలుగ విషపు జీవిన్
హేలగ బట్టుచు బొమ్మగు
తేలును ముద్దాదెడి బడతిన్ మెచ్చదగున్
 
లక్ష్మి చేజారెనని యా సురపురి వారు
దిగులు జెంది వైభవమును తిరిగి పొంద
కాంక్ష పూని యత్నించుట కలిమి కొఱకు
కవుల కల్పన గాదె సాగర మథనము
కందం
రామా రామా యనుమా
నామమె రక్ష యనెఱిఁగి ప్రణతుల నొసగుమా
వామాంకమ్మున జానకి
నీ మొర తెలుపుచు నభయము నిచ్చును గనుమా

తేటగీతి
మెల్లగ నిదురోయినవిట మింటి పూలు
యతివ సొగసుఁతాము గని! యాహా యనుచును
గూని వానివలె శశిదాగుకొని యుండె
మూగవోయె నళని వ్రాయ పూనుకుంటి
తేటగీతి ఆఖరు పాదము గొట్టి బదులు నుండి
గ్రీష్మ తాపము మొదలాయె రేగె నెండ
యంబుధిని నిలిపిన రామ యాదు కొనుమ!
జలము లేక జీవము లెండె; శరము దీసి
పాథి గొట్టి తీపి పయఁము పంచుమిలను

తేటగీతి
రెల్లు పొదలలో పుట్టిన శ్రీ శరవణ
రేయిఁ బవలు జూపు మనకు లీలలెన్నొ
వల్లి దేవసేన సమేత పళని వాస
శుభము గూఁర్చు దీవెనలిమ్మ సుబ్బరాయ



తేటగీతి(మాలిక)
తేటగీతి
సర్వ మంగళ మదినమ్మె శంకర! నిను
సన్నుతింతు నిరతము నే శంభు! యీశ
విష్ణు బ్రహ్మ యర్చిత! నిల వేల్ప! దేవ
వరము లొసగ మనవి సేతు పార్వతీశ
ద్విజునకుఁ దెగిన వదనంబుఁ దిరిగి దెచ్చి
విఘ్నహరుఁ భువికి నిలిపి బిల్వ పూజ్య
గాచినావు సంకటములు కాశి వాశ
పాడెదను కీర్తనలు నీకు ఫాలనేత్ర












ఆటవెలది
మనసు మారదెపుడు మనుజుల గుణమదె!
నీతులెన్ని జెప్పు! రీతి యంతె
హితమొనర్చు బుద్ధి యెన్నటి కొచ్చునో!
మంచి యన్న మాట మహిని కల్ల!
 మరొక ఆటవెలది

ఆలు బిడ్డల గనకున్న యలమటించు 
భ్రాంతి లోన పడి గనడు బాధ నొంద
కాలి పోవువేళ నెవరు గాన రాక
యొంటరైతిననేడుచు యుక్తి విడచు


ఆటవెలది
నింగి నేల రంగు నీలమే! యొక్కటే!
నట్ట నడుమ నుండె నంట యద్రి
సాగు చుండె పైన చల్లని మేఘము
ప్రకృతి మాయ జూడ బాగు బాగు
తేటగీతి ఇక్కడ ఆఖరు పాదము సమస్యకు నా పూరణము
అత్త మామలామెకు క్రొత్త వారు సుతులు
తల్లిదండ్రులు సతతము తనయులేగ
మరిది యూడుబిడ్డలకైన మాత గాదె!
ఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
తేటగీతి
జ్ఞానము కొఱకు నరుడు జిజ్ఞాస తోడ
పరుగులిడుఁట గనుచు నగుబాఁటు జేసె
సురులు మనము తిరోగమించు పథముననె
పయనమైతిమని; యిటుల పరువు పోయె
తేటగీతి ఆఖరు పాదము సమస్యకు నా పూరణము
శాస్త్ర విద్య నేర్చి నరుడు జనుల కొఱకుఁ
పాటు పడక కీడును గూర్చు పనులు నెఱపి
తాను చదివినందుకు ఫలితమిదనన్న
విద్య నాశనకరము వివేకమడఁచు


తేటగీతి  ఆఖరు పాదము సమస్యకు నా పూరణము

స్వామి భక్తుల గాంచుచు చరణ సేవ
భాగ్యమందలేదని తాము బాధఁ పడుఁచు
నట్టి వారి పొందైనను నందదనుచు
యీశు గల్గు నరుల మెచ్చు యీశ్వరుండు

[29/05, 00:12] Durga Madhuri: 

విజయ వాడ నందు వెలసిన దుర్గమ్మ
కష్ట ములను దరుము కదన ధీర
పసిడి వర్ణ మోము బంగరు తల్లివే
వరము లిమ్మ దేవి వైజయంతి


[29/05, 00:27] Durga Madhuri: 

గదయు వీణ ఖడ్గ కమల కేతనములు
కరము లందు నిలుపు కరుణ వరద
సింహ యాన! యంబ! చిద్రూపి! కష్టముల్
ద్రుంచ మనవి తల్లి! దుర్గ! లలిత


[29/05, 00:27] Durga Madhuri: 

త్రిముఖి! కదన రంగ ధీర! యష్టభుజివై
గదయు వీణ ఖడ్గ కమల పాత్ర
కేతనములను గలిగిన పరమేశ్వరి!
సింహ యాన! దుర్గ! చిత్స్వరూప!

ఆటవెలది
సంధ్య వేళ లోన జాబిలి కురిపించు
వెన్నెలందు చిలిపి వెన్న దొంగ
వేణువూదు చుండ వెలగులీనెగ రాధ
మోము చక్కగాను ముదము తోడ


మత్తేభవిక్రీడితము
హనుమంతా! బలవంత! హే యసుర సంహారా! కపీశా! సదా
గనుఁమా శ్రేయము! నీకు నా మనవిదేకాలాత్మకా! దేవ! మా
మనమంతా నిను నింపు భాగ్యమొసగేమాదైవమా! మారుతీ
ధనధాన్యంబులు నిన్ను గోరను గదాధారీ! దయాసాగరా

కందం
చీకట్లను వదలకనే
నీకన్నులు మూసికున్న నిజయోగివయా
నీకరుణకై తపిస్తిమి
యీ కాష్ఠముదరమవేల యీశుని తనయా
కందం
క్షీరాబ్ధి తనయ! లక్ష్మీ
నారాయణ మన విహారి! నా మనమందున్
ధారగ నుతింతు సతతము
నారద వంద్యా మధుర వననిలయ! జననీ

సుమారు 2003-04 సమయంలో ఈనాడు ఆదివారం మేగజైన్ నందు వెంకటగిరి రాజా వారి అవధానం లో సమస్యా పూరణలో ఆంగ్ల పదాలు 4 ఇస్తే, కవి గారు తెలుగులో పూరంచారుట. ఆ దత్త పదాలు ఇవి. “లవ్, డియర్, లుక్, ఎట్ మి”  అనే ఆంగ్ల పదాలను తెలుగులో వచ్చేటట్టు పూరించాలి. దానికి నా పూరణ.

తేటగీతిలో

ప్రియుని మాట “లవ్వ”నితకు ప్రీతి నీక 
మనసు నక”లుక్కు”మన్నట్టి మల్లడిపడి 
పడతి వ”డియరు” దెంచుచు పలికె నంత 
నీకు లుకు”లెటు మీ”రెనో నాకుదెలిసె.
“సాహితీ బంధు”  తోబాసు శర్మ.
ప్రియుడు చెప్పిన మాటలు ఆ వనితకు ప్రియము గూర్చక, మనసు కలుక్కు మనేటటువంటి బాధ పడుచూ ఆమె వడిగా వచ్చి పలికింది నీ కులుకు ఎలా మారినవో నాకు తెలిసింది” అని.

ఇప్పుడవే పదాలతో క్రింది పద్యము


ఆటవెలది
పలుకు కున్న విలువ పసిడి కుండ దిలను
చెలిమి లేని చోట సెలవు సెలవు
బిడియమున్న చోట వీలగునే పేర్మి
వెలుగులెటు మిగులును వేదనున్న


కందం
శిరమున నెమలిక ధారీ
వరమ్ము లొసగుమిట లోక బాంధవ! క్రీడీ!
గిరధర! కొలువ తరమ నిను
కరమున శరములు తొడగని గడసరి దేవా