Thursday, December 23, 2021

Variety Poems

 [23/12, 07:55] Kalyani Madduri: ✍ *చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం*


భూమీ భామాంబు భవా

వామాపా వైభవ భువి భావావాపా

వేమమ్మోముము భూభవ

భీమ భవాభావ భావ విభువామావిభా


*చదివే సమయంలో పెదవులు తగలనిది*

శ్రీశా సతత యశః కవి

తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం

కాశా నిరతారాధిత

కీశేశా హృష్ణ గగనకేశా యీశా


*ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది*

*అంటే పెదవి తగలనిది, తగిలేది*

దేవా శ్రీమాధవ శివ

దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా

జ్యావగ వంద్యా వాసవ

సేవితపద పగవిరామ శివ జపనామా


*కేవలం నాలుక కదిలేది*

సారసనేత్రా శ్రీధర

రారా నన్నేల నిందు రాక్షసనాశా

నారద సన్నుత చరణా

సారతరానందచిత్త సజ్జనరక్షా                                                                                                                                        

*నాలుక కదలని (తగలని) పద్యాలు*

కాయముగేహము వమ్మగు

మాయకు మోహింపబోకు మక్కువగ మహో

పాయం బూహింపుము వే

బాయగ పాపంబు మంకుభావమవేగా

భోగిపభుగ్వాహ మహా

భాగా విభవైకభోగ బావుకభావా

మేఘోపమాంగభూపా

బాగుగమముగావువేగ బాపాభావా


*నాలుక కదిలీ కదలని పద్యం*

ఓ తాపస పరిపాలా

పాతక సంహారా వీర భాసాహేశా

భూతపతిమిత్ర హరి ముర

ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా  


🙏 *పద్య భాషాభిమానులకు జోహార్లు*.

*తెలుగు కవులకు, పద్య రచయితలకు జోహార్లు* 🙏 

*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని *



My Versions

[23/12, 10:52] Durga Madhuri: *కేవలం నాలుక కదిలేది*


సరసిజ నయనా చక్రీ

కరినుత జనులను దయగొను ఖడ్గధరా నీ

దరి చాలునయా కృష్ణా

తరగని సిరులనొసగు హరి! ధరణిజ నాథా


ఒకటి ప్రయత్నం చేశాను, సమయము చూసి మిగతావీ పడతాను

[23/12, 15:34] Durga Madhuri: శౌరీ! రాధా లోలా

రారా సాంద్ర నిలయ హరి రక్కసి నాశా

ధీరా దశరథ తనయా

శ్రీరఘు నందన! సురనుత! శేషాద్రీశా