Friday, August 23, 2013

చందమామ

అనంతమైన కొమ్మకి పూచిన పూవు
శ్వేత వర్ణమును అలుముకున్న సమస్తము కలది గ వుంటుంది
అన్దరికీ బంధువు నంటుంది అయినా అందనంటుంది
ఏమిటది ?


కలువల రేడంట
చక్కని వెలుగంట
కవికుల తోడంటా
చిక్కును వారి కరములకంటా
కనులకు తోడంట
చిమ్మ చీకటి రేతిరినంటా
కానరాడంటా ద్విపక్షమ్మునంతా
చతురత ఇదే చూడురంతా




గగనానికి పూచిన కుసుమమును నేను
గరళ కంఠుని శిర పుర వాసుని నేనూ
గమనమాగని బాటసారిని నేనూ
గుర్రం జాషువా కవితల వెన్నెల నేను
గాయం సేయను కానీ మాయమవుతానూ
గొప్పగ మళ్ళీ మరు పక్షముకై ఎదిగొస్తానూ



అందని వాడంటా‌ అద్దమునె దొరుకునంటా
అమ్మలకు చేరువంటా అందుకే మామంటా
అటులనే బంధమంటా అందరితొ బాంధవ్యమంటా
అమృతముకు సోదరుడంటా అందగాడు అను నామమందుకే
అమాసన రాడు అంటా అసహనమె‌ ఆ నాడు అంతా
అలంకారమె ఆతడెప్పుడూ అక్షరకుల ప్రియుడె ఎప్పుడూ
అవనిజకు సైతం భ్రాతుడితడూ ఆరోగ్య కారకుండందుకే
ఆద్యంతం చిలుకు వెన్నెల ఆనందదాయకుడటులా

No comments: