అక్కటా! ఈ నర జాతి మధ్యములు వగలోలికే పరుల భాషను వలచినారు
తేనెలొలికే తేట తెనుంగు తీయదనం మరచినారు
పాలు వద్దనే పసి వాని వలె పారవైచినారు
ఇంపైన భాష ఇంతేనా అని ఇప్పటి దాకా అలరారిన భాషను కాదని
అరువిచ్చిన పదాలను ఆదరిస్తూ ఆ పరభాషలోనే ఆదమరుస్తూ
ఆనందాన్ని సైతం అనువదిస్తూ అరుణోదయాన్ని ఆలస్యంగా చూస్తూ
అ, ఆ లను అణచి వేస్తూ అందానికి అన్య పదాలతో భాష్యం చెబుతూ
ఆవేదనని పెంచుతున్నారు అనంతమైన సొగసును పంచలేకున్నారు

No comments:
Post a Comment