Thursday, November 28, 2019

శ్రీనివాస గోవిందా

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు
కోరినట్టీ వరములు దీర్చెడి దేవుడూ
స్థిరచరములన్నియును తానై నిండినవాడూ
శ్రద్ధాభక్తులతో పూజించెడివారి అభిమతములు పండించెడివాడూ


🙏🙏🙏🙏🙏🙏🙏
సప్తగిరీశా సహృదయధామా
సాలగ్రామ వాసా సాకేతధామా
సాలంకృత సిరుల తల్లి లక్ష్మీ నాధా
సాధు సజ్జన పోషకా వందనం



వేంచేసెనమ్మా ఆ శ్రీ వేంకట నాధుడూ
వేదాలకెల్లా ఆతండు మూలంపు పురుషుడు
వేదనలలనెల్లా తీసేటీ ధీరుడూ
వెన్నెలకు తోబుట్టువునూ ఏలేటి వాడూ


🙏🙏🙏🙏🙏🙏🙏
సప్తగిరీశా సాలగ్రామ ధర
సాధుజన రక్షక సకల కళా వల్లభ
సమర్థ‌ పరి పోషక సౌందర్య రూపా
సీమంతిని పతివై సేవలను పొందితివీ




[24/04, 21:14] Durgamadhuri1: గోవిందా గోవుల పాలకా
గైకొనుమా మా ఛందోరహిత
గద్యాన్నీ గమకాలు తెలియని
గానాన్నీ గ్రహియించుమయ్యా మా
గమనము పయనము నీకైనేనని
గమ్యము పథమూ నీవేయని
గజలక్ష్మీ పతి ఓ గరుడగమనా
గంగాపితవైన ఓ పాపవినాశా

కేశములిచ్చిన క్లేశములు దీర్చెదవు
కొండ ఎక్కి వస్తే కొరతలన్ని తొలచేవూ
కోరినవారికెల్ల కొంగుబంగారవే
కొలువుతీరిన కోమలాంగీశా
కైదండలివిగో వైకుంఠవాసా
కైమోడ్పులీయవే కరుణాంతరంగా
కాడు దయను చూపులు మాపై కడలి నిలయా


 గోవులను కాచావా గోపాలా
గోవర్ధన గిరిని ఎత్తావా గోవిందా
గోరు ముద్దలు తిన్నావా పసివాడా
లోకాలన్నీ ఉదరమున ఉంచిన వాడా
వేకువ నేటికాయెనా నీ భక్తులకూ
వేంకటగిరి పై నిను దర్శించుటకూ
వేణు గాన లోలా వేంకట రమణా మా
వేదనలు తీర్చవా ఆపద్బాంధవా



[14/06, 20:12] Durgamadhuri1:

 కోరితి నే కోనేటి రాయని
ఈ రీతిని క్షీణమెరుగని
అక్షరములతో క్షీరసాగర శయనుని
శరణమీయమని రణములు వలదని
శంఖు చక్ర ధారుని శాంతాకారుని
శేషతల్పము నలంకరించిన వారిని
శక్తీ దేవి శంభుడు శరభుడు
కొలిచిన వానిని కొరత లేకుండా
మాకు కొంగు బంగారం సేయమని యా
కల్పతరువు సహోదరిని చేపట్టిన వానిని
కంసుని చెర యందు పుట్టిన వానిని
కుబేరుని విహంగమునొసగిన వానిని
కాముని దండ్రిని సోముని చుట్టమును
మము దయ జూడమని
మహినందూ అమరలోకమందూ
ఆనందంబులే యొసగమని

[14/06, 20:12] Durgamadhuri1

: కోనేటి రాయా కోదండ రామ
కోమలాంగి పతివే మా యందరి
కోరికలెల్ల దీరిచి మా
కొంగు బంగారమ్ము సేయవే
కొలుతును నిను సదా ఆలపించి
కీర్తనల్ యాలకించవే మాపై
కినుక వహించక మా తప్పులెల్ల
క్షమియించా కనికరించవో కరుణాంతరంగా

[14/06, 20:12] Durgamadhuri1

: పుడమి యంతయు వెలసిన పురంధర
పయనము సేయలేదని నీ క్షేత్రమునకు
పతనము కానీయకయ్యా మా భక్తి పథమును
ప్రతి దినమూ నిను విడువక కొలుతును
పుణ్య ధామాలు జూడకున్ననూ
పునీతులను గావించుమయా మమ్ము
పునర్జన్మ నిచ్చిననూ మా కర్మఫలముగ
పఠించే విధముగా నీ చరితను వరమీవయ్యా

No comments: