1.
దుర్గ వాసినీ బాపుమా దుర్గతులను
దుష్ట నాశినీ దీయుమా దుఃఖములను
దీన బాంధవి మా దశ దిశయు నీవె
దినకర శశి వహ్ని ప్రణతి దుర్గ!
ఇక్కడ ఆఖరి పాదంలో గణములకు ప్రాస యతి ఏర్పడింది. దిన, ప్రణ... న కి, ణ కి ప్రాస కనుక
దుర్గ వాసినీ బాపుమా దుర్గతులను
దుష్ట నాశినీ దీయుమా దుఃఖములను
దీన బాంధవి మా దశ దిశయు నీవె
దినకర శశి వహ్ని ప్రణతి దుర్గ!
ఇక్కడ ఆఖరి పాదంలో గణములకు ప్రాస యతి ఏర్పడింది. దిన, ప్రణ... న కి, ణ కి ప్రాస కనుక
ఇదే పద్యము ఆఖరు పాదము మార్చి:
దుర్గ వాసినీ వాపుమా దుర్గతులను
దుష్ట నాశినీ దీర్పుమా దుఃఖములను
దీన బాంధవి మా దశ దిశయు నీవె
భాను శశి వహ్ని లోచని ప్రణతి దుర్గ!
2.
శైల పతి సుతా! పార్వతీ! శంభు పత్ని!
స్వచ్ఛతకు నెలవైన మా చల్లనమ్మ!
చెరకు విల్లును ధరియించి చిరునగవులు
పంచి భక్తుల బ్రోవుమా! ప్రణతి దుర్గ!
ఇలా అయితే తేటగా ఉంటుంది
🙏🙏🙏
3.
[04/07, 16:01] Durgamadhuri1:
శైల సుత! శంభు పత్నియై సంచరించె!
కరి ముఖునికి యమ్మయై కనికరించె
షణ్ముఖునికియు మాతయై సంతసమును
పంచిన జగన్మాతకు ప్రణతి దుర్గ
శైలసుత! శంభుపత్ని! శ్రీ సన్నుతవుగ
కరిముఖుడు షణ్ముఖులకును గన్న తల్లి
లోకములనేలు నాయకి! లోకమాత
పరమయోగినివౌటెట్ల? ప్రణతి! దుర్గ!
క్రింది లక్ష్మీ ప్రసాద్ గారి వెర్షను చూసి పైది నా ప్రయత్నము:
శైలసుత! శంభుపత్నివన్ సంజ్ఞ వడసి/
కరిముఖుని కన్నతల్లివన్ ఖ్యాతిబొంది/
షణ్ముఖుని జననివను ప్రశస్తి గనియు/
పరమయోగినివౌటెట్ల? ప్రణతి! దుర్గ!
€€€€€£€£€€€€€€€€€€£€£€££€€€£€£€£€£€€_£€£
శతకమునకు, 07/Oct 2021/ ప్లవ ఆశ్వయుజము
శైల పుత్రి! సతీదేవి! చంద్ర ధారి!
కమల హస్త! భక్తుల కీవు కల్పతరువు!
ముక్తి మండలమ్ము నకు మమ్ము గొని పోవు
పార్వతి! వృషరుధవు నీకు ప్రణతి దుర్గ
€€€€£££££€£€£€£€£€£€£_£_€_€€€€€€€€€€€££€€
4.
నింగి నంతయు కప్పిన నిశిని ద్రోలు
తారల వెలుగు సైతము తరలి పోవు
కాంతు లీను పదములను కలిగి నెపుడు
ప్రజ్వరిల్లు తల్లీ నీకు ప్రణతి దుర్గ
తారల వెలుగు సైతము తరలి పోవు
కాంతు లీను పదములను కలిగి నెపుడు
ప్రజ్వరిల్లు తల్లీ నీకు ప్రణతి దుర్గ
Corrected cersion
తళుకు మని కాంతులీనెడి తారలన్ని
చిన్నబోవునట్లు వెలుగు జిలుగు జిమ్ము
నీ చరణ యుగ దీప్తికి నిలువ లేక
పాఱి చనవె తిమిరములు? ప్రణతి దుర్గ
5.
విశ్వ మంతయు గెలిచెడి విజయ దుర్గ
రుద్ర సతిగను యరులకు రుధిర దుర్గ
వందనమ్ము లందుకొనుమా ప్రణతి దుర్గ
6.
వెలసినావమ్మ కొండపై విజయ దుర్గ
యసురుల వధను గావించి యవని లోన
మాకు ధైర్యమై నిలిచిన మాత వమ్మ
భక్తులను బ్రోచు నీకిదే ప్రణతి దుర్గ
Corected version by Sri Lakshmi Prasad Garu
వెలసినావింద్ర కీలాద్రి విజయ దుర్గ
యసురుల వధను గావించి యవని యందు
మాకు ధైర్యమై నిలిచిన మాత వమ్మ
భక్తులను బ్రోచు నీకిదే ప్రణతి దుర్గ
పార్వతీ దేవి! పాపముల్ బాప మనవి!
యాశ కొలది పరుగులిడి యాతన పడి
చెడు నడతల యందున మేము చిక్కినాము
వాటి నెల్ల దరుము నీకు ప్రణతి దుర్గ
8.
పాహి దేవి బాపు పాపములను
మంచు కొండ నందు మల్లికాంబ
మమ్ము దయ చూచు మాత వీవు
పల్లవించు పలుకుతోటి ప్రణతి దుర్గ
పాహి దేవి బాపు పాపములను
మంచు కొండ నందు మల్లికాంబ
మమ్ము దయ చూచు మాత వీవు
- యాతురుతలు దీర్చి యాదుకొనుమ
మెరిసి మురిపించు తల్లి! యా మేరు శిఖర
వాసుని! కరుణ కురియు నీ వదనమునకు
భక్తి మీరగ చేసెద ప్రణతి దుర్గ
10.
అంబ! యన్యమెరుగనమ్మ యాది వంద్య
నీదు పదము లందే మది నిలిపితి గద
బ్రతుకు బాటలోన మము గాపాడు మనుచు
పదము లల్లియర్పించెద ప్రణతి దుర్గ
Corrected Version:
అంబ!నిన్ను తప్ప నితర మన్న దెరుగ
నీదు పదము లందే మది నిలిపితి గద
బ్రతుకు బాటలోన మము గాపాడు మనుచు
పదము లల్లియర్పించెద ప్రణతి దుర్గ
11.
(My version of poems on Muuka Sankarula Muuka Pancha Sati - 1. Paadaaravinda Satakamu)
తెలుప తరమ తల్లీ నీదు దివ్య మహిమ
లెన్ని యో! యెట్టివో! గద నెంచి చూడ
వర్ణనలు సేయ గలమ యో వైజయంతి!
భక్తురాలిగ నీకిదే ప్రణతి దుర్గ
Sri Lakshmi Prasad Sir's correction
తెలుప తరమె తల్లీ నీదు దివ్య మహిమ
లెన్ని యో! యెట్టివో! గద యెంచి చూడ
పామరులము మన్నింపుము వైజయంతి!
భక్తజనులము నీకిదే ప్రణతి దుర్గ
[04/12, 23:30] Durga Madhuri: వరహంసమ్ముల కందమౌ నడక లభ్యాసమ్ము గావింపగన్*
*గురువై పేదలపాలి కల్పతరువై గోరాడి యంతస్తమః*,
*పరమప్రౌఢి నెసంగు శాంభవి పదాబ్జద్వంద్వమత్యంతసుం*
*దరముం గూర్చియు వీడు ముచ్చటపడుం దర్శించి నర్చింపగన్.*
భావము :
*రాజహంసలకు నడకనేర్పు మొదటి గురువై, దరిద్రుల సంరక్షించునెడ కల్పతరువై, చీకటుల యౌద్ధత్యప్రకటనమెదిరించుదిట్టయై యున్న కామాక్షీదేవి చరణకమలములకొరకు వీడు (అనగా నేనన్నమాట) వేడుకపడుచున్నాను.*
[04/12, 23:31] Durga Madhuri:
పైన ఉన్న మూక పంచ శతి పద్యమునకు క్రింద నా అనుకరణ
శ్రీ లక్ష్మీ ప్రసాద్ గారు సమీక్ష చేసి దోషములు దిద్దారు
12.
నడక హంసకు నేర్పెడి నౌమవీవు
కలిమి లేని వారికి నీవె కల్ప తరువు
యంధకారము తరుము మా యమ్మ! నీదు
పాదములు గన వేచితి! ప్రణతి దుర్గ!!
13.
తేటగీతి
అష్ట రూపముల కొలువై యమృతమంత
బిడ్డలకు పంచి దీవించు వేల్పు వమ్మ
మాదు దోషము లెంచని మాతవనుచు
ప్రస్తుతించెద సతతము ప్రణతి దుర్గ
బిడ్డలకు పంచి దీవించు వేల్పు వమ్మ
మాదు దోషము లెంచని మాతవనుచు
ప్రస్తుతించెద సతతము ప్రణతి దుర్గ
14.
[23/12, 21:49] Durga Madhuri:
చింతిత ఫల పరిపోషణ
చింతామణి రేవ కాంచి నిలయామే
చిరతర సుచరిత సులభా
చిత్తం శిశిరయతు చిత్సుధాధారా
ఈ పద్యమునకు అనుకరణ
చిత్తమందు తలచినంత చింత తీర్చు
యమృత రూపిణి! కంచి కామాక్షి! జనని
శీతలంబగు దృక్కుల జిక్కులెల్ల
పాఱనొత్తు శక్తివి నీకు ప్రణతి దుర్గ
15.
పొలయలుకన్ భయంపడుచు మున్ వినతుండగు శంభుదేవునౌ*
*దల దివి నిల్లుదీర్చు శశి దాలుచు నచ్చపు సాంధ్యరాగా మే*
*లలితపదారవిందరుచులం బరమేశ్వరి యా పదమ్ములం*
*దెలమిని నాయనమ్మ విహరించుత జాడ్యమువాసి నిల్చలున్.*(
ఈ పద్యమునకు అనుకరణ
శంభు శిరముపై నిలచిన చందమామ
సందె రాగము పొందు నీ చరణములను
చూచి యో కంచి కామాక్షి! సుందరమగు
వదనము కలిగిన నీకు ప్రణతి దుర్గ
16.
నిన్ను వీడిరా నంటి నేనిలకు! జనని!
యాత్మ నిచ్చి నన్నిచటకు యంపినావు
నామ స్మరణను మార్గమున నీ చరణముల
పథము నిన్ను వొందితి నమ్మ! ప్రణతి దుర్గ!!
Latest:
[09/10, 20:50] Durga Madhuri: Padmaja Mantrala
బ్రహ్మ చారిణి! గిరిసుత! రాజకన్య
కలశము కమండలములను కరము లందు
దాల్చు కరుణా రసమయి! సదాశివుడను
పతిగ పొందిన తాపసి! ప్రణతి దుర్గ
[09/10, 22:07] Durga Madhuri:
వేద మాతవు! భక్తుల వేదనలను
దీర్ప రావమ్మ నిలకు యో ధీర శక్తి!
వెండి కొండ నివాసిని విశ్వ జనని
పాహి పాహి శరణమమ్మ ప్రణతి దుర్గ
[10/10, 18:30] Durga Madhuri:
ఇంద్ర కీలమున వెలసి ఇంతులకును
దీపమై నిలచిన నీదు రూపమునకు
పూజ సేయుదుమో గిరి రాజ కన్య
పాల జలధి కన్యసఖివి! ప్రణతి దుర్గ
[10/10, 19:18] Durga Madhuri:
వేదమాతవై బెజవాడఁ వెలసినావు
నాద సన్నుత బ్రోవుమా నగజ! జనని!
నీదుఁ సన్నిధి గోరెద నీలవేణి
పాద పద్మములకు నాదు ప్రణతి దుర్గ
దుష్టులను దనుమాడెడి తోడు వమ్మ
విజయ పురి నివాసిని! మాకు వేల్పువీవు
కదన రంగము నందున ఖడ్గ హస్త!
భావనా మాత్ర సంతుష్ట నీకు ప్రణతి దుర్గ
అష్ట భుజిగ నిలకు జేరి నష్టమి నాడు
నసుర సంహారమును జేసి నంతిమముగ
జనుల గాచితివని నిన్ను సన్నుతించి
పద్యమర్పించెదను తల్లి! ప్రణతి దుర్గ
ఖడ్గ ఖేటక శంఖ కమల కలశ
బాణము గదలను కరముఁ పట్టినట్టి
యష్ట భుజి సింహ వాహిని యాపదలను
పారవైచి కాపాడుమా! ప్రణతి దుర్గ
తేటగీతి:
పంచ ముఖి! దశభుజి! పేర్మి పంచి మాకు
బ్రతుకు రీతిఁ దెలుపు వేద ప్రాజ్ఞి! నిన్ను
గొలుచు పదము లేవియు లేవు కోమలాంగి!
పద్మ నిలయ! యందుకొనుమ ప్రణతి! దుర్గ
[15/10, 14:43] Durga Madhuri:
పట్టు వస్త్రములను దెచ్చి గట్టినాము
పన్నగేశు పత్ని! నుతులు పాడినాము
పాపములను గణన సేయకమ్మ పాహి పాహి
పంచ భూతేశి! పద్మాక్షి! ప్రణతి దుర్గ
[15/10, 14:44] Durga Madhuri:
మహిషుఁ వధియించు శక్తివి మమ్ముఁ గాచి
మహిని ధర్మ స్థాపన జేయు మాతవీవు
మహిమ లెన్నియో లెక్కింౘ మాదు తరమ!
వాసు దేవ సహోదరి! ప్రణతి దుర్గ
స్వార్థ తలుపులే దప్ప విశాల హృదిని
భక్తి తోడ చేయుట లేదు బాధ దీర్పు
మనవి మీరి స్మరింౘని మమ్ము క్షమించు మా
భయ వినాశి నీకు ప్రణతి దుర్గ
########################################
కామధేను బంధం కోసం అన్నీ (8) భ గణములు, 13వ అక్షరం యతితో కూడిన పద్యములు - ఛందం పేరు: మేదుర దన్త వృత్తము:
ఈ క్రింది 1వ పద్యము నకు హంసక్క (అనంత ఛందము ఛందశ్శిక్షణ సమూహం లో) బంధం కామధేనువు బొమ్మ వేసి అందులో పద్యం కూర్చి ఇచ్చింది On 29th August
1. లోకము నేలెడి నాయకి! యెంచక లోపము గావుమ బిడ్డల! మమ్ముల!
యో కరుణా మృత రూపిణి! నిర్వృతి యోగము వేడెద నెన్నడు వీడక
నీకడ యుండెడి భాగ్యమె సంపద నిక్కము యంచుచు మోక్షము నిమ్మని
మా కడ గండ్లను దీరిచి నీదరి మానవ జాతికి నిమ్మని ప్రార్థన
2. జంగమ దేవర తాండవ మాడెడి శైలియు నద్భుత రీతిగ నుండును
గంగయు గౌరియు పాదము చక్కగ గల్పుచు నాట్యము లాడగ జూచిన
నంగన లందరు నేర్చుచు విద్యను హంసల చందము మోదము పంచెడి
భంగిని తాళము గల్గిన తీయని పాటను పాడుచు నాట్యము జేసిరి