Sunday, October 18, 2020

తటాక బంధము

 ఏ ఛందముననైనా నాలుగు పద్యాలు ప్రతి పద్యము నందూ మొదటి అక్షరం కలిసి ఒక పదము రావాలి మకుటము ఉండాలి 


కందంలో జనయిత్రి మరియు హిమసుత అనే పదాలు ఏర్పడేలా రెండు బంధములు వ్రాసాను 


1. జనయిత్రి 

జగముల నేలెడి నాయకి

ఖగవాహన తోడిచూల గైకొనవమ్మా

నగుమోముల నగజ యుమా

భగవతి ప్రణతులు మరాళి!  పళనుని మాతా


నడిసంద్రాన దిశగనక

బడితిమి నిను పొందు దివ్య పథమునె యిమ్మా

ఘడియైన క్షణమైన నిను

విడువక యుండెడి వరమును వేడితి మాతా



యినకుల తిలకుని సోదరి

యనలుడు భానుడు శశిలు నయనములె నీకున్

మనమున తలుతును గదనిను

నను నిత్యము నే విడువక హరిహయ మాతా


త్రిభువన పాలిని జగతికి

శుభములు గూర్చెడి జననివి శోభన! శివుడే

విభుడు మలయాద్రి వాసిని!

యభయము నొసగుచు సతతము యవనిని మాతా


2. హిమసుత


[20/10, 19:03] Durga Madhuri:


హిమసుత యగజా కాంచని!

మము బ్రోవుమ సింహయాన! మాతృక! యంబా!

యుమ! బహుభుజ! శ్రీ భ్రామరి!

రమా సరస్వతి కొలిచిన లలితా! మాతా


20/10, 19:03] Durga Madhuri: 


మహిజ పతి సహో దరి! హే

మహిషాసుర మర్దినీ సుమధుర వచన నీ

మహిమలు తెలుప తరమ! యీ

మహిని వెలసి మమ్ము గాచు మంత్రిణి! మాతా


[20/10, 19:03] Durga Madhuri: 


సుర గణ పూజిత! కోరిన

వరముల నొసగుచు శృణియును పాశము గదయున్

కరముల ధరించు చండిక!

పరాత్పరా! ప్రణతులిడుదు! భక్తిగ మాతా


20/10, 19:03] Durga Madhuri: 


తలపుల నింపుకొనెద నిను

చలిమల పట్టి రహి రూపి జంగమ పత్నీ

కలువల రేడుని శిరమున

నిలిపి నిశిని వెలుగుతోడ నింపిన మాతా



No comments: