పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
ఆటవెలది
గంటి మయ్య నిన్ను గాల మేఘుడ! నిను
బాయకుండు నట్టి వరము నిమ్మ
సిద్ధ మంత్ర మీవు చెడనీయవు గదయా
గారవించి మమ్ము గాయు వాడ
బాయకుండు నట్టి వరము నిమ్మ
సిద్ధ మంత్ర మీవు చెడనీయవు గదయా
గారవించి మమ్ము గాయు వాడ
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కీర్తన లోని మూడవ చరణము పై. చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా
ఆటవెలది
ధన్య చరితుడితడు తాళ్ళపాక సుతుడు
హరిని వినుతి జేసి హర్షమిచ్చె
జనులకెల్ల పంకజాసనుని ఘనత
దెల్పి మాయ పొరలు దీసె నతఁడు
హరిని వినుతి జేసి హర్షమిచ్చె
జనులకెల్ల పంకజాసనుని ఘనత
దెల్పి మాయ పొరలు దీసె నతఁడు
ఆటవెలది
యిలను రేగు రోగములను బాపెదవయ
వైద్య రూప ధారి వ్యాధి నడచి
నిర్వృతి నొసగుదువు నిన్ను దలచినంత
వేంకటాద్రి నాథువీవు దేవ!
వైద్య రూప ధారి వ్యాధి నడచి
నిర్వృతి నొసగుదువు నిన్ను దలచినంత
వేంకటాద్రి నాథువీవు దేవ!
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి కీర్తన ఇది
ఆటవెలది
వీర లక్ష్మి హరికి ప్రియ సతి వీవమ్మ
కదన రంగ ధీర; కలిమి నీయ
వరము లొసగు తల్లి వైలోకములనేలు
జనని! శుభములొసగు జలధిపుత్రి!
కదన రంగ ధీర; కలిమి నీయ
వరము లొసగు తల్లి వైలోకములనేలు
జనని! శుభములొసగు జలధిపుత్రి!
కొండలలో నెలకొన్న కోనేటీ రాయడు కీర్తన పై
ఆటవెలది
కొండలు నెలవైన కోనేటి రాయడు
వరము లొసగుటందు వరదుడాత
డెంచి చూడ సతము డీతడే దైవము
మంచి వాడు ఘనుడు మహిని నిజము
వరము లొసగుటందు వరదుడాత
డెంచి చూడ సతము డీతడే దైవము
మంచి వాడు ఘనుడు మహిని నిజము
అన్నమయ్య పై
ఉత్సాహము
తెలుగు భాష లోని పాట తేనె లూరు విధముగా
పలికె నన్నమయ్య సతము భక్తి మదిని నిండగా
వెలుగు రేఖ యైనిలఁబడి విన్నపాలు జేసెగా
కలియు గంబు నందు జనుల కామితములఁ దీర్పగన్
పలికె నన్నమయ్య సతము భక్తి మదిని నిండగా
వెలుగు రేఖ యైనిలఁబడి విన్నపాలు జేసెగా
కలియు గంబు నందు జనుల కామితములఁ దీర్పగన్
చంపకమాల
పదక వితాపి తామహు డు ప్రస్తు తిజేసె నుదేవ దేవునే
సదమ ల స్వామి రూపము నుచక్క గదల్చె డిభాగ్య మిమ్మనే
ముదము నుబంచు కీర్తన లుమోహ నుపైన యయంయ గూర్చెనే
పదిల ముసేయ రేజను లపాడ రెవాని నిభక్తి తోడనే
సదమ ల స్వామి రూపము నుచక్క గదల్చె డిభాగ్య మిమ్మనే
ముదము నుబంచు కీర్తన లుమోహ నుపైన యయంయ గూర్చెనే
పదిల ముసేయ రేజను లపాడ రెవాని నిభక్తి తోడనే
No comments:
Post a Comment