Saturday, June 5, 2021

త గణ దండకములు

 పార్వతీ దేవి


శ్రీమాత! నీనీడ నేగోరి నీచెంతకుంజేరి నీమంబుగా నేను నీకీర్తనల్పాడి నీమెప్పుకై వేచి యున్నాను రావమ్మ శర్వాణి! దైత్యాంతకీ! నీకు కైమోడ్పు లర్పింతు దీవించు మా నన్ను కామారి కళ్యాణి! సంతాన సౌభాగ్య మేవేడి తిన్నిన్ను ప్రాప్తింప వేతల్లి! వేరైన ధ్యాసంటు లేదంటి నీరక్ష చాలమ్మ హేమాద్రి జా! గౌరి! దుర్గా! నమస్తే నమస్తే నమః


శివుడు

నీ(మ)మ్ము గానేను నీపూజలేగాని యే సేవ లేగాని చేయంగ లేనయ్య హాలా(హ)లమ్మంతయున్ మ్రింగ బూనేటి మా(దేవ) శంభో యుమానాథ నీపాద పద్మంబు చేరేటి భాగ్యమ్ము వేడంగ నీదండకంబీకు నర్పింతునోసామి భర్గా నమస్తే నమస్తే నమస్తే నమః

No comments: