Friday, June 11, 2021

ఛందస్సులు

 1979 సంవత్సరమున ప్రబంధ పుస్తకమున ఒక్క సీసమున 63 పద్యములను గర్భితము చేశారు


చాటు పద్య మణి మంజరి చాటు పద్య రత్నాకర పుస్తకంబులు


వృత్తములలో మాత్రా ఛందము ఉండదు!



[04/06, 08:21] Metc Mohtilol:


 "త్రి" పదలో మూడే పాదాలు. "ద్వి" పదలో రెండే పాదాలు. 

ద్విపద - రెండు పాదాలు, 3ఇంద్ర + 1సూర్య. ప్రాస పాటించాలి. మూడో గణం మొదటి అక్షరం యతి.


[04/06, 08:21] Metc Mohtilol: 


త్రిపద:- 1-వ పాదం 4 ఇంద్రగణములు

2- 3 పాదములలో

2-ఇంద్రగణములు-1-సూర్యగణము-ప్రాస కలదు

మొదటి పాదములో మూడవ గణం మొదటి అక్షరం యతి

[04/06, 09:37] Sujana:


 ప్రశ్న - ఉత్సాహము జాతి కేటగిరీ లోకి వస్తుంది కదండీ? సుగంధి, తరళము, పంచచామరము మాత్రమే వృత్తాల కేటగిరీ లోకి వస్తాయి. కరెక్టేనాండీ? Answer is yes

[06/06, 08:19] Sujana: 


*ఇంతవరకూ మనకు గురువులు నేర్పిన వృత్తములు* - 


 _1) వసుధ (ప్రసవ)_ - నాలుగు పాదాలు. ఒక్కో పాదంలో రెండు స గణాలు. యతి లేదు. ప్రాస పాటించాలి. 


 _2) సుగంధి_ - నాలుగు పాదాలు. నాలుగు పాదాలలో వరుసగా  7 సూర్యగణాలు + 1 గురువు. అన్నీ హ గణాలే. 7 హ గణాలు + 1 గురువు. ఐదవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం కలదు. ప్రాసయతి చెల్లదు. 


 _3) సింహ విక్రమము_ - నాలుగు పాదాలు. నాలుగు పాదాలలో వరుసగా  7 సూర్యగణాలు + 2 గురువులు. అన్నీ హ గణాలే. 7 హ గణాలు + 2 గురువులు. ఐదవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం కలదు. ప్రాసయతి చెల్లదు. 


 _4) తరళము_ - నాలుగు పాదాలు. నాలుగు పాదాలలో వరుసగా  7 సూర్యగణాలు + 1 గురువు. అన్నీ న గణాలే. 7 న గణాలు + 1 గురువు. ఐదవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం కలదు. ప్రాసయతి చెల్లదు. 


 _5) మానిని_ - నాలుగు పాదాలు. నాలుగు పాదాలలో వరుసగా  7 భ గణాలు + 1 గురువు.  1,3,5,7 గణాల గణం మొదటి అక్షరం యతి. కేవలం 5 వ గణం మొదటి అక్షరం మాత్రమే యతిగా వేసినా ఫరవాలేదు. ప్రాస నియమం కలదు. ప్రాసయతి చెల్లదు. 


8 భగణములూ, 4 పాదములూ, సప్రాస, 5వ గణము మొదటి అక్షరము యతితో.. మేదుర దంతమూ, 

5 భగణముల పై గురువూ, 4   పాదములూ, సప్రాస, 3వ భ గణము మొదటి అక్షరము యతితో అశ్వగతి వృతతమూ మానినితో గల్భస్థము చేయవచ్చు


 _6) ఉత్పలమాల_ - నాలుగు పాదాలు. అన్నిపాదాలలోనూ భ,ర,న,భ,భ,ర,వ గణాలు. యతి 1-10. ప్రాస నియమము కలదు. ప్రాసయతి చెల్లదు. 


 _7) అచల_ - నాలుగు పాదాలు. పాదానికి 8 లఘువులు అంటే రెండు నలములు. ప్రాస ఉంటుంది. యతి లేదు. 


 _8) ద్విపద_ - 2 పాదాలు. ప్రతి పాదంలో 3 ఇంద్ర గణాలు +1 సూర్య గణం. 3 వ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం కలదు. 


 _9) పంచచామరం_ - 4 పాదాలు. అన్ని పాదాలలో జ,ర,జ,ర,జ,గ. యతి 1-10. ప్రాసనియమం కలదు. 


 _10) స్రగ్విణి_ -  నాలుగు పాదాలు.  ప్రతి పాదములో 4 ర గణములుండును. ప్రాస నియమమున్నది. యతి 7 వ అక్షరము. 


ననరరరర, 9 యతి, సప్రాస,  4 పాదములు 

మదన విలసిత లో ఓ లగణం తర్వాత 3 వగణములు -- నిషా వృత్తము

III III UIU UIU UIU UIU నలసయయవ


 _11) మత్తకోకిల_ - నాలుగు పాదాలు. అన్నిపాదాలలోనూ ర,స,జ,జ,భ,ర గణాలు. యతి 1-11. ప్రాస నియమము కలదు. ప్రాసయతి చెల్లదు. 


 _12) పద్మనాభము_  - నాలుగు పాదాలు. నాలుగు పాదాలలో వరుసగా  7 తగణాలు + 2 గురువులు.  ఐదవ గణం మొదటి అక్షరం యతి. 1-13. ప్రాస నియమం కలదు. ప్రాసయతి చెల్లదు. 



తోటక వృత్తము 4 పాదములూ 4 సగణములూ యతి 9వ అక్షరము సప్రాస


నళినీ వృత్తము 4 పాదములూ 5 సగణములూ యతి 10 వ అక్షరము సప్రాస


దుర్మిల వృత్తము 4 పాదములూ సప్రాస 8 సగణంబులు 13 యతి

*ఇంతవరకూ మనకు గురువులు నేర్పిన జాతులు* -

వసుధ, తోటక, నళినీ, దుర్మిలములను గర్భస్థము చేయవచ్చును

కవిరాజ విరాజితము 1 నలము 6 భగణంబులు 1 గురవు

పాదములు ఉండును.

  1. ప్రాస నియమం కలదు
  2. ప్రతి పాదమునందు 8,14,20 వ అక్షరములు యతి స్థానములు


II UII UII UII UII UII UII UII U


బాలాశ దళ వృత్తము 5 నగణముల పై రెండు గురువులు యతి 11 

అతి వినయ 5 నగణముల పై ఓ సగణము యతి 11


కనక లత 6 నగణములపై ఓ సగణము యతి 13

మణిగణ నిగరం / శశికళ 4 నగణములు 1 సగణము 9 యతి

చారుమతి భజసన భజసన గ యతి 13, 17

మంగళ మహాశ్రీ వృత్తము భజసన భజసన గగ యతి 9, 17

 _1) త్రిపద -_ 3 పాదాలు. 1 వ పాదంలో నాలుగు ఇంద్ర గణాలు, 3వ గణం మొదటి అక్షరం యతి. 2, 3 పాదాలలో యతి లేదు, 2 ఇంద్ర గణాలు +1 సూర్య గణం వ్రాయాలి. ప్రాసనియమము కలదు. ప్రాసయతి కూడా వాడవచ్చు. అసలు యతిలేకుండగను వ్రాయవచ్చు.‌


 _2) కందము_ - నాలుగు పాదాలు. నాలుగు మాత్రల గణాలు. భ,జ,స,నల,గగ మాత్రమే వాడాలి. 1,3 పాదాలు మూడు గణాలు, యతిలేదు. 2, 4 పాదాలలో ఐదు గణాలు, నాల్గవ గణం మొదటి అక్షరం యతి, చివరి అక్షరం గురువు. మొత్తం ఎనిమిది గణాలలో బేసి గణం జగణం కారాదు.  ఆరవగణం మాత్రం నల కాని జగణం కాని వాడాలి. ప్రాస పాటించాలి. ప్రాసయతి కూడదు.


 _3) ఉత్సాహము_ - నాలుగు పాదాలు. నాలుగు పాదాలలో వరుసగా  7 సూర్యగణాలు + 1 గురువు. హ గణము, న గణము రెండూ వాడవలెను. ఐదవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం కలదు. ప్రాసయతి చెల్లదు. 


*ఇంతవరకూ మనకు గురువులు నేర్పిన ఉపజాతులు* -


 _1) ఆటవెలది_ - నాలుగు పాదాలు. విషమ పద్యము. 1,3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. 2,4 పాదాలలో వరుసగా ఐదు సూర్య గణాలు. నాల్గవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లుతుంది.


 _2) తేటగీతి_ - నాలుగు పాదాలు. నాలుగు పాదాలలో వరుసగా  1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. నాల్గవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లుతుంది.


 _3) మంజరీ ద్విపద_ - 2 పాదాలు. ప్రతి పాదంలో 3 ఇంద్ర గణాలు +1 సూర్య గణం. 3 వ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం లేదు. ప్రాసయతి వాడవచ్చు. 


 *• Special category -* _దండకము_ - త గణ దండకం - బోలెడు త గణాలు + గురువు

ర గణ దండకం - బోలెడు ర గణాలు

న గణ దండకం - బోలెడు న గణాలు + గురువు. ప్రాస లేదు. యతి, ప్రాసయతి లేదు.

[06/06, 13:07] 


Thompella Bala Subramanyam Acharya:


దీనిని షట్పద వృత్తము అంటారు పాదానికి ఎనిమిది అక్షరాలు మాత్రమే ఉంటాయి కనుక యతి ఉండదు. ప్రాస మాత్రమే ఉంటుంది. ప్రతిపాదానికి రెండు భగణములపై రెండు గురువులు ఉంటాయి. దీనిని లింగబంధములో ఇలా నిర్మించాలి.

1. మొత్తము పద్యాన్ని ఇలా వరుసగా వ్రాయాలి. లింగముపై మొదటి అక్షరమును పెట్టాలి.

2. క్రింద ఏడు అక్షరములను పెట్టాలి

3. ఆ క్రింద అయిదు అక్షరములను పెట్టాలి

4. దాని క్రింద మూడు అక్షరములను పెటాలి.

5. మధ్యలో ఒక అక్షరమును పెట్టాలి.

6. దానిక్రింద మూడు అక్షరములను పెట్టాలి

7. మరల దాని క్రింద అయిదు అక్షరాలను పెట్టాలి.

8. చివరగా ఏడు అక్షరములను పెట్టాలి.

9. ప్రారంభం నుండి కుడి నుండి ఎడమకు, మరల ఎడమనుండి కుడికి వ్రాయాలి.

10. పై చిత్రము యొక్క నడక చూస్తే తెలుస్తుంది.

[08/06, 23:32] K Vara Laxmamma Garu:


 మహలక్ష్మీవృత్తము:-ర,ర,ర


శ్రీమహాలక్ష్మి! మాయింటికిన్

స్వామితోఁ గూడి యేతెంచుమా!

ప్రేమతోఁ గొంచు మా హారతుల్

క్షేమముల్ గల్గ దీవింపుమా

[09/06, 09:52] +91 98482 95471:


వెంకటస్వామి.... శ్రీకాళహస్తి

తిరుమల చరిత్ర 

               10

ఆపాతలిక

1వ.పా....స స స గ   యతి...6

2వ పా.... న న స స గ... యతి... 9

3 వపా.... న స భ గ గ   యతి...7

4 వ పా.... న న త య.   యతి... 8


స్థిరచిత్తముచే హరికై తా

సిరులనొసగి కడు సేవల నర్పిం

చి రతముగ లక్ష్మీపతి చెంతన్

సరగున జనె నా సాధ్వి సమావై

[10/06, 05:34] Rama Krishna Varanasi: 


*ఓం సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికాయై నమః.🙏*

(శ్రీ లలితా సహస్ర నామములలో 290వ నామము.)


స్వయం కల్పిత


శ్రీమౌక్తిక వృత్తము.


గణములు.. న  భ  త  ర  స  వ.      యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.     


భసిత దేహునితో గూడి భావనన్ విహరించుమా


యసమ భక్తిని నాలోన హాయిగా కలిగించుమా,


రససమంచిత పద్యాళి ప్రార్థనన్ విని యాలకిం


చు, *సకలాగమ సందోహ శుక్తి సంపుటమౌక్తికా!*

🙏

అమ్మకు వందనములతో 🙏

చింతా రామకృష్ణారావు.

[10/06, 11:05] Sujana: 

దండకము - త గణ దండకం - బోలెడు త గణాలు + గురువు

ర గణ దండకం - బోలెడు ర గణాలు

న గణ దండకం - బోలెడు న గణాలు + గురువు. ప్రాస లేదు. యతి, ప్రాసయతి లేదు.

[10/06, 19:03] Metc Mohtilol: 

సుగంధికి-ఉత్సాహకు-తరళ కి చాల తేడా ఉన్నది ఇదివరలో చెప్పాను. మరల చెప్పుచున్నాను. ఈ మూడింటికి కుడా ఏడు సూర్యగణములపై ఒక గురువు రావాలి. 5 వ గణాద్యక్షరము యతి. అయితే తేడా మన ఇష్టం వచ్చినట్లు సూర్యగణాలు వ్రాయడం కాదు. కొద్ది తేడా ఉంది. 1. సుగంధి వృత్తం.. ఇందులో అన్నీ హగణములే వాడాలి నగణం ఉండరాదు. 2. తరలి వృత్తం.. ఇందులో అన్నీ నగణములే వ్రాయాలి హ గణం రాకూడదు. 3. ఉత్సాహ వృత్తం ..ప్రతి పాదంలో తప్పక ఒక నగణం కాని ఒక హ గణం కాని ఉండాలి.

[10/06, 21:28] Sujana: 

*తరళము-* నాలుగు పాదాలు. నాలుగు పాదాలలో వరుసగా  7 సూర్యగణాలు + 1 గురువు. అన్నీ న గణాలే. 7 న గణాలు + 1 గురువు. ఐదవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస నియమం కలదు. ప్రాసయతి చెల్లదు. 


 *ధ్రువకోకిల - తరలము -* నాలుగు పాదాలు. అన్నిపాదాలలోనూ న,భ,ర,స,జ,జ,గ గణాలు. యతి 1-12. ప్రాస నియమము కలదు. ప్రాసయతి చెల్లదు.


 *తరలీ వృత్తము* - నాలుగు పాదాలు. అన్నిపాదాలలోనూ భ,స,న,జ,న,ర గణాలు. యతి 1-11. ప్రాస నియమము కలదు. ప్రాసయతి చెల్లదు.

[10/06, 21:55] Thompella Bala Subramanyam Acharya: 

1. తరలి వృత్తము-- భ/స/న/ జ/న/ర--ప్రాస ఉండును యతి 11 వ అక్షరం.  2 తరలము (ధృవకోకిల)--నభరసజజ గ. ప్రాస ఉండును. యతి 12 వ అక్షరం. 3. తరళము..7 నగణములపై 1 గురువు. ప్రాస ఉండును. యతి 13 వ అక్షరం. (5 వగణమ్ మొదటి అక్షరం)

[12/06, 00:41] Thompella Bala Subramanyam Acharya: 


తురంగ వృత్తము: లక్షణములు: నాల్గుపాదములుండును. ప్రాస గలదు. ప్రతి పాదములో భలల/భలల/భలల/భలల+నగణము ఉండును మొత్తం 23 అక్షరములుండును పాదానికి. యతి 11 వ అక్షరం. ఈ వృత్తణ్ణీ సులువుగా వ్రాయుటకు నాల్గు సెట్లు గా హగణం నగణం వ్రాసి కొని చివర నగణం జేర్చినచాలు. మూడో సెట్ మొదటి గణాద్యక్షరముపై యతి ఉంటుంది. అంటే ఇలా (UI/III//UI/III//UI/III//UI/III//III)



తోదక, దోదక,దోధక, భారతి వృత్తము.


ఇందు నాల్గు పాదాలుండును. భభభగగ గణములుండును. ప్రాస కలదు. యతి 7 అక్షరము అంటే మూడో భగణం మొదటి అక్షరం.


అల్పభారతి వృత్తము.

ఇందు నాల్గు పాదాలుండును. భభభగ గణములుండును. ప్రాస కలదు. యతి 7 అక్షరము అంటే మూడో భగణం మొదటి అక్షరం.


మనము అల్పభారతి గర్భ భారతి (తోదక) వృత్తాన్ని హాయిగా నిర్మింపవచ్చు. ప్రయత్నించమ్డి.


మంగళ గీతి: ప్రాస లేదు

నాలుగు పాదములు మూడవ పాదము మొదటి అక్షఱము యతి , ప్రాస ఐచ్ఛికము, నాలుగు ఇంద్ర గణమ్ములు


మందార దామ వృత్తము

నాలుగు పాదములు, ప్రాస యుండును, త, త, త, గ, గ గణములు, మూడవ గణము మొదటి అక్షఱము యతి 



భాసురవృత్తరచనా ప్రయత్నము

దోషములున్న తెలియజేయాల్సిన ది

భాసురవృత్తం  భ ,భ భ ,గ ,గ, గణములు 7. అక్షరం యతి



మంధర వృత్తము 

రెండు భగణములు, రెండు నగణములపై ఒక గురువు. 7 వ అక్షరం యతి.


(అంత్య ప్రాస చూపించిన “మధురగతి రగడ” అవుతుంది.)


కోరెద నెప్డు సుగుణ పదములతోన్

పారగ పద్యపు వఱద కవితలన్ 

ధారణ నొందు పథము నొసగుమ యో 

శారద! వేడెద సతతము నినునే.



*మంధర* వృత్తము

భభననగ, సప్రాస, యతి-7


భారముఁ దీర్చును భవుఁడు  నతిడగన్

కోరఁగ విద్యను గుణము లిడుచున్

దీరముఁ జేర్చును దిరముఁ నిలుపగన్

దీరుఁగ నీశుని దినముఁ గొలువుమా!


*బలభిన్మణి* వృత్తము

భసననగ, సప్రాస, యతి-7


భారము లడఁచున్ భవుడు గొలువఁగన్

కోరఁగఁ జదువుల్ గుణము లొసఁగుచున్

దీరముఁ దెలుపున్ దిరము నిలుపగన్

దీరుఁగ నిడుమా దినముఁ బ్రణతులన్


విజయ మంగళ రగడ


అచలము 4 పాదములూ సప్రాస 2 నల గణములు అంటే 8 అక్షరములే కనుక యతి ఉండదు

మంజుల వృత్తము 4 పాదములూ సప్రాస 2 నల గణములు పైన మరొక లఘువు

మదన విలసితము 4 పాదములూ సప్రాస 1 నల, 1 నగ, యతి ఉండదు 8 అక్షరములే కనుక


మదన విలసితమునకు మరో రెండు గణములు గలిసిన భుజగ శిశు వృత్తము అంటే ననయ (నసగ) ప్రాస యుండు యతి ఉండదు

16 సూర్య గణములు

5 , 9 , 13 గణముల మొదటి అక్షరములు యతి

అంత్య ప్రాస గలదు

No comments: