Wednesday, June 15, 2022

1000లో నుతులతో పాటూ మరో పది

1. తేటగీతి 1 సూ + 2 ఇం + 2 సూ, యతి 4వ గణము మొ.పా

ఇంటి దొంగవగుట జూడ హీన గుణము

నరుడ! కష్టపెట్ట వలదు నమ్మినట్టి

సతిని మోసగించిన నది చావు సమము

సత్యగుణము తో మసలుమ! సతతమిలను


2. మత్తకోకిల ర స జ జ భ ర యతి 11

మాతృ భాషను వీడబోకుమ మానవా యది చేటురా

ప్రీతిగన్ చదివించి నేర్పరె పిల్ల పాపలకున్ సదా

వేతనంబుల విద్యయేలను! వృక్ష నీడను వంటిదౌ

మాతృభాషను గారవించిన మంచి గల్గును సోదరా


3. ఉపేంద్రవజ్రము జ త జ గ గ 8

విరోధ భావమ్ములు భీతి గొల్పన్

హరించి పోయేనిక హాయి లేకన్

ధరాతలమ్మంతయు దైన్యమేగా

స్థిరమ్ము గానీయరె స్నేహబుద్ధుల్


4. 15 157 వంశస్థర జ త జ ర 8


శ్రమించు నాడే సుఖ సౌఖ్య మందునే

క్షమించి నన్ గల్గును సంతసమ్ములున్

తమస్సు వీడంగ ముదమ్ము దక్కునే

సమాన రీతిన్ జని సాగు నెమ్మదిన్


5. 46 67 తామరసము (తోదకము) న జ జ య 8

వనమున పూచిన పద్మము వోలెన్

ఘనమగు సంపద గల్గినదౌ యీ

దెనుగును మించిన తీపియు లేదే

మననము సేయరె మానక నాంధ్రుల్

6. ఉత్పలమాల,  భ, ర, న, భ, భ, ర, వ, యతి 10

భారత భావి పౌరులగు బాలల చక్కని వృద్ధి కోసమై

తీరుగ దిద్దరే తెవివి తేటలు వారికి గల్గునట్లుగన్!

శౌరుల యొక్క గాథలను చక్కగ దెల్పిన రాటు దేలుచున్

చేరెదరంట నంబరము చీకటి చీల్చుచు కాంతి రేఖలై


7. చంపకమాల,  న, జ, భ, జ, జ, జ, ర, యతి 11

మనసున కల్మషమ్ము తగు మంచిని చేయదు మానవా సదా

వినయ గుణమ్ము కాచునిను! వీడకు సజ్జన సన్నిధానమున్

కనులకు గానుపించునది గాదు నిజమ్మనెఱింగి మేలుకో

ధనమొక మత్తు లోకులకు ధారగ నిచ్చితివా యధోగతే


8. 101 104  భారవి భ ర భ ర భ ర వ యతి 13

ఒప్పకు మానవా చెప్పుడు మాట తో నొప్పిని గల్గు రీతినన్

చెప్పకు నెన్నడున్ తప్పుడు పల్కులున్   చేయకు పాప కార్యముల్

తిప్పలు దెచ్చునే యిచ్చిన యప్పులాత్మీయులకైన! నమ్మినన్

నొప్పులు దీర్ప రారెవ్వఱు గాన నీ నోములె గాచురా నిన్ను మానవా

9

కవనము నాట్యము గానము

కవలిగ శిల్పమ్ము చిత్ర కళలును గలువన్

యవి లలిత కళలు! వానిని

చవి జూసిన వదలలేరు! సత్యము గనుమా


10. ఉత్సాహము


తెలుగు భాష లోన గలవు తేనెలొలుకు సిరులు! యా

వెలుగు లోన గలవు పద్య విద్య నేర్పు ఛందముల్

నలతి యలతి పదములల్లి యద్భుతముగ గూర్చగా

పలుకు సుళువు యాయునట్లు పండు భావమంతయున్

No comments: