Thursday, August 16, 2018

On Vajpayee

వాజపేయుడు పయనమయ్యె
వాగ్దేవి కచ్చట ప్రత్యక్షమయ్యె
వజ్రమంటి నేత మాయమయ్యె
వన్నె తెచ్చే వ్యక్తి మనకి దూరమయ్యె 

Thursday, June 21, 2018

On Suuryakaantammaa

Suuryudi kiranammuve neevU Kaarunyamu kaladaaniveevuu Kaanthalake maanikyammu kaademiti Suuryakaantammo neeku Saati raarevarammo Natanalonuu meti neevuu Attavu kaadu Ammavu toti janulaku neevu Aravadam anthaa paipaine Apyaayata nee hridayaanepuduu nindene Bhuvini elinaavu kalaakaarinigaa Diviki eginaavuu Nitya santoshinigaa vardhillutunnaavu telugu manasullo vadili nee teeyati gnaapakaaluu

Sunday, June 3, 2018

Blood, Toil, Tears and Sweat

Blood Toil Tears and Sweat
Always seems to have become wet
Though the eyes wouldn't have met
These feelings are never felt slept
Hearts have to ensure they're swept
That would bring in Cheers, Glory and Fest

Wednesday, May 30, 2018

తెనుగు గొప్ప పదాలు

భరత ఖండము చక్కని పాడియావు

చెరసాలలే ప్రతి చంద్రశాలలెయగున్

– చిలకమర్తి

మాకొద్దీ తెల్ల దొరాతనమూ

దండాలండోయి మేముండలేమండోయి బాబూ – గరిమెళ్ళ సత్యనారాయణ


శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్య సీమై

యే దేశమేగినా యెందు కాలిడినా – రాయప్రోలు


నీవు ప్రాణాధికవు… నా సరస్వతివీవు వాస్తవమ్ముగ భాగ్యదేవతవు నాకు – తల్లావజ్ఝల శివశంకర శాస్త్ర్య్

గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదు కాసింతసేపు

కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు – నండూరి సుబ్బారావు

మూగవోయిన నా గళమ్మున గూడా నిదురవోయిన సెలయేటి రొదలు గలవు – దేవులపల్లి కృష్ణ శాస్త్రి

తిండి కలిగితేనె కండ కలదోయి కండ కలవాడేను మనిషోయీ

నలుగురు కలిసీ నవ్వే వేళా నా పేరొకపరి తలవండోయి - గురజాడ

భావకవిన్మాత్రము కాన్నేనహంభావకవిని - “పట్టాభి"

పచ్చి బాలెంతరాలు మా భరత మాత

నాదు కన్నీటి కథ సమన్వయము సేయ నార్ద్ర హృదయంబు గూడా కొంతవసరంబు– జాషువా

కొల్లాయి గట్టితేనేమి – బసవరాజు అప్పారావు

మట్టీ మనిషీ ఆకాశం వీటి చుట్టే అల్లుకుంది సృష్టి కథా సూత్రం

మాటకి దండం పెడతా పాటకి దండం పేడతా – ఆచార్య డా|| సి నా రె

వంటింటీ సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా చివరకు వంటింటి గిన్నెలన్నింటి పైనా మా నాన్న పేరే – విమల

ఆర్భాటాలొద్దూ ఆడంబరాలూ ఒద్దూ అందరం అత్యవసరంగా మాట్లాడుకునే విషయానికి వద్దాం – ఆదూరి సత్యవతీ దేవి

అందమైన దోపిడీకీ పవిత్రమైన హింసకూ బలైపోయిన నేను భారత స్త్రీని – ఓల్గా

నేనొక నిషిద్ధ జీవిని
మొన్నటి దాకా నా నవ్వు నిషిద్ధం
నిన్నటి దాకా నా చదువు నిషిద్ధం
నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధం – శ్రీమతి

గతాన్ని కాదనలేను వర్తమానం వద్దనబోనూ
భవిష్యత్తును వదులుకోనూ – కాలం నా కంఠమాల – దాశరథి కృష్ణమాచార్య

మానవత లేని లోకాన్ని స్తుతించలేను ఈ నాగరికతారణ్యవాసం భరించలేను – బాల గంగాధర తిలక్

Okka siraa chukka laksha medallaku kadalika - Kaloji

Naa aksharaalu vennello aadukune andamaina aadapillalu - tilak

Naa jeevitham vadagaadpaite naa kavitvam vennela - jaashuvaa


తెలుగుదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకొండా
యెల్ల నృపుల గొలువ యెరుగవే బాసాడి దేశ భాష లందు తెలుగు లెస్స - ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణ దేవరాయ

నేనంతా పిడికెడు మట్టినే కావచ్చు కానీ కలం ఎత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. - గుంటూరు శేషేంద్ర శర్మ
ఏనుగెక్కినాము ధరణీశులు మొక్కగ నిక్కినాము - తిరుపతి వేంకట కవులు
వాణి నా రాణి - పిల్లలమర్రి పిన వీరభద్రుడు అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయమూర్తి - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి బిరుదు
ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునపుడు వినిపించు భాష - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క - లక్ష మెదళ్ళకు కదలిక - ప్రజాకవి కాళోజీ
కవి కూడా నేతగాడే‌ బహు చక్కని సాలె గూడు అల్లువాడే - కాళోజీ
అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా - ప్రజాకవి కాళోజీ

శ్రీ వాణీ గిరిజా - నన్నయ అక్షరమ్ము వలయు కుక్షి జీవులకు అక్షరమ్ము జిహ్వకు ఇక్షురసము అక్షరమ్ము తన్ను రక్షించు గావున అక్షరమ్ము లోక రక్షితమ్ము

పలుకు బళ్ళన్నియు పరమ తత్త్వార్థ బోధకములై
ఒప్పు అందాల భాష బహుజన్మ కృత పుణ్య పరిపాకమున చేసి ఆంధ్ర భాష మాట్లాడుతుంటాడు

అరటకులోయల గాలికొండ హైదరాబాద్ గోలకొండ కలసికట్టెను తెలుగుతల్లి కంఠసీమను పూలదండ - బాపు రెడ్డి

తేనె కన్న మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు - ఆరుద్ర

తెలుగు పులుగు చేరలేని దేశంలేదు తెలుగు వెలుగు దూరలేని కోశంలేదు - దాశరథి

కధ కధనం మీద పెద్దిభొట్ల సుబ్బారావు గారి సూక్తి బాగుంది.

సూర్యుడికి, కాంతికీ ఉన్న సంబంధమే, రచయతకీ కళకీ ఉంటుంది. - చలం


పల్లవించిన వాణీ పలుకుల తేనెల రాణీ
ప్రతిభా పాటవాల ప్రాజ్ఞీ సకల విద్యా ప్రదాత్రీ ప్రణామమ్ములు గైకొనుమా


అనుకున్నవెన్నియో జారిపోయినవి, అనుకోనివెన్నియో జరిగిపోయినవి, అందుకే రేపన్న ఆశ మనకు అది కూడ నిన్నగా మారు వరకు’



🟤 *తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో  చూద్దాం...*

1. _‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు_ 
_నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’_
*దేవులపల్లి కృష్ణ శాస్త్రి*

2. _‘‘కప్పివుంచితే కవిత్వం_ 
_విప్పి చెబితే విమర్శ’’_
*డా.సి.నారాయణరెడ్డి*

3. _‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ_ 
_ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’_
*కాళోజి*

4. _‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’_
*నన్నయ*

5. _‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’_
*సుబ్బారావు పాణిగ్రాహి*

6. _‘‘రాజే కింకరుడగు_ 
_కింకరుడే రాజగు’’_
*బలిజేపల్లి లక్ష్మీకాంతం*

7. _‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న_ 
_వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’_
*బసవరాజు అప్పారావు*

8. _‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’_
*గుర్రం జాషువా*

9. _‘అత్తవారిచ్చిన అంటుమామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను’’_
*కాళ్ళకూరినారాయణరావు*

10. _‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’_
*దాశరధి*

11. _‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’_
*నార్ల వెంకటేశ్వర రావు*

12. _‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’_
*తిరుపతి వెంకట కవులు*

13. _‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’_
*గురజాడ*

14. _‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’_
*గరిమెళ్ళ సత్యనారాయణ*

15. _‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’_
*శ్రీనాథుడు*

16. _‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’_
*పోతన*

17. _‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’_
*గద్దర్*

18. _‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’_
*శ్రీ శ్రీ*

19. _‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’_
 *వెన్నలకంటి*

20. _‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’_
*కొనకళ్ల వెంకటరత్నం*

21. _‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’_
*అల్లసాని పెద్దన*
 
22. _‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’_
*చేమకూరి వేంకటకవి*

23. _‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’_ 
*త్యాగయ్య*

24. _‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’_
*ధూర్జటి*

25. _‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు’’_ 
*బద్దెన*

26. _‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’_
*వేమన*

27. _‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’_ 
*కంచర్ల గోపన్న*

28. _‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’_
*సుద్దాల హనుమంతు*

29. _‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’_ 
*ఆరుద్ర*

30. _‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’_ 
*వేముల శ్రీ కృష్ణ*

31. _‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’_
*త్రిపురనేని రామస్వామి*

32. _‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’_
*బాలాంత్రపు రజనీ కాంతరావు*

33 ._‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’_
*అడవి బాపిరాజు*

34. _‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’_
*కరుణశ్రీ*
 
35. _‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో_
*గుడ అంజయ్య*

36. _‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’_
*అలిసెట్టి ప్రభాకర్*

37. _‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’_
*సావిత్రి*

38. ‘_‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’_
*ఖాదర్ మొహియుద్దీన్*

39. _‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను_ 
*బాలగంగాధర తిలక్*

40. _‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’_
*అన్నమయ్య*

41.  _‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’_
*ఏనుగు లక్ష్మణ కవి*

42. _అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ_
*పాలగుమ్మి విశ్వనాథం*

43. _‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ_ 
*చలం*

44. _‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’_
*విమల*
 
45. _‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’_
*నండూరి సుబ్బారావు*

46. _‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’_
*అందెశ్రీ*

47. _‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’_
*చెరబండరాజు*
 
48. _ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు_
*కందుకూరి రామభద్రరావు*

49. _నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ_ 
*నందిని సిధారెడ్డి*

50. _రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’_
*మిట్టపల్లి సురేందర్*

𑁍 _"తెలుగదేలయన్న దేశంబు తెలుగు_ 
_నేను తెలుగు వల్లభుండ........._
_దేశభాషలందు తెలుగు లెస్స_"  *(శ్రీకృష్ణదేవరాయలు)*

🍀 *రానున్న తరానికి ఇవి మనం రాసిచ్చే వీలునామా..CM Reddy*

Tuesday, April 10, 2018

Bhiimaa Nadi

మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమల నుండీ పుట్టిన భీమా (చంద్రభాగా అనే మరో పేరు కూదా వుంది) నది కి ఈ విళంబి లో పుష్కారాలు - వాటిని పురష్కరించుకుని నేను రాసిన దశకం ఇది

సహ్యాద్రి నందు బుట్టీతివీ నీవు
సస్యశ్యామలమూ జెయుటకీ భూమిన్
సంతసమందించుటకూ మాకున్
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

భీమ శంకరుని చరణముల నుండి ఉరికి
విష్ణు పాదోద్భవిని తలపించినావు
శివకేశవ సమానతను జూపినావూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

పస్చిమ కనుమల నుండీ పాకి
దక్షిణ దిశ వైపుగా సాగి
దాహార్తిను నీవు దీర్చినావు
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

కామణ్ డ్యాము ని నీవు నింపినావూ
క్షామం బాధనూ నిలువరించినావూ
క్షేత్రాలన్నీ చక్కగ పండించినావూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

సోమని రూపమున పండరిపురమన దాల్చినావూ
చంద్రభాగగా పేరు గాంచినావూ
చల్లని వరమును ఒసగినావూ
సార్ధకమమ్మ! నీదు జన్మ భీమా

అరియ కుమండలముల నదూ కూర్చుంది
మూల మూథ ప్రవాహినులను జేర్చుకునీ
ఇటుల మరిన్నిటిని నీలో కలుపుకొని తీరం తాకితివమ్మ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

కృష్ణమ్మకు చెంతనె మొదలెట్టిన పరుగు
క్రిందికా అనకుండా సాగెను ముందు
తుదకు మళ్ళీ కలిసేను ఆ కృష్ణవేణి లోనే
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

పుడమిని పచ్చగ పలికించినావూ
ప్రావహమ్మున నీవూ చరియించినావూ
ప్రజల పాట్లనెల్ల దీర్చినావూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

నీ దరిన వెలసితిరమ్మ సకల దేవతలూ
ఆది గణపతి సిద్ధి వినాయకుడూ ఆతని తణ్డ్రి భీమేశ్వరుడూ
విడువలేదు గద పండరిపుర విఠలుడూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

గానుగాపురమందు గురువూ దత్తుడూ
తుల్జాపురమందు లోకాలనేలే జగన్మాతా
కొలువైతిరమ్మా నీ ఒడ్డునే
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

- మాధురి

Thursday, October 30, 2014

What is it all that's needed?

I am searching, I am searching, Oh I am Searching
In the garden of earth, below the sky, I am searching...
Running behind the time, moving across the shores, oh I am desperately searching...
Covering all the water, Leaving aside the sleep, oh I am waiting... waiting for?
...
Tweaking on self, tweaking on self, oh what am I doing what am I doing?!?!
I then started laughing, out of tiredness!! I then started laughing, out of tiredness!!
Only to realize, that I needed a little than what I am actually hunting for...
And guess what they are! It’s nothing than HAPPINESS. And guess where it can be!!
Nowhere other than in the Soul and Heart. This is what a PERSON should know.

Little words

Share the Love, Don’t Scare the people...

Care for the need; don’t tear out the feelings...

...
Play the Game, but not shame the lost...

Get the fame, but do not run badly for the name...

Smile for a while, smile for a while

Have some fun, though you have got to run

Look at the Sun, Rather than taking out a gun...

Keep Praying, not too much preying...

Use the hands to Clap, and not to slap...

Forget the harm, and think of Charm...

Use the Arm for work, but not to Cram others...

Grow well in heights, but without fights...

Rather than cry, do give a better TRY...

Wednesday, October 22, 2014

Dreams - కలలు


Lies within the EYES – that makes our heart an ICE

Often having it is NICE – and sometimes it is SPICE

These dreams are our feeling’s SPYS – of which the poets appraise
 
నవరసాలు అందులో అనుభవిస్తున్నా - నోరు విప్పి
కనిపించేది రెప్ప పాటు కన్నా ఎక్కువే అయినా -
 
Happen in our sleep – but are the reflection of our consciousness
Lies in our Eyes – but are never seen by others, neither in the mirror
They catch our feelings – but we can’t catch them in return
Eyes are two, person is one – and yes, but DREAMS are many!!
 
నీలాల మేఘాలంటి కన్నుల మాటున - నిశి రాతిరి నిదురించే హృదయ స్పందన
నయనాలతో నిత్యం చుస్తున్నా - పట్టి బంధించలేకున్న భావన
మనతొనే వుంటున్నా మనకంటూ అందనిదీ - మనసులోనే వుంటుందీ బయటకంటూ రానిదీ
వద్దన్నా వెంట వస్తుంది - కానీ మళ్ళీ కావాలాంటే దొరకనిదీ కలలు

Tenungu Bhaasha

అక్కటా! ఈ నర జాతి మధ్యములు వగలోలికే పరుల భాషను వలచినారు
తేనెలొలికే తేట తెనుంగు తీయదనం మరచినారు
పాలు వద్దనే పసి వాని వలె పారవైచినారు
ఇంపైన భాష ఇంతేనా అని ఇప్పటి దాకా అలరారిన భాషను కాదని
అరువిచ్చిన పదాలను ఆదరిస్తూ ఆ పరభాషలోనే ఆదమరుస్తూ
ఆనందాన్ని సైతం అనువదిస్తూ అరుణోదయాన్ని ఆలస్యంగా చూస్తూ
అ, ఆ లను అణచి  వేస్తూ అందానికి  అన్య పదాలతో భాష్యం చెబుతూ
ఆవేదనని పెంచుతున్నారు అనంతమైన సొగసును పంచలేకున్నారు 

Sunday, April 6, 2014

ప్రకృతి

నునువెచ్చని ఉషః కిరణాలు సుతిమెత్తని సుమాలు
వర్ణనలకు అందని వర్ణాలతో కుడిన హరివిల్లు
పంచభూతాలు పసిడి లోహాలు పదునాల్గు భువనాలు
లెక్కింపలేని అందమైన జీవరాసులతో కూడినది మన ప్రకృతి


గగనకుసుమమా నీకు గ్రహణమా అద్భుత గ్రహమా ఆపదను గ్రక్కున విడువుమా భానుని చాటున వేకువని దాటి భూమిని చుట్టీ బాలురన్ నీవెంట దిప్పుకొనెడి చాతుర్యమా


చూచుటకు కన్నులు చాలని అందం
శ్వాసించెడి నాసిక పుటలన్ అదిరించేటి సుగంధం
వచియించుటకు వాక్కులకందని వర్ణముల్
వదలివేయుటకు మనసు ఒప్పని బంధం - పుష్పవనం


కురులు అలంకరించేటి
సిరుల గుణం కలిగేవి ఈ
విరులు విరజిల్లాను సౌరభాలు
కరములనందూ ఇమిడేను అందంగాను


వీచే పూవుకు ప్రాణం పోయ ఆర్కుడను కాను
పూరెక్కల సౌరభము మోయ వాయువును కాను
పుష్పము చుట్టూ తిరుగాడే భ్రమరమును కాను
నెలకొరిగిన విరులను తాక పుడమిని కాను
మరి ఏమిటి నేను... ఇదంతా చూచి ఆనందించే మనిషిని... మనిషిలోని మనసును... మనసు పట్టి వ్రాయించే కరమందలి కలమునుండి జాలువారిన కవితను