Tuesday, February 22, 2011

Naakishtam

spashtatha tho kudina telugu nakishtam


swacchata vuttipade telupu nakishtam

santosham lo vunde velugu nakishtam

saraina darilo vacche gelupu nakishtam

Sunday, December 5, 2010

సామాన్యుడే మహా రాజు!!

ఊరి చివర విసిరి వేసి నట్టు వుండే పాత బడ్డ veedhi
 చెత్త కనిపించాలి అంటే వెతకక్కర్లేదు
ఎందుకంటే అడుగు తీసి అడుగు వేయగానే మనకి స్వాగతం చెప్పేస్తాయి దుర్గందాలు
అటువంటి వీధి లో వాసన కంటే వేగం గా అతిథి ని పలకరిస్తుంది ఒక పూరి గుడిసె లోని ఇఫోనే లోని పాట వీళ్ళల్లో ఎంతో మంది పిల్లలు తమ పెద్దల్లాగే పని వాళ్ళుగా చేరతారు తప్ప చదువు పట్ల ఇంట్రెస్ట్ వుండదు కాకపోతే తమ దగ్గర వున్న బంగారం కానీ డబ్బు కానీ చూపించితే తమకి ఈ పని రాదు అన్నది వాళ్ళ భావాన్. నిజమే... పట్టు చీరలు పంచెలు కట్టుకుని ఖరీదైన రిబ్బన్లు వ్రిస్ట్ undefined లు చుతుకుని ధగధగ లాడే నగలు పెట్టుకుని నాకు క్లెర్క్ పోస్ట్ ఓ వంట మనిషి గానో పని మనిషి గానో ఆయా గానో పెట్టుకోమంటే ఎవరు పెట్టుకుంటారు!!


కార్ పార్కింగ్ కోసం ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన లవన్ లో తన కొత్త బెంగే ని నిలిపి అక్కడ నించి తన నివాసం కొలువయి వున్నా ఇంటికి ఎంత లేదు అన్నా ౫ నిమిషాలు పడుతుంది ఆ లవన్ నించి నాన్-పోల్లుతేడ్ వెహిచ్లె ని డ్రైవ్ చేస్కుంటూ తన రూం వుండే దిక్కుకు చేరుకున్నాడు బిజినెస్-త్య్చూన్ రాజన్ వెర్మ
మనుష్యుల కన్నా వారి కోరికలే ఎక్కువ గా కనిపించే విశాల భారత దేశం లో ప్రతి పది అదుగులకీ ఒక మనిషి వుండటం ఎంత సహజమో ప్రతి మనిశికీ లెక్కలేనన్ని భవనాలు వుండటం కూడా అంతే సహజం

అందుకని కొంత స్పేస్ ఆదా చెయ్యటానికి గవర్నమెంట్ పెట్టిన నియమం అది.... ఏ వీధిలో వాళ్ళు ఆ వీధి చివర్లో కాని మొదట్లో కాని పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేస్కుని ఇంటికి నాన్-పోల్లుతేడ్ వెహిచ్లెస్ లో కాని నడిచి కాని వెళ్ళాలి ani
తద్వారా పొల్లుతిఒన్ శాతం తగ్గటం ఆరోగ్య స్పృహ పెరగటం ముఖ్యోద్దేశం ఇక పార్కింగ్ ఏరియా వీధికి ఎటు వైపు వుంటే మరో వైపు చివర్న వున్న ఇంటికి హెలి-పాడ్ ఇచ్చేటట్టు అగ్రీమెంట్ ప్రతీ బిజినెస్-మగ్నెత్స్ వీధికి కుడా ... అలాంటి వీధిలో వుండే అనిరుద్ ఆశియ తన సహోదరుడి ఇంటికి పార్టీ కి వెళ్తున్నాడు తన సతి పుత్రా సమేతం గా అయితీ ఫషిఒన్ దేసిగ్నేర్ గ పేరు గాంచిన అతని సతీ మని ప్రస్తుతం ఒక జరీ అంచు చీర ఒక కెంపుల హారం మాత్రం మేడలో వేసుకుని తన కొడుకు కి ఒక సఫారి సూట్ వేసి తీసుకు వెళుతోంది. కారణం ఇటీవల కేంద్రం లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ మీద ఆదాయపు పన్ను దగ్గరనించి అమ్మకపు పన్ను వరకు ఎటువంటి దాడులు జరిగే ఆస్కారం లేకుండా జాగ్రత్త పడుతోంది.

ఇక సమాజం లో అతి ముఖ్యమయిన వాడు అత్యంత దీనుడిగా చెప్పబడే వాడు అయిన మధ్య-తరగతి వాడి కదా కి వస్తే... రేషన్ షాప్ లో పంచదార కేరోసే తేచుకునే రోజు నిన్చీ ఇంట్లో ఓవెన్ రైస్ కోకేర్ రోటి మకెర్ పెట్టె సంపద వచ్చినన జీవన శైలి ని సంప్రదాయాన్ని అనుసరించే గడిపే మామూలు మనిషి. తను పని చేస్తున్న కంపెనీ నష్టాల్లో కూరుకున్నా మీడియా సృష్తి తో అప్రతిష్ట పాలు అయినా తన కంపెనీ CEO గ పిలవబడే పెద్ద మనిషి ఎంత కష్టాల్లో ఇరుక్కున్నా  తన మేనేజర్ ఎలాంటి పరిస్థితిల్లో వున్నావారి జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు వుండదు. అమాయకత్వం వారికి దేవుడు ఇచ్చిన వరం. దాన్ని అజ్ఞానం అన్నా పర్లేదు. జయలక్ష్మి ఎంత తెలివి రాజకీయ నాయకురాలు అయినా మమత ముఖేర్జీ ఎంత కంత్రి అయినా సామాన్య స్త్రీ మాత్రం ఎంత స్థాయిలో ఉద్యోగిని అయినా అత్తా మామల వేధింపులు ఆడపడుచుల సాధింపుల మధ్య పిల్లల తో సతమతమవుతూ వుంటే ఒక ఇంటి యజమాని గ చెప్పబడే వాడికి తోబుట్టువుల చదువు పెళ్ళిళ్ళు లేదా పిల్లల ఆరోగ్యాలు భార్య టైం కి ఇంటికి వచ్చిందా లేదా అమ్మ నాన్న ఎక్కడ వుంటున్నారు ఇవే అతని ముందు వుండే లక్ష్యాలు. మహా అయితే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాల గురించి ఆఫీసు లో చర్చించి లేట్ గ పని ముగించి ఇంటికి చేరతమో ఒక రెండు సుప్స్ కాఫీ ఎక్కువ తాగటమో చేస్తాడు. లేదా కేంద్రం మంత్రులకి ప్రజా ప్రతినిదులకి పెంచిన జీతాల మూలం గా నిత్య జీవితం లో వాడే సరుకుల రేట్ పెరిగి జీతం పెరక్క కూసింత అవస్థలు పడతాడు. కాని ఎదుగుతున్న యవకుడు లోంస్ తీసి రెకెస్సిఒన్ పెరిఒద్ లో కూడా ఇల్లు కొని కార్ నడపను గలదు, ఫంక్షన్ కి కానీ శారద ట్రిప్ కి కాని భార్య మేడలో నేక్లసు వేయను కలదు. మరి మహారాజు అంటే ఇతను కాక మరేవాడు????!!!!

Wednesday, December 1, 2010

On Gadgets

ennaallaki ennaallaki ennellaki!! TV mogatledu intlo entaa anukuntu parigetthukuntuu vacchhaanu... intlo anthaa bane vunnara! ani dada kaassepu... hmm ponile indumulamga intha kaalam intlo kanapadakunda poyina maatala sandadi ivala thirigi modaluthundi ee TV gola leka povatam mulaanna anna aasa maroka vaipu... theeraa ee aasala panditlonchi corridor lonchi purthi ga lopalaki vacchi chuddunu kada! Hatha vidhiii TV moogaboyindi ante kaaranam idaa... anukovalisi vachindi. avunu mari okallu Desktop daggara inkokallu laptop daggara marokallu black berry tho office fone lonu nimagnayipoyaru....

Friday, October 23, 2009

శ్రీ సరస్వతి మాత

పదాల వాణి నిన్ను ఏ నామాలతో పిలువను
స్వరాల రాణి నిన్ను ఎన్ని రాగాలతో రంజింపజేయను
శ్వేతా వస్త్రధారి నిన్ను పీతాంబరాలతో అలంకరించనా
సకల జగత్తుకు మూలమైన బ్రహ్మ కళత్రా
నిన్ను ఏ కలలతో కొలువను కల్యాణి
సుమధుర భాషిణి సుహాసిని విరించి హృదయవాసిని వాసిని
విద్యాదాయినీ వినయ ప్రదాయిని విజయ కారిణి
మంగళ రూపిని మహిమాన్విత సరస్వతి
సదా నీ కృప ప్రసరించు నీ సర్వ రూపార్చన మా చేత గావించు
-- నాగిని



పల్లవించిన వాణీ పలుకుల తేనెల రాణీ
ప్రతిభా పాటవాల ప్రాజ్ఞీ సకల విద్యా ప్రదాత్రీ ప్రణామమ్ములు గైకొనుమా




హిరణ్య గర్భస్థ హృదయవాసినీ

హరి కృపా విలాసినీ హంస వాహినీ
హిమవర్ణ వస్త్రధారిణీ హాలాహరధరుని సహోదరీ
హ్రీం కార శబ్ద మూల ప్రకాశినీ
కచ్ఛపీ మము కరుణించుమా
కైతలెల్ల మాచే వ్రాయించుమా

కలములనెల్ల బ్రోచుమా కచ్ఛపీ
పలుకులను సలుపుమా వాగ్దేవీ
విద్యలకెల్ల వినుతికెక్కిన శ్రీ భారతీ
విరించి సృష్టిని లిఖించిన శ్రీ వాణీ

వాణీ పలుకుల రాణీ
చదువుల పూబోణీ
అన్నింట నొసగుమా
యుత్తమ శ్రేణీ
ధవళ వస్త్ర! తిమిర వర్ణ కురుల వేణీ


Tuesday, November 4, 2008

చిన్ని కవిత

పదమే నా పాదం
కలమే నా కాలం
అక్షర లిఖితం మనమున గీతం
అలరించే మౌన సంగీతం



అక్షర పిపాసిని నేను
అయినా అజ్ఞానినని మరువను
అద్భుతంగా వ్రాయలేను
అహో అనిపించుకోలేను
అందుకే మౌనం వహిస్తున్నాను
అందరూ వ్రాసేవాటికై ఎదురు చూస్తున్నాను
అకుంఠిత దీక్షతో నేర్చుకుంటాను
అలరించే మీ కవితల్ని ఆస్వాదిస్తాను

Friday, October 24, 2008

పదముల పయనం

నడక లో వేగం పని తో పరుగు
అలుపన్నది లేదు కనక
ఆనందం అందులోనే వుంది
కవయిత్రి నవుదామంటే పద్యాలు రాయను
కాని కలం కదిపితే పదాలు ఆగవు
కవిత అని చేపుదామంటే అది భావం మాత్రమె

Thursday, October 9, 2008

స్ఫూర్తిదాయక కవిత

పలుకులతో ఆగిపోకుండా ప్రహసనం మొదలెడదాం
వట్టి మాటలు కావు మావి గట్టి చర్యలు అని చాటుదాం
నిరాసక్తత నిస్సహాయత దరి చేరనీయక విజయానికి పోరాడదాం
నవ యువ భారతావనిని నిర్మిద్దాం
అనుభవం మాత్రమే కలిగిన రాజకీయ నాయకత్వానికి
మన జవసత్వాలు జోడిద్దాం
మన దేశ కీర్తి పతాకాలు అన్ని చోట్లా నిలుపుదాంకోట్లాది
ప్రజల కలలు పండిద్దాం

భావుకత

వీచే పువుకి ప్రాణం పోసే సూర్యుడిని కాను
నవ్వే పుష్పానికి జీవం ఇచ్చే నీటిని కాను
విరులని నిలిపే వృక్షాలు నిలబడే మట్టిని కాను
వీటన్నిటినీ అందించే హృదయాన్ని నేను
కనుకనే ఆనందాన్ని పొందుతాను
అందాన్ని ఆస్వాదిస్తాను
మంచి తనాన్ని పెంపొందిస్తాను
సంతోషాన్ని ఆహ్వానిస్తాను

నా అక్షరీకరణ

మౌనాన్ని భాష గా మార్చలేని నాడు
భావాన్ని నలుగురికీ పంచని నాడు
అక్షర కిరణాలతో జనుల తలుపు తటుతూ
నిజాల వెలుగులు నిమ్పలేని నాడు
ఈ కలం నాకు వద్దు
సాహిత్యపు తేనెలు రుచి చూపిస్తూ
స్వచ్ఛమైన మనసులు తాకే కలమే ముద్దు

తాత్త్విక చింతన

1. కరిగిపోయిన కలల మీద రాయనా కవితని
కలిసిరాని కాలం మీద కదపనా కలాన్ని
కరువైన కరుణ గురించి విప్పనా గళాన్ని
దూరమైన మంచితనం మీద వల్లించనా పాఠాన్ని
కవితల పలక మీద చెరిగిపోతున్న అక్షరాలూ
మనోఫలకం పైన నిలిచిపోయిన భావాలూ
మనవి కావనుకుని వేరయిన బంధాలూ
పలకరించని స్నేహపు సుగంధాలూ

మాపటి పూటంటి మాటున జేరగ

సాయం సంధ్యపు చీకటి చాటున దూరగ

వర్ణన లేవీ వర్ణమాలలు ఏవీ పర్ణశాలలు ఏవీ

నా పద, పద్య పాకశాలలో వీటన్నిటి మాటశాలలో!!

2. పచ్చని చీరను చుట్టిన పుడమిపై

నును వెచ్చని కిరణపు పలకరింపుతో
పక్షుల గానము వీనులవిందుగ
మన అందరికీ మనసులు నింపగ

పరుగులు ఆపీ ప్రతి లిపిని దీసీ

ప్రతినిత్యము పద, పద్యములు వ్రాసీ

పసివారికీ పాఠకులకూ కధలను అల్లీ

అవి అందించిన రచయితలకు జవాబుల మాలను పంచీ

పొద్దు గడిచాకా ఝాము దాటాకా

పడమటమ్మ నుదుటిని మొత్తం పరిచే
కమలముల నేస్తం కనుమల నుంచి జాలువారగా

మంచు బిందువుల‌ కన్నా మిన్నగ

మంచితనముతో కరిగే మనసును

కమలముల రేడు నిశి రాతిరి రాజూ

మబ్బుల మాటున దాగిన వెన్నెల


చల్లని స్పర్శ నుదుటిని దాకగ
ఇలపైనే ఇంటి వద్దనే  నిలిచే చెట్ల‌నీడన
నిదురించాలీ అనునిత్యమ్మూ
ఇవ్విధముగ సాగాలీ అనుదినమూ