Thursday, January 9, 2020

శ్రీ రామదూత

రామదూతగా కీర్తనొందినావూ
కష్టములనుండి మాకు ముక్తి నొసంగు దేవా
రక్షించుటకు సదా వేగిరమే రావా
అంజనీ సుత మా వందనమందుకోవా

శిరసా నమామి శ్రీ రామ దూత
మనసా స్మరామి మారుతి సుత
వందనాలు అంజనిగర్భ సంభూత
తోడుండుమా సదా మా చెంత

ఘనమైన పుజలు నే‌ చేయలేనో వాయునందన నీల
మేఘశ్యాముని చిత్తమందు నిలుపుటతప్ప ఓఅనిల
కుమార ఆశీస్సలీయవో అంజనా సుత మమ్ము అగాధము
లనుండి బయల్పడేవో భద్రాద్రి వాస దాసా

వైదేహి దుఃఖ నివారక ఓ వాలి సహోదర సన్నిహితా
విపత్తులు దీసివేయవో మాకు విజ్ఞాన విజ్ఞతలనీయవో
విరించి సతి శ్రీ సరస్వతీ సమాన గాత్రా విజయము
వినయము జతచేసి మాకందించవో విపణి విహారా


ఈశ్వరుని అవతారమై మాకెల్ల
ఈప్సితములను దీర్చగ
ఈ పుడమిన విలసిల్లిన
ఇక్ష్వాకు వంశాభిలాషీ
సదా హిత, మిత భాషీ
స్మిత వదన ఆశ్రిత సదనా
దిక్కులు దాటే సువేగ గమనా

సకల యుగాలందు విరాజిల్లిన చిరంజీవి
సలలితముగ కార్యములు నెరవేర్చే
సమర్థ శక్తిశాలీ సూక్ష్మ బుద్ధి శీలీ
సమరమందైన సంభాషణ యందైన
సంయమనం పాటించు సుగుణశీలీ
సద్భక్తితో మేము చేసెడి నామ
స్మరణ స్వీకరించి మము దీవించుమా




24/04, 20:21] Durgamadhuri1: సుందర హనుమను తలుచుటె చాలు
ఆనందంతో ఉప్పొంగేను మదిలో కెరటాలు
ఎన్నడు ఎరుగని ధైర్యం వద్దకు వచ్చి వాలు
అట్టి ఆ ధీశాలికి నా ప్రణామాల

శ్రీ హనుమాన్ జయంతి, శార్వరి సంవత్సరం

కొప్పునూరూ హనుమయ్యా
కొలుతుము మిము మేమయ్యా
కోరిన వరములీయవయ్యా
కోదండరాముని ప్రియ భక్తా
కోనేటి రాయని తోపాటుగా
కొండపై నిలిచినా బంటువయ్యా
కొరతలేకుండ మము చూడవయ్యా నీ
కోవెలే మాకు వైకుంఠ మయ్యా

No comments: