Friday, April 24, 2020

శ్రీ రామాయణం

పుత్ర కామేష్టితో పుడమి కేతెంచావు
పున్నమి వెలుగుల కాంతి పంచావు

దినదినమూ ఎదుగుతూ విద్యలనూ నేర్చావు
దశరథుని కంట వెలుగువై నిలిచావు

గురువాజ్ఞతో యాగరక్షణ చేసినావు
గౌతమ పత్నికి శాప విమోచనం గావించావు

మిధిలకేతెంచి మిన్ను విరిగేలా
మహాదేవ చాపాన్ని అలవోకగా విరిచావు

సిగ్గిల్లుతున్న సీమంతిని మది దోచావూ
సీతమ్మను చేపట్టి జనకుడినీ కాచావూ

భార్గవ రాముని విల్లునీ నిలువరించి
భంగమొనర్చినా భువిపైనేనాతని నిలిపావూ

కైక కొరకై కానలకేగినావూ
కనకపు సింహాసనం కాదనుకున్నావు

లలనా లక్ష్మణులు వెంటరాగా
లలితమైన అంతఃపురం వీడినావు

లాలించి ప్రజలను అందులకొప్పించినావూ
లయబద్ధంగా వనముల చేరావూ

గుహుడిని బ్రోచీ నెలవున్నావూ
గమ్యము ఇది కాదంటూ అచట నుంచి కదలీనావూ

కబంధ బాహువులను సంహరించావూ
కష్టపెట్టే వారిని ఉపేక్షించేది లేదన్నావూ

శూర్పణఖనూ సాగనంపినావూ
శూలం దండం వాడకనే

మాయ లేడికై పరుగిడినివూ
మగువను కోల్పోయి విలపించావూ

శరభంగ శబరి సేవలనందగ
సేదతీరుట నెపముతొ కృప చూపినావూ

సుందరుడైన హనుమ నిను చేరగానే
సుగ్రీవునితో చెలిమిని చేశావూ

వాలిని పడగొట్టి క్షాత్ర ధర్మం నిలిపావూ
వరమునాతనికొసగీ మోక్షమునిచ్చావు


చూచితిని సీతను అంటూ హనుమ
చెప్పినది విని పొంగిపోయి నావు

వారధిని కట్టించీ లంకను చేర
వానర సేనతొ సాగినావూ

కళత్రము కొరకై కయ్యమందినావూ
కదనరంగమున ధీరుడవై నిలిచావు

రావణుని నిలువరించినావూ
రాఘవుల బలము తెలిపినావూ

భరతునికై త్యాగమొనర్చగలవీవూ ఆ
భ్రాత కొరకే‌ రాజువైనావూ

సాయం చేయ వచ్చిన వారందరికీ
సగౌరవ స్వాగతం చూపావూ

సాకేతధామా సరళ హృదయా
సేవలు చేయగ‌ రాలేని మము

నీ భక్తుల దయ చూడుమయ
నీరజపత్రేక్షణ నీలమేఘ శ్యామా


భద్రపురినివాసా మా భక్తి నీవు గొనుఁమా
తన్మయత్వముననే తరియించు పాట వ్రాయుచుంటీ
నిన్ను గొలుచు భాగ్యం నీరజాక్ష నాకు ఈయమంటీ
నిక్కమైన నిధియన్న నీదు నామమయ్యా...

తక్కువేమి మనకూ ట్యూన్ లో అల్లుకున్నాను

No comments: