5.
4.
ఆటవెలది
ఎన్ని యాపదలకు ఎదురీది నిల్చెనో
తెలిసికొన్న మనసు తేలియాడు
కట్టడమును గట్టినట్టి పట్టును జూసి!
దండకమ్ము వ్రాసి దండమిడుదు
తెలిసికొన్న మనసు తేలియాడు
కట్టడమును గట్టినట్టి పట్టును జూసి!
దండకమ్ము వ్రాసి దండమిడుదు
3. ఆటవెలది
నీటి మీద తేలి నిలుచు నిచట నున్న
యిటుక రాళ్ళు! ఏమి కిటుకు వాడి
గట్టి నారు రాజు గణపతి సేనలు
పట్టుఁ దప్పకుండ! భక్తి మీర
యిటుక రాళ్ళు! ఏమి కిటుకు వాడి
గట్టి నారు రాజు గణపతి సేనలు
పట్టుఁ దప్పకుండ! భక్తి మీర
2. ఆటవెలది
కాకతీయ రాజు కళల యభిరుచిని
దెల్పునట్లు గాను దిద్ది రిచట
నునుపు రాతి తోడ ననిల నయనుడగు
పరమ శివుని! శిల్పి! భక్తి మీర
దెల్పునట్లు గాను దిద్ది రిచట
నునుపు రాతి తోడ ననిల నయనుడగు
పరమ శివుని! శిల్పి! భక్తి మీర
1.తేటగీతి
శిల్పి నామమ్ము నే పేరు నిల్పుకున్న
ఆలయమ్ము రామప్ప దేవాలయమున
శివుడు విష్ణువు లిరువురు జేరి నిలచు
దృశ్యమును గన్న చాలును హృదయమునకు
ఆలయమ్ము రామప్ప దేవాలయమున
శివుడు విష్ణువు లిరువురు జేరి నిలచు
దృశ్యమును గన్న చాలును హృదయమునకు
No comments:
Post a Comment