Sunday, September 22, 2024

అంబపై ఓ పాట. ఈవేళ

 అమ్మా అమ్మా మాయమ్మా

అందఱి బంధువు నీవమ్మా ||అమ్మా||


కొండలు కోనలు తిరిగేనమ్మా

లోయలు బాగా వెతికేనమ్మా ||కొండలు||


ఏ ౘోటను నే గనలేదమ్మా

మూలము ఏదీ దుర్గమ్మా ||ఏ ౘోటను||


కడలిని మించిన కారుణ్యం

దయ ౘూపెడి నీ సౌజన్యం ||కడలిని||


తిరిగీ వెదకీ అలిసాకా

తల్లీ నీ వడి చేరితినే ||తిరిగీ||


అప్పుడు అవగతమైనదిగా

అమ్మా నీ వాత్సల్యపు మమత ||అప్పుడు||


గమ్యము చేరితిగా యింకా

గుబులే లేదూ గౌరమ్మా ||గమ్యము||


వసుధనె నేనూ నిలచిననూ

నీ మణిద్వీపమె అది నాకూ ||వసుధనె||


భక్తిగ ఎౘటను బ్రతికిననూ

భగవతీ నిను చేరిన మాటే ||భక్తిగ||

No comments: