Tuesday, September 24, 2024

దేవుళ్ళపై పాట

సిగలో గంగను కల దేవా
సగ భాగము సతికిచ్చేవా ||2||

భగభగ మండే నిప్పులనే
నగవులతో ౘల్లబరచేవా

నిగనిగలాడే నాగులనూ
దిగనీయక పైనెట్టేవా

కొండలపైనా కొలువుండీ
యండై మాకూ నిలచేవా

తెల్లని ౘల్లని మంచులకూ
అంౘున తపమును చేసేవా

గ్రీష్మము శిశిరమూ ఒక ౘోటే
ౘక్కగ పెట్టిన హర శంభో

ప్రణతులు గొనుమా మల్లన్నా
దోషములెంౘక తండ్రి వలె







అంజని పుత్రా హనుమంతా
అందఱి లోనా బలవంతా

ఆపద వేళన నే గానీ
ఆఖఱు నిముషము నే గానీ

నిను దలౘుట నే మరచిననూ
నా రక్షకు నీవు నిలచేవూ

సంతోషానా హనుమయ్య
స్మరణము మానిన అనవయ్య
దోషము నాదని ఓ దేవా
తోడై ఉండే హనుమయ్యా

ప్రణతులు గొనుమా రామదూతా
ప్రార్థన నీకే చిరంజీవా

No comments: