Thursday, January 23, 2025

కాకినాడ సాహిత్య సాంస్కృతిక కళా వేదిక పోటీ కొఱకు:

కాకినాడ సాహిత్య సాంస్కృతిక కళా వేదిక పోటీ కొఱకు:

ఈ పద్యములు పూర్తిగా నా స్వీయ సృజన, దేనికీ అనుకరణ కాదు, అనుసరణా కాదు, ఎవఱినీ కించపరౘటానికి వ్రాసినది కాదు, ఎక్కడా ప్రచురణకు కానీ, పరిశీలనకు కానీ పంపబడలేదు అని హామీ ఇస్తున్నాను.

ఉత్పలమాల 

అక్షరమన్న జాతికది యమృత భాండము నేర్పు యానమున్

శిక్షణ వేఱదేల మన్ని చిన్న దలంపును గూడ వ్రాయవౘ్చునే

లక్షణమైన సంపదలు రక్షణ రేఖలు మానవాళికిన్

దక్షత నేర్పి లక్ష్యముకు దారిని ౘూపు జయమ్ము గూర్చునే

అక్షము పారనీదు మనకాపద చేసెడి వారినుంచి తా

నక్షిణియై సదా శ్రియము హ్లాదము మోదమునందజేయునే

పక్షములుండు చందురుని పట్లను గాని మధించినన్ మదిన్

వృక్షము వంటి సూక్తులను వృద్ధియె దక్కును సాహితీ సిరుల్.


అక్షము = పాచిక, యక్షిణి = దేవత


మత్తకోకిల ర స‌జ జ భ ర యతి 13


సాహితీ సిరులన్ పఠించిన గల్గు జ్ఞానము తీరునే

దాహమంత వసుంధరన్ బ్రతికించు దారి ప్రాప్తమై

మోహమే యిక పారిపోవుగద విమోచనమందునే

దేహమున్నను దేనిపైనను రాదు తీపియు నిక్కమే.

No comments: