శ్రీ మాత్రే నమః
మనకందరికీ ఎంతో నచ్చిన పీడలు ఒకటైన శిరావెన్నెల గీతారామశాస్త్రి గారి గురించి చెప్పాలంటే ఓ గ్రంథం సరిపోదు.
వారిని దగ్గరగా చూసిన వారికి అంటే ప్రత్యక్షంగా కాదు, పాటల ద్వారా..
ఒక విషయం స్పష్టమవుతుంది.
"ప్రతిగీతలోనూ ఉన్నది ఒకటే భావన ప్రతి జీవి లోనూ ఉందని ఒకటే పరమాత్మ అన్నట్టు. సందర్భానుసారంగా పగల నుంచి రే అయ్యేవరకు వచ్చే రోౙులను సమయాల లాగే పాటలోని ప్రస్తావనలు ఉంటాయి అంతే. నిౙానికి జీవితం కూడా అంతే." అన్నదే ఆ సారం.
ఇదే ఉద్దేశంతో, వారి ప్రతిపాటని వివరించే సాహసం నేను ఎప్పుడు విడిగా చేయలేదు.
కానీ, మహామహులు కూడా ప్రస్తావించే "ప్రాగ్దిశ వేణియ" అన్న పదము, భావన - నాకు సాహిత్యాన్ని బాల్యంలో పరిచయం చేశాయి.
అలా అలా వింటూ వచ్చిన వారి పాటలలో, ఇన్నేళ్ళయినా వన్నె తరగని ప్రతీ పూవుల మాల లోంచీ, ఓ అక్షర కుసుమం పై నా ఈ ప్రత్యేక విశ్లేషణ.
"భరత వేదమున నిరత నాట్యముగా" పాటలో, "నీలకంధరా ౙాలి పొందరా, కరుణతో నన్ను గనరా, నేల కందరా శైల మందిరా, మొర విని బదులిడరా" ఓ ప్రత్యేకతను కలిగి ఉంది.
శైలము కలిగినదా శైలి అంటే, ఎందుకంటే, "శిల" అంటే కదలనిది, అచలము.
ఇక్కడ మంౘు పర్వతము కదులుతూనే ఉంటుంది, కారణం, హరుని శిరము నున్న జలనిధి గంగమ్మ పారటమో, లేదా భస్మ నేత్రము నుండి ౙాలు వారే అగ్ని తాపమునకు వెండి కొండ నుండు మంౘు కరగి పౌవటమో కాదు!
"Larger than Life" అనబడే గురువు గారి గీతాలలోని సారమూ, నా మనసు లోని భావమూ, "శైలమూ" అంటే, స్వామి శంభుని కరుణతో భక్తుల కడకు చేరి పోయే గుణము.
"శంకరా!" అనగానే, "శరణూ" అన్న ఆర్తి అన్నా విన్నాడో లేదో కానీ, ఆ ఆక్రందన పూర్తయే లోపలే స్ఫూర్తి యై మూర్తీభవించిన దయా సముద్రుడు, ఈ "తాపసి".
అందుకే, "శైల మందిరా" అంటే, అక్కడి "తాపసి" నేలకు, నేల మీది వారికీ తప్పకుండా " అంద"టమే "అందమని" కదా!
నల్లని/ నీల వర్ణపు మెడగల నీలకంధరుడు, ౙాలి పొంది, కరుణా రసమనే శైల మందిరం నుంచీ నేల కంది, మన మొరలకు బదులీయాలన్నమాట!
ఎంత గొప్ప భావన! ఎంత ౘక్కగా అల్లబడిన విన్నపము!
మన మనవులను మహేశునికి గురువు గారు చెప్పేశారు కనుఁక, ఇక మన పనేమీ లేదు, గురువు గారికి "ధన్యత"ను తెలపటం తప్ప!
మాఘమాసమారంభమయే వేళ, సూర్యనేత్రుని స్తుతింౘుకుంటూ,
"శరణు శరణు సురేం
ద్ర సన్నుత, శరణు శరణు శంభో శంకర".
No comments:
Post a Comment