బిడ్డ కంటి నీరు వేదన తల్లికి
కనుక పలుక దెపుడు కఠిన వాక్కు
యుల్లి పాయ సేయు నుపకారముర కన్ను
తుడిచి మేలొనర్చు తొలచు దుమ్ము
బిడ్డ కంటి నీరు వేదన తల్లికి
కనుక పలుక దెపుడు కఠిన వాక్కు
యుల్లి పాయ సేయు నుపకారముర కన్ను
తుడిచి మేలొనర్చు తొలచు దుమ్ము
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కీర్తన లోని మూడవ చరణము పై. చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి కీర్తన ఇది
కొండలలో నెలకొన్న కోనేటీ రాయడు కీర్తన పై
అన్నమయ్య పై
1. హరిగతి రగడ
పద్యము వ్రాయుట రాదను బాధనె బాపెడి యొజ్జకు వందనమిచ్చెద
విద్యను నేర్పుచు ముందుకు సాగెడి వేల్పుకు భక్తిగ వందనమిచ్చెద
గద్యము చెంతనె యాగెడి వారిని గాచెడి నౌమకు వందనమిచ్చెద
నాద్యులు తానయి జ్ఞానము పంచెడి యార్యులకెప్పుడు వందనమిచ్చెద
2. ఉత్సాహము
విద్య నేర్పుటందు లేదు విసుగు గురువు కెన్నడున్
ఉద్యమమ్ము గాదు తనకు నూపిరనుచు సాగుచున్
హృద్యముగను బోధ సేయు మృదుల గురువరేణ్యుకున్
పద్య రచన తోడ దెల్ప వలయు వందనంబులున్
3. ఆట వెలది
విద్య నేర్పుచుంద్రు విత్తము గోరరు
తాను వ్రాయుటైన మాని వేసి
శిష్య గణము కొఱకు స్థిర చిత్తులగుచుందు
రట్టి గుఱువు కిత్తు అంజలులను
4. ఆట వెలది
పద్య విద్య మాకు పంచుట కొఱకయి
బృంద మొకటి గూర్చి వృక్షమల్లె
బెంచు టొకటె గాక బిడ్డల వోలెను
సాకు చుండె మమ్ము సద్గురువుగ!
శారదాంబకు ప్రియ సుతుఁడు ఛంద బృంద నేతయౌ
శారద మాతకు ప్రియమగు సుతుఁడు ఛందము బృందము నడిపెడు నేతయౌ
కోరిన
శారదాంబ ప్రియసుతుండు ఛంద బృంద నేత మా
భారమున్ వహించి విద్య పంచు యొజ్జ గా తనన్
కోరినంత చేత మాకు
చేరదీసి యాదరించు
గోదారమ్మ వడి తన బడి
గోదారమ్మ వడిని పెరిగి
భూదేవి వలె సహనమును మోయుచు
శారదాంబ సుతుఁడు మనకు ఛందములను నేర్పునే
భారమున్ వహించి విద్య పంచు జ్ఞాన దీప్తి యే
సారసముగ జెప్పుటందు సహన శీలి
కీర్తి కాంక్ష లేదు కలిమిని గోరరు
యోర్పు తోడ నేర్పు యొజ్జ తమరు
ఋణము దీర్చ లేను
3. విద్య నేర్పు తారు విత్తము గోరరు
తాను వ్రాయుటైన మాని వేసి
శిష్య గణము కొఱకు స్థిరచిత్తము తోడ
నిల్చి యుండు గురువు! నిగ్రహ మూర్తి
4. పద్య విద్య మాకు పంచుట కొఱకును
బృంద మొకటి గూర్చి వృక్షమల్లె
బెంచు టొకటె గాక బిడ్డల వోలెను
సాకు చుండె మమ్ము సద్గురువుగ!
5. సాహితీ జగమం దుబంధు
ఛంద బృంద సభ్యులమే
శిక్షణ దక్షిణ పక్షము శిక్ష
శిక్షణ నిత్తురు పద్యము
వేలు ద్రుంచి ఇద్దమన్న ఏకలవ్య గానయా
వేల ధనము బోదమన్న ప్రియము గాదు మీకునున్
కలము బట్టి దక్షిణిత్తు గవనములను! దీక్షనే
ఫలము సతము బూని వ్రాసి పద్యములను దేవరా
అది 2005వ సంవత్సరం. రెండు దశాబ్దాల నా కన్నవారి కృషికీ, నేను కన్న కలల కోసం ఇష్టంగా పడ్డ కష్టానికీ, నాపై నేను, నా వారు ఉంచిన నమ్మకానికీ ఫలితం దక్కిన తరుణం.
నేను కోరుకున్న ఉద్యోగం వచ్చిన సంవత్సరం. ఉద్యోగానికై వ్రాత, మౌఖిక పరీక్షలకు వెళ్ళే ముందు నేను మా అమ్మ వంక చూడగానే తను అన్న మాట, ఆ కలియుగ నాయకునిపై భక్తి చెదరనీయకు, నీ ఆత్మవిశ్వాసాన్ని ఆ స్వామి చెదరనీయరు అని. నాకు బాగా అలవాటైన మా ఇంటికి దగ్గర లో ఉన్న ఆ స్వామి కోవెలకు వెళ్ళే సమయం కూడా లేదు, ఎంతో దూరంలో ఉన్న పరీక్షకు బస్సులు మారి మరీ చేరాలి మరి! అయినా స్వాభి లేనిదెక్కడ, అందరి ఆత్మలోనూ ఉన్నది ఆ సర్వాంతర్యామే కదా, దిగులేలా యని ఒక్కసారి కన్నులు మూసుకుని స్వామి దివ్య మంగళ రూపాన్ని స్మరించుకుని పరీక్షకు చేరుకున్నానూ, ఆ స్వామి దయతో ఉద్యోగాన్నీ పొందాను.
మా నాన్నగారికి మొదట అర్థం కాలేదు, నాకు అంత పెద్ద ఉద్యోగం వచ్చిందని! కానీ ఆ స్వామి ఆశీర్వదించారంటే నా భవిష్యత్తుని తను అంత ఉన్నతమైన స్థాయిలో వ్రాసినట్టే కదా!
అటు తరువాత స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుందామని పరుగు పరుగున తిరుపతికి పయనమై వెడితే చూడాలి స్వామి దయ! కాలినడకన కొండ ఎక్కిన అరగంటలోనే దర్శనమిచ్చేశారు స్వామి! ఆ దివ్య మూర్తి! అందరూ ఎంతో సమయం వేచి ఉంటే కానీ దొరకదన్న ఆ స్వామి దర్శన భాగ్యం మాకు మాత్రం నిరీక్షించే అవకాశం రాకుండానే దక్కింది. ఆ క్షణం నా ఆనందానికి హద్దులు లేవు, ఆనందాన్ని వర్ణించటానికి అక్షరాలూ చాలవు. ఆ తర్వాత మాడ వీధులలో నడుస్తుంటే ఒక యోగి రూపంలో దర్శనమూ, ఆశీర్వచనమూ లభించాయి, ఇక మాకెవ్వరికీ అక్కడ నుంచీ కదిలి తిరిగి ఇంటికి రావాలి అనిపించలేదు.
అది మొదలు, విడువకుండా స్వామి దర్శనానికి మరల మరల వెడుతూనే ఉన్నాము, అంతటితో ఆగలేదు.
శివునిలో శక్తీ, నారాయణునిలో నళిన దళేక్షణ, బ్రహ్మ లో భారతీ ఐక్యమవటమంటే - ఆత్మ పరమాత్మతో ఏకమశటమే అంటారు.
అలా నేను నాకు సర్వస్వము అయిన నా పతిదేవునితో ఏడడుగులు వేసింది కూడా ఆ ఏడుకొండల ఏకస్వరూపుని సన్నిధిలోనే. అంగరంగ వైభవమైన వేడుకలేవీ వద్దు, ఆ అలమేలు మంగమ్మ స్వామి సన్నిధియే నాకు మక్కువ అని ఆ నారసింహుని జయంతి రోజున ఆ తిరుమలలోనే నా పతిదేవులతో ఏడడుగులూ నడచి, వివాహమైన వెంటనే స్వామి వారి నిజరూప దర్శన భాగ్యం కూడా పొందాను.
ఆ స్వామి దీవెనతో పండంటి బాబుని కని, ఆ పసివాడికి కూడా ప్రతి యేటా ఆ దివ్య మంగళ సవరూపుని దర్శనం చేయిస్తున్నాం. అంతే కాదు, మా బాబుకి ఎంతో చిన్న వయసు నుంచే ఆ తిరుమల సన్నిధి లోని మాడ వీధులలో... ఆ కోనేటి రాయని నమ్మిన బంటు, భక్తుల పాలిటి కల్పతరువు అయిన ఆ రామదూత తిరుగాడిన చోటనే తనూ సంచరించే వాడు.
ఒక్క దర్శనమొందే వేళ తప్ప... మిగిలిన సమయములో, అర్థరాత్రి అయినా సరే, చలికి జ్వరము వచ్చినా మా బాబు లోపలుండి నిద్దరోవటం ఇష్టపడడు మేము ఆ తిరుమలలో ఉన్నత సేపూ... ఇదంతా ఆ స్వామి కరుణ గాక మరేమిటీ అనిపిస్తుంది.
గురువులకు, పెద్దలకు ప్రణతులతో... నేను వ్రాసిన పద్యములకు సవరణలు సూచించి సరైన రీతిలో వ్రాయించిన వరలక్ష్మమ్మ గారికి సవినయ పూర్వక కృతజ్ఞతలతో...
శక్వరీ ఛందము, పరమేశ వృత్తమునకు పద్యములు
స,న,జ,భ,గగ గణములు, యతి 10వ అక్షరము
1. త్రిపురాసురుల హరించి దివ్యుల కెల్లన్
రిపు బాధలచెర దీర్చు పృశ్నివి నీవే
యపరాధులను వధించు నాశ్రిత పక్షా
యపమృత్యువు దొలగింపుమా పరమేశా
పృశ్ని = వెలుగు
2. సిరి సంపదలను గోర చిన్మయ రూపా
కరుణించుమని భజింతు కాముని వైరీ
యరులెల్ల గలుగ జేయు నాపదఁ దీర్పన్
అరుదెంచి దరికి రావయా పరమేశా
3. కలనైన విడువనయ్య కల్మష నాశా
యలుపన్నదెఱుఁగకుండ నార్తిగ నిన్నే
తలతున్ మది నిరతంబు తాండవ రూపా
మలినంబులు దొలగించు! మా పరమేశా
4. భయ నాశము గలిగించు పార్వతి నాథా
లయకార! నిను నుతించు రాగము దీయన్
నయమౌను వెతలు రోదనల్! మరి వేరౌ
నియమంబులను త్యజింతు నే పరమేశా
5. ఎదురీత నెఱుఁగ నయ్య యీశ్వర! దేవా
మదిలో వ్యథలు జనించె; మాపుమ బాధల్
నిధులేవి యడుగ నేను నిశ్చల రూపా
హృదిలోన నిలుపుకొంటి! హే పరమమేశా
[08/02, 12:40] Durga Madhuri:
వేద భాస్కరుగనిలను వినుతికెక్కి
వేద ధర్మము నంతటా వెలువరించి
వేద రక్షణ సల్పెడి వేద రత్న!
వందనంబులివియె మీకు వాణి పుత్ర!
భాష్య సూత్ర పరిచయముల్ వ్రాయు మీరు
జ్ఞాన దీప్తి పంచిరిలను జ్ఞాన మూర్తి
మహిని మానవోత్తమ మీకు మాదు చేత
వందనంబులివియె మీకు వాణి పుత్ర!
బుగ్గ నీలమ్మల సుతుడ! బ్రోచినారు
నేడు ధర్మ సూక్ష్మ విషయ నీతులెల్ల
మాకు తెల్పుచు; సహృదయ! మాకు యొజ్జ!
వందనంబులివియె మీకు వాణి పుత్ర
నాల్గు వేదంబు లొక తావి నందు జేర్చి
దివ్య వేదవాణి గ్రంథము దెచ్చి జనకు
హితము కొఱకుఁ పాటుపడు స్నేహితుని కిత్తు
వందనంబులివియె మీకు వాణి పుత్ర!!
యజ్ఞ యాగముల్ జేయుచు యులుపెఱుఁగక
ప్రజకు సిద్ధాంతములనన్ని పరిచయములు
చేసి వారి హృదులనిలచిన ఘనుడవు
వందనంబులివియె మీకు వాణి పుత్ర!
వేద యుపనిషత్తుల నేర్చి వేగిరమ్మె
యెదిగినారు జీవితమందు యేకవీర
వోలె నిలిచి తీర్చిరి మమ్ము వున్నతంగ
వందనంబు లివియె మీకు వాణి పుత్ర!
పామర జనులైనన్ వొంద వచ్చు మీరు
వ్రాయు భాష్యముల్ జదివిన! భరత మాత
ముద్దు బిడ్డ! యజ్ఞానము మోకరిల్లె
వందనంబులివియె మీకు వాణి పుత్ర!
జాతి భూషణ! జనహిత! జయము కలుగు
గాక మీకు వేదోద్ధార! గైకొనమని
మా ప్రణతులు వినయముగ మనవి జేేేతు
వందనంబులివియె మీకు వాణి పుత్ర
గ్రంథములను వ్రాసి జనుల కరమునందె
నిలిపి జ్ఞాన సంపద వారి నేస్తమైరి
తీర్చుకొనలేము ఋణము యో దీప కళిక!
వందనంబులివియె మీకు వాణి పుత్ర
10 December 2010:
=================
Let the Almighty give bad days
I will not sit down showering the bays
Let me grow looking into more ways
That will shine in my life with the hays
After all efforts is what I pay
The ones which I carry with a hope ray
స భ ర ||U U|| U|U
ఝటమున గంగా ప్రవాహము శిరమున శశీ ప్రకాశము
చాల లేదా భిక్షపతీ నీకు
పుష్పము లేల నయ్యా నిత్య అభిషేకీ
కైలాసమంతా కపాలమ్ములే
సుగంధములున్నవా సదా భస్మమే
తప సర్ప జ్వాలల ఉష్ణము
హిమ చంద్రుల తెల్లని చల్లదనమూ
అన్నింటి మిశ్రమం నీ ఆశ్రమం
ఆయువు కోరిన వారికిచ్చేవు ఆశ్రయం
అట్టి చిత్రములెల్ల గనీ
అచ్చెరువొందుట మా వంతూ
ఫణులెల్ల నుండును నీ ఇంట
ఇక చోటేదయ్యా వాటికింకెచటైన
నీ పత్ని కురులట నీ కంఠ సిరులట
నీదు జ్యేష్ఠునికి యజ్ఞోపవీతం
పిమ్మట కనిష్ఠునికీ ఆతని పత్నకీ అవేగా రూపం
కాదే మానస నీదు పుత్రీ నాగాభరణా
కుండలినీ శక్తికీ వాసం పన్నగమే
నంది నీ వాహనం సింహం నీ సతిదట
మూషిక మయూరాలూ అచ్చటే ఉండునట
ఆహా ఏమి వింతలయ్యా శివయ్యా
ఎంత చతురత నీదయ్యా
వ్యాఘ్ర పూజిత నీ అర్థాంగీ
శార్దూల చర్మమ్మె నీ ఆసనం
సమస్త జీవరాశి ఇలా నీ పరం
ఇంక కుసుమాలకేదయ్యా స్థానం
1.
*మొదటి శ్లోకము .*
*స్మరహరుభామ! నీదుమహిమన్ సరవిన్ సరిగా గణించి యే*
*ర్పరుపగ నెంతమేటి యొకపాటియ యెంతటియత్నమున్న నీ*
*శ్వరి! ఎగయించె గాంచిపురసౌధవిహారవిశారదా! మనః*
*పరమవిపాకమేదొ నఠను ద్వచ్చరణస్తు0ఠతిజల్పనమ్ములన్.*
ఓ కాంచీవిహారరసికా! నీమహిమమార్గమిట్టిదని నిర్ణయించుటకు ఎంతవాడును సరికాజాలడు. ఐననూ నా మనఃపరిపాకమేమోగాని నీ పాదములను కొనియాడుటలో నన్ను వాచాలుని జేయుచున్నది.
కాంచి పురవిహారీ! నీదు
దివ్య మహిమలు! తెల్ప గలమ
/*కాంచి పురవిహారీ! తెల్ప గలనె నీదు మహిమ
నీదు చరణముల స్మరణే మాకు వెలుగమ్మ
కల్ప తరువు మంకెన పూవు కాంతులు చాలక
వైర మొందు వెలుగుల రాణీ ప్రణతి దుర్గ */
/*చిత్తరువు నిను వర్ణన సేయలేదు జనని
మానస మునందు యాతృతే మరిలేదు శక్తి */
కాంచి పురాధిప నీదు
నా పద్యము final version
తెలుప తరమ తల్లీ నీదు దివ్య మహిమ
లెన్ని యో! యెట్టివో! గద నెంచి చూడ
వర్ణనలు సేయ గలమ యో వైజయంతి!
భక్తురాలిగ నీకిదే ప్రణతి దుర్గ
2. శ్రీ మన్నందన వాటికా కిసలయ