Thursday, July 15, 2021

పద్యాంశములు

 పద్యభారతి వారు ఎంపిక చేసిన పది అంశములు వీటిలో మీకు నచ్చిన నాల్గు అంశాలతో ఒక్కోదానికి అయిదు పద్యాలను వ్రాయండి.

1.దైవ ప్రార్థనలు

2.  తెలుగు భాషా ఛందస్సు

3.  హేమంత ఋతువు

4 . ప్రపంచ శాంతి

5. పద్య పరిమళం.

6. తెలుగు పెళ్లిళ్లు

7.తెలుగు సినిమా

8.అవధానం -అంశాలు

9.నవరసాలు

10. పద్య భారతి.


1. దైవ ప్రార్థనలు


[24/05, 13:47] Durga Madhuri: 


మేదుర దంతము


మానస మందున మంగళ దాయిని మాతను గొల్చెద మంత్రము తోడను

దీనుల బ్రోచెడి తీయని పల్కుల దేవత; బాధను దీర్పెడి తల్లిని

గానము జేసెద కాంచి నివాసిని కష్టము బాపెడి గౌరిని దల్చెద

భాను రథంబున భాసిలు రేఖగు భ్రామరి దేవిని భక్తిగ నిత్యము


*మేదుర దంతము, 8 భ గణమూలు, 5వ గణము మొదటి అక్షరము యతి*

[24/05, 13:49] Durga Madhuri: 


మానిని


మానస మందున మంగళ దాయిని మాతను గొల్చెద మంత్రముతో

దీనుల బ్రోచెడి తీయని పల్కుల దేవత బాధను దీర్పుననిన్

గానము జేసెద కాంచి నివాసిని! కష్టము బాపెడి గౌరివనిన్

భాను రథంబున భాసిలు రేఖగు భ్రామరి దేవిని భావనతో

మానిని వృత్తము 7, 13, 19 యతి స్థానములు, 7 భ గణములు, ఒక గురువు*


అశ్వగతి


మానస మందున స్కందుని మాతను గొల్చెద నే

దీనుల గాచెడి బాధలు దీర్పెడి తల్లిని నే

గానముఁ జేసెద నిత్యము గౌరిని కీర్తనతోన్

భానురథంబున భాసిలు భ్రామరి నే గొలుతున్



*పద్మనాభ వృత్తము: 7 తగణములపై 2 గురువులు, 5వ గణము మొదటి అక్షరము యతి*


శ్రీమాత నీనీడ మాకిమ్మ మాయమ్మ! ఛిద్రూపి! నీ దివ్య నామంబె గాచున్

ప్రేమార నీదృష్టి మాపైకి సారించు  వింధ్యాద్రి పైనుండి! ముల్లోక పూజ్యా

గ్రామంబు లందుండి నిత్యంబు రక్షించి కామ్యంబు లన్ దీర్పు వేల్పంచు మమ్మున్

శ్రీమంతులన్ జేయు సౌభాగ్య రూపంబు! సేవించు భాగ్యమ్ము నందించుమమ్మా


స్రగ్విణీ


తల్లి!నే నెప్పుడున్ దల్తునిన్ భక్తిగన్

మల్లెలే యల్లెదన్ మాలగా బేర్మితోన్

బల్లవించున్ సదా భక్తి పాటల్ మదిన్

జల్లగా జూడుమా శాంభవీ! మమ్మిటన్


పద్య పరిమళము


[30/07, 12:55] Durga Madhuri: 


1. *ఆట వెలది*


తెనుగు భాష నందె తీయనౌ పద్యముఁ

గలదు! చదివినంత గలుగు మదిని

హర్షమెపుడు! గణము యతులు ప్రాసను గూర్చి 

ఛంద మనుసరించి! సాగ వలయు


2.

[30/07, 15:47] Durga Madhuri: 


2. *తేటగీతి*

తొమ్మిదవ శతాబ్దమునది తొలుత దొఱికె

శాసనమ్మున తరువోజ ఛంద పలుకు

యుద్ధమల్లుకాలమున నిబద్ధమాయె

నైదు సీస పద్యమ్ములు! నందె మనకు


3.

[31/07, 12:58] Durga Madhuri: 


3. *తేటగీతి*


వృత్తపద్యములు దొఱకె వేల యేండ్ల

నాడె! కామసానుల శాసనమ్మునందు

జూడ దెనుఁగున పద్యము జాడఁ అగణ

ఘనచరితగలదని! పూర్వ కథలు దెలిపె


4.

[02/08, 09:26] Durga Madhuri: 


4. *తేటగీతి*


శృతి లయలతోడ గానము చేయునట్లు

నొక సరళ రీతిన నడుచును కవనములు

పద్య మునకు ఛందమనెడి ప్రక్రియ యొక

అందమును గలిగించెడి యమృతపాణి!


5.

[02/08, 09:26] Durga Madhuri: 


5. *హరిగతి రగడ*


భక్తకవీశుడు పోతన వ్రాసెడి పద్యము పూరణ సేయుట కొఱఁకను

రక్తిగ పుడమికి వచ్చెను యారఘు రాముడు స్వయముగ! గావున గోరను

ముక్తిని! దెనుఁగను భాషను నేర్చెడి బుద్ధిని మాత్రము నిమ్మని! అమ్మను!

శక్తిని వేడెద! నిత్యము పద్యము చదివెడి వరమును యొసగిన చాలును!




తెలుగు భాషా ఛందస్సు

1. ఆటవెలది

పాదములకునుండు పద్యలక్షణములు
దెలుపు శాస్త్ర మదియె! తేనెలూరు!
ఛందపరిమళమ్ము సన్నజాజికి మల్లె
వోలె నల్లుకొనుచు! నేలె సతము


2. ఆటవెలది
దెనుఁగు భాష సాహితీ ప్రక్రియను! జూడ!
యతులు ప్రాస తోడ! యలరుచుండు!
వదల కూడదిట్టి బంగరు సంపద!
భాషయందమపుడె! పరిఢవిల్లు

3. ఆటవెలది

ఐదు పదుల నుండు అక్షరమాలను
ఖైదు చేయవచ్చు కైతలందు
ఛంద శాస్త్రమునకు జతను జేరి వెలుగు
పద్య నామమంది! హృద్యమగును



4. ఉత్సాహము


తేట దెనుఁగు భాష జూడ తేనెలూరు దీయగన్

తేటగీతి గణము లందు దినకరసుర రాజు లన్

యాటవెలది నందు గూడ యార్క యింద్ర ములనిటన్

బాట వోలె గూర్చినంత బల్లవించు పద్యమే


5. తేటగీతి

తేట దెనుఁగున ఛందముతీపి వనరు
పద్యమునకు సొగసునిది పంచి యలరు
గురువు లఘువు తోడ గణముగూర్చ వలయు!
ప్రాస లుయతులు తోడుగపల్లవించు


విశ్వశాంతి


5.  ఆటవెలది

జనన మరణ ములనుచక్రమునందున
చింత పడుచు తిరుగు జీవులకును
పగలు పంతములనుసెగలు మోయగ నేల
కసిని విడచి నంతగలుగు కలిమి



4. ఉత్సాహము

విశ్వశాంతి కొఱకు సలుపువేరు యత్న మేలనో
యీశ్వరుండు యొక్కడనుచుహృదయమందు నిల్పుచున్
విశ్వసించినంత దక్కువిజయపథము సర్వదా
శాశ్వతముగ ధరణిపైనశాంతి నిలుచు! సత్యమే

3.

ఉత్సాహము
నీరు నిప్పు గాలి నేల నింగి దారి జూపురా
కారు మబ్బు మధ్య మెఱయు కాంతి వోలె మెలగరా
దారి తప్పు దీనులకును దన్నుగా నిలువుమయా
ధీరుఁడౌదువపుడె నీవు తేనె వోలె పలుకుమా

2.

పోరు పొక్కు మఱిచి సతము పొందు గోరు మేలయా

వేరు భావమెపుడు లేక విఱుపు మాట వీడుమా

చేరువైన చెలిమి నెపుడు చీదరించబోకుమా

భారమౌను బ్రతుకు పరుల బాధ పెట్టినంతనే

1.

ఆటవెలది
సాటి వారి పట్ల సానుభూతి గలిగి
మసలు కొనుట మేలు మర్త్యులకును
కష్టమెవరి దైన కలిసి గెలువవచ్చు
జగతి సత్యమిదియె జయముఁ గూర్చు

Wednesday, July 14, 2021

పద్య భారతి

 * ఉత్సాహము: 7 సూర్య గణములు, 1 గురువు, ప్రాస కలదు, యతి 5వ గణము మొదటి అక్షరము*


అరుణ కాంతి వేళ నతఁడు నామె చేయి పట్టి నీ

బరువు బాధ్యతలను మోయుఁ బంధమౌదు ననుచు తా

విరహ మింక తాళలేక వేడుచుంటి నిన్నిటన్

సరస మాడుకుంటు తెలిపె సఖుడు మదిని వలపు తోన్


*తొలకరి వర్షం*


*కందము*


తొలకరి చినుకుల్ కుఱియగ

నిలపై  నిండెను చెరువులు నింపుగ జూడన్

పొలముల పంటలు పండెన్

బలిమిగ; హాలికులకెల్ల ఫలములుఁ బంచెన్


*చంపకమాల*

*న, జ, భ, జ, జ, ర 11వ అక్షరము యతి,  ప్రాస యుండును, ప్రాసయతి చెల్లదు*


సురమునిపూజ్య! మాగృహముఁ శోభల నింపె మడి భాగ్యదాయివే!

సరసిరుహాక్షి! లోకముల చల్లగ జూచెడి నీకు మ్రొక్కినన్

త్వరిత ఫలంబు లందునని భక్తుల నమ్మిక; కల్పవల్లివై

వరములనిచ్చు వేల్పువని వందనమిచ్చెద తల్లి! నీకివే


*మత్తకోకిల*


*ర, స, జ, జ, భ, ర 11వ అక్షరము యతి,  ప్రాస యుండును, ప్రాసయతి చెల్లదు*


శౌరివై రణమం దునిల్చె డిశక్తి వేయసు రాంతకీ

వేరు మాటలెఱుంగనమ్మిట వేల్పు వైనను గావుమా

గోరినంతనె భక్తులందరి గోర్కెలన్నియు దీర్పుమా

వారిజాక్షి! కపర్థిపత్ని! దవాగ్ని నేత్ర! ప్రణామముల్

*చిత్రము*

*మంగళ గీతి: 4 ఇంద్రగణములు, 4 పాదములు, ప్రాస ఐచ్ఛికము, యతి 3వ గణము మొదటి అక్షరము*

రక్తముఁ బీల్చెడి రక్కసి జూడరే

రసము వోలె దలచి ద్రాగుచుండె మదమున్

జీవుల బాధించి చిరునగవులు చిందు

గుణమెటుల హితమగునిలన్ దెలియదాయె


*పంచ చామరము*


4 పాదములు, ప్రాస గలదు,


జ, ర, జ, ర, జ, గ గణములు, లేదా 8 వ గణములు, యతి 10వ అక్షరము


*బాల్య జ్ఞాపకములు*

*పంచ చామరము*


సదా భయంబు తోడ నేను సాగినాను ముందుగా

మదిన్ భయమ్ము మెండుగాగ మాటరాక యుండగా

గదాధరుండుఁ నాంజనేయుఁ గాయు దైవముండగా

కుదేలు గావుటింక మాను కొమ్మటంచు మాతయే


వచించి ధైర్యమిచ్చు పల్కె బాగుగాను ప్రేమగన్

రచించు మమ్మ రామ బంటు లక్షణంబులన్నియున్

కచేరి చేసి నంత భక్తిగాను దేవదేవునిన్

కుచింతలన్ని పారిపోవు; గోర్కెలెల్ల దీరునే

పద్య భారతి 3వ పరీక్షకు

పంచచామరము
వచించి ధైర్యమిచ్చు పల్కె బాగుగాను ప్రేమగన్
రచించు మమ్మ రామ బంటు లక్షణంబులన్నియున్
కచేరి చేసి నంత భక్తిగాను దేవదేవునిన్
కుచింతలన్ని పారిపోవు; గోర్కెలెల్ల దీరునే
పంచచామరము
సదా భయంబు తోడ నేను సాగినాను ముందుగా
మదిన్ భయమ్ము మెండుగాగ మాటరాక యుండగా
గదాధరుండుఁ నాంజనేయుఁ గాయు దైవముండగా
కుదేలు గావుటింక మాను కొమ్మటంచు మాతయే

చంపకమాల

సురము నిపూజ్య! మాగృహ ముఁశోభ లనింపె డిభాగ్య దాయివే
సరసి రుహాక్షిలోకము లచల్ల గజూచె డినీకు మ్రొక్కినన్
త్వరిత ఫలంబు లందున నిభక్తు లనమ్మి కకల్ప వల్లివై
వరము లనిచ్చు వేల్పువ నివంద నమిచ్చె దతల్లి నీకివే

Thursday, July 1, 2021

తోపెల్ల ఉషా కౌమారీ సీతకు కళ్యాణమున అక్షర మాల

ఆటవెలది
పద్య విద్య నేర్పుబాలశర్మ సుతకు
పెండ్లి వేడుకండి! పిన్న పెద్ద
జేరి పందిరింట సీతా హవీషులఁ
తోడ నందరాడి పాడరండి!

ఆటవెలది
పద్మనాభునకటపౌత్రిగ జనియించి
నాఱసింహునికిటనవవధువుగ
యడుగిడెడి శుభ సమయమున చిందించుమా
తఱగని నగవులనుతరుణి! సీత

తేటగీతి
ఉషకు నాడపడుచు జూడనుషయె! లీల
గనగ చివుకుల వారింటికన్న బిడ్డ
వోలె కోడలి పై మల్లెపూలవాన
కురియు భాగ్యము గలుగుత! గురుసుతకట


తేటగీతి
చివుకుల గృహమున వెలుగు సిరుల దివ్వె
చింత యన్నదెఱుఁగకుండ చిరుఁ నగవుల
తోటి వరుడు హవీషుకు తోడు యగుచు
వర్థిలవలెను నూరేండ్ల పంటగాను


కందం
వాణిజ్య శాస్త్ర మందున
రాణించవలెను సతతము ప్రప్రథమమ్మౌ
శ్రేణిన నిలువవలయు పూ
బోణి! విజయసీమ నందిముదమొందవలెన్

Tuesday, June 29, 2021

మండలి - పద్య సౌరభములు

 3. ఆటవెలది

జాణుఁ దెనుఁగు జూడ చక్కగానుండునూ
పదము పలికిఁ జూడ బాగు బాగుఁ
పద్య సొగసు జూడ! పల్లవించు మనసే
వదలబోకు మాతృ భాష! నరుఁడ
ఆటవెలది
రెండుఁ గణములుండు లెక్కజూఁడ! నగల
ములవి సూర్యనామముండు కలిసి
చేయు తరళ గంధ సింహ విక్రమములు
ఉభయ గణము తోడ నుత్సముండుఁ







2. ఆటవెలది

నాల్గు మాత్రలుండు నగుమోము పద్యము
కందమందమంత గణములోనె!
బేసి నెపుడు గురువు బిగియ వలదు మధ్య
జాతి పద్య సొగసుఁ చక్కెరేనుఁ


1. తేటగీతి

తేటగీతి యాటవెలది తేనెలూరు
జాతి లోన నుండవు నుపజాతులగును
సీస ముననుసరింతువు! ప్రాసయతిని
గలిగి యుండును! రెంటికి గణములొకటె
స్థానములె మారు మరి యతి స్థానమైన
నాలుగవ గణమున యందె నలుగుఁ! చుండుఁ
విషమ గన్ను శైలిన యాట వెలది యుండు
తేటగీతిచరణములుతీరుఁగుండు

Monday, June 28, 2021

మండలికి - తెనుఁగు వైభవము

 14. 

తేటగీతి
అక్షరార్చన సేయుట అక్ష హస్త
యొసగినట్టి వరము! సదా యుత్సహించి
వ్రాసి సతము జనని సేవ చేసికొనుట
ధన్య చరితుఁ జేయుఁ మనను! ధరణి నందు
13.
ఆటవెలది
గేయమందు వ్రాసె రాయ ప్రోలు కవియె
భరత సీమ బొగడ వలయు నెపుడు
విడువకుండ! నిదియె వేదభూమి! ధరణిఁ
యనుచు మ్రోకరిల్లమనెను మనను


12.  ఆటవెలది

వేంకటేశుఁ స్వామి బిలచె స్వయముగాను
యన్నమయ్యనిలకు యంతు లేని
సంతసమ్ముఁ బంచు సంకీర్తనలనెల్ల
వినుట కొఱకు! గనుమ దెనుఁగు మహిమ


ఆటవెలది
విద్య విలువ దెల్పుఁ పద్యములున్నవి
దేశ దైవ సేవ దిశగ జనుల
జాగృతమ్ము జేయు సాహితీ ప్రక్రియ
సంపదయ్య దెనుఁగు! చదుఁవవలయు


11.


తేటగీతి
సామెతలు నానుడులునుక్తి జాతియంబు
పద్య పదనిసలు గజలు గద్య ములును
ప్రక్రి యేదేని గాని! సొంపగు నడకను
గలిగిన దెనుఁగును గొలుమ! ఘనముఁ గాను


10. 

ఆటవెలది
మాతృ భాష మనసు మమత నింపు! వినుమ
తల్లి ప్రేమ గలది ధరణినందు!
ఒక్క పరి పలికిన నొసగుసంతసమును
వీడ బోకు నెపుడుఁ వినుముఁ నరుడ


9. ఆటవెలది

జాతి రక్ష కొఱకుఁ జాగృతంబునొనర్చు
శక్తి గల పదములు స్వంతమైన
వాడి వేడి పదున భాష దెనుఁగు గాదె!
తరచి జూడ చరిత! ధరణి నందుఁ


8. తేటగీతి

పద్యములు సామెతలుఁ వంటి ప్రక్రియలను
నింపుకున్నసొగసుగల నిండుఁ భాష
తేట దెనుఁగు! కవుల పంట! దివ్యమైన
నడక గలదిఁయని బహుమానములనందె


7. వేల కీర్తనలను విన్నయా శ్రీహరి

మనమునందుఁ దెనుఁగు దనము గోరి

యన్నమయ్య నిలకుఁ యార్తితోడ సఱఁగు

బంపి దీర్చుఁకొనెను! బాగుఁ గాను

6. తురగవల్గన రగడ

ప్రాజ్ఞులెల్ల మెచ్చి గొలుచు భాష! కమ్మనైన భాష!
రాజ్ఞి తానె యగుచు వెలుగు రమ్య మైన గొప్ప భాష!
యాజ్ఞ సేయు రాజులైైన యార్తి తోడ వ్రాయు భాష!
విజ్ఞులంత ముదము తోడ వినుతి సేయు సొబగు భాష

5. ఆటవెలది

అన్య భాష పట్ల అంతరంబు విడచి
జేర్చుకొనుచుఁ సాగు! చిన్న బోదు!
దేశ్య గ్రామ్య మైన దెనుఁగునందు నిముడు!
వందనంబుఁ దెల్పఁ వలయుఁ మనము


4. మేదురదన్తమ్

ఆమని యాగమనంబున కోయిల యాగక జేయునుఁ గానము! తీయఁగ!
రాముని నామముఁ భక్తిగ! పాడుచు రాగము దీయుఁను చిల్కయె కమ్మగ!
యేమని జెప్పద! రమ్యత నిండిన యింపగు సొంపగు సంపద వైపుకు
నామది పాఱుఁను పద్యము చెంతకు! నవ్యత నిండిన భాషను జేరుఁను!


3. ఆట వెలది

బ్రహ్మ హరియు నీశ్వరాదులందఱుఁ మెచ్చు
బంగరమ్ము వంటిభాష తెలుఁగు
విశ్వమంత తానువినుతిఁగెక్కి సతము
జయముఁ నందుచుండెచక్కగాను

2. ఉత్సాహము

తేనె కన్న తీయ నైన తెనుఁగు భాష జూచినన్!
మేను పులకరించుఁ సతము మెఱయు! గనుమ యువత! నీ
సాన బట్టి నేర్చినంత ఛందమందమంత యున్
జానుఁ నడక గూడ దెలుఁపు! స్వనము గూడ మధురమా

1. ఉత్సాహము

పద్య మన్న సొగసు దెనుఁగు భాష నందె గలఁదు గా
చోద్య మిదియె గాదె! సతము జూడగానె! పద్యమే
హృద్య మైన నడక గలది! హృదయ మందు నిలుచునే
వద్యమేదియైనగాని! పద్యమందమిచ్చునే
వాద్యమల్లె హాయినిచ్చు వంక లేవి లేకనే
సేద్యమింక జేయవలెను! చిత్త శుద్ధి తోడ నీ
విద్య నేర్చుటెపుడు! మనకుఁ బ్రియము గావలెనిక నై
వేద్యమల్లె నీయఁ వలెను! విష్ణు సుతుని పత్నికే

మండలి - చేమకూరి

 

ఉత్సాహము
కలియుగంబు బ్రహ్మ గారు కాళికాంబ శతకమున్
కలము పట్టి వ్రాసినారు కందిమల్లివాసుడే
ఫలములన్ని సుమములాయె స్వామి దృష్టితోడనే
కలియుగంబు వింతలన్ని కనులముందు నిలిపెనే


ఉత్సాహము
తాళ్ళపాక యన్నమయ్య ధర్మ పత్ని వ్రాసె తా
వేళ్ళ మధ్య కలము పట్టి వీరుడగు కిరీటి దౌ
పెళ్ళి గాథ స్వయము గాను ద్విపద ఛందమందునన్
త్రుళ్ళవలయుఁ పడుతులంత త్రోవ జూపె తమకనిన్



మేదురదన్తమ్

శంకర మంచను యింటనఁ బుట్టిన సత్యము గారిట వ్రాసిరి మేలగు
వంకలు యన్నవె యుండక మంచిని బల్కెడి చక్కని గాథలు లోకులు
యంకకు జూడక తిన్నగ సాగుచు యందరి బంధువు వోలెను మెల్గుచు
వంకర బుద్ధిని గల్గక నిత్యము పంచిన హ్లాదము మేలును గూర్చును



ఆటవెలది

వేయి పడగలనెడి విశ్వనాథ కవియె
పగడములకు మల్లె పంచినారు
రామ కల్పవృక్ష రచనతోడ మనకు
నామసాధనముఁ మనకునొసగెను


ఆటవెలది
భృతులు భుక్తి గాదు కృతులె శాశ్వతమని
యనుచు నిలచెనిలను యాంధ్ర భోజుఁ
కృష్ణ దేవ రాయ! తృష్ణ జూపె దెలిపె
దెనుఁగు తేనె కన్న దీపిఁ యనెను

18.


కందం
నన్నయ తిక్కన ఎఱ్ఱన
మున్నగు కవులు దెనిగించె ముదితల్ నాథౌ
కన్నయ సత్యము ధర్మము
వెన్నంటి నడిపిన గాథఁ విజయ కథలనిన్




14.

ఆటవెలది
భక్త కవిగ వెలిగె బమ్మెర పోతన
వీర భద్ర విజయ ధార వ్రాసె
దండకమ్ము తొలుఁత దండగా గుచ్చిన
ధన్య జీవి దెనుఁగు ధరణిపైన

సహజ పండితుండు జనుల నోటను నాను
పద్య రాజములను వ్రాసినాడు!
భాగవతమును భువిపైని నిలపినాడు
రామ కృపను యందె లక్షణముగ

జానకీశుడిలకు జయమునీయునటుల
పలుకు మొదలుఁ బెట్టి భాగవతము
రచన జేసి తాను రామచంద్రు కృపను
పొందగలిగినట్టి పుణ్య జీవి

పోతనార్యు కొఱఁకు పురము విడచి వచ్చె
శ్రీజ పతియెఁ తానె! చింత దీర్ప
యమిత భక్తి పరుఁడు యంబస్తుతిని జేసె
యమ్మ పదము తోడ కమ్మ గాను


12.

ఆటవెలది
కావ్య యుగము నొకటి గలదిలన్ దెనుఁగున
పండితుండుగు కవి భద్ర వేమ
రాజు లింట కొలువు లనుజేసి వెలిగెను
కంచు ఢక్క గొట్టి! కనకమందె

సీస పద్య నిపుణ! శివరాత్రి చరితము
వ్రాసినట్టి ఘనత! వాసిఁ బొందె!
వీధి రూపకంబు వీరి సృజనయేగ
భోగములను విడచి ముక్తి నందె


11.


ఆటవెలది
కందుకూరి రుద్ర కవిమాధవ నృసింహ
వంటి సుప్రబంధ వర్యులున్న
యందమైన గడ్డ యాంధ్ర భూమి! దెనుఁగు
సీమ జూడ వెలుగు జిలుగు లీను


10.

ఆటవెలది
రామభద్ర వ్రాసె రామాభ్యుదయమును
మల్లనది మృదువగు మధుర శైలి
సూరన దెనిగించె గరుడ పురాణము
రామకృష్ణ సఖుడె! రాయలకును


9.

ఆటవెలది
అల్లసాని వారి యల్లిక జిగిబిగి
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు
రామ రాజు గొప్ప లాక్షణికుండట
ధూర్జటి వచియించె! తుచ్ఛము సిరి


8.


ఆటవెలది
పాండురంగ విభుని పదగుంఫనము నిలన్
రామ కృష్ణ కవుల ప్రతిభ యనుచు
తోటి వారలెల్ల పోటీయనక తాము
మెచ్చుకొంటిరంట మిక్కిలిగను
7.ఆటవెలది
నిగమ శర్మ అక్క నీతి నియమములు
తమ్ముఁ చెంతఁ నుడివె! నమ్మవోలె
తెనుఁగు పద్యమందు దిశను జూపు పలుకు
సతము నిండియుండుఁ! జయముఁ గూర్చు!

6.

ఆటవెలది
అష్ట దిగ్గజములనాంధ్ర భోజుఁ నిలపె
భువన మిజయమందు పూజ్యుడాఁయె
పండితుఁలను మెచ్చి ప్రాజ్ఞుడీతఁడు తానె
వ్రాసె కావ్యమొకఁటి స్వయముఁగాను



5. 

ఆటవెలది
అన్నమయ్య పలుక యద్భుతమ్ము గనఁగ
త్యాగరాజ కృతులు బాగుబాగు
రామదాసు పాట రమ్యమెపుడు విన్న
తేట తెనుఁగు సతము తీయఁనేగ


4. ఆటవెలది

ఎంత బాగ వ్రాసినేని నేమిఫలముఁ
మెచ్చరేల యనుచు మిగుల వగచి
పలికినట్టి వాడవై నిజమునుఁ దెల్పి
నిర్భయమ్ముగాను నిలచిఁనాఁవు!


3.
ఆటవెలది
పదము పదము నందు పండునలంకార
సొగసు యద్భుతంబుఁ జూడ! వహ్వ
యనుదురంత! నంత యందగించు నయ! యో
చేమ కూరి! ప్రణతి చిత్తగించుఁ

2. ఆటవెలది

నీదు పద్యమందు నిలుచు వాణి! సతము
నిశ్చలమ్ము గాను! నీదు ప్రతిభ
గాన వచ్చు నీదు కవనమందున! నెట్లు
సాధ్యమాయె! నింత చక్కదనము


ఆటవెలది

ఏక పాదమందు యింపుగ యతి జతి
జేసి పద్య మల్లు చిత్ర శైలి
మీది చేమ కూరి! మిమ్ముఁ బొగడ! లేవు
పదము లేవి చెంత! పండితార్య


ఆటవెలది
వచన కావ్యములను ప్రక్రియ మొదలయెన్
దక్షిణయుగమందె! తఱచి జూడ
యక్ష గాన ములను యందజేసెమనకు
కందుకూరి పాప కవులు గనగ


1. ఆటవెలది
దక్షిణాంధ్ర యుగము తఱగని వన్నెలు
చేమకూర వారి చిత్రమైన
రచన బాగు బాగు రఘునాథుఁ రాముని
కథను వ్రాసె స్వయము గాను! తానె