Tuesday, June 22, 2021

ఆటవెలది

 

[03/06, 12:48] Durga Madhuri:


దైవ మెపుడు జూచు తప్పులను గణించు

గనుక నప్రమత్త గుణము గలిగి

యున్న మేలు కర్మ యొక్క ఫలము

తిరిగి జేరు మనను తెలిసి కొనుమ!

[03/06, 12:48] Durga Madhuri:


అమ్మ తరఫు గాదు నయ్య తరఫు గాదు

బంధువంటు వచ్చి బాధ పెట్టు

హక్కు యేమి గలిగె హాని జేయుటకును

నీతి లేని గుణము నీచ మగును



ఆటవెలది

నస తొనలు తిన్న హురుచి గానుండు
దలకుండ దిన్న హ్వ యనుచు
సిమి ఛాయనుండు బంగరంపు సొబగు
స్వస్థతిచ్చు నిజము తము మనకు

29/05, 00:27] Durga Madhuri: 

గదయు వీణ ఖడ్గ కమల కేతనములు
కరము లందు నిలుపు కరుణ వరద
సింహ యాన! యంబ! చిద్రూపి! కష్టముల్
ద్రుంచ మనవి తల్లి! దుర్గ! లలిత


[29/05, 00:27] Durga Madhuri: 

త్రిముఖి! కదన రంగ ధీర! యష్టభుజివై
గదయు వీణ ఖడ్గ కమల పాత్ర
కేతనములను గలిగిన పరమేశ్వరి!
సింహ యాన! దుర్గ! చిత్స్వరూప!

ఆటవెలది
సంధ్య వేళ లోన జాబిలి కురిపించు
వెన్నెలందు చిలిపి వెన్న దొంగ
వేణువూదు చుండ వెలగులీనెగ రాధ
మోము చక్కగాను ముదము తోడ


న్యస్తాక్షరి, యతి స్థానము లోనె అక్షరాలతో - ఆటవెలది

పా జలధి నందు పాతాళ వాసుల
లాగుచుండె సురులు రా వెంట
బా నొక్కి పట్టి వాసుకిని! యపుడు
లాస్యమాడు పడతి రం వెడలె!

ఆటవెలది
రోలుఁ దెచ్చి పెట్టి లోగిలి ముంగిట
దంపి జూడ వలెను రుణులంత
ప్పు దెచ్చి రుబ్బ డల పిండి యగును
చ్చి మిఱప యేమొ చ్చడాయె

ఆట పాట తోడ నలసి సొలసి నాడు
యాద మరచి నిదుర నందె బాబు
ఎంత ముద్దు గొలిపె నితడు! గోపాలుడు
సద్దు సేయ వలదు స్వామి చెంత
ఆటవెలది
రాడు రాడు భవుడు లాస్యమాడు సతితో
తాండవమ్ము సేయు తా విభుండు
నుల కొఱకు రాడు త్యవాక్కు గనుమ
దీన బంధు గాడు త్రిపుర హరుఁడు



అమ్మ యన్న పలుకు నమృతము
 మించును
తేనె లూరు పిలుపు తీయగుండు
సాటి రాదు మరిక జగతిన వేరేది

కన్న తల్లి మాట వెన్న మూట

ఆటవెలది
లుపు మూలనుండి రుమునలక్ష్మిని
జ్యేష్ఠ రూపమైన సిరికి యక్క
యలి వెడలు నంట యటికి వెంటనే
దుమ్ము ధూళి నిలవదు నిజము గద

ఆటవెలది
వెండి కొండ పైన విహరించు టేలయా
ని యడుఁగ కపర్ధి! యంట్లు గడుఁగు
బాధ లేలన పడలెనని హిమగిరి
నందు యుంటి ననెను! యము గాను
సంధ్య వేళ లోన జాబిలి కురిపించు
వెన్నెలందు చిలిపి వెన్న దొంగ 
వేణువూదు చుండ వెలగులీనెగ రాధ
మోము చక్కగాను మదము తోడ

ఆటవెలది
రిగి పోయెనిట్టి సిరులు కనుల ముందు
కాలమేల యింత ఠినమాయె
రలి రావు !యిట్టి ధుర క్షణములిక
ర్మ ఫలములివిక లత వలదు
ఆటవెలది
ర్మ రీతి నెఱుఁగ ర్మపురి నివాస
ర్మ ఫలము బాపి రుణ జూప
వేడు కొంటి మయ్య వినతి వినుమ దేవ!
జాగు సేయకుండ యము నిమ్మ

తేనె లొలుకు భాష తెనుగు భాష జనులా

తేనె చిందు ఘనత తెనుగు దేను

తేనె తీపి పొందు తెనుగు వలన గాదె

తేనె పలుకు లన్న తెనుగు పనుకె

****************************************************

మాయ లోన పడెను మాధవ పౌత్రుఁడు

రూపు మారి పోయి రోదనొందె;

కుండమందు మునిగి గోల్పోయినది పొందె 

యహము శిక్ష వేయు నణగ దొక్కు

ఆటవెలది
యము జయములయ దరథ నందన రామ
క్ష్మణాగ్రజ! హరి! వకుశ పిత!
జానకీశ! సతము గదోద్ధరణ సేయు
క్తి యుక్తి రక్ష ర్వమీవె

ఆటవెలది

నీరు లేని బ్రతుకు నిలుచునె ధరణిన

జలము నిండు కున్న జయముఁ చెదురు

సలిలమవసరమయ జంతు జాలమునకు

మ్రింగ హక్కు పడమిని మనకే

దత్తపది:


కదనమందు దాడి గాదయ దోషము

పాడి సేయుటందు వలదు భయము

వేడి కోలు యేల భీరువు గాకుమ!

మహిని చెఱఁచు వాని మాడనిమ్మ!

ఆటవెలది
లుకు కున్న విలువ సిడి కుండ దిలను
చెలిమి లేని చోట సెలవు సెలవు
బిడియమున్న చోట వీలగునే పేర్మి
వెలుగులెటు మిగులును వేదనున్న


గ్రీష్మ తాపము మొదలాయె గాడ్పు వీచె

యంబుధిని నిలిపిన రామ యాదు కొనుమ!

జలము లేక జీవము లెండె శరము దీసి

కడలి గొట్టి తీపి పయఁము పంచుమిలను

నియమముగ పూజ సల్పుట నేర్వ లేదు

షడ్రుచుల మాను కొనియుండు శక్తి లేదు

చేయ గలిగిన దొక్కటే! చిద్విలాస

నిత్య నామ స్మరణమయ్య నీలకంఠ

పద్య విద్య నేర్చె పడతి దుర్గ గురువుల్
చెంత చేరి; వారు చేరదీసి
సాన పట్టు చుండె సహృదయులై! భళి
వ్యసనమొదలలేక వ్రాయుచుండె

---------------------------------
శరము లన్ని వైచి జలము దెచ్చె కిరీటి
తాత కిచ్చి తనను త్రాగమనెను
పెద్ద లనగ నెంత పేర్మి ఫల్గుణునకు!
వినయ మున్న వారె విజయులుకద!
----------------------
నిన్న కలను గంటి నేను నిన్ను నిజము
నిన్ను తలవకుండ మిన్నకున్న
నేను యసలు లేను నిన్ను నింపితి మది
నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను
---------
క్ష్మి చేజారెనని యా సుపురి వారు
దిగులు జెంది వైభవమును తిరిగి పొంద
కాంక్ష పూని యత్నించుట లిమి కొఱకు
వుల కల్పన గాదె సార మథనము
----
ఆలు బిడ్డల గనకున్న యలమటించు 
భ్రాంతి లోన పడి గనడు బాధ నొంద
కాలి పోవువేళ నెవరు గాన రాక
యొంటరైతిననేడుచు యుక్తి విడచు


ఆటవెలది
నింగి నేల రంగు నీలమే! యొక్కటే!
ట్ట నడుమ నుండె నంట యద్రి
సాగు చుండె పైన ల్లని మేఘము
ప్రకృతి మాయ జూడ బాగు బాగు
ఆటవెలది
నసు మారదెపుడు నుజుల గుణమదె!
నీతులెన్ని జెప్పు! రీతి యంతె
హితమొనర్చు బుద్ధి యెన్నటి కొచ్చునో!
మంచి యన్న మాట హిని కల్ల!
ఆటవెలది
పూల మాల గట్టి పూజకై భక్తిగా
తాను వేసికొనెను రుణి మొదట
ర్పణమున జూడ ర్శన మిచ్చెను
స్వామి బింబమల్లె! క్కగాను
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U |U |U U |U U |
 న్నుతిం తుని న్ను ర్వే శ్వరీ మ మ్ము
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U || | |U |U || | |
నా దుకొ న గరా వయం బజ న ని
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
| | |U |U || | | || | | |
 త మువీ డనీ దు ర ణ కమ ల ము లు
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U |U || | || | |U |
 ల్లిభ క్తసు ల భ య నుజూ పు












ఆటవెలది : 97%(28/29)
గణ విభజన
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U |U |U | || | U |
 డిపో తిన య్యనో రి మిక ర వా యె
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
U |U || | |U |U |
చే వలే దుప ను లుఁజే యలే ను
సూర్యసూర్యసూర్యఇంద్రఇంద్ర
U |U |U |U | U| | U |
 న్నగి ల్లిపో యె క్తి నీఱ స మొ చ్చె
సూర్యసూర్యసూర్యసూర్యసూర్య
| | |U || | || | |U |
నె టు లసా గుబ తు కుయె ఱుఁ కలే దు
ఆటవెలది
ఇంటి పనుల లోన యిసుమంత సాయము
కోరఁ లేము మనము కొద్దిగైన
యింతి పనుల జూడ యింతింత గాదయా
కొలిచినంత కొలది సి పోవు

 ఆటవెలది

సానుభూతి దప్ప సాయమీయగ లేను
బాల! దిగులు చెంద లదు నీవు
లత వల్ల నేమి లుగు కరుగు శక్తి
కుదుట పడుము తల్లి! కోమలాంగి
ఆటవెలది
సిమి వన్నె మెఱయు పంచభూతేశికి!
సిడి యాభరణము పైట గాదె!
యాంధ్రులెల్ల మెచ్చు ద్భుత పులిహోఱ
దెచ్చి నీకు పెడుదు! ధీర మాత!

ఆటవెలది
చింతపండుఁ దెచ్చి చిక్కగ గలిపెద!
దినుసు లన్ని వేసి ద్రిప్పి గరిట
పూజ సలిపి తల్లి! పులిహోఱ బెట్టెద!
మ్మగారగించి! నికరించు

No comments: