Tuesday, June 22, 2021

తేటగీతి

తేటగీతి
లోకమంత నిండిన భాషరొక్కములను
పొందుటకు పయోగమనుచుపొందుఁ గోరు
నిత్య నూతనమాక్స్ఫర్డ్కునింగి హద్దు

క్రొత్త పదము జేర్చుటలోనకుంటు వడదు 

తేటగీతి

పాల సంద్రమందు మునిగె పాండు రంగ
డేల యన పాత్రలన్ని తా నేల తోమి
గడుగ వలెనని జూపించె గడుసు దనము
పత్ని లక్ష్మికి శ్రీహరి! బాగు బాగు


కృష్ణ స్మరణ సేయరె హరి కృపను వొంద
రుక్మిణీ పతి నుడువరే లోకులెల్ల
వెతలు దీర్చు బంధువితడు వేణు గాన

లోలుని గన చాలవు వేయి లోచనములు
తేటగీతి

విసపు క్రిమిబారి పడి మేము వేడినాము
బిల్వ పూజ్య! మాకై నీవు వేగ రావ
గరళ కంఠుడ వను మాట కల్పనేమొ
యని తలచవలయు నిక హే యాది పురుష
తేటగీతి

నాకు నిత్యము పేర్మితో నడక నేర్పి
పద్య రచన యందు వలయు ప్రతిభ పెంచు
రీతి మార్గ దర్శకమును ప్రీతి తోడ
పంచు గురువగు మీకిత్తు ప్రణతులివివియె
ఎన్ని యుగములైనను నీవెనెన్న దగిన
దైవమయ్య! రామ! సుగుణ ధామ!
వైరి పక్షమైన శరణని పలికినంత

నభయమొసగెడి వాడ! దయార్ద్రుడవయ!

తేటగీతి
పరమ భాగవతోత్తముల్ బాధ పడిన
దుఃఖ పెట్టిన వారగు దోషులెల్ల
వదలబోదు విధియెపుడు! పట్టుకొనును
గనుక వైర గుణము మాని ఘనముగుండు
తేటగీతి
విష్ణు పుత్రిగ నీవుద్భవించినావు
విశ్వమంతయు గంగగ వెలసినావు
వేణియగ దిక్కులను పాఱు వేల్పువమ్మ
వందనమ్ములు నీకివే పాప నాశి! !

ఆఖరు పాదము సమస్యకు పై మూడు పాదములూ సమస్యా పూరణము

తేటగీతి
పోతన కలముఁ కురుపతి పోరుఁ గోరె
గాని విశ్వ శాంతి కొఱకు కలము కదిపి
వ్రాసెడి రచనన వినూత్న పద్ధతినను
సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె

తిరుపతి పదము న్యస్తాక్షరి


తేటగీతి
తిప్పలు గలిగెను వినుము దేవ వినతి
రుణపడి జనులిట దలతురు మరి విడరు
పక్కి వాహనా! కారుణ్య వరద! శ్రీప
తి! మనమున నిలిపెదరయ తిరుమలపతి

తేటగీతి
తిరుమల గిరిపై వెలసిన దేవ దేవ
సిరులను గురిపించెడి హరి! శ్రీనివాస
పరి పరి విధముల నుతింతు భక్త సులభ
యడిగితి నయ నీ రక్షణ నంబుజాక్ష


ఈశ! నీ దివ్య నామమే యెఱుఁక నాకు!

శ్రీ గిరీశ! జగతికి నీ చిరు నగవులె

వెలుగు రేఖ! నీకె శరణు బిల్వ పూజ్య

వెతలు దీర్ప మనవి తండ్రి! వేద పురుష


మధ్యలో "భా" ప్రత్యేకత

బ్రహ్మ పత్ని! శ్రీ భారతి! వందనమ్ము
నీరజాక్షి! హే భార్గవి! నిన్ను కొలుతు
నాదు రక్షణ భారము నీదె యనుచు
వేడెదను మృదు భాషిణి వేగ రావ!

ద్విజునకు శరణు! ద్విముఖ! యో! దేవ‌ దేవ!
విఘ్నములను నాశమొనర్చు విమల పుత్ర!
యాది పూజ్య! యనింద్య వా హనుడ! నాకు
చదువు నొసగమని మనవి! స్కంధ గురువ

అష్ట లక్ష్మిగ నిచ్చట యవతరించి
బిడ్డల యభీష్టములు నింక విన్నపములు
దీర్చి శుభములు కలిగించు దీవెనలను
వరము లను యిచ్చు శుభలక్ష్మి! ప్రణతులమ్మ

వాణి! నిన్నెరిగిన వారు వ్రాయగలరు
కవనములును కావ్యములను గద్యములను
మంచి వాక్కుతోడ నిలను మసులునట్లు
మమ్ము దీవించ మనవి కమలజ పత్ని

అదిరెను టమోట పచ్చడి యద్భుతమ్ము
చేయవలెను నేనిక జాగు సేయకుండ
లొట్ట లేయుచు విడువక రొట్టె యిడ్లి
యన్న ములలోకి తిందురు యాహ యనుచు

రామ! దశరథ సుత! రణరంగ ధీమ
యుత్తమ పురుష! శస్తాస్త్ర యోధుడవయ!
ధర్మ నిరతికి రూపము త్యాగ గుణము
స్వంతము జగతి నందీవె సౌమ్యుడవయ

తేటగీతి
మెల్లగ నిదురోయినవిట మింటి పూలు
యతివ సొగసుఁతాము గని! యాహా యనుచును
గూని వానివలె శశిదాగుకొని యుండె
మూగవోయె నళని వ్రాయ పూనుకుంటి
తేటగీతి ఆఖరు పాదము గొట్టి బదులు నుండి
గ్రీష్మ తాపము మొదలాయె రేగె నెండ
యంబుధిని నిలిపిన రామ యాదు కొనుమ!
జలము లేక జీవము లెండె; శరము దీసి
పాథి గొట్టి తీపి పయఁము పంచుమిలను

తేటగీతి
మెల్లగ నిదురోయినవిట మింటి పూలు
యతివ సొగసుఁతాము గని! యాహా యనుచును
గూని వానివలె శశిదాగుకొని యుండె
మూగవోయె నళని వ్రాయ పూనుకుంటి

విజయ వాడ నందు వెలసిన దుర్గమ్మ
కష్ట ములను దరుము కదన ధీర
పసిడి వర్ణ మోము బంగరు తల్లివే
వరము లిమ్మ దేవి వైజయంతి

తేటగీతి
రెల్లు పొదలలో పుట్టిన శ్రీ శరవణ
రేయిఁ బవలు జూపు మనకు లీలలెన్నొ
వల్లి దేవసేన సమేత పళని వాస
శుభము గూఁర్చు దీవెనలిమ్మ సుబ్బరాయ

తేటగీతి(మాలిక)
తేటగీతి
సర్వ మంగళ మదినమ్మె శంకర! నిను
సన్నుతింతు నిరతము నే శంభు! యీశ
విష్ణు బ్రహ్మ యర్చిత! నిల వేల్ప! దేవ
వరము లొసగ మనవి సేతు పార్వతీశ
ద్విజునకుఁ దెగిన వదనంబుఁ దిరిగి దెచ్చి
విఘ్నహరుఁ భువికి నిలిపి బిల్వ పూజ్య
గాచినావు సంకటములు కాశి వాశ
పాడెదను కీర్తనలు నీకు ఫాలనేత్ర








తేటగీతి

తల్లి చరణము పట్టిన దక్కు మనకు
మోక్ష పథము; ధ్యానింపరే ముదిత లార
మర్త్య జన్మయుండదిక పై మంగళంబు
లిచ్చు జనని నీడన విహరించెదమిక

No comments: