Wednesday, April 22, 2020

కరోనా కీ భగవంతునికీ అనుసంధానం చేస్తూ వ్రాసిన పాట

తిరుమల వాసా శ్రీశైలేశా
విశ్రాంతి పొందగ రారండీ
శుచి యే స్వర్ణమని సూక్ష్మం సూచన
ఈ భక్తులకెల్లా తెలపండీ

భువినందేనా మరి మదినందు
లేరా మీరెల్లా ||2||
భగవంతుడిని చూచుటయంటే కాదే అది మన తరమెల్లా

ఇసుకకు సైతం జాగా లేక క్షేత్రాలు
ఇరుకైపోయీ జరుగుచుండే తోపులాటలూ
ఇబ్బందులు సైతం వదిలీ మేమంతా
ఇహపరమైన కోర్కెల చిట్టా విప్పేమే మరి మీ వద్దా

ఇందుకనేనా స్పందించారూ మీరంతా
ఇలయందందరిని కూర్చోపెట్టీ
ఇళ్ళల్లోనే నిలిపారూ
ఇంతటి కధనూ నడిపారూ

పునఃప్రారంభం అంటే మామూలూ కాదే
పురిటీ వంటిదీ పుడమీకీ
చిత్తశుద్ధితో ఇకపై మరి మనమంతా
ఇంపుగా నిలిపీ అందిద్దామూ ముందు తరాలకూ

Tuesday, April 14, 2020

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వర్ధంతి ఏప్రిల్ 14

విజ్ఞాన ఖని విద్వాన నిధి
విశ్వమెల్ల వినుతించిన పెన్నిధి
విధాత గని కోరుకున్న సన్నిధి
వీడి వెళ్ళెను మనను వినయశీల ప్రతినిధి


ఛందోబద్ధమైన ప్రయత్నం


విజ్ఞానపు ఖనిగాదె విద్వత్తుల నిధియేగ
విశ్వమెల్ల వినుతించె విలక్షణ పెన్నిధియె
విధాతయె చకితుడై వేడుకున్న సన్నిధియె
వీడెకడ కుమనను వినయశీల ప్రతినిధి


ఛందం గుణింతం
...


ఈశ్వరీ చూడవమ్మా ఈదిశన్ పదార్చితా
నీదయ మాకొసగుమా నిఖిల లోకమాతా


భగవతీ భోళాశంకరులు భక్తులను బ్రోచుగాక
భ్రమరమ భ్రమణము బొందినవారు మము కాచుగాక


శ్రీ కృష్ణుని పై పాట

శ్రీ పాండురంగ మహాత్మ్యం లోని "కృష్ణ ముకుందా మురారీ" పాట రాగంలో


[10/04, 14:18] Durgamadhuri1: మురిపాలా ముకుందా మురారీ
[10/04, 14:20] Durgamadhuri1: మది దోచే ఓ చోరా రాలేరా
మురిపాల ముకుందా మురారీ
[10/04, 15:04] Durgamadhuri1: దేహము పైన మోహము శూన్యం
[10/04, 15:07] Durgamadhuri1: ధేనువు వెంట నువ్వు తిరిగేవు అంటా
వ్రేపల్లె అంతా గోపాల సిరులేను అంతా
సహస్రాక్షుడైనా నీకు సరి రాడు కాదే
సమరాన సైతం ఇది చాటేవు నీవూ
[10/04, 15:15] Durgamadhuri1: వెన్నను మదినీ దోచేటి నీవు
వెన్నెల ముదమును చూపెట్టి నావూ



బృందావనానికి ఈ అందం ఎక్కడిది
భక్తుల బ్రోచే కృష్ణునితో బంధంతోడిది
సెలయేరూ సిరిమల్లె శశి వెన్నెల
తరుశాఖలు తరుణీమణి తరగని గని
వర్ణించతలమౌనే నిను కొలిచే
పదసంపదే మాకు సదా వరమగునే
వాణీశుడు వేయి పడగల నాగేశుడు
పలుకగలరే నీ ప్రేమ ప్రతిభ గూర్చి


విరించికే పితరుడవో నీవు
విమలాపతి సహచరుడివో
వీణాధారుని గానామృత గమ్యానివో నీవు
విరజా తీరస్థ వాసుడివో వైకుంఠ నిలయా
వేణుగానలోలా నీ పాటతో మా మంది మెరయా
వెన్నెలలోనా విహరించే విలాసమే నీదయా
వన్నెలు చిందే చిన్నదానను మురిపించే రసహృదయా
వేడిన వెంటనే వెతలను తీర్చే కరుణా వరద వయా
వేడుకనున్నా విన్నావంటే మా విలాపమునూ
విన్నావంటే వెంటనే లేచీ వేగిరమే వచ్చెదవూ మా
వేదనలన్నీ నీ వేటుతో తీసే మా వేలుపువీవూ
వేదము గానీ వేయి పడగల శేషుడు కానీ
వర్ణించగలరే నీ వెలుగుల చరితనూ  ఓ
వేదాద్రి వాసా వేంకటేశా వైనతేయారోహా
విరోధి మర్దన విను మా మనవి వింధ్యాద్రి వాసిని భ్రాతా
విజయము విషయము విద్యా వినయము ఒసగుము విడువక మాకు సతతము దేవా స్తోత్రము చేసెదమూ మి
విపంచి నాదము వినోద కేళియ రూపము ఏదైనా
వినుతించెదమో నిన్ను వివరించెదము నీ గాధలే
వేంచేయి మా హృది గదిలోకీ వేరు చేయకు మమ్మూ

మురుగేశా మయూర‌ వాహన
మానస సోదర మాతృకల తనయా
మాననీయా మము దయ చూడవయా
మా కష్టముల బాపుమయా
మహేశ జ్ఞాన బోధకా మయూఖ సోదర
మహి మండలమున ఉదయించిన
మహామహిమాన్విత దేవా
మము దీవించుమా కరుణావరదా



భద్రమొనర్చే బలరామకృష్ణులు
భయములు దీరుచును ఈ
భ్రమరాంబ సహోదరులు
భక్తులను బ్రోచే ప్రసన్న వదనులు


నల్లనయ్య వాడు అల్లనల్లన
పిల్లనగ్రోవిని ఊదుతాడు
చల్లనయ్యగా ఉడిపిలోన ఉన్నాడు
మెల్లమెల్లగా అందరి మదినీ దోచుతాడు




పత్రం పుష్పం ఫలం తోయం
ఏమి పెట్టగలను నీకు నైవేద్యం
ఓ శిఖి పించ మౌళీ శ్రీ హరీ
సమస్తమూ నీ ఆధీనమే కదా!


స్వామి సదా రక్షింతురు మనను
స్మరణయొకటె కావలిసినది
సిరికీ భువికీ పతియై ఆతండు
సంతానమైన మనను కాచుచుండును



చల్లని వెన్నెల పరవగ
మెల్లగ పవనము వీచగా
పిల్లన గ్రోవిని ఊదుచు
అల్లరి చేసెడి కన్నయ
అలనల్లన కానవచ్చే
మదిని గిల్లుచు దోబూచులాడె
మరి యిల్లు జేరడె సందియ వేళకు
గోపెమ్మ చేయు అందియ నాట్యము జూడగ

శ్రీ శార్వరి నామ‌ సంవత్సరం

శాంతమును కూర్చుతూ
శాకపాకాలను అద్దుతూ
శార్దూల వాహిని కృపనొసగుతూ
శ్రేయోదాయకమైన జీవితాన్నందించాలని కోరుతూ

శ్రీ శార్వరీ నామ సంవత్సర శుభాకాంక్షలు

కరోనా

[14/04, 15:49] Durgamadhuri1: కరోనా... ఓ కరోనా...
ఎంత పని చేశావే
ఎచటివారనచటనే నిలిపావే
ఎంతటి వారలైన నీకు దిగదుడుపు
ఏ మందులైన నీకు అలుసని తెలిపావే
ఏమీ ఎరుగని దాని వోలె నిలిచావే
ఎంతో భయమును మాకు గొలిపావే
ఎవ్వరైన లెక్కలేదన్నావే
ఎదలో సొదలెట్టేవే
ఏకఛత్రమును సాధించేవే
ఏరులై పారి అందరినీ కరిగించే
ఏడుపును సైతం తెచ్చేవే
ఎత్తు చూస్తే అసలు లేవే
ఎకసెక్కాలెన్నో నీ వలెనే పుట్టేనే
ఎప్పటికీ కనమనుకున్నవి చూసేమే
ఎన్నటికి మమ్ములనొదిలేవే
ఏహ్యభావం మోసిన పురుగువులే
ఎరువులేసి నిను పరిగెత్తించేములే
[14/04, 15:49] Durgamadhuri1: కమ్మని నిద్రలోకొచ్చేవే
కలలన్నీ చెదర్చేవే
కరమున సైతం ఇమడవులే
కర్ణమును మాత్రం తాకేవుగా
కలతలు కష్టాలు తెచ్చేవుగా
కరుణ అన్నదే చూపవుగా
కడలిని సైతం దాటేవూ
కోవిడ్ పేరుతో తిరిగేవూ
కోరని బాధలు తెచ్చావూ
[14/04, 15:49] Durgamadhuri1: మా పరుగులనన్నీ నిలిపేవూ
పనులను నీ చెర పట్టేవూ
పుడమికి ఊరట అంటూనే
పూరుషాళిని బెంబేలెత్తించేవూ
కుటుంబాలనింట్లో ఉంచావూ
కుదరదనుకున్నవి చూపేవూ
కీడై వచ్చీ మేలై నిల్చినావూ
కీలకమైన దశనిలపై నడిపినావూ

Sunday, March 29, 2020

క్షేమము - క్షీణమూ

క్షమయా ధరిత్రి వమ్మ వసుధ నీవు
క్షేమమొక్కటె ఈయవమ్మ ఈ వసంతములో
క్షయము పెంచక క్షామము పంచక
క్షోభలు తీసి వెలుగులు పెనవేయవమ్మ విశ్వ మానవాళికిన్

Sunday, March 15, 2020

శ్రీ చెన్నకేశవ స్వామి

బంగారు కేశములు గల చెన్నకేశవా
మా చెంతకేగి చిక్కులను క్లేశములను దీర్చవా
చేయి పట్టి తండ్రి వోలె నడిపించవా
చేరదీసి తల్లి వోలె ప్రేమ కురిపించవా

Monday, March 9, 2020

ఓం దుం దుర్గయై నమః

తల్లి దుర్గమ్మ తోడుండవమ్మా
తరుణిని ఇక్కట్లను తొలగించవమ్మ

ఇహమునందూ లీనమై నేను
నిను మరిచుండవచ్చు
ఇరుగుపొరుగుల అదురులకూ
బెదిరి జడిసుండవచ్చు
ఇబ్బందులు కలిగించు జనాలతోడ
నేనే సేయుదునంటు జగడమాడుతుండొచ్చు
ఇంటిలోనీవారు పెట్టు చిచ్చుకు
సహియించక సొంతంగా స్పందిస్తుండొచ్చు

ఇన్ని విధములుగా ఇందరమూ ఇంతులమూ
నిను విస్మరించినమని నీవు విస్తుపొందకుమమ్మ

మాతగా మా తప్పులని మన్నించవమ్మా
మా అజ్ఞానమ్ము నీవు అహమనీ ఎంచకమ్మ

మేమంతా ఎటు వెళ్ళిననూ మము విడువకమ్మ
సర్వశ్య శరణాగతి మా అభిమతమమ్మ

కనుక మము కాయుమమ్మ ఓ కాంచనాలమ్మ
కరుణించవమ్మ మము కన్నబిడ్డలుగ నీకు

*******""""""""****************************

వలయములు ఎన్నైనా రానీ
వ్రతము మాకు నీ నామమే తల్లీ
వలదు ఏ చింతా నీ భక్తులకు
వరము నీ స్మరణ అయి ఉండంగ
విఘ్నమేదైన కానీ ఎంతైనా కానీ
విరామం మెరుగని విజయమే నీ పథము
వినయముతో మేము చూసెడిదే నీ పాదము
వినాశకాలన్నీ నిను తలచిననే తొలగిపోవును


వ్యాఘ్ర వాహిని వ్యాధి నివారిణి
వానర పూజిత వ్యాకుల నిర్మూలించే
వింధ్య నివాసిని విపత్తుల దీసే
విజయదుర్గా విమలా దేవి మా వందనమందుకొనుమా

విన్నపాలు వినుమా వారాహీ మాకు
వెలుగులనీయుమా వహ్నిలోచనీ
విధాత రాతలో విఘ్నములు బాపవే
విఘ్నేశ్వర మాతా వేదనలు దీర్చుమా వామకేశీ

విరించి విష్ణు ఇంద్ర పూజితా వాణీ రమా సేవితా
విరోధి మర్దని వింధ్య నివాసిని వారాహీ రూపిణీ
వేంచేయవమ్మా మా హృదయమలకూ దయగల
వేలుపువై మము వెతలనుండీ కాపాడుటకై


*****************************************
దశావతారిణి దశమార్చే శక్తి
దయగలమాత దుష్టుల పాపుల
దనుమాడే ధీర వనిత భువినీ
దివినీ ఏలే దేవత

దుర్గమ్మ దుఃఖార్తి నాశిని దురిత నివారిణి
దైత్య సంహారిణి దుర్గను నివాసిని
దీనుల బ్రోచే దయగల తల్లి తానే
దీవెన లిచ్చే తిరుగు లేని దేవత



***""""""""**"†*"**"""**********************

నెలవంక నిను వీడలేక
నుదుటిపైనా మరి నయనమైనా
నీకడకేతెంచే నీరజ చెలికాడు
నిశి రాతిరి మెరిసే వరమొందాడూ


*******************""""""""""""************

చంద్రవదనమ్మ నీవు చల్లని తల్లివి
చిమ్మ చీకటిలో వెలుగులు చిందే జాబిల్లివీ
చెడు నడతల వారిని చెండాడే చండీశ్వరివి
చెమ్మగిల్లిన మా కళ్ళను తుడిచే ప్రేమ మూర్తివీ
చదువుల‌ తల్లిగా విద్యను ఇచ్చీ చంచలాదేవిగా మా
చేతలయందు శ్రద్ధను పూన్చి సిరులను ఇచ్చే‌ లక్ష్మి దేవివీ
చాముండి గా కోరిన కోర్కెలు తీర్చే దయగల తల్లివి
చెరకుగడతో మాకెపుడు తీపిని పెంచే అమృత రూపిణివి


*****************************************


దుర్గాం దుఃఖార్తి నాశిని దురిత నివారణ చేయవమ్మ

దివ్య శక్తీ దిక్కువు నీవే తల్లీ దిష్టి దరిజేరనీయకూ

దినకరశశి వహ్ని నేత్రీ నీవే జగద్ధాత్రీ దిక్కు సర్వులకూ

దయగల మాతా దమనములు తరుమమ్మా


Sunday, March 1, 2020

గరుడగమన రాగం

శరణు అన్న పలుకు నిన్ను చేరగానే
పరుగున వచ్చెదవు మాకై పరుగున వచ్చెదవు మాకై
|| మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

నీరమందు ఉన్నా నీడవోలె మా వెన్నంటి ఉండే దేవా వెన్నంటి ఉండే దేవా
||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

వరము కోరినంతనే ఫలము ఇచ్చెదవు మా మనమును బ్రోచేదేవా మనమును బ్రోచేదేవా
||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

కానుకంటు మేము ఏమి ఇచ్చినను దయతో గొనియెదవయ్యా దయతో గొనియెదవయ్యా

||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

కరుణయందు కానీ కదనమందు కానీ అద్వితీయుడవయ్యా నీవూ అద్వితీయుడవయ్యా నీవూ

||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

ఘనమైన పూజలు ఛందస్సు పద్యములు అందించలేమయ్యా స్వామి ఐనా మము బ్రోవమయ్యా దేవా


  • ||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

Saturday, February 15, 2020

Story mirror contest

గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో
హూదయమున్న ప్రతి జీవిలోనూ చెప్పబడని గాధలు ఎన్నో
కలము కదిపితే పదములు కూరిస్తే కాగల గ్రంథాలే అన్నీ
కరములు కలిపేందుకు కాలము చాలక కరిగిపోయిన వ్యధలేన్సుమ్మీ