Wednesday, June 9, 2021

ఇంద్రభాను వృత్తము - బెజ్జాల కృష్ణ మోహన రావు గారు

 బాధ గల్గెనో హరీ బాధ బాపుమా

బోధనల్ సదా 

నాథునీవయా సదా 

వేధ నేసదా 



పేర్మి జూపు మా యిలన్ కూర్మి గూర్చునో


రామ గావుమా సదా రామ బ్రోవుమా

వామ భాగమున్ సదా భామ యుండగా

ప్రేమ మీరగన్ సదా శ్యామ సుందరా



దేవకీ సుతా హరీ సేవ సేతునో



భీతి జెందితిన్ హరీ యీతి బాధలే

రీతి బాయునో గదా 

స్వామి వై సదా


వేంకటేశ యో! హరీ బింకమేలనో

పంకజాక్ష! యేమయా వంకలేలయా

శంకరార్చితా యిలా శంకలేలయా

యింకి పోయె కంట నీరింక గావయా

గాచుమమ్మిటన్ సదా బ్రోచుమమ్మిటన్



భ్రాంతి నొందితిన్ హరీ 



బింకమేలనో ప్రియా యింక చాలుమా

వంక లేలనో యిలా శంకలేలనో


పద్యములూ ఛంద లక్షణములు

3 ఇంద్ర గణాలూ ఒక సూర్య గణము రెండు పాదాలూ ప్రాస యుండును 3వ గణము మొదటి అక్షరము ద్విపదము


మంజరీ ద్విపద లో పై లక్షణములే, ప్రాస యుండదు కనుక ప్రాస యతి యుండును కనుకు ఉపజాతి

ఉత్సాహ 7 న/హల, చివర గ గణం, 5వ గణం మొదటి అక్షషరంర, ప్రాస యుండునూ

సుగంధి 7 హ/ చివర రెండు గురువులు, 5వ గణం మొదటి letter యతి, ప్రాస యుండును

సింహ విక్రమము సుగంధి 7 హ/ చివర గురు, 5వ గణం మొదటి letter యతి, ప్రాస యుండును

తరళము 7 న, 1 గguru 5వ గణము మొదటి అక్షరము, ప్రాస yes

మేదుర దంతము ప్రాస యుండు, 5వ గణము మొదటి letter యతి 8 భగణములు

మానిని 8 భ గణములు చివర గురువు, 7, 13, 19 యతులు, ప్రాస యుండూను, 

మానిని, మేదుర దంతము గర్భితము చేయవచ్చు.

అచల వృతతము 8 లఘువులు. దీనితో సర్వ లఘు తేటగీతి, సర్వ లఘు ఆట వెలది గర్భితం చేయవచ్చు, సర్వ లఘు కందము సాధన వచ్చును
పద్మనాభము 8 తగణములు
పద్మనాభము

  1. పాదములు ఉండును.
  2. ప్రాస నియమం కలదు
  3. ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
  4. ప్రతి పాదమునందు త , త , త , త , త , త , త , గా(గగ) గణములుండును.

పంచ చామరమూ 

  1. పాదములు ఉండును.
  2. ప్రాస నియమం కలదు
  3. ప్రతి పాదమునందు 10 వ అక్షరము యతి స్థానము
  4. ప్రతి పాదమునందు జ , ర , జ , ర , జ , గ గణములుండును


ఈ జ, ర, జ, ర, జ, గ లనే వ, వ, వ, వ, వ, వ, వ, వ (8 వ గణములూ,) 10వ అక్షరము యతి అనవచ్చు
సీసములు

శ్రీనాథుడు ఎక్కువగా వ్రాసెన్, ఇవి 16 రకాలు, ప్రాస యుండదు ప్రాస యుండిన సప్రాస

మొదటా నాలుగు పాదాలూ ఉత్సాహము ఆ పైన తేటగీతి/ఆట వెలది

6 ఇంద్ర గణములు 2 సూర్య గణములు
అంటే 22 పదములు మినిమం 30 maximum 

యతి: ఏక పాదమైన 2 యతులు, కాకున్న దేని యతి దానిదే


బెజ్జాల కృష్ణ మోహన రావు గారు: Facebook 

6,6 మాత్రల గణములు (యతి 13 వ అక్షరము) లేదా 3 చతుర్మాత్రా గణములు, యతి లేదు, రెండు చోట్లా ప్రాస యుండును

Sunday, June 6, 2021

పద్య భారతి శిక్షణ నోట్స్

 1. అనుష్టుప్ ఛందము. ప్రతి పాదమునకు 8 అక్షరములు, ప్రాసతో కూడి, 8 అక్షరములే కనుక యతి లేక, మొత్తము 4 పాదములతో 32 అక్షరములై యుండును

Saturday, June 5, 2021

త గణ దండకములు

 పార్వతీ దేవి


శ్రీమాత! నీనీడ నేగోరి నీచెంతకుంజేరి నీమంబుగా నేను నీకీర్తనల్పాడి నీమెప్పుకై వేచి యున్నాను రావమ్మ శర్వాణి! దైత్యాంతకీ! నీకు కైమోడ్పు లర్పింతు దీవించు మా నన్ను కామారి కళ్యాణి! సంతాన సౌభాగ్య మేవేడి తిన్నిన్ను ప్రాప్తింప వేతల్లి! వేరైన ధ్యాసంటు లేదంటి నీరక్ష చాలమ్మ హేమాద్రి జా! గౌరి! దుర్గా! నమస్తే నమస్తే నమః


శివుడు

నీ(మ)మ్ము గానేను నీపూజలేగాని యే సేవ లేగాని చేయంగ లేనయ్య హాలా(హ)లమ్మంతయున్ మ్రింగ బూనేటి మా(దేవ) శంభో యుమానాథ నీపాద పద్మంబు చేరేటి భాగ్యమ్ము వేడంగ నీదండకంబీకు నర్పింతునోసామి భర్గా నమస్తే నమస్తే నమస్తే నమః

Sunday, May 30, 2021

నానుడులూ నా పద్యములూ

 బిడ్డ కంటి నీరు వేదన తల్లికి 

కనుక పలుక దెపుడు కఠిన వాక్కు

యుల్లి పాయ సేయు నుపకారముర కన్ను

తుడిచి మేలొనర్చు తొలచు దుమ్ము

Thursday, May 27, 2021

అన్నమయ్య పై

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా

ఆటవెలది
గంటి మయ్య నిన్ను గాల మేఘుడ! నిను
బాయకుండు నట్టి రము నిమ్మ
సిద్ధ మంత్ర మీవు చెడనీయవు గదయా
గారవించి మమ్ము గాయు వాడ


పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కీర్తన లోని మూడవ చరణము పై. చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా


ఆటవెలది
న్య చరితుడితడు తాళ్ళపాక సుతుడు
రిని వినుతి జేసి ర్షమిచ్చె
నులకెల్ల పంకజాసనుని ఘనత
దెల్పి మాయ పొరలు దీసె నతఁడు




ఆటవెలది
యిను రేగు రోగమును బాపెదవయ
వైద్య రూప ధారి వ్యాధి నడచి
నిర్వృతి నొసగుదువు నిన్ను దలచినంత
వేంకటాద్రి నాథువీవు దేవ!


జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి కీర్తన ఇది 

ఆటవెలది
వీర లక్ష్మి హరికి ప్రియ సతి వీవమ్మ
దన రంగ ధీర; లిమి నీయ
రము లొసగు తల్లి వైలోకములనేలు
నని! శుభములొసగు లధిపుత్రి!

కొండలలో నెలకొన్న కోనేటీ రాయడు కీర్తన పై

ఆటవెలది
కొండలు నెలవైన కోనేటి రాయడు
రము లొసగుటందు రదుడాత
డెంచి చూడ సతము డీతడే దైవము
మంచి వాడు ఘనుడు హిని నిజము


అన్నమయ్య పై


ఉత్సాహము
తెలుగు భాష లోని పాట తేనె లూరు విధముగా
లికె నన్నమయ్య సతము క్తి మదిని నిండగా
వెలుగు రేఖ యైనిలఁబడి విన్నపాలు జేసెగా
లియు గంబు నందు జనుల కామితములఁ దీర్పగన్


చంపకమాల
క వితాపి తామహు డు ప్రస్తు తిజేసె నుదేవ దేవునే
మ ల స్వామి రూపము నుక్క గదల్చె డిభాగ్య మిమ్మనే
ముము నుబంచు కీర్తన లుమోహ నుపైన యయంయ గూర్చెనే
దిల ముసేయ రేజను లపాడ రెవాని నిభక్తి తోడనే

Thursday, May 13, 2021

గురువు గారిపై - అనంత సన్మానము నకు

1. హరిగతి రగడ

పద్యము వ్రాయుట రాదను బాధనె బాపెడి యొజ్జకు వందనమిచ్చెద

విద్యను నేర్పుచు ముందుకు సాగెడి వేల్పుకు భక్తిగ వందనమిచ్చెద

గద్యము చెంతనె యాగెడి వారిని గాచెడి నౌమకు వందనమిచ్చెద

నాద్యులు తానయి జ్ఞానము పంచెడి యార్యులకెప్పుడు వందనమిచ్చెద

2. ఉత్సాహము

విద్య నేర్పుటందు లేదు విసుగు గురువు కెన్నడున్

ఉద్యమమ్ము గాదు తనకు నూపిరనుచు సాగుచున్

హృద్యముగను బోధ సేయు మృదుల గురువరేణ్యుకున్

పద్య రచన తోడ దెల్ప వలయు వందనంబులున్

3. ఆట వెలది 

విద్య నేర్పుచుంద్రు విత్తము గోరరు

తాను  వ్రాయుటైన మాని వేసి

శిష్య గణము కొఱకు స్థిర చిత్తులగుచుందు

రట్టి గుఱువు కిత్తు అంజలులను


4. ఆట వెలది 


పద్య విద్య మాకు పంచుట కొఱకయి

బృంద మొకటి గూర్చి వృక్షమల్లె

బెంచు టొకటె గాక బిడ్డల వోలెను

సాకు చుండె మమ్ము సద్గురువుగ!







శారదాంబకు ప్రియ సుతుఁడు ఛంద బృంద నేతయౌ

శారద మాతకు ప్రియమగు సుతుఁడు ఛందము బృందము నడిపెడు నేతయౌ

కోరిన 


శారదాంబ ప్రియసుతుండు ఛంద బృంద నేత మా

భారమున్ వహించి విద్య పంచు యొజ్జ గా తనన్

కోరినంత చేత మాకు

చేరదీసి యాదరించు 



గోదారమ్మ వడి తన బడి

గోదారమ్మ వడిని పెరిగి

భూదేవి వలె సహనమును మోయుచు 



శారదాంబ సుతుఁడు మనకు ఛందములను నేర్పునే

భారమున్ వహించి విద్య పంచు జ్ఞాన దీప్తి యే

సారసముగ జెప్పుటందు సహన శీలి


కీర్తి కాంక్ష లేదు కలిమిని గోరరు

యోర్పు తోడ నేర్పు యొజ్జ తమరు

ఋణము దీర్చ లేను 


3. విద్య నేర్పు తారు విత్తము గోరరు

తాను వ్రాయుటైన మాని వేసి

శిష్య గణము కొఱకు స్థిరచిత్తము తోడ

నిల్చి యుండు గురువు! నిగ్రహ మూర్తి 


4. పద్య విద్య మాకు పంచుట కొఱకును

బృంద మొకటి గూర్చి వృక్షమల్లె

బెంచు టొకటె గాక బిడ్డల వోలెను

సాకు చుండె మమ్ము సద్గురువుగ!


5. సాహితీ జగమం దుబంధు


ఛంద బృంద సభ్యులమే






శిక్షణ దక్షిణ పక్షము శిక్ష


శిక్షణ నిత్తురు పద్యము 


వేలు ద్రుంచి ఇద్దమన్న ఏకలవ్య గానయా

వేల ధనము బోదమన్న ప్రియము గాదు మీకునున్

కలము బట్టి దక్షిణిత్తు గవనములను! దీక్షనే

ఫలము సతము బూని వ్రాసి పద్యములను దేవరా


ఉత్పలమాల
వృద్ధుల బల్కులన్ విడచి పెట్టుట క్షేమక రమ్ముగా దనెన్
బుద్ధిగ శాంతిగో రుటయె మోదము పంచును! పూరుషా ళికిన్
సిద్ధుడు స్వీకరిం చెనట శ్రేయము జేసెడి మంచి వాక్కులన్
యుద్ధము చేయకుండగనె యోధునిగా వెలుగొందె నిద్ధరిన్
ఉత్సాహము
శాదాంబ ప్రియసుతుండు ఛంద బృంద నేత మా
భామున్ వహించి విద్య పంచు జ్ఞాన దీప్తినే
కోరినంత మాత్రమునను గురువు గాదయుంచుచూ
చేదీసి యలుపు దరిని జేరనీక నడుపు గా



Monday, April 12, 2021

ప్లవ ఉగాదికి నా పద్యములు

 శార్వరి యనూజ! నూతన
పర్వ మునకు తెఱఁను దీయ వచ్చేయమ్మా
యుర్విని గమ్మిన పురుగను
దర్వము దరమఁగ సఱగుఁన దయసేయమ్మా


నూతన వత్సరమా మా
హూతిఁ గొని దిరిఁగి యొసగుమ హోత్సాహమ్మున్
సేతువు గట్టిన మువ్వురు
మాతల ముద్దుల తనయుని మనువుకు రమ్మా



అలసి సొలసితిరిట గడచిన కాలమున్
జనులు ప్రాణ హాని జరుగు ననుచు
గడప దాటకుండ కాలము గడిపిరి
మంచి జేయ రమ్మ! మహికి ప్లవమ!


ఆమని!రమ్మిట! కోయిల తీయగ రాగము వీనుల విందుగ పాడును
మామది నిండుగ స్వాగత మిత్తుము మామిడి తోరణ మాలగ ముంగిట
ప్రేమగ యార్తిని బాపుమ వేదన పెంచక; భూమిజ నాథుని యల్లుడు
రాముని ప్రార్థన జేసెద మేమిట రక్షణ తక్షణ మిమ్మని

Tuesday, April 6, 2021

ఏడూకొండల వాడితో నా ప్రయాణము

అది 2005వ సంవత్సరం. రెండు దశాబ్దాల నా కన్నవారి కృషికీ, నేను కన్న కలల కోసం ఇష్టంగా పడ్డ కష్టానికీ, నాపై నేను, నా వారు ఉంచిన నమ్మకానికీ ఫలితం దక్కిన తరుణం.

నేను కోరుకున్న ఉద్యోగం వచ్చిన సంవత్సరం. ఉద్యోగానికై వ్రాత, మౌఖిక పరీక్షలకు వెళ్ళే ముందు నేను మా అమ్మ వంక చూడగానే తను అన్న మాట,  ఆ కలియుగ నాయకునిపై భక్తి చెదరనీయకు, నీ ఆత్మవిశ్వాసాన్ని ఆ స్వామి చెదరనీయరు అని. నాకు బాగా అలవాటైన మా ఇంటికి దగ్గర లో ఉన్న ఆ స్వామి కోవెలకు వెళ్ళే సమయం కూడా లేదు, ఎంతో దూరంలో ఉన్న పరీక్షకు బస్సులు మారి మరీ చేరాలి మరి! అయినా స్వాభి లేనిదెక్కడ, అందరి ఆత్మలోనూ ఉన్నది ఆ సర్వాంతర్యామే కదా, దిగులేలా యని ఒక్కసారి కన్నులు మూసుకుని స్వామి దివ్య మంగళ రూపాన్ని స్మరించుకుని పరీక్షకు చేరుకున్నానూ, ఆ స్వామి దయతో ఉద్యోగాన్నీ పొందాను. 

మా నాన్నగారికి మొదట అర్థం కాలేదు, నాకు అంత పెద్ద ఉద్యోగం వచ్చిందని! కానీ ఆ స్వామి ఆశీర్వదించారంటే నా భవిష్యత్తుని తను అంత ఉన్నతమైన స్థాయిలో వ్రాసినట్టే కదా!

అటు తరువాత స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుందామని పరుగు పరుగున తిరుపతికి పయనమై వెడితే చూడాలి స్వామి దయ! కాలినడకన కొండ ఎక్కిన అరగంటలోనే దర్శనమిచ్చేశారు స్వామి! ఆ దివ్య మూర్తి! అందరూ ఎంతో సమయం వేచి ఉంటే కానీ దొరకదన్న ఆ స్వామి దర్శన భాగ్యం మాకు మాత్రం నిరీక్షించే అవకాశం రాకుండానే దక్కింది. ఆ క్షణం నా ఆనందానికి హద్దులు లేవు, ఆనందాన్ని వర్ణించటానికి అక్షరాలూ చాలవు. ఆ తర్వాత మాడ వీధులలో నడుస్తుంటే ఒక యోగి రూపంలో దర్శనమూ, ఆశీర్వచనమూ లభించాయి, ఇక మాకెవ్వరికీ అక్కడ నుంచీ కదిలి తిరిగి ఇంటికి రావాలి అనిపించలేదు. 

అది మొదలు, విడువకుండా స్వామి దర్శనానికి మరల మరల వెడుతూనే ఉన్నాము, అంతటితో ఆగలేదు. 

శివునిలో శక్తీ, నారాయణునిలో నళిన దళేక్షణ, బ్రహ్మ లో భారతీ ఐక్యమవటమంటే - ఆత్మ పరమాత్మతో ఏకమశటమే అంటారు.

అలా నేను నాకు సర్వస్వము అయిన నా పతిదేవునితో ఏడడుగులు వేసింది కూడా ఆ ఏడుకొండల ఏకస్వరూపుని సన్నిధిలోనే. అంగరంగ వైభవమైన వేడుకలేవీ వద్దు, ఆ అలమేలు మంగమ్మ స్వామి సన్నిధియే నాకు మక్కువ అని ఆ నారసింహుని జయంతి రోజున ఆ తిరుమలలోనే నా పతిదేవులతో ఏడడుగులూ నడచి, వివాహమైన వెంటనే స్వామి వారి నిజరూప దర్శన భాగ్యం కూడా పొందాను.

ఆ స్వామి దీవెనతో పండంటి బాబుని కని, ఆ పసివాడికి కూడా ప్రతి యేటా ఆ దివ్య మంగళ సవరూపుని దర్శనం చేయిస్తున్నాం. అంతే కాదు, మా బాబుకి ఎంతో చిన్న వయసు నుంచే ఆ తిరుమల సన్నిధి లోని మాడ వీధులలో... ఆ కోనేటి రాయని నమ్మిన బంటు, భక్తుల పాలిటి కల్పతరువు అయిన ఆ రామదూత తిరుగాడిన చోటనే తనూ సంచరించే వాడు.

ఒక్క దర్శనమొందే వేళ తప్ప... మిగిలిన సమయములో, అర్థరాత్రి అయినా సరే, చలికి జ్వరము వచ్చినా మా బాబు లోపలుండి నిద్దరోవటం ఇష్టపడడు మేము ఆ తిరుమలలో ఉన్నత సేపూ... ఇదంతా ఆ స్వామి కరుణ గాక మరేమిటీ అనిపిస్తుంది.

Sunday, March 21, 2021

శక్వరీ ఛందము, పరమేశ వృత్తము

 గురువులకు, పెద్దలకు ప్రణతులతో...  నేను వ్రాసిన పద్యములకు సవరణలు సూచించి సరైన రీతిలో వ్రాయించిన వరలక్ష్మమ్మ గారికి సవినయ పూర్వక కృతజ్ఞతలతో... 


శక్వరీ ఛందము, పరమేశ వృత్తమునకు పద్యములు


స,న,జ,భ,గగ గణములు, యతి 10వ అక్షరము



1. త్రిపురాసురుల హరించి దివ్యుల కెల్లన్

రిపు బాధలచెర దీర్చు పృశ్నివి నీవే

యపరాధులను వధించు నాశ్రిత పక్షా

యపమృత్యువు దొలగింపుమా పరమేశా

పృశ్ని = వెలుగు


2. సిరి సంపదలను గోర చిన్మయ రూపా

కరుణించుమని భజింతు కాముని వైరీ

యరులెల్ల గలుగ జేయు నాపదఁ దీర్పన్

అరుదెంచి దరికి రావయా పరమేశా



3. కలనైన విడువనయ్య కల్మష నాశా

యలుపన్నదెఱుఁగకుండ నార్తిగ నిన్నే

తలతున్ మది నిరతంబు తాండవ రూపా

మలినంబులు దొలగించు! మా పరమేశా


4. భయ నాశము గలిగించు పార్వతి నాథా

లయకార! నిను నుతించు రాగము దీయన్

నయమౌను వెతలు రోదనల్! మరి వేరౌ

నియమంబులను త్యజింతు నే పరమేశా


5. ఎదురీత నెఱుఁగ నయ్య యీశ్వర! దేవా

మదిలో వ్యథలు జనించె; మాపుమ బాధల్

నిధులేవి యడుగ నేను నిశ్చల రూపా

హృదిలోన నిలుపుకొంటి! హే పరమమేశా