Monday, November 26, 2012

కన్నీటి చుక్క

మేఘం కరిగి చినుకయ్యాను
నేలపై పారి ఏరయ్యాను
ఎగసి దుమికే జలపాతమయ్యాను
కలకంటి కన్నీటి చుక్కగా మాత్రం చిక్కనయ్యాను

Monday, April 9, 2012

ప్రకృతి - ప్రత్యేకత

నింగిని చేర నిచ్చెన నేను వేసాను 
నేలన  నిలిచే మొక్క పైకేదిగింది
జాబిలిని తాకలేక పాటలు రాసాను 
చందమామే వెన్నెల తో నను తాకింది 
మేఘం కరగదేమని వాయువుని అడిగాను
సరస్సు తో సరసం ఆడుతూ ఆకులు కనిపించాయి
ప్రకృతి ని కనిపెట్టలేక నేను ఉండిపోయాను 
నా కవితా వస్తువై తను నన్ను పలకరించింది