Tuesday, April 10, 2018

Bhiimaa Nadi

మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమల నుండీ పుట్టిన భీమా (చంద్రభాగా అనే మరో పేరు కూదా వుంది) నది కి ఈ విళంబి లో పుష్కారాలు - వాటిని పురష్కరించుకుని నేను రాసిన దశకం ఇది

సహ్యాద్రి నందు బుట్టీతివీ నీవు
సస్యశ్యామలమూ జెయుటకీ భూమిన్
సంతసమందించుటకూ మాకున్
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

భీమ శంకరుని చరణముల నుండి ఉరికి
విష్ణు పాదోద్భవిని తలపించినావు
శివకేశవ సమానతను జూపినావూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

పస్చిమ కనుమల నుండీ పాకి
దక్షిణ దిశ వైపుగా సాగి
దాహార్తిను నీవు దీర్చినావు
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

కామణ్ డ్యాము ని నీవు నింపినావూ
క్షామం బాధనూ నిలువరించినావూ
క్షేత్రాలన్నీ చక్కగ పండించినావూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

సోమని రూపమున పండరిపురమన దాల్చినావూ
చంద్రభాగగా పేరు గాంచినావూ
చల్లని వరమును ఒసగినావూ
సార్ధకమమ్మ! నీదు జన్మ భీమా

అరియ కుమండలముల నదూ కూర్చుంది
మూల మూథ ప్రవాహినులను జేర్చుకునీ
ఇటుల మరిన్నిటిని నీలో కలుపుకొని తీరం తాకితివమ్మ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

కృష్ణమ్మకు చెంతనె మొదలెట్టిన పరుగు
క్రిందికా అనకుండా సాగెను ముందు
తుదకు మళ్ళీ కలిసేను ఆ కృష్ణవేణి లోనే
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

పుడమిని పచ్చగ పలికించినావూ
ప్రావహమ్మున నీవూ చరియించినావూ
ప్రజల పాట్లనెల్ల దీర్చినావూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

నీ దరిన వెలసితిరమ్మ సకల దేవతలూ
ఆది గణపతి సిద్ధి వినాయకుడూ ఆతని తణ్డ్రి భీమేశ్వరుడూ
విడువలేదు గద పండరిపుర విఠలుడూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

గానుగాపురమందు గురువూ దత్తుడూ
తుల్జాపురమందు లోకాలనేలే జగన్మాతా
కొలువైతిరమ్మా నీ ఒడ్డునే
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

- మాధురి