Sunday, April 6, 2014

ప్రకృతి

నునువెచ్చని ఉషః కిరణాలు సుతిమెత్తని సుమాలు
వర్ణనలకు అందని వర్ణాలతో కుడిన హరివిల్లు
పంచభూతాలు పసిడి లోహాలు పదునాల్గు భువనాలు
లెక్కింపలేని అందమైన జీవరాసులతో కూడినది మన ప్రకృతి


గగనకుసుమమా నీకు గ్రహణమా అద్భుత గ్రహమా ఆపదను గ్రక్కున విడువుమా భానుని చాటున వేకువని దాటి భూమిని చుట్టీ బాలురన్ నీవెంట దిప్పుకొనెడి చాతుర్యమా


చూచుటకు కన్నులు చాలని అందం
శ్వాసించెడి నాసిక పుటలన్ అదిరించేటి సుగంధం
వచియించుటకు వాక్కులకందని వర్ణముల్
వదలివేయుటకు మనసు ఒప్పని బంధం - పుష్పవనం


కురులు అలంకరించేటి
సిరుల గుణం కలిగేవి ఈ
విరులు విరజిల్లాను సౌరభాలు
కరములనందూ ఇమిడేను అందంగాను


వీచే పూవుకు ప్రాణం పోయ ఆర్కుడను కాను
పూరెక్కల సౌరభము మోయ వాయువును కాను
పుష్పము చుట్టూ తిరుగాడే భ్రమరమును కాను
నెలకొరిగిన విరులను తాక పుడమిని కాను
మరి ఏమిటి నేను... ఇదంతా చూచి ఆనందించే మనిషిని... మనిషిలోని మనసును... మనసు పట్టి వ్రాయించే కరమందలి కలమునుండి జాలువారిన కవితను