Wednesday, September 30, 2020

శ్రీ శివుని మీద

 

ఢమరుక ధారీ గనుమా

గమకము లెల్లయు శృతిగొని కమ్మగ పండున్

తమ కరమున నిముడుచు నిట

హిమసుత నాథా కపర్థి! హే ముక్కంటీ



శ్రీశైలం శివుని మీద కంద పద్యములు

[27/09, 19:08] Durgamadhuri1: 

1.

శాసన వాక్కులు దెల్పెను

దాసుల వోలెను కదంబ రాజులు గొల్చే

నీ సఖి భ్రమరాంబను నిను 

శ్రీ సిరి శిఖరపు నివాస! శ్రీశైలేశా

[28/09, 19:54] Durgamadhuri1:

2.

 అల్లన గనుమా కుండిన

పల్లవ నితరులు యొనర్చె భక్తిగ నీకై

నెల్లల నెరుగని సేవలు

చెల్లునె వారిని విడుచుట శ్రీశైలేశా

3.

అరుణాసురుపాలించెను

ధరణిని; తల్లిని జపించి తావర మ్మొందీ

సురులందరు వేడగతా

చిరు కీటకము వలె మారె శ్రీశైలేశా




Tuesday, September 29, 2020

వాన మీద పిల్లలు పాడుకుందుకై నా గేయం

 Sending it to Infobells for publishing


వచ్చే వచ్చే వాన వచ్చే

మనకై తానూ మెరుపులు తెచ్చే


వచ్చే వచ్చే వాన వచ్చే

పంటలు పండే వరమే ఇచ్చే


వచ్చే వచ్చే వాన వచ్చే

పడవతో ఆడే సరదా తెచ్చే


రారండోయ్ రారండోయ్ పిన్నా పెద్దా రారండియ్

వానయ్యను చూసీ మురవగ రారండోయ్


తడువక మీరు తప్పట్లేయండోయ్

మరలా రావారనిపించేలా వానయ్యకు స్వాగతమీరండోయ్

Friday, September 25, 2020

గాయకుడు శ్రీ పతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సందర్భంగా

 కవుల పదము పొందె కమ్మని గాత్రము

నీదు గళము నందు నేర్పు నందె!

యెంత కఠినమయ్య యిటుల జేసే విధి

నిన్ను గొనెను గాదు నీదు పాట



గగన సీమ జేరి గానము జేయుచు

దివిజుల మురిపించు దివిటి! కంట

నీరు ఆగకుండ కారుచుండెనిచట

మాకు! న్యాయమేన మరుగవటము!


బాలు పాడు పాట బహుతీపి! పలుకులు

తేనె లూరు! తాను తీసి పోరు

నటన యందు గూడ! నారద సముడట

గాత్రమందు! యెంత ఘనుడవయ్య!!

Monday, September 21, 2020

మేదుర దన్త వృత్తము కిరీటము శతకము

 1.


నీజ లోచని! ప్రార్థన జేసెద నే వరమిమ్మని వేడెద భక్తిగ
భాతి! నాకును! పద్యము వ్రాసెడి బంగరు విద్యను యీయుమ నిత్యము
శాద! నీ స్తుతి పల్కుచు నంతట క్కగ బోధన జేసెడి శక్తిని
ధాగ యిమ్మని గోరితి యో! వర దాయిని! వందనమమ్మ సనాతని

2.

Sunday, September 20, 2020

తోపెల్ల గురువు గారి వద్ద నా మొదటి పద్యములు

 [09/04, 01:34] Durgamadhuri1: పలుకులు కావవి పదముల కూర్పులు

తేనెలు చిందే తెలుగక్షరములు

[10/05, 23:52] Durgamadhuri1: కచ్ఛపీ నీ కరుణ కలగక

కలము ఎటుయును కదపలేనిక

[12/05, 23:29] Thompella Bala Subramanyam Acharya: రగడకు అంత్య ప్రాస ఉండాలి ప్రతి రెండు పాదాంతాలలో అది లేదు. సరే చంద్రగణాలు ఉండాలి గణాలను చూస్తున్నావా? చూస్తూ సాధన ఎన్నటికీ రాదు. వచ్చాకే సాధన చెయ్యాలి. లక్షణాలు రావాలి తడుముకోకుండా. చంద్రగణాలు 16 నోటికి వచ్చా?

[21/05, 13:32] Durgamadhuri1: కాళింది మడుగులో కృష్ణయ్య తారంగమూ

కాళికా సోదరుని నాట్య సంరంభమూ

[03/07, 23:55] Durgamadhuri1: దుర్గ వాసినీ బాపుమా దుర్గతులను

దుష్ట సంహారిణీ దేవి దోష రహిత

దీన బాంధవి మా దశ దిశయు నీవు

దినకర శశి వహ్ని నయని ప్రణతి దుర్గ!


దుర్గమ్మను స్తుతిస్తూ ప్రయత్నించిన తేటగీతి పద్యము... గురువులు పెద్దలు దోషములున్న తెలుప ప్రార్థన

[05/07, 15:48] Durgamadhuri1: దైవ రూపులు గురువులు ధైర్యమిచ్చి

పద్య రచన సేయుట యందు పట్టు నిచ్చి

భయము కలిగిన స్వాంతన వచనములను

పలుకు నడిపెడి యొజ్జకు వందనమ్ము

[05/07, 17:23] Thompella Bala Subramanyam Acharya: నిర్దోషమమ్మా చాల బాగా మంచి పదాలతో వ్రాసావు శుభమస్తు గ్రూప్ లో పెట్టుమ

[05/07, 17:50] Durgamadhuri1: జీవితమున చీకట్లను చీల్చి మనను

నిలిపి సంసార మందలి నిశులనెల్ల

జ్ఞాన దీప్తితో నింపి య  జ్ఞానమెల్ల

పారద్రోలెడి యొజ్జలకు ప్రాంజలులివె

[05/07, 18:15] Durgamadhuri1: జీవితమున చీకట్లను చీల్చి మనను

నిలిపి సంసార మందలి నిశులనెల్ల 

జ్ఞాన దీప్తితో నింపి య  జ్ఞానమెల్ల

పార ద్రోలు యొజ్జలకెల్ల ప్రాంజలులివె

[09/07, 04:53] Durgamadhuri1: నింగి‌ నంతయు కప్పిన నిశిని ద్రోలు

తారల వెలుగు సైతము తరలి పోవు

కాంతు లీను పదములను కలిగి యెపుడు

ప్రజ్వరిల్లు తల్లీ నీకు ప్రణతి దుర్గ

[09/07, 15:42] Durgamadhuri1: కనికరమున కొరత లేదు కనక దుర్గ

విశ్వ మంతయు గెలిచెడి విజయ దుర్గ

రుద్ర సతిగను యరులకు రుధిర దుర్గ

వందనమ్ము లందుకొనుమా ప్రణతి దుర్గ



[24/10, 08:02] Durga Madhuri: అల్పు రాల నేను నజ్ఞాన ముననుంటి

సరియగు దిశ లేక సంచరించు 

నన్ను చేరదీసి నడిపించు గురువర్య

వందనంబు లివియె వాణి పుత్ర!

[24/10, 08:02] Durga Madhuri: పలుకు రాదు నాకు ప్రాకులాడుట తప్ప

గాలి పదములేమొ కందమాయె

నెటుల సాధ్యమిట్టి నిర్మాణములు దేవ

మీదు మార్గ మందు మేము రాగ

[24/10, 08:02] Durga Madhuri: పెద్ద బంధములను పేర్చుట రాదాయె

భక్తి తోడ నిట్టి పలుకు లమరె

దోషమున్న పేర్మి తోడ తెలుపు నొజ్జ

యేమి యిడగ దీరు ఋణము గురుల

Sunday, September 6, 2020

మేదుర దన్త వృత్తము (కిరీటి వృత్తము) పద్యములు

 [28/08, 23:20] Durgamadhuri1:

[29/08, 11:48] Durgamadhuri1: 


లోకము నేలెడి నాయకి! యెంచక లోపము గావుమ బిడ్డల! మమ్ముల!

యో కరుణా మృత రూపిణి! నిర్వృతి యోగము వేడెద నెన్నడు వీడక

నీకడ యుండెడి భాగ్యమె సంపద నిక్కము యంచుచు మోక్షము నిమ్మని

మా కడ గండ్లను దీరిచి నీదరి మానవ జాతికి నిమ్మని ప్రార్థన

[01/09, 00:18] Durgamadhuri1: 


జంగమ దేవర తాండవ మాడెడి శైలియు నద్భుత రీతిగ నుండును

గంగయు గౌరియు పాదము చక్కగ గల్పుచు నాట్యము లాడగ జూచిన 

యంగన లందరు నేర్చుచు విద్యను హంసల ‌చందము మోదము పంచెడి

భంగిని తాళము గల్గిన తీయని పాటను పాడుచు నాట్యము జేసిరి

[01/09, 16:02] Durgamadhuri1: 

కరు లటునిటు నిల్వగ నీ కరములందు

కాంచనము కురిపించుచు కనుల నిండు

రూపమన దర్శనమిచ్చు లోక మాత!

నిన్ను నిరతము గొల్తును నీరజాక్షి

[01/09, 21:06] Durgamadhuri1: 

మత్తగజంబులు ప్రక్కన జేరెను మాధవ పత్నికి చామర వీచగ

నెత్తుచు తొండము సౌరభ పుష్పము నింపుగ జల్లెను హస్తము నందున

హత్తిన తామర భాగ్యము గన్గొని హర్షము జిమ్మెను పూర్వపు జేతుల

పుత్తడి సైతము నింతటి దీవెన పొందగ పొంగుచు జిల్గుల నద్దెను

హత్తిన - నాటిన; పోతన విరచిత శ్రీ భాగవత పద్యాలు శ్రీ గజేంద్ర మోక్షం లోనిది ఈ పదము

[04/09, 22:24] Durgamadhuri1: 


[11/09, 03:37] Durgamadhuri1: ముక్కెర జూడరె యమ్మకు మోమున ముచ్చట గొల్పెను యందము పొందెను

చక్కని తల్లిని భక్తిగ జూచుచు సంతస మొందుచు మెల్లగ తానిక

చుక్కల మధ్యన నుండెడి చల్లని సోముడు జేరెను మాత శిరస్సున 

దిక్కుల నేలెడి దేవత లందరి దేవిని జూచిన మోదము గల్గును


Failed ones:



[15/09, 16:03] Durgamadhuri1: మోహన రాగము వీనుల విందుగ ముచ్చట గొల్పుచు నుండును నెప్పుడు

మోహన రూపము దాల్చిన విష్ణువు పోరున గెల్చెను భస్ముని యుక్తిగ

మోహము నాశము గానిది యందదు మోక్షము నేర్వుము సత్యము భక్తుల!

మోహన మానస ముండిన పండును మోడుగ మారిన జీవిత గాధలు

[15/09, 16:03] Durgamadhuri1: ముత్యపు కాంతులు చల్లెడి పాదము మోహము ద్రుంచును మోక్షము నిచ్చును

రత్నపు వెల్గులు చిందుచు నాట్యము లాస్యము లాడెడి పాదము ద్వయము

నిత్యము సృష్టికి రక్షణ జేయును నిక్కము సంతస మిచ్చెడి రూపము

సత్యము చిత్తము యామెయె వేకువ ఝామున రేఖకు చేతన మామెయె