Sunday, November 1, 2020

శ్రీ శివుని పై

 స భ ర ||U U|| U|U


ఝటమున గంగా ప్రవాహము శిరమున శశీ ప్రకాశము

చాల లేదా భిక్షపతీ నీకు

పుష్పము లేల నయ్యా నిత్య అభిషేకీ


కైలాసమంతా కపాలమ్ములే

సుగంధములున్నవా సదా భస్మమే

తప సర్ప జ్వాలల ఉష్ణము

హిమ చంద్రుల తెల్లని చల్లదనమూ


అన్నింటి మిశ్రమం నీ ఆశ్రమం

ఆయువు కోరిన వారికిచ్చేవు ఆశ్రయం

అట్టి చిత్రములెల్ల గనీ

అచ్చెరువొందుట మా వంతూ


ఫణులెల్ల నుండును నీ ఇంట

ఇక చోటేదయ్యా వాటికింకెచటైన

నీ పత్ని కురులట నీ కంఠ సిరులట

నీదు జ్యేష్ఠునికి యజ్ఞోపవీతం

పిమ్మట కనిష్ఠునికీ ఆతని పత్నకీ అవేగా రూపం

కాదే మానస నీదు పుత్రీ నాగాభరణా

కుండలినీ శక్తికీ వాసం పన్నగమే


నంది నీ వాహనం సింహం నీ సతిదట

మూషిక మయూరాలూ అచ్చటే ఉండునట

ఆహా ఏమి వింతలయ్యా శివయ్యా

ఎంత చతురత నీదయ్యా


వ్యాఘ్ర పూజిత నీ అర్థాంగీ

శార్దూల చర్మమ్మె నీ ఆసనం

సమస్త జీవరాశి ఇలా నీ పరం

ఇంక కుసుమాలకేదయ్యా స్థానం

మూకపంచశతి - పాదారవింద శతకము

 1.

*మొదటి శ్లోకము .*

*స్మరహరుభామ!  నీదుమహిమన్ సరవిన్ సరిగా గణించి యే*

*ర్పరుపగ నెంతమేటి యొకపాటియ యెంతటియత్నమున్న నీ*

*శ్వరి! ఎగయించె గాంచిపురసౌధవిహారవిశారదా!  మనః* 

*పరమవిపాకమేదొ నఠను ద్వచ్చరణస్తు0ఠతిజల్పనమ్ములన్.*


ఓ కాంచీవిహారరసికా!  నీమహిమమార్గమిట్టిదని నిర్ణయించుటకు ఎంతవాడును సరికాజాలడు. ఐననూ నా మనఃపరిపాకమేమోగాని నీ పాదములను కొనియాడుటలో నన్ను వాచాలుని జేయుచున్నది.

కాంచి పురవిహారీ! నీదు 

దివ్య  మహిమలు! తెల్ప గలమ


/*కాంచి పురవిహారీ! తెల్ప గలనె  నీదు మహిమ

నీదు చరణముల స్మరణే మాకు వెలుగమ్మ

కల్ప తరువు మంకెన పూవు కాంతులు చాలక

వైర మొందు వెలుగుల రాణీ ప్రణతి దుర్గ */


/*చిత్తరువు నిను వర్ణన సేయలేదు జనని

మానస మునందు యాతృతే మరిలేదు శక్తి */


కాంచి పురాధిప నీదు


నా పద్యము final version 


తెలుప తరమ తల్లీ నీదు దివ్య మహిమ

లెన్ని యో! యెట్టివో! గద నెంచి చూడ

వర్ణనలు సేయ గలమ యో వైజయంతి!

భక్తురాలిగ నీకిదే ప్రణతి దుర్గ


2.  శ్రీ మన్నందన వాటికా కిసలయ