Friday, October 5, 2018

Replies to PVR Sir's posts in FB

dhRvuni charitra:

విమాత యైన మాతృత్వమ్ము మారదు గదా
అందరికీ పితయే గాదు అంతర్యామీ ఆతండె గద
యెరుగకనా ఈ సత్యం ఎగిరెన్ సురుచి ఆ ధృవుని మీదన్
లీలయే గద ఇదియంతయూ ఆ లోక నాయకుని మాయయే గదా!


విమాత యైన మాతృత్వమ్ము మారదు గదా
అందరికీ పితయే గాదు అంతర్యామీ ఆతండె గద
యెరుగకనా ఈ సత్యం ఎగిరెన్ సురుచి ఆ ధృవుని మీదన్
లీలయే గద ఇదియంతయూ ఆ లోక నాయకుని మాయయే గదా!

చదివితి నేనీ ధ్రువ చరితన్
తలచితి నేనీ ఘన లీలలన్
పొందితి మది నానందం
ఆ జగత్పితరుని మహిమనేమని నే వర్ణింపన్


On Viswanatha Satyanarayana

వేయి పడగల విద్వాంసుడు
గిరి కుమారుని గీత కారుడు
కల్పవృక్షంతో కవి సామ్రాట్
ఆహా ఏమి పాండిత్యం

వ్యాసుడు సైతం కలవరించెనీ ఆన్నం కోసమె
వేదం మరిచీ పలవరించేనీ భుక్తి కోసమె
కృష్ణుడు గీతలొ బోధించేనీ అన్నంగూర్చే
అటువంటి అన్నదాత తానె కాదా పరమాత్మ

మేరు నగధీరుడయిననేమి మెరిసే ధనవంతుడయిననేమి
మురిపించే బిడ్డల నించీ ముదిమి వయసు వారి వరకూ
పరమాన్నమయినా పచ్చడి మెతుకులయినా ప్రతి ఒక్కరికీ
వేడుకలయినా మరి దేనికయినా వడ్డించేదీ అ న్నమే‌ కదా

నిర్లక్ష్యం సేబోయకటువంటి అన్నమును
నిరంతరం శ్రమియించే అన్నదాత కష్తమ్మునూ
నిత్యము కొలవాలి ఆ పుణ్యమూర్తులనూ
నిక్కంబు ఈ మాట ఎవరు కాదన్నా


ఆచార్యులు వ్రాసే పద్యమ్మునకు ఆలంబన ఈ భాషయె కాదే,
ఆ భాష పుట్టింది ఈ నారాయణుని నించె నపుడు
ఆ శ్రీ హరి, ఈ సిరా ఝరి కారె మరి
ఒకరికొకరు బింబ ప్రతి బింబముల్


తాపసమొనరిచిననే లభ్యమౌను కపిలముని దర్శనం
పాతాళమునకు పయనమయినంతనె కాదు,  తామసమునంతము చేచితేనే అందును ముక్తి
పాపాలను నిలువరిస్తేనే కాదు!!

కాని పేర్మితోడ దొరుకునోయి ఈ భాగవతోత్తములు (మిమ్మల్నే) దీవెన
కావ్యం సైతం వ్రాయించే ప్రేరణ


భక్తి భావం కూడా, మాకు మీరంటే!!
పోతనను సూడలేదు నేను శ్రీ నాధునైన కలవలేదు,
పాల్కురికి తెలియదు నాకు ధూర్జటిని ఐనన్ ఎరుగ నేను
చూచితిని మిమ్ము గగనమున చందురుని వోలె
పద్యముల వెన్నెల పంచగాన్ మాకందరికీ
రచియించుట వచియించుట మీకు చెల్లింది
నేర్చుకొంటూ వాటిలో సేదతీర్చుకొనుట మాకు అందింది

అలకనంద మీద:
---------------------
అలకనందయయి అమృతమ్ముగ వచ్చే
అలుపెరుంగక పారుచు అవసరాలను దీర్చే
అన్ని దిక్కులా తిరిగి అవని అంతయు తడిపే
అలల నిలయమునకు అంతిమంగా జేరే
----------------------------------------------------------------

పూర్వము సీతారామమ్మ గారనే ఓ గ్రుహిణి
ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకుంటున్న సంధర్భములో ఒక బ్రాహ్మణుని భోజనానికి పిలిచారు!

ఆతిధ్యము పొందేవారు అనగా అతిథి కొన్ని నియమాలు పాఠించాల్సి వుంటుంది,
అందులో అతి ముఖ్యమైనది,
వీలైనంతవరకు ఆతిథ్యం ఇచ్చిన వారి మనసు కష్టపెట్టని విదంగా సర్దుకుపోవాలి,
ఈ విషయాలను ధ్రుష్టిలో వుంచుకొనే ఆ సద్బ్రాహ్మణుడు ఆమె వంటలు రుచించకపోయినా, అధ్భుతమైన భోజనము చేస్తున్నట్లుగా ముఖకవళికలు ప్రకటిస్తూ,
మనసులో ఈ వంటలకన్నా
శివుడు మ్రింగిన
హాలాహలమే రుచిగా వుంటుందేమోనని తలపోసుకొంటూ మొత్తానికి భోజనం పూర్తి చేసారు!

తాంబూలసేవనముతోనైనా కాస్త తస్యాంతి పొందవచ్చునని తాంబూలసేవనానికుపక్రమించేలోగా
సీతారామమ్మ గారు వచ్చి
"అయ్యా! తమరికి భోజనము రుచించిందా, పధార్దాలు ఘుమఘుమ లాడాయా,
సుష్టుగా భోజనము చేసారా, క్షుద్బాద తీరిందా? "
అని ప్రశ్నావళి సంధించారు!

అరికాలి మంట నెత్తికెక్కుతున్నా ఆయన "అవును తల్లీ" అని క్లుప్తముగా జవాబిచ్చారు!

అతని జవాబుకి సంత్రుప్తి చెందని ఆ తల్లి తన వంటల మీద ఓ పద్యం చెప్పమని బలవంతం పెట్టింది!

ఇక ఆయన అసహనము కట్టలు తెంచుకున్న ప్రవాహంలా ఈ క్రింది పద్య రూపమలో తన విశ్వరూపం చూపింది

"ఉడికీ ఉడకని మెతుకులు,
 కాటోయిన కందిపప్పు,
 కాగని చారును,  గొడ్డళ్ళతో తెగని బూరెలు,
 సిద్దెలతో మురికి నెయ్య సీతా రామా!"


ఇందుకు నా స్పందన:


సరిగా వండని భోజనం
ఛందస్సు పండని కవిత్వం
భావరహితములౌతున్న నేటి జీవితం
మహిని వలసిన ముచ్చటా ఇది మహదేవా!
రమా వాణీ అన్నపూర్ణ
రామిక్కడికి అంటున్నా
మర్త్యులకది మదికెక్కదె?
మహిని వలసిన ముచ్చటా ఇది మహదేవా


చీకట్లు కమ్మిన చోట
చిన్నారులను తరిమేసిన నాట
చిరునవ్వులను చిందించనీయక
చిదిమివేసారే చెడ్డ మనుషులు!

చేతకాక చేష్టలుడిగి చచ్చుబడ్డాము అంతా ఇక్కడ!
ఇంకా ఏమి వ్రాయను!


Pvr Gopinath శత శతక కర్త
శారదా మానస పుత్రా
శబ్ద, అర్థ అలంకార శాస్త్ర వేత్తల
మీ కావ్య సాహిత్య పరిమళం
ఇంతైన అందిన చాలు
ఇంపైన పద్యాలు మా నుంచి వ్రాలు
ఇటువంటి‌ మీకు, మీ పాండిత్యానికి
నా వందనాలు



అక్షరాలా వాణీ సుతుడు మీరు
అనుదినము వ్రాయు కవులు మీరు
మీ దీవెనలె బలము మాకు
మీ నీడనె నేర్చుకొనెదము మేము
Over messenger in Facebook

వాజపేయుడు పయనమయ్యె
వాగ్దేవి కచ్చట ప్రత్యక్షమయ్యె
వజ్రమంటి నేత మాయమయ్యె
వన్నె తెచ్చే వ్యక్తి మనకి దూరమయ్యె 


Suuryudi kiranammuve neevU Kaarunyamu kaladaaniveevuu Kaanthalake maanikyammu kaademiti Suuryakaantammo neeku Saati raarevarammo Natanalonuu meti neevuu Attavu kaadu Ammavu toti janulaku neevu Aravadam anthaa paipaine Apyaayata nee hridayaanepuduu nindene Bhuvini elinaavu kalaakaarinigaa Diviki eginaavuu Nitya santoshinigaa vardhillutunnaavu telugu manasullo vadili nee teeyati gnaapakaaluu



Padamulu saripovune mee Kavitvaanni varninchadaaniki?
Aksharamulu venakaadune meeku vandanamulidataaniki?
Satakamulu vraayu Saraswatii Sutaa

Andukonumu maa Subhakankshalu



పద కవితా పితామహుడవు నీవూ
ప్రతిభావంతులకు ముందుంటావూ
ప్రతి ఒక్కరికీ మార్గదర్శివి నీవూ

అన్నమయ్య నీవు అందుకో వందనమ్ములు



Puujyaaya Aanjaneya Sakalaabheeshtapradaakya
Paschimam Sri Garudaa Swamyne Namaha Deerghaayushyapradaayakaaya Namaha
Uttaram Sri Lakshmi Varaaha Swamyne Namaha Sarwaiswaryakaraaya Namaha
Dakshinam Sri Lakshmi Narasimha Swamyne Namaha Sarwa Vijaya Kaarakaaya Namaha

Uurdhwam Sri Hayagreeva Swamyne Namaha Gnaana Pradaayaka Namaha

On 20th March 2018, on PVR Gopinath Aachaarya's post in FB, "కోసలేయ! మమ్ము గావుమయ్య!"
My reply to Sri Ramachandra Raju Kalidindi Gaaru's challenge applying Nishiddhaakshari on "R"

Dasaratha tanayudu dayaaguna saagarudu
Raghukula nandanudu raakshasa samhaarudu
Seetaapati sakala gunaabhidhaamudu
Challani chuupula vaadu chandrabimbamu vanti vaadu
Karuninchun sakala bhaktulan
Sikshintun sakala dushtulan
Vachiyimpan bhaktulaatani naamamun
Vattune vegirame vaari chentakin
Potanakorakegina reetin
Bhadruni kada koluvaina vidhamun


కౌసల్య తనయుడు కష్టముల దుంచున్
సాకేతాధీశుడు సకల దుష్టుల డనుబె
కదనభూమి ధీశాలి సకల కళల గుణశీలీ
దయతో భక్తుల చెంతనుండున్

నీరజాక్షుడనక రాముని రాజీవనయనుడనక
వారిజనేత్రుడనక రమణీయుని వనరహూలోచనుడనజ
కారుణ్య కన్నులనకుంటే కృఇపాదృక్కులనకుంటే
రఘుకులతిలకుడని వ్రాయక దశరథతనయుడని పిలుచకుంటేన్
వనజాక్షుడనెదము ఆతనిని నల్ళినదలేక్షణుడనెదము
దయామయ చూపులవాడనెదము ఆతడు దానవులదునిమెడివాడనెదము
అవనీతనయాకామితుడనెదము ఆతండు ఆపదలను కాచెడివాడనెదము
అయోధ్యాపాలకుడనెదము ఆతనిని వాయునందనుని ఇష్టుడని కొలిచెదము



Pvr Gopinath చూచితిని ప్రహేళిక
వేసితిని వేలు నాసిక
పైన జవాబు తెలియక
అయ్యయ్యో ఎంత తికమక నా పద్యం ఫేస్బుక్లో నా పోస్టులో హే కృష్ణదేవరాయా గ్రహించకుంటివా ఈ మాయా తన పర బేధము లేక పత్నినే త్యజించెన్ రాఘవుడై దశావతారుండు యదుకుల భూషనుండై వంశమంతమునుయూ గనుచుండెన్ సర్వమెరింగియున్ అటువంటి ఖర్మ బద్ధుండు నిన్నేల రక్షించుననుకొంటివి! ఓయి క్షత్రియోత్తమా!కవులన్ బోషించి కావ్యముల్ రచియించి కళలన్ నిలబెట్టి దైవమున్ బూజించి ప్రజలన్ పేర్మితోడ పాలించి భాషయున్ బ్రతికించి క్షేత్రముల్ దర్శించితివేని పుత్రునిన్ పొందియును కోల్పోయితివే! విజ్ఞుడవయి విచక్షణన్ విడిచితివె నీవు నీ గురువునే చివరకు శిక్షించితివే కడు చిత్రముగ లేదే ఈ విలాపంబు!


In response to Srimati Sitadevi Gaaru's post in FB on Kridhnashtsmi, 23rd August 2019, Sraavana Sukravaaram:


మురిపెంచెదవయ నీ లీలలతో
ముచ్చెట గొలిపెదవుగ నీ పసి చేష్టలతో
ముకుళిత హస్తమిదే నీకు మా అందరిదీ
మురారి అందుకోవయ్య మా ఈ వందనమ్మె




మనం 'మను'షులం కదా, మరి మనసు స్పందించును కదా!
వెతలు లేని మనసుండునా
వేదన పడని గూడుండునా
వెన్నెల నిండుగ సదా ఉండునా
వెలుగుల రేడుకు మాత్రం ఇది తప్పునా!
మన మనసును నియంత్రణ చేస్తాడు అని చెప్పే చంద్రుడికే తప్పదు కదా బాధ!




భాగవతమ్మెరిగించిరి మాకు
బాగు జరుగుటకు మార్గమొనరించిరి
బ్లాగులెన్నియొ ఇటుల నింపవచ్చు మీరు
భావములెల్ల గ్రహియించెదము మీదు పద్యముల నుంచి



శ్రీ విష్ణు మాయ


విమాత యైన మాతృత్వమ్ము మారదు గదా
అందరికీ పితయే గాదు అంతర్యామీ ఆతండె గద
యెరుగకనా ఈ సత్యం ఎగిరెన్ సురుచి ఆ ధృవుని మీదన్
లీలయే గద ఇదియంతయూ ఆ లోక నాయకుని మాయయే గదా!

Thursday, August 16, 2018

On Vajpayee

వాజపేయుడు పయనమయ్యె
వాగ్దేవి కచ్చట ప్రత్యక్షమయ్యె
వజ్రమంటి నేత మాయమయ్యె
వన్నె తెచ్చే వ్యక్తి మనకి దూరమయ్యె 

Thursday, June 21, 2018

On Suuryakaantammaa

Suuryudi kiranammuve neevU Kaarunyamu kaladaaniveevuu Kaanthalake maanikyammu kaademiti Suuryakaantammo neeku Saati raarevarammo Natanalonuu meti neevuu Attavu kaadu Ammavu toti janulaku neevu Aravadam anthaa paipaine Apyaayata nee hridayaanepuduu nindene Bhuvini elinaavu kalaakaarinigaa Diviki eginaavuu Nitya santoshinigaa vardhillutunnaavu telugu manasullo vadili nee teeyati gnaapakaaluu

Sunday, June 3, 2018

Blood, Toil, Tears and Sweat

Blood Toil Tears and Sweat
Always seems to have become wet
Though the eyes wouldn't have met
These feelings are never felt slept
Hearts have to ensure they're swept
That would bring in Cheers, Glory and Fest

Wednesday, May 30, 2018

తెనుగు గొప్ప పదాలు

భరత ఖండము చక్కని పాడియావు

చెరసాలలే ప్రతి చంద్రశాలలెయగున్

– చిలకమర్తి

మాకొద్దీ తెల్ల దొరాతనమూ

దండాలండోయి మేముండలేమండోయి బాబూ – గరిమెళ్ళ సత్యనారాయణ


శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్య సీమై

యే దేశమేగినా యెందు కాలిడినా – రాయప్రోలు


నీవు ప్రాణాధికవు… నా సరస్వతివీవు వాస్తవమ్ముగ భాగ్యదేవతవు నాకు – తల్లావజ్ఝల శివశంకర శాస్త్ర్య్

గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదు కాసింతసేపు

కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు – నండూరి సుబ్బారావు

మూగవోయిన నా గళమ్మున గూడా నిదురవోయిన సెలయేటి రొదలు గలవు – దేవులపల్లి కృష్ణ శాస్త్రి

తిండి కలిగితేనె కండ కలదోయి కండ కలవాడేను మనిషోయీ

నలుగురు కలిసీ నవ్వే వేళా నా పేరొకపరి తలవండోయి - గురజాడ

భావకవిన్మాత్రము కాన్నేనహంభావకవిని - “పట్టాభి"

పచ్చి బాలెంతరాలు మా భరత మాత

నాదు కన్నీటి కథ సమన్వయము సేయ నార్ద్ర హృదయంబు గూడా కొంతవసరంబు– జాషువా

కొల్లాయి గట్టితేనేమి – బసవరాజు అప్పారావు

మట్టీ మనిషీ ఆకాశం వీటి చుట్టే అల్లుకుంది సృష్టి కథా సూత్రం

మాటకి దండం పెడతా పాటకి దండం పేడతా – ఆచార్య డా|| సి నా రె

వంటింటీ సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా చివరకు వంటింటి గిన్నెలన్నింటి పైనా మా నాన్న పేరే – విమల

ఆర్భాటాలొద్దూ ఆడంబరాలూ ఒద్దూ అందరం అత్యవసరంగా మాట్లాడుకునే విషయానికి వద్దాం – ఆదూరి సత్యవతీ దేవి

అందమైన దోపిడీకీ పవిత్రమైన హింసకూ బలైపోయిన నేను భారత స్త్రీని – ఓల్గా

నేనొక నిషిద్ధ జీవిని
మొన్నటి దాకా నా నవ్వు నిషిద్ధం
నిన్నటి దాకా నా చదువు నిషిద్ధం
నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధం – శ్రీమతి

గతాన్ని కాదనలేను వర్తమానం వద్దనబోనూ
భవిష్యత్తును వదులుకోనూ – కాలం నా కంఠమాల – దాశరథి కృష్ణమాచార్య

మానవత లేని లోకాన్ని స్తుతించలేను ఈ నాగరికతారణ్యవాసం భరించలేను – బాల గంగాధర తిలక్

Okka siraa chukka laksha medallaku kadalika - Kaloji

Naa aksharaalu vennello aadukune andamaina aadapillalu - tilak

Naa jeevitham vadagaadpaite naa kavitvam vennela - jaashuvaa


తెలుగుదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకొండా
యెల్ల నృపుల గొలువ యెరుగవే బాసాడి దేశ భాష లందు తెలుగు లెస్స - ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణ దేవరాయ

నేనంతా పిడికెడు మట్టినే కావచ్చు కానీ కలం ఎత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. - గుంటూరు శేషేంద్ర శర్మ
ఏనుగెక్కినాము ధరణీశులు మొక్కగ నిక్కినాము - తిరుపతి వేంకట కవులు
వాణి నా రాణి - పిల్లలమర్రి పిన వీరభద్రుడు అలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయమూర్తి - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి బిరుదు
ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునపుడు వినిపించు భాష - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క - లక్ష మెదళ్ళకు కదలిక - ప్రజాకవి కాళోజీ
కవి కూడా నేతగాడే‌ బహు చక్కని సాలె గూడు అల్లువాడే - కాళోజీ
అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా - ప్రజాకవి కాళోజీ

శ్రీ వాణీ గిరిజా - నన్నయ అక్షరమ్ము వలయు కుక్షి జీవులకు అక్షరమ్ము జిహ్వకు ఇక్షురసము అక్షరమ్ము తన్ను రక్షించు గావున అక్షరమ్ము లోక రక్షితమ్ము

పలుకు బళ్ళన్నియు పరమ తత్త్వార్థ బోధకములై
ఒప్పు అందాల భాష బహుజన్మ కృత పుణ్య పరిపాకమున చేసి ఆంధ్ర భాష మాట్లాడుతుంటాడు

అరటకులోయల గాలికొండ హైదరాబాద్ గోలకొండ కలసికట్టెను తెలుగుతల్లి కంఠసీమను పూలదండ - బాపు రెడ్డి

తేనె కన్న మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు - ఆరుద్ర

తెలుగు పులుగు చేరలేని దేశంలేదు తెలుగు వెలుగు దూరలేని కోశంలేదు - దాశరథి

కధ కధనం మీద పెద్దిభొట్ల సుబ్బారావు గారి సూక్తి బాగుంది.

సూర్యుడికి, కాంతికీ ఉన్న సంబంధమే, రచయతకీ కళకీ ఉంటుంది. - చలం


పల్లవించిన వాణీ పలుకుల తేనెల రాణీ
ప్రతిభా పాటవాల ప్రాజ్ఞీ సకల విద్యా ప్రదాత్రీ ప్రణామమ్ములు గైకొనుమా


అనుకున్నవెన్నియో జారిపోయినవి, అనుకోనివెన్నియో జరిగిపోయినవి, అందుకే రేపన్న ఆశ మనకు అది కూడ నిన్నగా మారు వరకు’



🟤 *తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో  చూద్దాం...*

1. _‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు_ 
_నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’_
*దేవులపల్లి కృష్ణ శాస్త్రి*

2. _‘‘కప్పివుంచితే కవిత్వం_ 
_విప్పి చెబితే విమర్శ’’_
*డా.సి.నారాయణరెడ్డి*

3. _‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ_ 
_ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’_
*కాళోజి*

4. _‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’_
*నన్నయ*

5. _‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’_
*సుబ్బారావు పాణిగ్రాహి*

6. _‘‘రాజే కింకరుడగు_ 
_కింకరుడే రాజగు’’_
*బలిజేపల్లి లక్ష్మీకాంతం*

7. _‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న_ 
_వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’_
*బసవరాజు అప్పారావు*

8. _‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’_
*గుర్రం జాషువా*

9. _‘అత్తవారిచ్చిన అంటుమామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను’’_
*కాళ్ళకూరినారాయణరావు*

10. _‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’_
*దాశరధి*

11. _‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’_
*నార్ల వెంకటేశ్వర రావు*

12. _‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’_
*తిరుపతి వెంకట కవులు*

13. _‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’_
*గురజాడ*

14. _‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’_
*గరిమెళ్ళ సత్యనారాయణ*

15. _‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’_
*శ్రీనాథుడు*

16. _‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’_
*పోతన*

17. _‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’_
*గద్దర్*

18. _‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’_
*శ్రీ శ్రీ*

19. _‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’_
 *వెన్నలకంటి*

20. _‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’_
*కొనకళ్ల వెంకటరత్నం*

21. _‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’_
*అల్లసాని పెద్దన*
 
22. _‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’_
*చేమకూరి వేంకటకవి*

23. _‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’_ 
*త్యాగయ్య*

24. _‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’_
*ధూర్జటి*

25. _‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు’’_ 
*బద్దెన*

26. _‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’_
*వేమన*

27. _‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’_ 
*కంచర్ల గోపన్న*

28. _‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’_
*సుద్దాల హనుమంతు*

29. _‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’_ 
*ఆరుద్ర*

30. _‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’_ 
*వేముల శ్రీ కృష్ణ*

31. _‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’_
*త్రిపురనేని రామస్వామి*

32. _‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’_
*బాలాంత్రపు రజనీ కాంతరావు*

33 ._‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’_
*అడవి బాపిరాజు*

34. _‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’_
*కరుణశ్రీ*
 
35. _‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో_
*గుడ అంజయ్య*

36. _‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’_
*అలిసెట్టి ప్రభాకర్*

37. _‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’_
*సావిత్రి*

38. ‘_‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’_
*ఖాదర్ మొహియుద్దీన్*

39. _‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను_ 
*బాలగంగాధర తిలక్*

40. _‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’_
*అన్నమయ్య*

41.  _‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’_
*ఏనుగు లక్ష్మణ కవి*

42. _అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ_
*పాలగుమ్మి విశ్వనాథం*

43. _‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ_ 
*చలం*

44. _‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’_
*విమల*
 
45. _‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’_
*నండూరి సుబ్బారావు*

46. _‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’_
*అందెశ్రీ*

47. _‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’_
*చెరబండరాజు*
 
48. _ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు_
*కందుకూరి రామభద్రరావు*

49. _నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ_ 
*నందిని సిధారెడ్డి*

50. _రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’_
*మిట్టపల్లి సురేందర్*

𑁍 _"తెలుగదేలయన్న దేశంబు తెలుగు_ 
_నేను తెలుగు వల్లభుండ........._
_దేశభాషలందు తెలుగు లెస్స_"  *(శ్రీకృష్ణదేవరాయలు)*

🍀 *రానున్న తరానికి ఇవి మనం రాసిచ్చే వీలునామా..CM Reddy*

Tuesday, April 10, 2018

Bhiimaa Nadi

మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమల నుండీ పుట్టిన భీమా (చంద్రభాగా అనే మరో పేరు కూదా వుంది) నది కి ఈ విళంబి లో పుష్కారాలు - వాటిని పురష్కరించుకుని నేను రాసిన దశకం ఇది

సహ్యాద్రి నందు బుట్టీతివీ నీవు
సస్యశ్యామలమూ జెయుటకీ భూమిన్
సంతసమందించుటకూ మాకున్
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

భీమ శంకరుని చరణముల నుండి ఉరికి
విష్ణు పాదోద్భవిని తలపించినావు
శివకేశవ సమానతను జూపినావూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

పస్చిమ కనుమల నుండీ పాకి
దక్షిణ దిశ వైపుగా సాగి
దాహార్తిను నీవు దీర్చినావు
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

కామణ్ డ్యాము ని నీవు నింపినావూ
క్షామం బాధనూ నిలువరించినావూ
క్షేత్రాలన్నీ చక్కగ పండించినావూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

సోమని రూపమున పండరిపురమన దాల్చినావూ
చంద్రభాగగా పేరు గాంచినావూ
చల్లని వరమును ఒసగినావూ
సార్ధకమమ్మ! నీదు జన్మ భీమా

అరియ కుమండలముల నదూ కూర్చుంది
మూల మూథ ప్రవాహినులను జేర్చుకునీ
ఇటుల మరిన్నిటిని నీలో కలుపుకొని తీరం తాకితివమ్మ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

కృష్ణమ్మకు చెంతనె మొదలెట్టిన పరుగు
క్రిందికా అనకుండా సాగెను ముందు
తుదకు మళ్ళీ కలిసేను ఆ కృష్ణవేణి లోనే
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

పుడమిని పచ్చగ పలికించినావూ
ప్రావహమ్మున నీవూ చరియించినావూ
ప్రజల పాట్లనెల్ల దీర్చినావూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

నీ దరిన వెలసితిరమ్మ సకల దేవతలూ
ఆది గణపతి సిద్ధి వినాయకుడూ ఆతని తణ్డ్రి భీమేశ్వరుడూ
విడువలేదు గద పండరిపుర విఠలుడూ
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

గానుగాపురమందు గురువూ దత్తుడూ
తుల్జాపురమందు లోకాలనేలే జగన్మాతా
కొలువైతిరమ్మా నీ ఒడ్డునే
సార్ధకమమ్మ నీదు జన్మ భీమా

- మాధురి