Tuesday, June 18, 2019

శ్రీ మాల్యాద్రి వాసా

జయలక్ష్మి శ్రీ జలజాక్షి నిను జేరంగా
వామభాగమ్మున వారిజాక్షి అయి అలంకరించంగా
సిరులనిచ్చు శుభ లక్ష్మి సేవింపంగా
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

శంఖు చక్ర ధారీ శారంగ పాణీ
శాశ్వతమైన వాడా శాంతి నొసంగు దేవా
శుభములు కూర్చగ రావా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

శీఘ్ర ఫలముల నొసగుచు
శకునములు మంచివి సూచించుచు
శంకలన్ని తొలగించుచు దరహాసముగ నుండెడి
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

శంకరుని రౌద్రము వోలె శతృవులను దరుముచు
శరత్కాలపు శశి వోలె సదా వెలుగుచు
శీతలమ్ముగ నవ్వుచు శత వర్షములు చూచెడి
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

దక్షిణ హస్తమ్ముతో దీవించుచూ
దయగలవానిగ దరినుండి రక్షించును
ధీరత్వమ్ముతొ దుష్టుల దనుమాడువాడా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

భానువారము మొదలు భృగు వారమ్ము వరకును
బహుసురపురములవారిని బ్రోచు బ్రహ్మాండనాయకా
భక్త జన కోటికై భువిపై వెలసిన భాగవత పురుషా
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

సప్త తీర్థముల సలిలముతో శోభిల్లు శ్రీ నారసింహ
సకల చరాచర జగత్తుకు జీవమొసగుమో నారాయణ
శీఘ్రముగా ఫలములనొసగు శ్రీ కరుణాంతరంగా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

ఏకము కాదు ద్విజము కాదు సప్త తీర్థములు
నిను జుట్టుచు జాలువారుచుండంగా
ఏడు జలములతోడ మా ఏడుపులు తీసివేయవ
మాల్యాద్రిన‌ వెలసిన దేవా మమ్మేలుకోవా

కపిల, అగస్త్య మహర్షులు, ఇంద్ర వరుణ దేవతలూ
జ్ఞాన స్వరూపమగు జ్యోతి సైతం తీర్థమ్ములు కాగా
శివకేశవులైన శంకర నారసింహములు సైతం చేరెనిచట
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

పశ్చిమాన అహోబిలమున నుంటివీవు
ఉత్తర దక్షిణాన పెన్నా కృష్ణవేణిలు పారుచుండగా
ఆ కృష్ణమ్మ వాయువ్యాన శ్రీశైలమ్ముతో కలపంగా వెలసిన
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

వృచాచల, సింగరాయకొండ లలో వెలసి
పూర్వ, వామ దిశలందు వాటిని నిలిపీ
సర్వ దిక్కులా మాకు అండగా ఉన్న అప్పన్నా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

నీ దర్శనం కొరకు ప్రయాస పొందెడి నరులకై
నీ దేవి అగు మా మాత అభిమతము దీర్చుచు
ఇన్ని విధములుగ అందిన కారుణ్య మూర్తి
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

ఏడు తీర్థముల వాని తోడ ఏడుకొండల స్వామి,
శివ పార్వతుల వెంటే వీరభద్ర స్వామి
నీకు జతగా జనులను దీవించు చోట వసియించిన
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

సమీపమున నున్న మొగలిచర్లలో
సద్గురు రూపమున సేద దీరుచు
సన్మార్గమున మమ్ము నడిపెడి
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

పర్వతాలే ఆవళీలుగా నిలిపిన నిఖిల లోకేశా
ప్రకృతి సోయగాలే నీకు జావళీలు ఓ పరమేశా
పరంధామునివై ఆర్త రక్షణ చేయు సర్వేషాం
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

నీ నామమే మాకు సర్వం స్మరణయె గానం
పారవశ్యంతో తన్మయులమై మమేకవడమే మా గమ్యం
నిను పొందుట నీ భక్తలకెపుడునూ సులభమే కదా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

యోగులయిన నీ యందు జోగుతేనే కదా రంజనం
మమ్ము అటువైపు నడిపించే మీకు సదా వందనం
తప్పు లెన్నడైన చేసినా దండించక తరియింప చేయుమా
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

మహా ఋషులు మరెన్నో వృక్షాలు మృగాలూ
సమస్తమూ సత్యమైన నిను సేవించుచు
సతతము నిను స్తుతియించుచు  సంతసమొందునుగా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

స్థిరవారమున నీవూ నరులకందెదవూ
స్థితప్రజ్ఞతనూ ఇవ్విధముగ మాకూ నేర్పించినావూ
స్థిమితముగ నిను తలచి శాంతి నొందెదమూ
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా



సింహాచలేశ్వరుడు చందనోత్సవుడు
సిరి మా లక్ష్మి విభుడు చెంగల్వ పూదండ ధారుడు
ప్రహ్లాద వరదుడు పరమేశ సఖుడు
నవక్షేత్ర నివాసి నారసింహా నమోస్తుతే




Saturday, June 8, 2019

Sri Sai

సద్గురు రూపా శ్రీ సాయి సమస్త లోక రక్షకా శ్రీ సాయి
ముక్తి కారకా మోక్షదాయకా ఆనందదాయకా ఆత్మసిద్ధి నాయకా
ద్వారకామాయివాసా దయాసాగరా దారిద్ర్య నాశకా దాక్షిణ్య భావా
సదా మమ్ము కాచుము దేవా  సంతోషమ్మునొసగుము దేవా



అమ్మయైన విడుచునేమో ఆకాంక్షలకు లోబడి
అమృతమును పంచు ఈ గురువు

అవని అంతయు కాచున్