Thursday, November 28, 2019

శ్రీనివాస గోవిందా

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు
కోరినట్టీ వరములు దీర్చెడి దేవుడూ
స్థిరచరములన్నియును తానై నిండినవాడూ
శ్రద్ధాభక్తులతో పూజించెడివారి అభిమతములు పండించెడివాడూ


🙏🙏🙏🙏🙏🙏🙏
సప్తగిరీశా సహృదయధామా
సాలగ్రామ వాసా సాకేతధామా
సాలంకృత సిరుల తల్లి లక్ష్మీ నాధా
సాధు సజ్జన పోషకా వందనం



వేంచేసెనమ్మా ఆ శ్రీ వేంకట నాధుడూ
వేదాలకెల్లా ఆతండు మూలంపు పురుషుడు
వేదనలలనెల్లా తీసేటీ ధీరుడూ
వెన్నెలకు తోబుట్టువునూ ఏలేటి వాడూ


🙏🙏🙏🙏🙏🙏🙏
సప్తగిరీశా సాలగ్రామ ధర
సాధుజన రక్షక సకల కళా వల్లభ
సమర్థ‌ పరి పోషక సౌందర్య రూపా
సీమంతిని పతివై సేవలను పొందితివీ




[24/04, 21:14] Durgamadhuri1: గోవిందా గోవుల పాలకా
గైకొనుమా మా ఛందోరహిత
గద్యాన్నీ గమకాలు తెలియని
గానాన్నీ గ్రహియించుమయ్యా మా
గమనము పయనము నీకైనేనని
గమ్యము పథమూ నీవేయని
గజలక్ష్మీ పతి ఓ గరుడగమనా
గంగాపితవైన ఓ పాపవినాశా

కేశములిచ్చిన క్లేశములు దీర్చెదవు
కొండ ఎక్కి వస్తే కొరతలన్ని తొలచేవూ
కోరినవారికెల్ల కొంగుబంగారవే
కొలువుతీరిన కోమలాంగీశా
కైదండలివిగో వైకుంఠవాసా
కైమోడ్పులీయవే కరుణాంతరంగా
కాడు దయను చూపులు మాపై కడలి నిలయా


 గోవులను కాచావా గోపాలా
గోవర్ధన గిరిని ఎత్తావా గోవిందా
గోరు ముద్దలు తిన్నావా పసివాడా
లోకాలన్నీ ఉదరమున ఉంచిన వాడా
వేకువ నేటికాయెనా నీ భక్తులకూ
వేంకటగిరి పై నిను దర్శించుటకూ
వేణు గాన లోలా వేంకట రమణా మా
వేదనలు తీర్చవా ఆపద్బాంధవా



[14/06, 20:12] Durgamadhuri1:

 కోరితి నే కోనేటి రాయని
ఈ రీతిని క్షీణమెరుగని
అక్షరములతో క్షీరసాగర శయనుని
శరణమీయమని రణములు వలదని
శంఖు చక్ర ధారుని శాంతాకారుని
శేషతల్పము నలంకరించిన వారిని
శక్తీ దేవి శంభుడు శరభుడు
కొలిచిన వానిని కొరత లేకుండా
మాకు కొంగు బంగారం సేయమని యా
కల్పతరువు సహోదరిని చేపట్టిన వానిని
కంసుని చెర యందు పుట్టిన వానిని
కుబేరుని విహంగమునొసగిన వానిని
కాముని దండ్రిని సోముని చుట్టమును
మము దయ జూడమని
మహినందూ అమరలోకమందూ
ఆనందంబులే యొసగమని

[14/06, 20:12] Durgamadhuri1

: కోనేటి రాయా కోదండ రామ
కోమలాంగి పతివే మా యందరి
కోరికలెల్ల దీరిచి మా
కొంగు బంగారమ్ము సేయవే
కొలుతును నిను సదా ఆలపించి
కీర్తనల్ యాలకించవే మాపై
కినుక వహించక మా తప్పులెల్ల
క్షమియించా కనికరించవో కరుణాంతరంగా

[14/06, 20:12] Durgamadhuri1

: పుడమి యంతయు వెలసిన పురంధర
పయనము సేయలేదని నీ క్షేత్రమునకు
పతనము కానీయకయ్యా మా భక్తి పథమును
ప్రతి దినమూ నిను విడువక కొలుతును
పుణ్య ధామాలు జూడకున్ననూ
పునీతులను గావించుమయా మమ్ము
పునర్జన్మ నిచ్చిననూ మా కర్మఫలముగ
పఠించే విధముగా నీ చరితను వరమీవయ్యా

Monday, November 18, 2019

NZTA

నూ జీ లాండు వెళ్ళినా లార్డు అంటూ ఆంగ్లాన అరువక
నూజివీడు మామిడి పండు అంత తియ్యగా మెలిగే
నూతన సృష్టితో తానూ కలుస్తూ జతగా ఒదిగే
తనదైన శైలి భాష మన తెలుగును మీరంతా విడువక
తృష్ణ తో కొనసాగుతూ మాతృభాష మాట్లాడుతున్నామన్న
తృప్తితో తులతూగుతూ సొంతగడ్డ మీద ఉన్న మమ్ము
ప్రేరేపించే దిశగా ఇటువంటి ఉత్సవమ్ములతో ఉత్సాహంగా సాగిపొమ్ము

దేశభాషలందు లెస్సయైన భాష
దేదీప్యమానంగా వెలుగొందు భాష
దేవతలంతా కోరుకొను ముచ్చటైన భాషా
దేవరాయలంతటి వాడే కొలిచిన భాష
ధైర్యం నింపే నాయకులను మలిచిన భాష
దిగంతాలంతా ప్రజ్ఞాను చాటుకున్న భాషా
దినదినమూ నూతనమై చవులూరించే భాష
దిక్సూచి యై ముందు తరాలను నడపాలీ భాష

కృష్ణ దేవరాయ కొలిచిన భాష
కృష్ణ శాస్త్రి అద్భుతంగా మలిచిన పదములు
కృష్ణ వేణమ్మ ఉరకలెత్తుతూ పొంగిన నేల
కృష్ణుని వోలె కృతకమెరుగని నైజం
అచ్చమైన మన ఆంధ్రుల సొంతం
ముచ్చటైన పద్యములు సైతం
ముల్లోకాలలోనూ తెనుంగుకే సొంతం
ఎల్లలెరుగని కీర్తి కిరీటం మనదే నేస్తం


పేరు: మాధురి దేవి
కలం పేరు: నాగిని


Thursday, November 14, 2019

శ్రీ మహాలక్ష్మీ దేవి

అంబిక తలపున ఉదయించిన వాణీ నెచ్చెలి ఆమె
అంబుధి నుండి ఉద్భవించిన అమృత సోదరి ఆమె
అంబా యనెడి గోమయమున వసియించును ఆమె
అంబరము తానె ఐన ఆదినారాయణునికి పత్నియె ఆమె

భృకుటిన భగభగమను మహర్షి పుత్రిక ఈమె
భద్రుని సోదరి ఐన భ్రమరాంబ నెయ్యమె ఈమె
భువిని ఏలే పద్మ కల్పపు నాయకి ఈమె
భుజంగశయనుడి హృదయవాసిని ఈమె

చంచలా దేవిగా పిలవబడేటి సిరిమాలక్ష్మి
చైతన్యముగ కొలువబడే శక్తికి ప్రియసఖి శ్రీ లక్ష్మి
చదువుల రాణి పతికి పిత్రుని సతియె ఈ లక్ష్మి
చక్కదనాల కొదువలేని చంద్రుని సోదరి మా మహాలక్ష్మీ

####₹#₹₹#₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹


చూడరమ్మ సతులారా జోలాలి పాడరమ్మ
ఈ చిన్నది ఈప్సితునకూ ఈడైనదీ || చూడరమ్మ ||

నిదురయన్నదెరుగకనె నిను జూచు జాబిల్లి
నిశిరాతిరిని నింపేటి నగుమోముల మన తల్లి || చూడరమ్మ ||

సిరులకెల్ల నిలయమట శ్రీ హరికీ హృదయమటా
స్థిరచిత్తముండునటా సహనము దయా ఉన్న చోటా
|| చూడరమ్మ‌||

సీతమ్మ అవతారమటా పతివెంటనే నడచునటా
శ్రీ కృష్ణుని సఖియెనట పడతులెల్ల బ్రోచునట || చూడరమ్మ||

సీమంతిని శ్రీ లక్ష్మి శీఘ్ర ఫలము ఒసగునట
శారదకీ శాంభవికీ సదా ఆమె నెచ్చెలి అట
||చూడరమ్మ||

కామునికీ కమలోద్భవునికీ మాత కదా
కామితార్థమ్ములిచ్చు కల్పతరువు ఈమె కదా ||చూడరమ్మ||


********************"*""**"""""************

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు - అన్నమయ్య కీర్తనకు అనుకరణ:



సొబగుల‌ నవ్వులదీ పెండ్లి కూతురు ||2||
తాను చంచలయై వరిస్తుందీ అర్హులనే

పేర్మి గల మాతయట జలజ వాసినీ ||2||
తాను తిరుగునటా లోకములో ఖగవాహినీ ||2||

కూర్మి సేయునటా తాను కచ్ఛపీతో

  • తాను సేవలందించునూ హిమజదేవికీ ||2||


శ్రీ మహాలక్ష్మీ అష్టకం రాగంలో వ్రాసాను


ఆద్యంత రహితే దేవీ... హృద్యంతర నివాసినీ...
అత్యంత శక్తి యుతే దేవీ... హ్రీం స్వరూపిణి నమోస్తుతే...
ఆనంద ప్రదాయినే దేవీ... ఆత్మీయ స్వరూపిణీ...
ఆణిముత్యాలయవాసినీ... పక్షి వాహినీ నమోస్తుతే...
ఆలయమందలి మూలం నీవే... పంకజమందూ నిలయం నీదే...
లోకమాతగ సమమును జూపే... కరుణవరదా నమోస్తుతే...
శ్రీచక్ర అధిష్టాన దేవీ... శ్రీ కంఠార్థ సహోదరీ...శారంగధర పత్నీ... శ్రీ లక్ష్మీ నమోస్తుతే...
కొల్హాపూర్ మహాలక్ష్మి... కోటిఫలప్రదాయినీ...
కడలి తనూజాదేవీ నీవే కామదాయినీ నమోస్తుతే...
వైకుంఠ రాణీ దేవీ... వైనతేయ వాహినీ
వైజయంతి మాలాధారిణీ... వైభవ లక్ష్మీ నమోస్తుతే...
వెన్నెల రేడు సహోదరీ.. వేదవేదాంగ సారిణీ...
వేణుగానలోలుని రాణీ... వెన్న దొంగ పత్నీ నమోస్తుతే....
శుభములు కూర్చే వరదాయినీ... శ్రేయము కోరే ప్రియదాయినీ...
లోకములేలే పావనీ... వనరుహలోచని నమోస్తుతే


**********₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹

విరించి మాతా వీణాపాణి పూజితా
విష్ణు హృదయ వాసినీ విహంగ వాహినీ
విరమించకుమా మము వీక్షించుట
విన్నపములు మావి వినిపించుమా వేంకటేశునికీ

విషాద వీచిక ఎన్నటికీ మము చేరవలదనీ
వినోదమున మీరున్నా మము వీడవలదనీ
విపణి దాటి వైకుంఠమును మేము అందలేమనీ
విభావరిలోని మా కీర్తనలన్నీ స్వామికి అర్పణమనీ


******************************************

శ్రీ మహాలక్ష్మీ దేవి పై వ్యాజ నిందా స్తుతి

లోకనాధుని హృదయమందే ఊయలూగేవు తల్లి
లోకువేమిటమ్మ నీకు దామోదరుడుండగా

సృష్టి చేసేను ఒక సుపుత్రుడు
ప్రేమను రంజింపజేసేను మనోజుడు

సంతానమునకూ సంబంధాలకూ
సర్దుకుపోవలిసిన అగత్యం లేదు

షణ్ముఖ పత్నీ నీ పుత్రికేగా
షడంగాలిక నీకు దాసోహమేగా

క్షీరసాగరుడు నీ పితరుడంటివీ
క్షీణము వేదిక వనరులకొరకేమన

కామధేనువు కల్పతరువూ కస్తూరికా సురభీ
చింతామణి ఉచ్ఛైశ్రవమూ అక్షయపాత్రా అందులవేగా

చందమామ తోబుట్టువు కాన చల్లదనం నిండుదనం
చక్కదనం కలువవనం సమస్తం నీ ఆధీనం

చీకోటి కోణం ఎరుగని వైనం వీటితో చేరూ
సూర్య మండల సంస్థితా నీవు సింధూర తిలకాంచితా

కశ్యప భృగువులు నీకై ఒనర్చిరి ఘోర తపములు
కలలోనైనా ఉండునా ఇక వారికి తాపములు

కమల నేత్రీ కమ్మని గాత్రీ కరవేమి నీ సోయగాలకు
కళ్యాణాభిలాషుడు జనమజనమలయందు నీ క్రమంగా

జ్యేష్ఠ దేవీ నీ అగ్రజయే నిక ఆమెను దాటి నిను
జేరగలదే ఏ దారిద్య్రం ఐననూ

వైకుంఠ వాసినీ నీ నిలయము ముత్యాల మయము
ఇక నీ కెల్లపుడునూ మది మధురసానందమయమూ

అమృతము నీ సోదరియంట గరళమేమి సేయునిక
ఆదిశేషువె తల్లమైన తల్లి నిన్ను తలచినంతనే ఆదుకొనునె


వైనతేయ వాహినీ కాదే నీది పవన గమనము
నిను కోరే భక్తుల కడకు కొనిపోయే పుణ్య ధామము


****************************************†***


మహాలక్ష్మి వమ్మా మమ్మేలవమ్మ
హేమలతా సుందరీ హరికీ ప్రియ సతి
సుమ మాల సమమా సుందరీ నీకూ
కోరికలు దీర్చవే కోమలాంగి మాకు

Sunday, November 10, 2019

Radio సమస్యాపూరణం

ధర్మము వీడిన వారలకు తప్పక కలుగును శాంతి సౌఖ్యముల్

1. ధనమును ఖర్చు చేయుచు దమనముతొ మెలుగుచు ఇం
ధనముతొ సర్వత్ర తిరుగుచు ముదమదియె అని మదముతొ అదియె ని
ధనమను భ్రాంతిని వీడి క్రమశిక్షణ యే క్రాంతి అనుచు అ
ధర్మము వీడిన వారలకు తప్పక కలుగును శాంతి సౌఖ్యముల్


2.  పరుగులు తీస్తూ పడమటకేగుతూ పచ్చ నోట్లు లెక్కలు పెడుతూ
పూర్వపు లోగిలి పూరిళ్ళొదిలీ పూరణ లేని ప్రశ్నలు
పొందీ పరమాన్నం పరమ అయిష్టం అనకా ప్రేమతో పర
ధర్మము వీడిన వారలకు తప్పక కలుగును శాంతి సౌఖ్యముల్

04 January సమస్యాపూరణం:

నిందారోపణలు హితంబునొసగున్ నీరజపత్రేక్షణా


నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేసిన
నీతిపరులన్ ఎందునా ఎంచలేక అనెడి
నిందారోపణలు హితంబునొసగున్ నీరజపత్రేక్షణా
అవి వేసెడి వారి పాపంబులన్ పెంచి

 02/02(Feb)/2020
అన్నను పెండ్లి యాడెను మహా మహితాత్ములు మెచ్చగా భువిన్


అరణ్యములకైనను పోయెదనీ ఈ అయోధ్య వాసుని చేకొని
అడవులైనను మరి అమరపురమైనను అమూల్యమని అమృత తుల్యమని
అతని సాంగత్యమున ఆ సుమిత్ర నందనుని సహోదరుడు కైక తనయ
అన్నను పెండ్లి యాడెను మహా మహితాత్ములు మెచ్చగా భువిన్


15/Feb

సమస్య: కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితోన్

కైలాసమ్మున కొలువైవున్న కామేశ్వరుని కలువుట
కొరకై మునులు అందరూ అటు చేరంగా తెలిసేనట
గజేంద్రుని కడుపూనందూ చేరాడని వనితలనంపితె ఆ
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితోన్



Padyamairhyd@gmail.com

Tuesday, November 5, 2019

నీటి ఎద్దడి,చందమామ :-- నాగిని

నీటి ఎద్దడి:
=======
నేలను త్రవ్వి చూశాను - నింగికి ఎగిరీ వెతికాను
గాలిలో తేమకై తలచాను - అగ్గిలో ఆవిరైనా ఉందని ఆశించాను
ఎందెందు ఉండునో అన్నన్నీ గాలించాను
కానీ నీటి చుక్కనైనా పొందలేక పోయాను
కన్నీటనైనా కానరాని కాస్తంత తడి కోసం వెతికి వెతికి నీరసించాను
భగీరథుడు యత్నించాడంటే నాడు జగమంతా జలం నిండి ఉంది
విఫల యత్నం నాదయ్యిందంటే నేడు ఇసుమంతైనా అది లేకపోయింది
-- నాగిని (కలం పేరు),  మాధురి (పేరు)

చందమామ -- నాగిని
==============
తెల్లని మల్లెల వంకకు చూస్తే నవ్వుతు చందురుడు కనిపించాడు 
ఎవ్వరు నువ్వు అని పలుకరిస్తే అందరికీ మామను అని చెప్పాడు 
అందుకోవాలని ఆరాటపడితే తాను గగన కుసుమానన్నాడు 
మామ కాని మామ ఎవరంటే చల్లని వాడు చందమామన్నారు
చేయి చాపి చూసి చెంత లేడని తెలుసుకుని 
అద్దం లో కని ఆనందిస్తుంటే
చక్కనైన పుస్తకం - తోడుండే నేస్తం 
జాబిల్లిని మరిపించే గొప్పదనం - చీకటిని పారద్రోలే తెల్లదనం 
ఉన్న "చందమామ" వచ్చింది నాకు వారసత్వంగా పుస్తకాన్ని అందించింది అమ్మ. 

అక్షరాలు నేర్చుతూ అది చదివాను
అందులోని నీతులు తెలుసుకుంటూ పెరిగాను
పసి వయసు నించీ పెరిగాక కూడా పక్కనే ఉంచుకుంటున్నాను
తరాలు  మారినా సముద్రాలు దాటినా వన్నె తరగనిది "చందమామ"
పున్నమే తప్ప అమాస ఎరుగదు ఈ వెన్నెలమ్మ
తీయని మాటలు అన్ని కాలాల్లోనూ పంచునమ్మా


అమ్మమ్మ నించీ తను పొందిందీ అంతటితో ఆగక నాకు పంచింది
నా సుతునికది నేను ఇచ్చాను పెంపకం ఇక కష్టం కాదని అనుకున్నాను
ఆకాశంలోని చందమామ వెన్నెలని పంచునమ్మా
అందుకోవాలని చూస్తే అందని మావేనమ్మా
తెల్లని చల్లదనం, స్వచ్చమైన మంచిదనం కావాలంటే
అద్దం దాకా ఎందుకమ్మా చేతిలో చందమామ ఇదుగోనమ్మా 

శ్రీ పరా దేవతా

పరా దేవత ప్రసన్న వదనం స్రృజియించెను విశ్వాన్ని
శిరమున శశి నింపెను అందున విశ్వాసాన్ని

ప్రకృతికి ఇంత తీయదనమేల ఒనగూరే
పరమేశ్వరి చెరకు గడని కుంచెగా చేసి చిత్రించినందువల్ల

పంచభూతాలకు అంత కారుణ్యమెక్కడిది
అది ఆ తల్లి శరముల నుంచి వచ్చినవి కదా

అష్టదిక్పాలకులు అంత స్థిరంగా ఎలా ఉన్నారు
అది దేవత నొసట నుంచి వచ్చినవి కనుక

సూర్య చంద్రులు గతులెలా నిలబడినవి
అది శక్తి సునేత్రాలు కదూ అవీ

పుడమి తల్లికి ఆ వాన జల్లు ఎక్కడిదీ
రమా వాణీ ల వింజామరల నుంచి వచ్చినవి కదా


కలం పేరు: శేషు (నాగిని)
పేరు: మాధురి

రాజ రాజేశి అష్టక రాగంలో:


అంబా శాంభవి శాంకరీ శార్వరీ పార్వతీ

కాశీ ప్రాసాద నాయకీ శ్రీ క్రీం శుహదరీ

సాయుజ్యామృత ప్రదాయినీ ప్రభావతీ భైరవీ

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా మోక్ష స్వరూపిణీ మోహినీ భార్గవీ

మాతా మలయాచల వాసినీ మాహిషాసుర మర్థినీ

మూకాసురాంతకా ముదితామణీ మృణాళినీ

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా శారద శార్ంగధాదరా శ్రీ శివా ప్రియ సతీ

శార్దూలాసనా స్థితకరీ శశి శేఖర పల్లవీ

అంబా భారతి భవభయహారిణీ భ్రామరీ రూపిణీ

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా వాణీ గాన లోల లహరీ  వామాంకవాసినీ

వారిజాక్ష సహోదరీ విశ్వనుత వీరోచిత శిరోమణీ

అంబాపరాజితా అంబుజాక్ష పూజితా

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా త్రిభువని త్రైలోక్య అర్చితా త్రిపురాంబికా

అజ్ఞానాంధకార నాశిని తిమిర దీపోజ్జ్వలా

అంబా త్రినయనుని తరుణీమణీ తపః ఫల ప్రదాయిని

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి|| శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా సకల కళా వల్లభీ సామగానరస రూపిణీ

చిన్ముద్రాలంకృత చిరుదరహాసిని మృదుభాషిణీ

అంబా మందగమనా మహిమండల పాలినీ మాహేశ్వరీ

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబా చందన చర్చితా చాంపేయ కాయా కళత్రా

కాంచీపురాధిపా కామాక్షి కామదాయనీ

కైవల్య పథార్చితా కైమోడ్పు నేత్రిణీ

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||శ్రీ రాజరాజేశ్వరీ ||


అంబాష్టాదశ పీఠవాసినీ అమంగళ నాశినీ

అష్టైశ్వర్య ప్రసాదినీ అఖిల భువనేశ్వరి

అంబాసురవధాంతకా ఆదిత్య మండల సంస్థితా

ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి|| శ్రీ రాజరాజేశ్వరీ||




గరికపాటి గారి గురించి:

గరికపాటి వారు మొదలెడితే జోరు ఆ
గరిక వారిది అద్భుతమైన తీరు మంత్రించిన
గరిక రీతిని సాగు మనకు పాఠములెన్నో నేర్పు సా
గరిక పోటుకు అది సాటి వారన్నింటా మేటి

రతనముల సంఖ్యతో మొదలగును
మరి భోజరాజు ఆస్థాన కవులను దలపింప జేయును
చదరంగ గడుల సంఖ్యనుండి ఏకత్వమును గోల్పోయిన పిమ్మట
అది నలుదెసలకూ వాటి మధ్య దెశలకూ గలువున్
అదియే మరల వచ్చి జేరున్
మరల వచ్చుటకు ముందు నొకటి మరల గోల్పోవున్
ఉంగరపు వేలుకు ఇటు రెండు అటు రెండు దగిలించినన్ వచ్చెడిది మరల వచ్చినది


ఇరువంటి శివరామకృష్ణ - నాగలక్ష్మి

వరలక్ష్మి విష్ణువుల సుతుండు
తన్నెరింగినవారికెల్ల హితుండు
కుశలము కోరేటి కృష్ణయ్యకు
మదినెరిగి ముదమొనర్చుచు
నగుమోముతొ నడయాడుచు
నీలమేఘశ్యామనాముని సీతారాముని
ఆనందాల గని అరవిందుని అందించెన్

కేశములు - కస్తూరి రంగ రంగా రాగం


తల్లి నీ కురులెల్లనూ దలచినా ఉండవు క్లేశమ్ములూ
మనమునా మరి కొలిచినా జేరవూ ఖేదమ్ములూ

వనమునూ దలపించెడీ విరులు నెలకొన్న కురులూ అవీ
వెన్నెలను నింపేటి ఆ నెలవంకకే తలమానికం

మోముపైకీ ఇంపుగా కనిపించు ముంగురులవీ
మూడవ నేత్రమ్ములో నుండేటి అగ్నినీ చల్లార్చునూ

తిమిరముగ అగుపించెడీ ఆ వర్ణమే అండగా
తాటంకములను మోసెడీ కర్ణమును అవి తాకగా

తాపసులకూ సైతమూ తమగుణమునూ అవి బాపునూ
తరుణులూ శిరములకునూ కోరెడీ సిరి నిధులివీ


-------------------------------------------------------------------

భద్రమ్మునొసగే శ్రీ కాళి దేవీ
భయముల హరియించు నీ కురులు మాకూ

తలపించు తలపై అవీ చిక్కటి చీకటి రాతిరినీ
కాలవర్ణమున కనపడును కాననే ఆ తిమిరమ్ము

భైరవునితొ చేరితెనేమో స్వర్ణవర్ణమగునూ
భక్తులమైన మా కెల్ల శుభములను కూర్చుచూ

Thursday, October 24, 2019

taamraparNii nadi

కమలము నుండీ ఉద్భవించినావూ
అగస్త్యుని వరముగ అవతరించినావూ
సింధూర వర్ణపు సీరె కట్టినావూ
తపస్యోద్భవీ తామ్రపర్ణీ! నీకు నమస్సులమ్మా నీీీీీీీీీీీ

గంగాధరుని ఆనన ఇలకు వచ్చినత్తున్నారు
ప్రవాహముతో మాకు పంటలిచ్చినావూ
దాహార్తిని తీర్చి మమ్ము నీ అక్కున జేర్చినావూ
తపస్యోద్భవీ తామ్రపర్ణీ! నీకు నమస్సులమ్మా

పెయార్, ఉల్లార్, పంబార్ ఉపనదులను కలుపుకొన్నావూ
కరియార్ డ్యాము ని తాకినావూ
పాపనాశనముని జేరి విద్యుత్ నిచ్చినావూ
తపస్యోద్భవీ తామ్రపర్ణీ! నీకు నమస్సులమ్మా

పానతీర్థం, కల్యాణతీర్థం, అగస్తియారు నామాలతో
ముచ్చటగా మౌడు జలపాతమ్ముగ ఎగసినావూ 
మాకు నయనానందమునిచ్చినావూ
తపస్యోద్భవీ తామ్రపర్ణీ! నీకు నమస్సులమ్మా

లంకాపురమునందూ నీవు వెలసినావూ
లక్షణముగా అంతటా మెరిసినావూ
లక్షల ఎకరాలనూ తడిపినావూ
తపస్యోద్భవీ తామ్రపర్ణీ! నీకు నమస్సులమ్మా

చిత్రావతి నదితోడి కూడినావూ
చిత్రమైన వంపులతో ముందుకు సాగినావూ
పశ్చిమ కనుమల మీదుంగా ప్రాకినావూ
తపస్యోద్భవీ తామ్రపర్ణీ! నీకు నమస్సులమ్మా

భారత గ్రంధమ్ములోన గలదు నీదు బలుకు
భువిని జేరితివి గదమ్మా నీవు ఎన్నడోనె!
భాష చాలునటమ్మ నిన్ను వర్ణించుటకున్!
తపస్యోద్భవీ తామ్రపర్ణీ నీకు నమస్సులమ్మా

కృత్తిగా మురుగేశుడు విరాజిల్లెన్ నీదు ఒడ్డునన్
కుంతీసుతుడు సైతము దెలిసికొనెన్ నీదు చరిత్ర
కలరనేకుల్ నీదు సన్నిధిన మోక్షమున్ బొందినారు
తపస్యోద్భవీ తామ్రపర్ణీ! నీకు నమస్సులమ్మా

ఋతుపవనములు నింపెనమ్మ నీదు గర్భమ్ము నీటితో
ఋజువర్తనమ్ముగ నిలిచెనమ్మ నీదు స్థలమున సలిలము
రమణీయమమ్మ నీదు ఘనత
తపస్యోద్భవీ తామ్రపర్ణీ! నీకు నమస్సులమ్మా

ఎంత వ్రాసిన తరగదె నీదు గురించి
ఏమి చెప్పినా చాలునటె నిను వివరించి
ఎట్టివారికయిన దుస్సాధ్యమె నిన్ను సమస్తముగ వచియించుటయున్
తపస్యోద్భవీ తామ్రపర్ణీ! నీకు నమస్సులమ్మా

Vaisakha Suddha Panchami Adi Sankaruni Jayanthi

శంకరుని అవతారముగ ఇలకు జేరినావూ
శక్తి ని పూజించుట మాకు జూపినావూ
సృష్టి రహస్యమ్ము మాకు దెలిపినావూ
వందనమ్ములు నీకు ఆదిశంకరా

అద్వైతమ్మును అందరికీ బోధించినావూ
ఆద్యంతమ్ములు లేని వారిని అర్చించినావూ
ఆర్తితోడ డ్య్వమును చూచుట నేర్పించినావూ
వందనమ్ములు నీకు ఆదిశంకరా

శ్తొత్రములనెన్నో అందించినావూ
శొకములు దరిజేరకుణ్డ బాపినావూ
సంతోషమివ్విధముగ మాకు పంచిన యౌ
వందనమ్ములు నీకు ఆదిశంకరా

ధ్యానమార్గముకు దివ్వెవైనావూ
ధనమెల్లనదియే ద్య్వనామమన్నావూ
దుఖమిలనిటుల దూరమ్ము సెసినా ఈ
వందనమ్ములు నీకు ఆదిశంకరా

ప్రజలనెల్ల పేర్మితోడ గ్రోలినావూ
ప్రాపంచిక బాధలనెల్ల తీస్కున్న ఈ
ప్రకృతి మాత దయను పొందగలిగినామూ
వందనమ్ములు నీకు ఆదిశంకరా

ఆధ్యాత్మికతను అవనికి తెచ్చునావూ
అంతరంగమున నీవు నిలిచినావూ
ఆరాటములనూ ఇటుల తీర్చినావూ
వందనమ్ములు నీకు ఆదిశంకరా

త్రిమూర్తి తత్వమును స్తుతియించిబావూ
త్రిదేవతామణులనూ కొలిచినావూ
త్రిలోక్య పూజ్యుడవైనావూ
వందనమ్ములు నీకు ఆదిశంకరా

పంచమినాడూ నీవు పుట్టినావూ
విశిష్ట వైశాఖమున ఉదయించినావూ
శుక్ల పక్షమున చంద్రునివోలె ఫ్రకసంచినావ్
వందనమ్ములు నీకు ఆదిశంకరా

పంచముడంటూ వేరు లేడన్నావూ
ప్రతి ఒక్కరూ సమానమేనన్నావూ
పరంధాముడే సర్వస్వమన్నావూ
వందనమ్ములు నీకు ఆదిశంకరా

ఏ రీతిన కొలిచెదము నిన్ను
మేమే విధమున్ స్తుతియించెదము మినిముం
పరమాత్మనే సదా అర్చించుచూ నీకు నీరాజనమ్ములొసగెదం
వందనమ్ములు నీకు ఆదిశంకరా

Malluru Narasinha

మల్లూరు యందు వెలసిన నరసింహా
మమ్మేలుకోవయ్య భక్త వరదా
మంగళాలు కలిగించు ముక్తి కారకా
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

నీ అద్రి ఇపుడు హేమాద్రి
నీదు నీడన మేము శరణార్ధులం
నిన్ను నిత్యమూ కొలిచెదము
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

శిశువును మ్రోయు మాతృ హృదయము వోలే
సరోజాక్షి కూర్చుండు పద్మమ్ము వోలె
మెత్తగానుండు ఉదరమ్ము నీది
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

శిల కాదది చెక్కని విగ్రహమ్ము
శ్రీ ఆంజనేయుని చక్కనైన రూపమ్ము
నీదు తోడుగ నిలిచి నిత్యమూ నీ వెంట నుండు
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

నీదు చందనంబు మమ్ము చల్లగుంచు
నీదు దరహాసంబు మాకు ధైర్యమ్మునిచ్చు
నీదు నామస్మరణమ్ము మాకు రక్షణనిచ్చు
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

దుష్టులను దునుమాడితివి దైత్యులను సంహరించితివి
శిష్టులను రక్షించితివి శిశువులు సైతం నిను తలచితిరి
పితృడవు నీవు లోకలకెల్ల పేర్మి పంచగా
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

అన్నింటా నిండి వుంటివి నీవు సర్వవ్యాపకుడైతివి
అందరినీ కరుణతొ జూచితివి నీవు శుభాలు కూర్చుంది
అమ్మతో నీవు కూడి ఉంటివి అమృతమంటి ఆదరణనిచ్చితివి
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా


స్వాతి నక్షత్రాన ఉద్భవించిన సారంగపాణీ
సరస్వతి నిను అర్చించి ఆయెను శార్వాణి
సకల సంపదల లక్ష్మి నీ రాణీ
స్త్రీ అవతారమున నీవు నారాయణీ
సాత్త్విక గుణముతో మము దయ చూడుమ
సతతము ఆపదల నుండి కాపాడుమా
సదా నీ స్మరణకు అనుగ్రహించుమా మా
యందేమైన దోషములున్న మన్నించుమా


చింతామణి నీదు చెంత కొలువయ్యుంది
ఇక మాదు కోర్కెలు దీర కొదువేముందీ
కోరిన వారికెల్ల కొంగు బంగారమె కదా
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

నీదు విగ్రహమ్ము దశ అడుగులు
నీదు ధ్వజస్తంభమ్ము అరవై అడుగులు
నీదు హృదయపు విశాలమ్ము కొల్వలేనంత
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

నిన్ను దర్శించగ దూరాలు తరలి రాలేను
నిన్ను చూచిన పిమ్మట మరలిపోలేను
అందుచేత మా అంతరంగముననే వుండవయ్యా
హేమాద్రి వాసా భక్త హృదయ నివాసా

Annamayya

పద కవితా పితామహుడవు నీవూ
ప్రతిభావంతులకు ముందుంటావూ
ప్రతి ఒక్కరికీ మార్గదర్శివి నీవూ
అన్నమయ్య నీవు అందుకో వందనమ్ములు

తొలి వాగ్గేయకారుడివీ తెనుంగు భాషా కోవిదుడివీ
తుది వరకూ శ్రీ హరినే స్వాశించినవాడివీ
తీయని కీర్తనలని అందించినవాడివీ
అన్నమయ్య నీవు అందుకో వందనమ్ములు

Odugu Gaayatri

శుభమ్ములు కూర్చే సంధ్యా దేవి
సిరులను ఇచ్చే సంపదల లక్ష్మీ
సత్యలోకమ్మునుండీ సరస్వతీ
మువ్వురు కలిసీ చేరిన నిలయం ఆనందాల వలయం

గృహమును దిద్దే శ్రీ గాయత్రీ
గగనమునుండీ ఆ గంగమ్మా
గణ్డములు బాపే మన దుర్గమ్మా
మువ్వురు కలిసీ చేరిన నిలయం ఆనందాల వలయం

నీలాద్రి వాసునీ ఆ నీలకంఠునీ
నిఖిల లోక సృష్టికర్త అస్ బ్రహ్మ దేవునీ
నిరతము జపిస్తూ నిత్యమూ స్తుతిస్తూ
అందరికీ ఆదర్శముగా నిలవాలీ అన్నింటా మన్ననలు పొందాలీ


Raamudu



రామచంద్రుడితడూ రఘువీరుడు
రాజీవలోచనుండూ రణధీరుడు
రారాజు ఇతడూ రాజేంద్రుడూ
రూపలావణుడూ మనోరంజకుండూ

చూడచక్కనైన మోము
చంద్రుడంటి చల్లని గుణము
చెప్పనలవి కాదు నీదు తేజస్సూ
కౌసలేయ! మమ్ము గావుమయ్య!


భద్రుని తోటీ ఆడితివీ
బంటు కాదని అక్కున జేర్చితివీ
బంధముతోడా చెలిమి చేసితివీ
కౌసలేయ!మమ్ము గావుమయ్య!!

ఈ భద్రుడు అద్రి భద్రుడు కాదు, పసితనాన శ్రీ రాముడిని ఎత్తుకు పెంచినవాడు! అందుకే ఆ పేరిమి

దశరథ నందనుడె ఆనతినీయగ
దశ తిరిగేనట దయ చేసెనిచట
దశకంఠుడు కానీ దమనులెవ్వరు రానీ
సర్వత్రా జయకేతనమేనంట

నీరజాక్షుడనక రాముని రాజీవనయనుడనక
వారిజనేత్రుడనక రమణీయుని వనరహూలోచనుడనజ
కారుణ్య కన్నులనకుంటే కృఇపాదృక్కులనకుంటే
రఘుకులతిలకుడని వ్రాయక దశరథతనయుడని పిలుచకుంటేన్
వనజాక్షుడనెదము ఆతనిని నల్ళినదలేక్షణుడనెదము
దయామయ చూపులవాడనెదము ఆతడు దానవులదునిమెడివాడనెదము
అవనీతనయాకామితుడనెదము ఆతండు ఆపదలను కాచెడివాడనెదము
అయోధ్యాపాలకుడనెదము ఆతనిని వాయునందనుని ఇష్టుడని కొలిచెదము

కౌసల్య తనయుడు కష్టముల దుంచున్
సాకేతాధీశుడు సకల దుష్టుల డనుబె
కదనభూమి ధీశాలి సకల కళల గుణశీలీ
దయతో భక్తుల చెంతనుండున్

Rajeeva Lochanuditandu Ramaneeya Ruupakundu
Raghuvamsa Naayakundeeyana
Rishyasringa varaprasaadamu
Raakshasa Samhaarudu
Ramyamaina Gunaalu kalavaadu
Raama Naamambutho Hariharulani melavinchinaadu


Dasaratha tanayudu dayaaguna saagarudu
Raghukula nandanudu raakshasa samhaarudu
Seetaapati sakala gunaabhidhaamudu
Challani chuupula vaadu chandrabimbamu vanti vaadu
Karuninchun sakala bhaktulan
Sikshintun sakala dushtulan
Vachiyimpan bhaktulaatani naamamun
Vattune vegirame vaari chentakin
Potanakorakegina reetin
Bhadruni kada koluvaina vidhamun

Ayonijaga buttii Ayodhya Intanu mettii
Adavalukegii Aapadalanu pondii Analamuna badasen Sadhwii Seeta
Aame viluvan avaniki telipituvi gadayyaa!
Kousaleya! Mammu gaavumayyaa!!


Sakala jeevaatmakundu Srishti Saarvabhoumundu
Soumitri Sodarundu
Seeta Pati
Sugreeva Snehithundu Sundarudayina Hanuma Puujitundu
Kousaleya! Mammu gaavumayyaa!!

Jagadeka Saarvabhoumundu Janakuni Jaamaataa
Jayamu kaligimche vaadu janaranjaka paalakudu
Jaraamarana kaarakundu
Kousaleya mammu gaavumayyaa

Dasaratha tanayudu dasakantha harudu
Dushta Sikshakundu Dharma rakshak Indu
Dyva ruupamitadu dayaa gunitundu
Kousaleya mammu gaavumayyaa

 పురుషోత్తముడే కదా వైకుంఠముననే బడనేల
 పూరుషాళికిన్ మేలు సేయుటకంటెన్ వేరు కార్యము గలదేల
 సమవర్తి ఇలకు రానేల రామునిన్ గొనిపోయి మాకు ఇక్కట్లను ఈయనేల
 కోదండపాణి నిష్క్రమించిన పుడమికి కాదె అది వ్యధ

భద్రగిరి రామయ్య భద్రుని వద్ద పెరిగినావయ్యొ
భయములను దీర్చమనే మా మొరలెరిగినావయ్యా
భక్తులనెల్ల బ్రోవుమయ్యా మా కొంగు
బంగారమే నీవయ్యా ఓ భ్రాతాగ్రజా


సుందరవదనుడని కాదీతండు సుగుణాలశీలి కాన స్మరియింతును
కమలదళాయతాక్షుడని కాదు కరుణా దృక్కులవాడని నే గొలుతును
ఆరడుగుల వీరుడని గాదు ఆపదలు దీర్చు ధీరుడని మ్రొక్కెదను
తీయని రాగం గానం సేయగలడని కాదు తక్కువ వారమని ఎంచక తానే పలకరించువాడని మురిసెదను
సీతాపతి శీతలమగు మది గలిగిన బుద్ధిమతి
దశరధ తనయా దయగలవాడవయా
వెలయుమయ్యా ప్రతి వాడనందయ్యా
కుటిలురనెల్ల ద్రోలుమయ్యా
కుటుంబాలను సదా నిలుపుమయ్యా
మమ్ము అసహాయులను సేయకయ్యా
మా మనసుల్లో సదా నిలువుమయ్యా
కదనరంగమన్నది సృజియించకయ్యా
కలహ, కలతలెల్ల దీసివేయుమయ్యా
కలిసి మెలసి ఉండేట్లు చేసి
కళ్యాణ కాంతులెల్ల మెరిసి
నీ కోవెలగా ప్రతి హృదినీ వెలిగించి
నీతి నిజాయితీ గా మమ్ము బ్రతికించవయ్యా


రణమున నిలువలేని సమయాన
రాముని నామమే తోడమ్మ
ఋజువులే కావాలా అందుకు
అవి మన నిజరూపములే కదమ్మ



శ్రీ రామ చంద్రా శ్రిత పారిజాతా
శ్రియమొసగు దేవా శీఘ్ర ఫలమొసగవా
శ్రేయము నీవే శ్రేష్ఠము నీవే
శ్లోకముల మూలము నీవే మా శోకములు బాపవే


[06/06, 06:51] Durgamadhuri1: కనికరము కోరుచుంటి కాకుత్సకుని నే
కల్పతరువు అని భావించుచుంటి
కష్టము లెల్ల తీర్చమని వేడుచుంటి
కాలము చేసెడి వేడుకలు బాపుమంటి
కదనము సేయగలేను రామా నీ
కధలు వినుటయె విందు కారుణ్య ధామా
క్రౌర్యము చూడలేనయ్యా నేను నీ
కృప తోనే నిలువ గలిగేది


[06/06, 06:51] Durgamadhuri1: అయోధ్య వాసా ఆశ్రిత పోషా
ఆనందము నీయవయ్యా
అనుజుల ప్రేమతో చూసిన
అగ్రజా మమ్మెల్లా బ్రోవుమయ్యా
అరణ్యం అగ్ని ఎదురైనా
అందించయ్యా నీ కరుణా
అభయ వరద హస్తములే మా
ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆనందాలూ


[06/06, 06:51] Durgamadhuri1: శ్రీ రామ చంద్రా శ్రిత పారిజాత
శ్రియమొనరించవయ్యా మాకు
శుభములు కలుగవలెనని మము
శీఘ్రమే దీవించవయ్యా సీతమ్మ నాధా
వానర సేనల చేరీ వాలిని సంహరించీ
వారధి బంధనము వేసీ వారిజాక్షిని కాచిన
వీరుడవయ్యా నీవూ విభీషణుడని ఒప్పిన
విజ్ఞుడవయ్యా నీవూ విను మా వినుతీ




విదేహీశా ఓ వీర రాఘవా
విజయపథమును అలంకరించినా
వినయ సౌశీల్యమును కలిగిన వాడా
విద్యా విషయ సంపన్నుడా ఓ
విశ్వామిత్ర శిష్య రత్నమా
వినీల గగన కుసుమ నామధేయ
వృద్ధ శబరిని గాచిన వాడా ఓ
వనితా లోకజన పూజితా
వశిష్ఠ పూజితా ఓ వానర సేవిత
వాలి సంహారక ఓ వారధి దాటిన వాడా
వర గర్వమును ద్రుంచిన వాడా
విభీషణుడు శరణుమొనర్చిన దైవమా
విపత్తలెల్ల రానీయకు మాకు
విధేయులను చేయుమయ్యా మమ్ము మీకు
విడువనయ్య నీదు నామము నేను
విషపు గుళికలు నాశమొనర్చమని
వినుమా మా మనవి మా
వినుతులెల్ల దీర్చుమా దాశరథి

శ్రీ గురు పూర్ణిమ - శ్రీ వ్యాస భగవానుడు

వ్యాస రూపముననొచ్చి మనకి వేదంబులనిచ్చే
పుణ్యపురుషునిగ నిలిచి పురాణాలను పంచే
ఉత్తమగతులనిచ్చుటకు ఉపనిషత్తులనూ సృజియించే
వైకుంఠవాసుడు విజ్ఞానధాముడూ విమోచనదాయకుడూ

శుకుని వంటి పుత్రుని బడసి మోక్షగామి జీవితమును జూపే
కురువంశమును ముందుకు నడిపీ మహిని కోర్కెలకంతు జూపె
సూతుని వంటి శిష్యుని పొందీ ముక్తికెల్ల మార్గముజూపె
వైకుంఠవాసుడు విజ్ఞానధాముడూ విమోచనదాయకుడూ

సత్యవతియనగా సంసారనావ దాటించెడి చుక్కాని
పరాశరుడెవరయా అంటే సృష్టి రహస్యాన్ని చేధించినవాడు
ఇట్టి వారి సుతుడింకెంతవాడయా ఇలలోన దైవమే
వైకుంఠవాసుడు విజ్ఞానధాముడూ విమోచనదాయకుడూ

యుగములెన్ని గడువనీ అవతరణలు ఎన్ని జరుగనీ
పరమార్ధమ్మొక్కటే పరాత్పరుని చేర్చుటే
ప్రతీ జీవినీ మరీ ప్రతీ కల్పమందూ
వైకుంఠవాసుడు విజ్ఞానధాముడూ విమోచనదాయకుడూ

ఆదిగురువ తొలుత మొదలిడే
అత్రి పుత్రునిగానూ అవతారమందే
గురువుయన్న జ్ఞానదీపికే కదా
గారవించి వారిని కొలుచుకుందమన్న

సప్తర్షులకునూ దక్షిణామూర్తిగనుండే
కుమారస్వామి తానె రమణ మహర్షి ఆయె
గురువుయన్న జ్ఞానదీపికే కదా
గారవించి వారిని కొలుచుకుందమన్న



శ్రీ దత్తుడు
_______&&


త్రిమూర్తుల రూపుడూ
త్రిగుణాతీతుడూ
త్రిపథగామిని వందితుడు
త్రినేత్రాలంకారుడూ
త్రికాలవేదీ త్రైలోక్య పతి
త్రిసంధ్యలయందు పూజనీయుడూ
త్రివేణీ సంగమందుయూ యుండునూ
తనను తలచినంతనే మనను రక్షించునూ

మొగలిచర్ల శ్రీ స్వామి

మొగలిచర్ల స్వామీ
మోము పైన దరహాసీ
మొదలు తు‌దలు నీవే
మోకరిల్లెదము మీకే

మోక్షమునందించుమయా
మోహములను దృంచుమయా
మాతయు పితయు నీవెనయా
మము సదా గావుమయా

మమకారము నీ పైనెనయా
మత్సరమునెడబాపుమయా
మదమును నిలువరించుము స్వామీ
ముదమునందించుము దేవా


అందం - భౌతికం కాదు, భావుకత్వం.

వినీల గగనాన విరిసిన కుసుమమా!
విరుల‌ రేడువైన మా చందమామ!
విహరించుచూన్న నీ పయనమొక లిప్త ఆపుమా!!
విషాదమయమైన మా గాధనిటు వినుమా!
వివరించుచున్న నా గాయాల బాధ కనుమా!
విచారించుచున్న నన్ను ఒక్క మారు ఓదార్చుమా!!

అంటూ నైరాశ్యంతో  నేలకొరిగిన నీరజ చరవాణి "నిన్న లేని అందమేదో... నిదుర లేచెనెందుకో" అంటూ మ్రోగింది. ఉమ్.... ఎదురింటి పంకజం ఆంటీ ఎప్పుడూ ఇంతేగా! కొత్తగా ప్రయత్నం చేసిన వంటలూ తనమీదే ప్రయోగిస్తుంది, పిల్లల దగ్గర సెల్ ఫోన్లో నేర్చుకున్న "ఫీచర్సూ" తన మొబైల్ మీదే చూపిస్తుంది. ఇంకా నయం, ఆవిడ కూడా తనలాగా టెస్ట్ ఇంజనీర్ కాదు, అయ్యుంటే "డిస్ట్రక్షన్ టెస్టింగ్" పేరుతో దానిని మరింత... ఎందుకులే, మళ్లీ ఇప్పుడు అదంతా, అనుకుంటూ ఇంకా మ్రోగుతున్న ఫోన్ వంక చూసింది. తీయకపోతే ఇలాగే‌ ఆగకుండా మళ్లీ మళ్లీ చేసేట్టుగా ఉంది, అసలెవరో చూస్తే పోలా, అనుకుంటూ ఫోన్ తీసింది. చురుకైన తన చక్షువులు అంత నిర్వేదం లోనూ ఫోన్ ఆన్ చేస్తూనే కొత్త నంబరయినా ట్రూ కాలర్ యాప్ ద్వారా ఆ నెంబర్ ఎవరిదో పేరు చూసి మెదడుకు సంకేతాలు ఇచ్చినయి, చమత్కార మైన పేరు, "నెలవంక". భలే ఉందే అనుకుంటూ, ఫోన్ కాల్ ఆన్ చేసి తన తీయటి స్వరంతో, "ఉభయకుశలోపరి"అంటూ సంభాషణ మొదలు పెట్టింది.
అవును, మన భాషలో ఉన్న సౌకర్యాన్ని సౌందర్యాన్ని వదులుకోకుండా వాడుకుంటే బాగుంటుంది కదా! అందుకే ఈ అలవాటు.  అవతలి నుంచి ఒక్క లిప్త పాటు మౌనం, ఆ తర్వాత గాఢంగా ఊపిరి తీసుకుని వదిలిన సవ్వడి. ఇంకా ఎవరూ మాట్లాడకపోవడంతో ఫోన్ కట్ చేయబోయేసరికి‌ ఒక చిన్న చిరునవ్వు వినిపించింది. దాంతో ఎవరూ అంటూ మళ్లీ అడిగింది. ఆ ఒక్క చిరునవ్వు తప్ప ఎంత సేపటికీ ఏమీ వినపడట్లేదు. అందరిలాంటిదైతే ఫోన్ కట్ చేసేసేదే. కానీ ఆమె అలా కాదు, అలా వింటూండిపోయింది. అవును మరి, ఇంతవరకూ ఆమెతో అలా నవ్వినవారే లేరే! కారణం, ఆమె అందవికారం! అవును, సంపన్నుల ఇంట్లో పుట్టిన ఆమె, నిజానికి ఎంతో ఆనందంగా ఉండవలసిన ఆమె, ప్రమాదవశాత్తూ తన మోము, చేతులూ, కాలిపోవడంతో, చూడటానికి ఇబ్బందిగా ఉండేలా తయారయ్యింది.  ఉదాసీనత అనేది దరి చేరనివ్వని నీరజ లాంటి వారికి అది సమస్య కాదు, ఉన్నతంగా ఆలోచించే ఆమెకది ఎదుగుదలకసలు ఏ మాత్రమూ అడ్డూ కాదు, నిజానికి అది కూడా ఒక అవకాశం, ఎదగటానికి, శక్తిగా కాదు, వ్యక్తిగా. అవును, మెడిసిన్ చదివే రోజుల్లో హౌస్ సర్జెన్సీ చేస్తుండగా కలిగిన ఆపద వల్ల తనో అనాకారిగా మారితే, ప్రశంస వస్తే స్వీకరించి, విమర్శలు వస్తే వదిలేసినంత సులభంగా, ప్రమోదం వచ్చినప్పుడు భుజాలు ఎగురవేస్తారు, ప్రమాదం వస్తే మాత్రం బంధాలని మనుష్యులని బయటకు ఎగురవేస్తాం, అన్నారు ఆమె కుటుంబ సభ్యులు. అందుకే, ఆమె ‌‌‌‌అటు జరుగుబాటూ, ఇటు తన ఆసక్తి రెండు కలగలిపి ఉండేలా నర్సు వృత్తి చేపట్టి, బ్రతుకు వెళ్ళదీస్తోంది. దురదృష్టం ఏంటంటే, ఆమె ఎంతో ఔదార్యంతో సేవ చేద్దామని వెళ్ళినా, సగం కాలిన ఆమె మోమును చూసి, పేషెంట్లు భయపడేవారు. చివరికి మొహం అంతా చున్నీ కప్పుకుని చేతులు సాచి పని ప్రారంభిస్తున్నా పసి వాళ్ళు కూడా భయపడి ఏడుస్తున్నారు. దాంతో ఆమె మంచితనం పట్ల గుర్తింపు, గౌరవము తోనూ, ఆమె పరిస్థితి పట్ల జాలి తోనూ హాస్పిటల్ వారు ఆమెకు ఇచ్చిన అవకాశాన్ని ఉంచటమా, ఉపసంసరించటమా అన్న సందిగ్ధంలో పడ్డారు. చేతులు చాచి అడగడం ఇష్టపడని ఆమె, తన ఆసక్తి కారణంగా అటు పేషెంట్లు, తన అవసరం దృష్ట్యా ఇటు హాస్పిటల్ సిబ్బంది బాధ పడటం ఇష్టం లేక, తాను ఉంటున్న హాస్పిటల్ దగ్గరలోని తన గదికి వచ్చి ఇలా చతికిలపడింది. అదుగో, అప్పుడు మ్రోగింది ఈ ఫోన్ కాల్, తీస్తే ఇదుగో, ఈ చిరునవ్వు. ఆ నవ్వులో ఎటువంటి ఎగతాళి, జాలీ కానరాలేదు ఆమెకు, ఆ స్థానే ఒక భరోసా, ఒక ప్రేమ పూరిత పలకరింపు కానవచ్చాయి. 

Gangamma English Telugu

విష్ణు పుత్రిగ ఉద్భవించితివమ్మ
విశ్వమంతయు ప్రాకితివమ్మా
వేణియగ అంతటా జేరితివమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ

వన్నె తరగని చరిత కలదానివిగా
విరాజిల్లుతున్నావు యుగయుగాలుగా
వర్ధిల్లుతున్నావు ఎన్నో రూపాలుగా
వందనమ్ములు నీకు పాపవినశినీ

వేలనామాలు నీకు వుండగా
విడిపాయలుగా ప్రవహించుచూ
వివిధ రూపాల సంతరించుచున్నావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ

వీణాధారిణి నిన్ను కీర్థించగా
వనజాక్షి సైతము నిన్ను కొలువగా
విమలా దేవికి సహోదరివైనావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

విశ్వేశ్వరుని పాదాల చెంత
విశాలాక్షి కన్నుల ముందర
వారణాసి లో వెలసినావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ

మణికర్ణిక ఒక ఒడ్డున
మహాదేవ నిలయం మరో వైపున
మహనీయ స్థలాలు మహిని అంతటా నీ నీడన
వందనమ్ములు నీకు పాపవినాశినీ

ఇంద్రుడు వృత్రుడిని సమ్హరించగా
సకల దేవతలూ దీవించగా
సుధగా వసుధను జేరినావుటా
వందనమ్ములు నీకు పాపవినాశినీ

అక్షయ తదియ నాడూ అవతరించినావూ
అవని అంతటా విస్తరించినావూ
అందరికీ శుభములను జేకూర్చినావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ

ఆకశమున మందాకినిగా అవదరించినావూ
సునాయాసమ్ముగా ఇరావతమ్మును నిలువరించీనావూ
గగనసీమన ఘనముగా ఎగసినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

భగీరథుని మొరను ఆలకించినావు
భువిని తాక నిశ్చయించినావు
భూజనుల పాపాలను రూపుమాపుతున్నావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ

ధ్రువ నక్షత్రమ్మున దిగినావూ
సమస్త తారక మండలాన్నీ తాకినావూ
సత్యలోకం మీదుగా సాగినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

చంద్రశేఖరుని ఝటాఝూటమ్మున నిలిచినావూ
ఆశ్రమములనిండా నీవెయయినావూ
జహ్ను ముని కర్ణమ్మునుండీ ఉబికినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

ఇటుల సాగిస్తూ నీ ప్రయానమ్మునూ
ఇక్కట్లననెన్నో దాటుకుని ఇలను దాకినావూ
ఇక్ష్వాకుల వంశమ్మును దరింపజేసినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

గోలోకమ్మున కృష్ణునితోడ గొలువుతీరినావూ
గంగమ్మగా జగమంతా పేరుగాంచినావూ
గ్రహమంతా(భూ గ్రహం) గృహసీమ విరాజిల్లెను నీ వలననే
వందనమ్ములు నీకు పాపవినాశినీ

విష్ణు పాదోద్భవిగా మొదలయిన పయనం
శివుని శిరస్సునీ జేరెనూ
బ్రహ్మ లోకమునూ నీవు స్పృశ్చినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

త్రిమూర్తుల నిటుల కలిపితివీ
త్రిదేవతలూ నిన్ను తలిచితిరీ
త్రిలోక్యపూజితవు నీవీవిధమున
వందనమ్ములు నీకు పాపవినాశినీ

పశ్చిమమ్మున నుండీ బుట్టీనావూ
పన్నగశయనుడి పుత్రివైనావూ
పాండురంగడి నివాసమందు మిళితమైనావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

హిమాలయములనుండీ మొదలైనావూ
సముద్రమ్ముతో సంగమించినావూ
ఎత్తుపల్లముల నిటుల గలిపినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

కైలాస పర్వతవాసుని తలను తాకినావూ
మేరు పర్వతము మీదుగా మరలినావూ
హిమగిరి తనయగా నిలిచినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

మూడు పర్వతముల నిటుల గలుపుతూ
ముచ్చటగా ముందడుగు వేసినావూ
మురిపెముగా మమ్మూ గాంచినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

పుడమి జనుల పాపభారములు మ్రోయుచున్నావు
ప్రక్షాళన చేయుచూ మమ్ము ఆదరించుచున్నావూ
పుణ్యమూర్తిగ నీవూ వాసికెక్కినావు
వందనమ్ములు నీకు పాపవినాశినీ

దక్షిణ దిశ నుండీ యముననీ
వామ భాగమునుండీ సరస్వత్నీ
కలుపుకుని ప్రయాగని సృష్టించినావూ ప్రయాగని
వందనమ్ములు నీకు పాపవినాశినీ

వసువుల శాపవిమోచనం గావించినావూ
గాంగేయుడకూ మాతవైనావూ
కురువంశమును కాపాడినావూ
వందనములు నీకు పాపనాశినీ

త్రివేణి సంగమమూ తో మూడు నదులనూ
పంచ ప్రయాగతో ఐదు నదులనీ
తద్వారా నీ సోదరీ మణులనీ నీలో లీనం చేసుకుంటివమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ

బ్రహ్మపుత్ర, పద్మల రూపమున బంగ్లాదేశ్ లోనూ,
గండకీ, కోసి ల నామాలతో నేపాల్ని చుట్టి
పవిత్ర భారత దేశం తో త్రిదేశాలనూ చుట్టిన ఘనత నీదమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ

హరప్ప, మౌర్య, మొఘల్, మెగస్థనీస్,
ఎన్నో రాజ్యాలూ, ఎన్నో సంస్కృతులూ
నీ నించే ప్రారంభం నీ వద్దే నిలవడం
వందనమ్ములు నీకు పాపవినాశినీ

వ్యాసముని పూజితవు నీవూ
భాగవతమ్మును నీ ఒడ్డున వ్రాయించినావూ
జగములనెల్లనిటుల నుద్ధరించినావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

వేల యుగముల నాటి నుండీ
వేల మైళ్ళ ప్రయాణమ్ము జేసి
వేల నదుల నీలో జేర్చికొని అందరికీ మాతవైనావూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ

పాలపుంతలను నీవూ దాటినావూ
పాలనురగల తెల్లదనమూ నీదీ
పాప పంకిలము జేసే గుణము నీది
వందనమ్ములు నీకు పాపవినాశినీ

నరుని నరము నీదు నీటియందు మునిగినంతనే
నరకమును దప్పించి నిల్పినావు స్వర్గమ్మునే
గొల్వతరమ నీదు మహిమ గంగమ్మా
వందనమ్ములు నీకు పాపవినాశినీ

పుణ్యమూర్తులకెల్ల నీవు ఉపమానమమ్మ
పుడమివాసుల కెల్ల చేసితివిటుల ఉపమానమమ్మ
పుష్కళమ్ము కాదె నీదు సుగుణమ్ములు టల్లి
వందనమ్ములు నీకు పాపవినాశినీ

అనంత గిరి వాసినీ ఆనందదాయినీ
మార్కండేయ పూజితా ముచికుంద సన్నిహితా
వెలసితివమ్మ విష్ణువు సన్నిధానమున
వందనమ్ములు నీకు పాపవినాశినీ

ఎన్నెన్ని చోట్లకని చేరేవు నీవు
ఎందరెందరు దేవతలకని అభిషేకించేరు నిన్నున్
ఎందరెందరో మునులు వదలక కోరితిరి కదా నిన్నిటులన్
వందనమ్ములు నీకు పాపవినాశినీ

నీ యందు మునిగిన చాలు
అస్థికలనిన్ దెచ్చి కలిపిన చాలు
సకల జన్మల పాపాలూ వెంటనే వ్రాలూ
వందనమ్ములు నీకు పాపవినాశినీ
స్వర్గము నుండీ దిగి వచ్చిన గంగ సర్గలు నీ పై నే వ్రాయంగా వి సర్గలు ఆ ప్రవాహంలో మునగంగా నవ సర్గలు అందులో నే దాయంగా బహు నామములతో నీరు ఉరకంగా బ్రహ్మ కమండలము నుండి నీవు జారంగా విష్ణు పదమును విమల పతి శిరమునూ తాకంగా సకల లోకములూ మీకు మ్రొక్కెనుగా

విఘ్నేశ్వరుడు, సుదర్శన చక్రం మీద ఒకే రాగంలో పాట

శ్రీ గణపతి మీద పాట

ఇట్టి ముద్దులాడేటీ బాలుడెవ్వడే
ఇట్టి ముద్దులాడేటీ బాలుడెవ్వడే
పట్టుకొచ్చి ఉండ్రాళ్ళు కుడుములెట్టరే
వాణ్ణి పట్టుకొచ్చి ఉండ్రాళ్ళు కుడుములెట్టరే ||ఇట్టి||

ఇంతులెల్లా ఇలయందూ తల్లులందునే
ఇంతులెల్లా ఇలయందూ తల్లులందునే
ఇంత మాత్రం గరిక ఇస్తే ఇచ్చగించునే
వాడు ఇంత మాత్రం గరిక ఇస్తే ఇచ్చగించునే ||ఇట్టి||

ఇక్కట్లను తలచినంతనే తీసివేయునే
ఇక్కట్లను తలచినంతనే తీసివేయునే
ఈర్ష్య వంటివాటినన్నీ తరిమివేయునే
వాడు వల్లమాలిన దుర్గుణములు నిర్మూలించునే ||ఇట్టి||

ఇహపరములన్నియూ స్వామి దయేనే
ఇహపరములన్నియూ స్వామి దయేనే
మోక్షమార్గములెల్ల తానే చూపునే మనకూ
ఈశ్వర తనయుడూ శుభములు గూర్చునే || ఇట్టి ||

******************************************
శ్రీ సుదర్శన చక్రం మీద పాట
******************************************

సుదర్శనమంటేనే శీఘ్ర ఫలమే
స్వామి చెంతకు మనను తానె చేర్చునే
స్వామి చెంతకు మనను తానె చేర్చునే || సుదర్శన ||

వైకుంఠ వాసుడూ వరద హస్తుడే
వైకుంఠ వాసుడూ వరద హస్తుడే
అట్టి చేతితోటీ ఆ దేవుడు తినను దాల్చునే
అట్టి చేతితోటీ ఆ దేవుడు తినను దాల్చునే || సుదర్శన ||

మంచివారిని తానెప్పుడూ కాచుచుండునే
మంచివారిని తానెప్పుడూ కాచుచుండునే
వంచించిన వారినీ క్షమియింపడే
వరములిచ్చు ఆ దైవమె చెప్పేవరకునూ || సుదర్శన ||

Friday, October 4, 2019

5 Poets

శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు

కళా ప్రపూర్ణ బిరుదాంకితులు  మీరు
కవి పుంగవుల బృందావనములోన
కలముతోడ నిలిచిన ఘనులు గాద
కాలము తోటి మనుజులు మారవలెనని
కాలిన బతుకుల గాయములు మానాలని
కాలికి పరుగులు అర్థవంతమవ్వాలని
కాంచనమంటె మంచి మనసేనని
కవితాత్మకంగా చెప్పినారు గద
కందుకూరి వారి సిద్ధాంతాలను మా
కందుకోవాలనే తలపును సృజియించి మా
కందుకోసమని మీ రచనల తోడిచ్చిన మీ
కందుకే మా ఈ నీరాజనం ఓ చిలకమర్తీ
ఉత్తమ ఆలోచనల దీప్తీ మీ పలుకులె మాకు స్ఫూర్తి
చిరకాలము నిలుచును మీ కీర్తీ ఓ మానవతా మూర్తి

******************************************
శ్రీ గురజాడ అప్పారావు గారు

గురజాడ వారి వాక్కు గురి గల వాక్కు
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పసి పడుచుల ప్రతినిధమ్మా
మధురవాణి సైతం మగువల మనిషమ్మా
కష్టాలను పడు వారిని చూసి కరిగిపోవునమ్మా
కన్యక, కన్యాశుల్కం రచన చేసెనమ్మా
కడలి లోతు గల తీరు వాటిదోయమ్మా
గిరీశం గారు ప్రతి హృదిలో చిరకాలం నిలిచుపోవునమ్మా
గారడీ చూపుతూనె కార్యములొనర్చు నేర్పు కదుటమ్మా
మలినమనగానేమమ్మా మన మదిలో మూలలే ననెనమ్మా
మురికి సిద్ధాంతాలనే ఊరికవతలకు తర'మాల'నెనమ్మా
ఎంతని చెప్పెద నేనైనా ఇంతటి ఘన సంస్కర్త గూర్చి నింకా
ఎంచగల వారెవ్వరమ్మా శ్రీశ్రీ వంటి వారే ఈయనని గొలిచిరమ్మా
మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మాటల తూటాలు వ్రాయాలీ
మనుష్యులనెంతో మార్చాలీ మనుగడకు దారీ చూపాలీ
నవ్యత్వమ్మునూ నింపాలీ నవ్వుల దివ్వెలు వెలిగించాలీ
నరనరానా ఉత్తేజమ్మును అనునిత్యం రగల్చాలీ
నా దేశమ్మను భావమునూ నేనే దేశమను బాధ్యతనూ
నరులా నరముల పాతాలీ నీ పదమే‌ అందరు పాడాలీ
నీరుగారక స్థిరముగ నిలిచేట్టూ మీరే మమ్ముల నడపాలీ
నిలకడగా ఆ విజయములుండాలీ నిద్దురలోనైన ఈ స్వప్నమె పండాలీ
మిమ్మిక మరువక మేమంతా ముందుకు సాగాలీ
మన దేశపు కేతనం రెపరెపలాడాలీ

******************************************
శ్రీ గుర్రం జాషువా గారు

జాషువా యన్న జాగృతమొనర్చు వారు
జాతులనెల్ల ఏకము చేయగలుగు వారు
జగతియు అంత ఎంతొ చదివినారు
జయములనెల్ల గోరువారు
జననిని గూర్చి ఎంతో వ్రాసినారు
జనులకునెల్ల గుణములు నేర్పినారు
జెండాకెపుడు విలువను ఇచ్చినారు
జీవుల బాధల గూర్చి కలత చెందినారు
గబ్బిలం, ఫిరదౌసి లను మనకు ఇచ్చినారు
గాయకులకెల్ల పదములు పేర్చినారు
గానముకు తగ్గ పల్లవులందించినారు
గుర్రము అను పేరు చిరకాలము నిలిపినారు
పరమేశ్వరుడెల్ల సరసమాడిరంటిరి
పిల్లల వద్దకు తాను జేరి
పసిపాపలపైన పద్యములల్లిరిటుల
పాండిత్యపు నేర్పు గలవారు మీరు
పౌరుషమె ఆభరణమని తెలిపినారు
పిరికితనమును మనములనుంచి తరిమినారు
ప్రజలను చక్కగ ముందుండి నడిపినారు
ప్రగతి బాట వైపు తోడుకొని సాగినారు

******************************************
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు

వేయి పడగలు గొప్ప రచనయ
వేరు ఉపమానము లేదు దీనికి
విద్య నేర్చిన వారు ఎవ్వరూ
వాదన చేయరిందు మాటపై
విషయ జ్ఞానం నందు శిఖరుడవు
విషపు వృక్షములు చీల్చి వేసినా
వినయ విధేయత వదలనివాడవు
వాక్కుల రాణీ పలుకుల మూలకారిణీ
వాణికి సోదర నామధేయుడవు
విశ్వనాథ పలుకు విశ్వమంత వెలిగే
విరుల తేనె చిలికీ వినోదము సైతం పంచే
విజయము నీదు వాకిట నిలువక నిక నేమి సేయున్
వృత్తి ప్రవృత్తి నీకు ఈ కవిత్వమేగా
వీరుడు అంటే ఆ రాముడేనని
వాల్మీకి రచనను వచీయించినావు
కలముతోనే కల్పవృక్షమును సృజియించినావూ
క్షీర సాగర మధనమును పునః సృష్టించినావూ
కీడు మాత్రం అందు లేకుండా చేసి గొప్పవాడవైనావు

*****************************************
శ్రీ బోయి భీమన్న గారు

ఓయి బోయి భీమన్న భారతమునెరిగినావు గదన్నా
బాగు కోరి అందరికీ బంధువైతివి గదరన్నా
బంగరమును పండించితివి బంజరమంటి మనసుల్లో
బహు చక్కగ‌ తట్టితివీ తలపుల పంజరపు తలుపులనూ

బహుమతి నొందితివి సాహిత్యమునందున
బహు ముఖ ప్రజ్ఞాశాలివి నీవన్న
భవితవ్యపు నవ నిర్మాణమ్మును చేసితివన్న
బాపితివీ అంటరాని తనమూ సమాజమునందున

బి. ఆర్. గారీ దారీలోనా నడచీనారూ మీరూ
ప్రజలానెల్లా అవ్విధముగా తోడ్కొని పోయీనారూ
భావగీతములు వ్రాసీనారూ బ్రహ్మాండంగా అవి వెలిగీనాయీ
బీజములనూ నాటినారూ మా అందరి మనములలోనా

మనుజులంతా ఒకటేనంటూ మమతా సమతా ఉండాలంటూ
భాయీ భాయిగా తిరగాలంటూ అటులే హాయిగా ఉండును అంటూ

*****************************************
శ్రీ కాళోజీ నారాయణరావు గారు

వరవిక్రయం అంటూ రచన చేసినారూ
వధువు తరఫున పెద్దగ ఇటుల నిలిచినారూ
విలువలనెన్నింటినో మీరు విడమర్చినారు
విశ్వాసాన్ని మీ రచనలలోని పాత్రల ద్వారా
విగతులమవుతున్న మాకు నేర్పినారూ
వేకువ మనమే కావాలని అభివృద్ధి తలుపులు తెరిచేందుకు
వేచి చూడక్కరలేదని బాధలు తరిమేందుకు అని
వేగు చుక్క అయి మీరు వెల్గినారూ
వెలితిలన్నవి లేకుండా మమ్ము నడిపినారూ

ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయులు
అన్యాయాన్నెదిరించిన అకుంఠిత దీక్షా పరలు
మలినాన్ని కడిగివేయడమే సిసలైన ముక్తి అనినారూ
అధర్మాన్ని శుద్ది చేయుటలొ ఆద్యులైనారూ

బహుభాషా కోవిదులు బ్రహ్మ సృష్టిని శుద్ధి చేసినారు
అసమాన ప్రజ్ఞాశాలి అస్తమించని కీర్తమంతులు
బృహత్తరముగ కార్యమొనర్చగలరు
బృహస్పతి వోలె మము నడిపించగలరు


అణాకధలూ ఇదీ నా గొడవ అంటూ ఎన్నెన్నో వ్రాశారూ
విజయం తుదకూ మనదేనంటూ ధైర్యం మాకు పంచీనారూ
కారాగారమైనా పోరుబాటనెపుడూ వీడలేదూ
బహిష్కరణను సైతం పద్ధతిగనే గెలిచీనారూ

మహనీయుల సరసన నిలువగలిగినారూ
మహోరాష్ట్రులయుండీ దేశమంతా మీదన్నారూ
విదేశీయులనీ నైజాములకూ పీచమణిచినారూ
బిరుదులు నెన్నో గెలిచీనారూ బాధ్యత మాదీ మోసీనారూ


మాతృ భాష ఆడలేని వాడె మర్త్యుడు -
తెలుగు ఉచ్ఛారణకు తెగువ చేయలేని తెగులేమిటీ
భాష పలుకుబడులది కాక పలుకు బడిలోనిది కావాలని
కవితాత్మకంగా సెలవిచ్చినారూ మము మేల్కొల్పినారూ

వందనమిదె మా అందరిదీ ముందర నిలిచిన మార్గదర్శకులకు
వ్రాయగలమా మేము మీ అంత చతురంగా...

*****************************************

శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు

అరువది దశకములన్న ఆడలేదు నీవు అవనిపై
అకుంఠిత దీక్ష చేసినారు అసమర్థతను తరముటకై
ఆద్యులు మీరు వ్యక్తుల ఆలంబనకూ
సుసాధ్యమ్ము చేయ చూపినారు స్వావలంబననూ

మొట్టమొదటి వారు మనోవైజ్ఞానిక శాస్త్రమ్మును
మనుజులెల్లరకు పరిచయము చేసి తెలుగువారి
మనములందు తిరుగాడినారూ
సంధించి నారు తిరుగులేని ప్రశ్నలను
సంధి కాలమందు శృతి సేరవలయు తలపులను
చీకటి మాటున దాగిన తెరవవలసిన తలుపులను
తొలి వేకువై వచ్చినారూ తెర తీయించి మము నడిపినారూ


మీ రచనలతో యణపాశపు ముందు వెనుకలు
మర్త్య లోకపు వింత పోకడలు విశదీకరించినారూ
పరివర్తనమ్ము చూపించినారూ సొగతాలు చదివించినారూ

శిధిలాలయమ్ములు లయబద్ధంగా నిలబెట్టినారూ
శిక్ష వేయకుండా మాకు శిక్షణను అందించినారూ
శిలాఫలకమువోలె చరితలో నిలిచిపోయినారూ
శరత్ వెన్నెలంటి భవిత అందం చవిచూపినారూ

వందనాలందుకోండి మా మార్గదర్శీ
వేనవేల ధన్యవాదాలు మీకు మనోదర్జీ













Monday, September 30, 2019

బతుకమ్మ మీద పాట


కదిలించేశారు....

In Facebook, I have composed and posted on Sharada Madam's wall in continuation to her song:


మా మంచి మైసమ్మా ఉయ్యాలో మగువలెల్లా నువ్వూ ఉయ్యాలో...
మల్లేపూవల్లే ఉయ్యాలో చూసుకో తల్లిగా ఉయ్యాలో...
రక్షగా నిలిచీ నువ్వూ ఉయ్యాలో రెక్కలే ఈయమ్మా ఉయ్యాలో
లెక్కలే అడుగకా ఉయ్యాలో ఎగరనీ సక్కంగ ఉయ్యాలో
కలలెన్నో ఉన్నాయి ఉయ్యాలో కలతల్ని చేరనీక ఉయ్యాలో
కలప చాటున మావి ఉయ్యాలో కాలీన బ్రతుకూలు ఉయ్యాలో
కాలినీ నోటినీ ఉయ్యాలో మెదపలేని గతుకూలె ఉయ్యాలో
కలవనీ లోకంతో ఉయ్యాలో కననీ బిడ్డల్ని ఉయ్యాలో
కళలనీ నేరువనీ ఉయ్యాలో మరువనీకు పుట్టింటినీ ఉయ్యాలో
ఎదగనీ మమ్మల్ని ఉయ్యాలో ఏమార్చనీక ఉయ్యాలో
పొసగనీ పదుగురితొ ఉయ్యాలో పోరు పొక్కూ లేక ఉయ్యాలో
తగవులన్నవె లేక ఉయ్యాలో తెమలనీ తరుణులని ఉయ్యాలో
తిరిగిరానిదే తరుణము ఉయ్యాలో గడిచినదెపుడూనూ ఉయ్యాలో
తెమలనీ బతుకులనీ ఉయ్యాలో తేలికగా సాగాక ఉయ్యాలో
తీపి గురుతులను మాకు ఉయ్యాలో చెయ్యమ్మ ప్రతిక్షణము ఉయ్యాలో
పండుగా మారనీ ఉయ్యాలో పసిగుడ్డుగ ప్రతి కణము ఉయ్యాలో

Thursday, September 26, 2019

సజల నేత్రి - సంద్రమునకు ధాత్రి

నయనమను నీల మేఘము వర్షించి సంద్రము కాగా

నీలవర్ణమున ఉబికే నయనపు నీటి మాటున
అలలుగ‌ తేలిన బాధను బిగిసిన పంటి చాటున
కరిగిన కలలకు సాక్ష్యముగ కాటుక కన్నుల నుంచి
జారిపోయిన మత్యమంటి మనసును నేను

చోర లంచగొండిగ ధనము కూడబెట్టిన
గోల్పోయిననేమినది కొంతయె నిష్ట జీవితమ్మున
అతిగ నితరులపైన తన పనులకు సైతం ఆధారపడి
పిమ్మట ఆరోగ్యమ్ము గోల్పోయిననదియు అంత చేటుగాదు
మరి చెప్పుడు మాటలు విని తప్పుడు గుణముల నింపుకొని
ఆదరించు ఆలిని గోల్పోయిననది తనను తాను
మొత్తము గోల్పోవుటయె గాద
గ్రహియింపుమా ఓ పురుషా!

కన్యాశుల్కం - వరవిక్రయం
ప్రక్రియ ఏదైనా ప్రశ్నార్థకం మగువ జీవితమే
ప్రవర మగవానిది ప్రహేళిక ప్రతి ముదితది
ప్రగతి కారకుండు పురుషుండుట
పడతి బానిసలకు ప్రతినిధట
పురుడు మాత్రమే పుడమి రూపుదట
పుణ్యమైతె అది ఆతనిదట
ప్రముఖుడెప్పడు వరుడేనట
ప్రదోషవేళ మనకతని స్మరణమట
ప్రస్థానమ్మున అగ్రపదవతనికట
ప్రతి విషయమందు మనమనుచరులమట
ప్రయోగశాలలం మనమేనట
ప్రయోజనాలెపుడు వారికెనట
ప్రయత్నమ్ము సేయవలదెపుడట
పతిదేవులను మార్చుటకట
పత్ని బ్రతుకుకునెప్పుడు కటకటే
పదములనెప్పటికీ వెనకేనట
పాపమైతేనే మనము ముందట
అక్కటా అన్ని దశ, దిశలయందునూ ఇదే అవస్థట
యుగ, తరములు గడిచినా ఇది మారదట





Saturday, September 21, 2019

ఆదిత్యుడు

🙏🙏🙏 ఆదిత్యుడు ఈయన ఆద్యుడీ లోకమునకే
ఆరంభం ఈతడే అదితి సుతుండు
అందరి చే వందితుండు ఆర్క నామధేయుండు
ఆవిరి చేయగలడు కడలిని కానీ
ఆంతరంగమున దయామయుండు
ఆదిదంపతులకు అతను నేత్రుండు
ఆనందాలకు మూలకారకుండు
ఆశ్రిత వత్సలుండు అటులే గాద కర్ణుడిని మరి కాచుకుంది
అశ్విని దేవతల పతి ఈతండు ఆరోగ్య దాయకుండు


ఆది దేవుడే ఆగమనము సేయగా
అపూర్వ దిశ నుండి ఆగని గమనము సేయించగా
అనునిత్యము జ్వలించు అగ్ని గుండము సేవించగా
అడుగడుగునా మా అవసరాలను తీర్చుచుండగా
అనంతలోకాలకి అందని దూరమున ఉంటూ
అంబరమున నిలిచి మాకు పగలును అందించుమా
ఆయురారోగ్య ఆనందాలతో మము దీవించుమా
ఆదిత్యునివైన నిన్ను మేము సదా కొలుతుముమా

జగదంబిక జయనేత్రానివైన ఘనుడవు నీవు
జలజాక్షి కొలువైన రథమండలము నడుపు సారథివీవు
జంగమయ్య రుద్రుడై నిలుచు అశ్వవాహనుడవీవు
జానకీపతి కదనరంగాన కొలిచిన ప్రత్యక్ష దైవానివీవూ



వెలుగు ను పంచడం లో అద్వితీయుడవు  వేకువ జాము కు ఆదిముడవు
వెన్నెల మామకు సైతం ఆదర్శ ప్రాయుడవు వేల్పుగా కొలువబడే ఆదిత్యుడవు
సృష్టికి ఆనంద కారకుడవు సకల జీవ కోటి కీ ఆరాధ్యుడవు
సుకుమారమైన పుష్పాలకు సైతం ఆశ్రితుడవు
కర్మ సాక్షీ కాంతి నిలయా కారుణ్య మూర్తి అందుకో మా వందనాలు
భాస్కరా భానుదయా ద్వాదశ రూపా దినకర తేజా దీవించు మమ్ము విజయాలతో



ఆదిత్యుడు అగ్ర స్థానుడు
ఆరంభ కారకుడు ఆరోగ్య దాయకుడు
ఆవిరి చేయగలడు అంబుధిని
అందించనూగలడు అమృతమును

"""""""""""""""""""""""""""""
హే కమలముల‌ రేడా కిరణముల గూడా
నీ వలననే ఏర్పడునులే ప్రతి నీడా
కలువల చెలిమికి నీవే తోడా
తూరుపుపై నీదెపుడు చెదిరి పోని జాడ

నిను కోరే వారికి నీపై కోపమున్నవారికీ
నిందలు బేధములెన్నడు సేయక
సమముగ వెలుగును పంచీ ఇచ్చే
దయగల మమతల సూరీడా

ప్రత్యక్ష సాక్షివీవు ప్రతి కర్మకూ
పలుకవు అయినా ఎటువంటి ప్రశ్నకూ
పయనము మౌనముగ చేస్తూ నీవూ
పూర్వము నుంచి పశ్చిమాద్రి కేగేవూ

ప్రతి నిత్యం పరుగిడుతున్నా
పదిలమే నీలో అంతే శక్తి
ప్రాభవమింతైనా కరగదు; దిన
ప్రచోదనం నీతోనే ప్రారంభం

వామాంకులకూ నేత్రముగా
వాసుదేవునితోనూ వర్ధిల్లుతూ
ద్వాదశాశ్వములతో అలుపెరగక
నడుస్తూ యుగయూగాలనూ దాటిన

ప్రాజ్ఞుడవీవూ ప్రాచీనుడవూ
పసిడీ సైతం నీలో ఒదిగే
ప్రాణాలు సమస్తం నీ వల్లే ఎదిగే
ప్రావీణ్యత అంతా నీదేలే

గగనమున సింధూరంలా భువిపై
పంటలలోనా పచ్చదనంతో వాయువు
లోనాగ్నిలోని ఆత్మవుగా నీటికీ మూలంగా

పంచభూతాలలో ఉనికిగానూ
ప్రకృతి మాతకు మూలంగానూ
విలసిల్లుతూ దీపముగా భాసిల్లుతూ
జ్యోతిర్గణాధిపతిగా సమస్తమునూ నడిపెవూ

నిందలు వేసినా నిన్నేమన్నా
చెదరక మెదలక నీ దారినేగేవూ
నిజమును నిత్యం చూస్తూండెదవూ

నీ స్థానం నుంచి ఎన్నడూ దిగజారవూ

Wednesday, September 18, 2019

Sri Bhramaraambika

శ్రీ గిరీ శిఖరమందూ శంకరుని సతిగ వెలసినావూ
శీతలమ్ము నీదు గుణమే నా తల్లి నీదు నిలయము కూడా అంతే ||శ్రీ గిరీ||

దక్షునీ పుత్రివయ్యీ నీవు ఆ శివుని చేరినావూ
హిమవంత తనయవయ్యీ హాలహలమ్మునూ తరమినావూ
తపమెల్ల ఒనర్చినావూ త్రినేత్రుడిని పొందినావూ
కళ్యాణ రూపిణిగనూ కామితారథములనిచ్చినావూ || శ్రీ గిరీ ||

షష్ఠేచ కాత్యాయనిగనూ పునఃపూజ నొనర్చినీవూ
ఫాలనేత్రుని అందీ అందరికి మార్గమును చూపినావూ
వధియించు వ్యాఘ్రం సైతం నిను చూసి తాను మారే
వాతసల్యమొనర్చుకుంటూ నీ చెంతనేగ నిలిచే ||శ్రీ గిరీ||

భ్రమరమ్ములూ భ్రమరమొందే బంధమూ పెంచినావూ
భద్రమును ఒనర్చు నీవూ బ్రహ్మమును పంచినావూ
భార్గవి రూపముననూ సిరులెల్ల గూర్చినావూ
భారతీ దేవివయ్యీ ఓ జనని విద్య వినయములొసగినావూ ||శ్రీ గిరీ||

శివుని పతివమ్మ‌ నీవూ శుభములూ సేయుచుండూ
స్మరణ మాతరముననే‌ శీఘ్రముగ స్పందించెదవుగా
శ్రీకరీ నామావళీ శ్రేయమే మాకెపుడునూ
సహస్రమూ నీ పేరులే సదా మాకవియు ముదములే ||శ్రీ గిరీ||

మాతృకలు నిను గొలువగా ముదముతో నుండు దేవీ
మాతవై నిలచి మాకూ మత్సరములెల్ల దీసెయ్యవే
మా తప్పులూ గాయమ్మవే మా తల్లి మాకు గుణములు నేర్పవే
మోక్షముకూ మార్గమీయవే ఓయమ్మ ముక్తి మాకొనరించవే ||శ్రీ గిరీ||

Sunday, September 8, 2019

శ్రీ అయ్యప్ప

కరిమల వాసా కరుణావరదా శబరిగిరీశా అయ్యప్పా
కామిత ప్రధాతా కాంచన వదనా శరణమనేశా అయ్యప్పా || కరిమల||

కళ్యాణ కారకా కావ్యముల వందిత శ్రీ గిరివాసుని తనయుడవే
కృపా సాగరా కార్య సాధకా శ్రీ దేవీ పతి పుత్రుడవే || కరిమల ||

కీర్తనమను ఓ భక్తి విధమున స్తుతియింతుము మిము అయ్యప్పా
కదనరంగమున సదా గెలుచు నిను కొలుతుము విడువక అయ్యప్పా || కరిమల||

Sunday, September 1, 2019

శ్రీ గణపతి మీద కవిత శ్రీ వినాయక చవితి వికారి నామ సంవత్సరమున

గృహములెల్ల గోవిందుని ప్రభలు నిండగా
ప్రతీ తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరుల కాగా
పుత్రుల రూపమున వెలసిన పళని వాసుని సోదరా
మహాభారతమును వ్రాసినావు వ్యాసుని తోడ నీవుగా

గణపతి నామ ధేయా గజేంద్ర వదనా
గౌరీ పతి ప్రియ సుతా కరుణా వరదా
గోవింద తనయ పతి సహోదరా
గరికను అందుకుని మము దీవించుమా



వినుమా వినాయకా మా విన్నపములను
విమలా సుత మా సంకల్పాలకు
విఘ్నములే నీవు తొలగించుమా
విజయములను సదా చేకూర్చుమా


పేరు మాధురి
కలం పేరు శేషు


Sunday, July 28, 2019

గురువుని గూర్చి

దత్తునిగా దయను పంచితివీ
దక్షిణ మూర్తి గా జ్ఞానం
దిక్కులకెల్లా నిలిపితివీ
మొగలిచెర్లలో మోహమును దరిమితివీ
అప్పాకోతేగా త్రోవను జూపితివీ
అక్కల్ కోట్కర్ నూ తాకితివీ
షిరిడీలోనా నిలిచినా నీవూ
సమతను సర్వత్ర చాటితివీ
ఏకనాధమహరాజచగా వెలసితివీ
ఏకత్వమునూ నిలిపితివీ
రూపములనెన్నో దాల్చిననూ
రాగద్వేషముల నొందకనే
మమ్ముల నీవుద్ధరించితివీ
మిమ్ము మేము తలయుచుచూ
ఎప్పుడూ నడిచే విధముగనూ
దీవించరే సద్గురువులారా

గణనాధా..

వందనమనరే గౌరీ పుత్రుడు గణనాథునికీ
వదనమునుంచే జ్ఞానము పంచే మన ఘన నాథునికీ
వినుమా వినుడీ జయ చరితములూ
వినాయకుని వింత గాధలనూ

వటపత్రమునా వెలసిన తానూ
విమలాపతికీ వివరము తెలిపే
విన్నూత్నమ్మే కదా ఈ కధలూ
విజయమునోసగే విఘ్నేశునివీ

పర్వతరాజూ పౌత్రుండితడూ
పశుపతి స్వామీ పుత్రుండితండూ
పరాశక్తికీ తనయుడు ఇతడూ
పళని వాసునీ సోదరుడితడూ

గజవదనమ్ముతో గుణముల నేర్పే
శుక్లాంబరమ్ముతో శుభములనిచ్చే
విఘ్ననాయకుడు విద్యను ఇచ్చే
సిద్ధి బుద్ధులను సిరులను గూర్చూ

గరికను దెచ్చీ గమనికనిస్తే
గమ్మత్తుగనూ కోర్కెలు దీర్చూ
ఉండ్రాళ్ళు పెట్టీ భక్తిని జూపితే
ఉత్పాతములే తీసివేయునుమా

ద్విముఖుడమ్మా మన పార్వతి తనయా
ద్విజన్ముడమ్మా ఇతడు మృత్యుంజయుడే
దిక్కులనన్నీ తానేలేవాడే
దీనజనులా తాను బ్రోచేవాడే

తల్లి దండ్రులనూ కొలిచిన ఫలమూ
తలదాటెపుడూ పోదూ అనుచూ
తమ్మునితొ గూడి తాను దెలిపేనమ్మా
తగనిది కాదే ఈ జీవిత సత్యం

మూషికాసురునీ మదమణిచిన ఘనుడూ
మాతా మాటకూ తా విలువను ఇచ్చీ
మౌనంగానూ ఆ దనుజుని కాచే
మంగళమనరే ఇంతటి మూర్తికీ

మహిమండలమూ అంతటా తానూ
మణిద్వీప వాసినీ తన తల్లిని గాంచే
మనువును గోరలేదుగా ఆ భావమ్ముతో
ముక్తినీ కోరరే అట్టి స్వామిని గొలువరే

ముప్పది రెండూ అవతారములెత్తీ
జగదంబ కటులా సామ్యము తెలిపే
ప్రతిబింబముగా ఇటులా నిలిచే
పరమాత్మికకూ మరు రూపమే కాదా

వ్రతకధను మనకీ తానందించే
దయతో గాదా మరి ఇది అంతయునూ
ఆ గాధ సైతం తా లిఖియించే
ఆర్తిని ఇటులా మనకందించే

మోదకహస్తుడై మోహము దృంచే
మోక్షమునిస్తూ మనని తా స్పౄశీయించే
మన్నించునుగా మన దోషాలన్నీ
మనమున నిలుపకా ఆ కరుణామూర్తీ

మరువగగలమే ఇంతటి దయనీ
మహనీయమూర్తీ ఇచ్చిన కృపనీ
మలినము సేయకా మన పూజలనూ
మనమందరమూ కలిసే గొలుతుమూ

ఇంతటి వానిని స్తుతియించగలమా
ఇలలో నున్నా అందరమూ కలిసినా
ఇందులో ఎట్టీ దోషములున్నా
ఇక్కట్లు ఇవ్వకా క్షమ జూపేయి స్వామీ

నీ కధలన్నీ గ్రంధములూ దెలిపే
మూడు పురాణములూ నీ కలపంతో నిండే
నీ కీర్తనలూ భువి అంతా ఏగే
చవితిన మేమూ చదివితిమీ వాటినీ

పేరు: మాధురి
కలం పేరు: శేషు

Thursday, July 25, 2019

Time Flies

Time Flies and keeps giving the cycle of seasons in its Row

The monsoon, the cool breeze, the birds chirping and to everything I Bow

The heat in the Weather, the sweat in the room, nothing makes me feel Low

Love the mangoes, entertain the Summer Vacation I really Bow



Feelings of mine on Summer are like the tides of an Ocean

Because the excitement keeps raising and falling amidst of Summer's different notion

Colourful and Fragrance filling Flowers still blossom after Spring

Gives Happiness filled moments to my heart with a flying Wing

Wednesday, July 24, 2019

Ad-hoc

In response to PVR Gopinath poem on Aasaa in humans


Aa Yamudayinaa samaadarinchade! Ahaa emi seppitiri!
Satyamamadiye Sajjanula maata
Vaastavammu vidhyaadhanula vaakku
Nikkamegaa Nippu vanti paluku
Kaadanuta ledu gaa itti Subhaashitham

కథలు కవితలు కలమున కొరకే కానీ
కలతలు, కొరతలు కడిగేందుకు కాదు
కడుపు  నింపవుఇవికూడు బెట్టవు నివి
కలిమి జేర్చదు నిది కూడజేయదు నిధి

పిల్లల ఆకలి సైతం దీర్చవె పసికూన పకాసులు రాల్చదె కాస్తైనా పస్తులన్నవి ఆపవే పొరపాటున పిచ్చి వ్రాతలు కాక మరి ఏమిటీ కనకధారస్తవమ్ముతొ కొలువలేను కమలదళమ్ములంటి నయనమ్ముల జూడగలేను కరుణ రసమయీ నిన్ను కీర్తించలేను కినుక వహించక మమ్ము కాపాడరావా

[25/07, 10:03]

కామితములీయవే కాంచీపుర వాహసినీ
కారుణ్యమొసగవె కాంసోస్మిత ప్రాకార నిలయా
కాపాడుతుండవ కాలపు కాటునుంచీ
కైవల్య మీయవె కనకవర్రమడగనూ

[25/07, 10:04]

 మూసిన రెప్పల మాటున
మునిగిన నీటిలొ పాపల
మోదమొ ఖేదమొ తెలియును
ముఖమే కదా మనసుకు అద్దము

[25/07, 10:06]

కన్నతల్లి తరమగలదు కాసులు లేవని
పుడమి మాత్రం పడవేయగలదా నన్ను పనికిరావని!!
ఎచట కేగిన మోయవలసింది తానే కదా
పేగు తెంచిన తల్లికి ఉన్న సౌఖ్యం లేదు కదా!!


ప్రపంచ తెలుగు మహాసభలు 4వ సారి విజయవాడ లో జరుగుతుండగా హాజరైన నజ్మా ఫేస్బుక్ వాల్లో నా కవిత



ఎల్ల నృపులు గొలువ ఎల్లపుడూ నర్తనములు సేయ
పద్యములు గల బాస గద్యములు గొలువు భాష
గోదారమ్మ వెంట సాగి గోమాత వోలె సాధు భాష
గోరుముద్దల బాస గోరువెచ్చని స్పర్శ
సమస్యాపూరణములు, సామెతలు స్వరలతలు
స్వర్ణసమాన జాతీయములు వరణశోభాతమైన అచ్చు హల్లుల
సోయగములు పొదిగిన భాష సొంపైన భాష
సోయగాల భాష సోమరితనాన్ని తురిమి వేయుభాష
స్ఫూర్తి నిచ్చు సూర్యుడినీ చల్లని సోముడిని
తలపింపు భాష తలమానికమైన భాష

వందనాలివిగో మా వర్ణనలందుకో
చందనమ్మిదిగో మా అభినందనాలందుకో




ప్రపంచంలో ప్రతి వారినీ "పిలిచేందుకు" ఉండేదే "నామము". అందుకే భాషాభాగాల లోనూ ఈ పేరుకే ప్రథమ స్థానము. కానీ ఈ "పేరును" ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలన్న ఆరాటంలో మన ఆలోచనా సరళి పై నేను ఓ మాట చెప్పాలనిపించి వ్రాస్తున్నాను.

"ప్రపంచంలో తమకు పేరు పెట్టే వారు లేక కొంత మందీ, పెట్టుకున్న పేరును పెట్టి పిలిచే ఆత్మీయులు లేక కొంత మందీ బాధ పడుతుంటారు.

మనం, మనకి ఉన్న పేరు నౘ్చలేదనే ౘోటనే ఆగిపోయాము‌.

మన లోనే కొంతమంది, తమకు పేరు రావటం కోసం తహతహ లాడుతుంటారు. విజయమనేది మన దారిలోకి తనంతట తానుగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వస్తుంది. కానీ ఈ పేరు కోసం అని ఆరాట పడటం బహు విచిత్రం గా ఉంటుంది.

కోకిలమ్మ పాట తీయనిదీ, గులాబి అందమైనదీ అంటాము కానీ, వాటికి పేర్లు పెట్టి నిర్వచించమే.

పేరు ఉన్న తక్షకుడిని, లోక శ్రేయానికై పాటు పడిన ఆదిశేషుని, వాసుకినీ తలౘుకుంటే మాత్రం, భయపడకుండా ఉంటామా?

మఱెందుకు మన పేరు మీదే మనకీ మమత! తనువే శాశ్వతం కాదని తెలిసీ, పేరు కోసం ఎందుకీ వెంపర్లాట?


Tuesday, July 23, 2019

శ్రీ దేవీ స్తుతి

భక్తి కలిగితె పూజరా భుక్తి కొరకు కాదుగా
శక్తి కొలది అర్చనా ముక్తి పేరుతో వలయునా
మోహమేల మోక్షంపై మౌనమొక్కటె సాధనోయ్
మదము మది మనది కాదోయ్
మాధవా వినుమా మా ప్రార్థన
మత్సరము వదలలేము మంత్రము చదవలేము
మాటను విడువలేము
మీపై ధ్యాసను నిలుపలేము
మొక్కుబడి దీర్పగలేము
మీ మూర్తిని సైతం కొలువలేము
మిమ్ము దయ నడగక నుండలేము

పేగు తెంచిన తల్లికే అమ్మవమ్మ
పేర్మి తోడ మమ్ము సదా జూడవమ్మ
పేదలమనవు నీవు నెపుడు దరమవమ్మ
పేచీలు మేము జూపీన ఓర్చు దుర్గమ్మ
పెనవేసుకున్న బంధం నీతో మాది పెద్దమ్మ
పేరు పేరునా గూర్చి నిను అర్చించ ప్రయత్నింతునమ్మ
పేర్చి నీదు నామములు లెక్కించలేమమ్మ
ప్రేరణ నిచ్చి నీ వైపుకు మమ్ము నడుపమ్మ
పెట్టలేదనీ సొమ్ములు మరి అలుగకమ్మ

కలదె సంపద నీ యందు ధ్యాస కంటె
కలిమి బలిమి అంతయు నీవే కదా
కూరిమి పేరిమి నీ నుంచి వచ్చినదే కాదా
కరుణ జూపు నీవుండగా నాకేల కలత

త్రైలోక్య జననీ త్రిభువన పాలినీ
త్రయామయీం పదార్చితా తాంబూల చర్వణ చర్వితా
తామశ నాశక దేవిగా తీక్షణ దృక్కుల దీవెన
తమసములొందే మాకొసగుమా
తొలగించుమా మా ఆపదలు
తరమకుమా మమ్ము తప్పులున్నవని
తరుణివిగా నీకు ఇది తప్పదుగా
తుమ్మెదలు వాలు శుభ మోము నీదీ
తేనెలు గారు తీపి పలుకులు నీవీ
తోయజాక్షీ నీకిదె మా వందనం

శ్రీ మాత్రే నమః

నీదు చరణములే శరణము
నీ గాధలే చేతుము శ్రవణము
నిను వదిలితే మాకు అంతటా రణమే
మనమున అది మేమగా మాన్పలేని వాతావరణము
నిను తలచితేనే అగును సకలము పూర్ణము
నిను కొలిచినదె ఉత్తమ పురాణము
నిను అనుసరించి ఏ కదా పాడును ఆ వాణీ
నిను ఏకధాటిగా కొలుచును కదా రంగనాథుని రాణీ
అతివల మూలమైన ఓ తరుణీ
నిఖిల లోక కళ్యాణీ
నీలకంఠుని శ్రీ రమణీ
నీరజనాభుని శసహోదరీ
భువనములకెల్లా భవానీ
బ్రోవుమమ్మా మమ్ములనూ

వాణీ రమా సేవితా
వారాహీ నామధేయితా
వామాంకా నివాసితా
వసుంధరా పూజితా
కదనరంగాపరాజితా
కామితార్థ ప్రదాయితా
కాణిపాకుని మాతృకా
కాంచీపుర నాయికా
వందనమ్ములు తరుణీమణీ
వర్చస్సు కల సాకార రూపిణీ
వదనమ్మున చెదరని దరహాసినీ
సదా సుమధుర భాషిణీ

చిదానంద గుణ భాసినీ
చిన్ముద్రాలంకత సంధాయినీ
సదా చిద్విలాసినీ
చంద్రశేఖర భామిని

చీనాంబరధర ధారిణీ
చింతా ప్రశమన వరప్రదాయినీ
చతుర్భుజ రూపిణీ
చాముండా ఆశ్రిత రక్షకీ

చుక్కల మధ్యన తారకలా
చీకటి చీల్చే నాయకీ
చిక్కులు దీర్చే దయామయి
చింతామణికీ మూలమూ

చిత్తశుద్ధి కలుగజేయవ మాకు
చందనమంటి చల్లదనమీయవే
చైతన్యమును దొలగనీయక మమ్ము
చైత్ర కోయిలల్లె నిన్ను గొలువనిమ్ము




శ్రీ కంచి కామాక్షి:
---------------------


కంచిలోన వెలసీనావు మాకు
కవచమై సదా నిలచీనావూ
కనకవర్షమును కురిపించీనావు
కరుణామృతమును చిలికీనావు
కమనీయ వదనవు కమల నయనవు
కైలాస వాసినివి కైవల్యదాయినివి
కైమోడ్పులందుకో మా కైదండలివిగో మా
కై నీవు తరలిరా మా క్షేమ భారము మోరవా

Friday, July 5, 2019

శ్రీ శాకాంబరీ

మంగళమనరే మన శారదాంబికకూ
జయ వందనమనరే మన శాకంబరికీ

శుభములనొసగే మన శార్వరీ దేవికీ
శ్రీ కరమైన ఆ శార్ంగుని సోదరికీ ||మంగళ||

శీతల శిఖరానా శిశిరములాగా
శ్రీ కంఠుని ఆ శైలజా దేవికీ ||మంగళ||


శేషుడు, శశినీ మోసిన వానితో
శ్రేయములిస్తూ దీవించే దేవికీ ||మంగళ||

శ్వేతవస్త్రముతో జ్ఞానం పంచే తల్లికీ
శరణని వస్తే కరుణించే తల్లికీ ||మంగళ||


శ్రీ రంగపురమున వెలసిన దేవికీ
శీఘ్ర ఫలముల నొసగే రాజరాజేశ్వరికీ ||మంగళ||

స్థిరముగ నిలిచే సిద్ధులనొసగే
సిరులను పంచే సాగరపుత్రికీ  ||మంగళ||

Tuesday, June 18, 2019

శ్రీ మాల్యాద్రి వాసా

జయలక్ష్మి శ్రీ జలజాక్షి నిను జేరంగా
వామభాగమ్మున వారిజాక్షి అయి అలంకరించంగా
సిరులనిచ్చు శుభ లక్ష్మి సేవింపంగా
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

శంఖు చక్ర ధారీ శారంగ పాణీ
శాశ్వతమైన వాడా శాంతి నొసంగు దేవా
శుభములు కూర్చగ రావా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

శీఘ్ర ఫలముల నొసగుచు
శకునములు మంచివి సూచించుచు
శంకలన్ని తొలగించుచు దరహాసముగ నుండెడి
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

శంకరుని రౌద్రము వోలె శతృవులను దరుముచు
శరత్కాలపు శశి వోలె సదా వెలుగుచు
శీతలమ్ముగ నవ్వుచు శత వర్షములు చూచెడి
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

దక్షిణ హస్తమ్ముతో దీవించుచూ
దయగలవానిగ దరినుండి రక్షించును
ధీరత్వమ్ముతొ దుష్టుల దనుమాడువాడా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

భానువారము మొదలు భృగు వారమ్ము వరకును
బహుసురపురములవారిని బ్రోచు బ్రహ్మాండనాయకా
భక్త జన కోటికై భువిపై వెలసిన భాగవత పురుషా
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

సప్త తీర్థముల సలిలముతో శోభిల్లు శ్రీ నారసింహ
సకల చరాచర జగత్తుకు జీవమొసగుమో నారాయణ
శీఘ్రముగా ఫలములనొసగు శ్రీ కరుణాంతరంగా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

ఏకము కాదు ద్విజము కాదు సప్త తీర్థములు
నిను జుట్టుచు జాలువారుచుండంగా
ఏడు జలములతోడ మా ఏడుపులు తీసివేయవ
మాల్యాద్రిన‌ వెలసిన దేవా మమ్మేలుకోవా

కపిల, అగస్త్య మహర్షులు, ఇంద్ర వరుణ దేవతలూ
జ్ఞాన స్వరూపమగు జ్యోతి సైతం తీర్థమ్ములు కాగా
శివకేశవులైన శంకర నారసింహములు సైతం చేరెనిచట
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

పశ్చిమాన అహోబిలమున నుంటివీవు
ఉత్తర దక్షిణాన పెన్నా కృష్ణవేణిలు పారుచుండగా
ఆ కృష్ణమ్మ వాయువ్యాన శ్రీశైలమ్ముతో కలపంగా వెలసిన
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

వృచాచల, సింగరాయకొండ లలో వెలసి
పూర్వ, వామ దిశలందు వాటిని నిలిపీ
సర్వ దిక్కులా మాకు అండగా ఉన్న అప్పన్నా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

నీ దర్శనం కొరకు ప్రయాస పొందెడి నరులకై
నీ దేవి అగు మా మాత అభిమతము దీర్చుచు
ఇన్ని విధములుగ అందిన కారుణ్య మూర్తి
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

ఏడు తీర్థముల వాని తోడ ఏడుకొండల స్వామి,
శివ పార్వతుల వెంటే వీరభద్ర స్వామి
నీకు జతగా జనులను దీవించు చోట వసియించిన
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

సమీపమున నున్న మొగలిచర్లలో
సద్గురు రూపమున సేద దీరుచు
సన్మార్గమున మమ్ము నడిపెడి
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

పర్వతాలే ఆవళీలుగా నిలిపిన నిఖిల లోకేశా
ప్రకృతి సోయగాలే నీకు జావళీలు ఓ పరమేశా
పరంధామునివై ఆర్త రక్షణ చేయు సర్వేషాం
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

నీ నామమే మాకు సర్వం స్మరణయె గానం
పారవశ్యంతో తన్మయులమై మమేకవడమే మా గమ్యం
నిను పొందుట నీ భక్తలకెపుడునూ సులభమే కదా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

యోగులయిన నీ యందు జోగుతేనే కదా రంజనం
మమ్ము అటువైపు నడిపించే మీకు సదా వందనం
తప్పు లెన్నడైన చేసినా దండించక తరియింప చేయుమా
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా

మహా ఋషులు మరెన్నో వృక్షాలు మృగాలూ
సమస్తమూ సత్యమైన నిను సేవించుచు
సతతము నిను స్తుతియించుచు  సంతసమొందునుగా
మాల్యాద్రి వాసా మహాలక్ష్మి నాధా మమ్మేలుకోవా

స్థిరవారమున నీవూ నరులకందెదవూ
స్థితప్రజ్ఞతనూ ఇవ్విధముగ మాకూ నేర్పించినావూ
స్థిమితముగ నిను తలచి శాంతి నొందెదమూ
మాల్యాద్రిన వెలసిన దేవా మమ్మేలుకోవా



సింహాచలేశ్వరుడు చందనోత్సవుడు
సిరి మా లక్ష్మి విభుడు చెంగల్వ పూదండ ధారుడు
ప్రహ్లాద వరదుడు పరమేశ సఖుడు
నవక్షేత్ర నివాసి నారసింహా నమోస్తుతే




Saturday, June 8, 2019

Sri Sai

సద్గురు రూపా శ్రీ సాయి సమస్త లోక రక్షకా శ్రీ సాయి
ముక్తి కారకా మోక్షదాయకా ఆనందదాయకా ఆత్మసిద్ధి నాయకా
ద్వారకామాయివాసా దయాసాగరా దారిద్ర్య నాశకా దాక్షిణ్య భావా
సదా మమ్ము కాచుము దేవా  సంతోషమ్మునొసగుము దేవా



అమ్మయైన విడుచునేమో ఆకాంక్షలకు లోబడి
అమృతమును పంచు ఈ గురువు

అవని అంతయు కాచున్

Wednesday, April 17, 2019

In response to Vachana Kavitaa Samasyaa Puuranam in "Ponnaada vaari Punnaaga Vanam" group of facebook:

157.
కుల త్యాగమెన్నడు మనము మరువజాలగలమా

ఈ సమస్యకు నేనునూ మూడు పూరణలు వ్రాశానోచ్!! (18 అక్షరాలు)

1.వేదికలపై వేడుకలనూ వసంతాల సరాగాల
నూ వదలలేకా వాటికై రాలేకా యావత్ దేశం కో
సం సర్వస్వాన్నీ వీడి యుద్ధ భూమిలో నున్న మన సైని
కుల త్యాగమెన్నడు మనము మరువజాలగలమా

2. తోటి వారంతా అభివృద్ధి అంటూ సౌఖ్యం అంటూ పరుగె
డుతుంటే నాకు మాత్రం ఎందుకులే అంటూ పంతాలకు పో
కా వారిభుక్తి  కొరకై నష్టాల కోర్చి కష్టించే కర్ష
కుల త్యాగమెన్నడు మనము మరువజాలగలమా


3. పదవులకై ఆశ పడకా పొగడ్తలకు పొంగకా
తెగడ్తలకు కుంగకా  తరతమ బేధాలనెంచకా
స్వంత లాభం మానుకుని మన కోసం పని చేసే నాయ
కుల త్యాగమెన్నడు మనము మరువజాలగలమా

కలం పేరు: నాగిని


భువినున్న భుక్తి కారకులను పూజించుచు
భ్రమణాల వల్ల బావుల పెరిగెడి పంటలను జూచుచు
బహు బాగు అంటూ బారులు తీరెడి
భూమి మీద జనుల కళ్ళన్నీ భోజనము పైనే


07 September సమస్య పూరణం

అల్లు, ఇల్లు, జల్లు, చిల్లు:

ముచ్చటైన ఏకవేణియను అల్లు
ముద్దులొలికే చిన్నారి ఉన్న ఇల్లు
ఎప్పటికీ నిండును ఆనందాల విరి జల్లు

10 September 2019 పూరణ



పూరణ 1

మొక్కవోని దీక్షతో మూగదైన సాధనమున
కు రెక్కలు దొడిగీ చీకట్లు చీల్చీ ఎక్కడ
జాబిల్లీ అంటే అక్కడ కాదు ఇక్కడటంచు వ
క్కను చూపినంత సుళువు చేసెన్ శాస్త్రవేత్తలు


మొక్క అయి వంగనిది మాను అయి వంగునా రె
క్కలు లేనిది ఏదైనా గగనమున ఎగురు
నా అక్కరకు రానిది నిరుపయోగమైతే కాదుగా
వక్క పలుకులు వోలే ఇవీ నిక్కమైనవేను సుమీ!

ఇది పూరణ 2

పూరణ 3

వక్క ఎపుడు తాంబూలము జోడు రెక్క ఎప్పుడు
ను ఎగిరే పక్షికి తోడు అక్క తాను తమ్ము చె
ల్లికి అండ మొక్క యావత్ సృష్టికి ఇచ్చునీడ
వీటిని చెడపబోకురా ఓయి మానవుడా

పూరణ 3


పూరణ 1

గగనమున గర్జించెడి మేఘము కరువను
గరళమ్మును దరుముటకు జనులందరు సమి
ష్టిగ నెరపిన కృషితో కురిసిన వర్షంతో క్షామమా
ఆట మొదలయ్యెనిప్పుడు మీ తాట దీయుటకు




17 September 2019 Contest 197


పూరణ 1
శతకములు పద్యములు ఘాటైన సామెతలు
శబ్దములు అర్థములు అందమైన అలంకార
ములు అతివలంత సౌందర్యమైన భాషయని
తొడగొట్టి తెలుపరా తెలుగోడి వైభవము

పూరణ 2
పోతన బ్రహ్మన ఒకరనా ఇద్దరనా ఇంపై
న దెంతయునో వ్రాసినారట అటుల తెలిపి
నారట గత చరితమును ఘన భవితమున్
తొడగొట్టి తెలుపరా తెలుగోడి వైభవము

పూరణ 3
వర్డ్స్ వర్త్ షేక్స్పియర్ షెల్లీ కీట్స్ ఆంగ్లమైతే
వీరి సమమైన దేవులపల్లిది ఆంధ్ర మోతే
వినుడిక విరి పరిమళపు కవిత్వమును
తొడగొట్టి తెలుపరా తెలుగోడి వైభవము

పూరణ 4
ప్రబంధాల ప్రభంజనము ప్రజలకదియును
ప్రయోజనము ప్రభువులకునూ అది మోదము
ప్రక్రియలందిది ఓ చమత్కారమని గ్రహించి
తొడగొట్టి తెలుపరా తెలుగోడి వైభవము

పూరణ 5
విద్య విజ్ఞానం వినోదం విహార వికాసం విప
ణి ఏదైనా విజయ పతాకలు మనవెన్నో వి
జేత, నేతలు మనవారెందరో అని ఎలుగెత్తి
తొడగొట్టి తెలుపరా తెలుగోడి వైభవము





1.
ఆంగ్లాలు ముద్దంటూ ఆమ్మ భాష వద్దంటూ వాటికై తామునూ
పరుగులు పెట్టి, పిల్లలనూ తీయించీ పోటీలోకి దించీ


పిల్లలని నాడు పరుగు తీయించీ పరదేశాలకంపించీ
పలకరింపులూ మనవళ్ళ పులకరింపులూ ఇటుల
వదలుకొని లేవు లేవనుచు వగువనేల ఇపుడు




[29/10, 12:28] Durgamadhuri1: లోకులెల్లరు నాశమవ్వాలన్న తలంపుతోన్
లోభులెల్లరు దానములు సేయక దాచిన సొమ్ము తోన్
కేదారేశు వ్రతమ్ము జేసినన్ జనుల్ కీడొంది దుఃఖింపరా
యనిన దైవము దుష్టులను గెలిపించునే!?
[29/10, 12:28] Durgamadhuri1: ఇది సమూహము లోని సమస్యకు నా పూరణం


11 November 2019 Samasya Puuranam:



సమస్యలు సమక్షము చుట్టుముట్టగా మనము
న హరినామస్మరణ సేయుచు విడువక మ
ననము నిదురనందు సైతం సేయువారు మన
సారా తాగిరి పండితోత్తముల్  ప్రతిభన్ పొందగన్


What's app group సమస్యాపూరణం

చేసెడిది చెడు కార్యమైనను అది సమాజానికిన్ ముందు
తరములకున్ తప్పుడు నడక చూపెడిదైనన్ చుట్టు పక్క
లా వారికి హాని ఐనన్ మారని వారి
వ్యాధిని న్యాయవాదియె నయంబొనరించును వాక్బలంబునన్



202. మబ్బులై కమ్ముచుండె, బెబ్బులై గాండ్రించవలెన్

దేశభాషలందు లెస్సయైన మాతృభాష యందు


27.11.2019: 203: దత్తపది
నలుగురు అనుజ పాండవుల పేర్లతో

భరతదేశమున నిలిపే విద్యాలయాలను నాగా
ర్జునుడె భవిత నొసగ బుద్ధి కూర్చ బాలుర
కున్ భీమాయే అది ఇనకులుడైన ఈ
శ్వరుని సహదేవునడైన రాముని వోలె


10.12.2019 
206వ సమస్యాపూరణం



1. లాంతరులెరుగమని సంధ్యవేళ గృహములనం
దే అందరం కలిసి ఒక్కటై మురిసిన ఆ క్షణ
ములే మధురమైనవని నియాన్ దీపాలు లేని చీ
కటి రోజులె మంచివని తోచె నిక్కాలమున్ గదా!


2. చదువుల వంకన చక్షువులు తెరుచుకుని చు
టెస్టు ప్రక్కల విద్యార్థులు అందరం కలిసి పుస్త
కమ్ములోని మస్తకమ్ముల నింపే చిన్ని వయసు చ
క్కటి రోజులె మంచివని తోచె నిక్కాలమున్ గదా!

3. వయసుడిగెనంటూ వసివాడినామని వృద్ధుల
మైనామని ఆ వృద్ధిని విడిచిపెట్టి విలాసం చే
యక తలవండిక చకచకా పనిచేసే‌ ఆ చి
క్కటి రోజులె మంచివని తోచె నిక్కాలమున్


22 December 2019 208వ సమస్యాపూరణం


1. తనవారనక పగవారనక ఎల్లరను బా
ధపెడుతూ బాగు కోరక భీతిల్ల జేసెడి వా
రలను కర్మఫలము తగురీతిన్ శిక్షించుచు
వదలక నెన్నటికి వెన్నంటియే యుండునెపుడు!

2. మనమున తలచిన మరచిన లెక్కించక మ
నకై ఆ కోదండ రాముని విల్లంబు గర్జిస్తూ ర
క్షించుటకై దుష్టుల నుంచి కాపాడుటకై సదా
వదలక నెన్నటికి వెన్నంటియే యుండునెపుడు!

3. కృషియె ఖుషియనుచు కుళ్ళుకొనక అందరి కు
శలము కోరుచు కరుణను చూపెడి వారకు శ్రీ
రాజరాజేశ్వరీ చెరకుగడ క్షేమమిచ్చుటకై
వదలక నెన్నటికి వెన్నంటియే యుండునెపుడు!

210 వ సమస్యాపూరణం శీర్షికన 25 December 2019


1. ముదమొందుటకు ముదితలకైనన్ మగవారికై
నన్ ముగింపు లేని ఇంపైన ముఖపుస్తకము నందు
కైత, కోత,కూతలేవైన మంచివైతె ఆ ఆనందం
పంచిన కొలంది పెరుగునే కాని తరగదోయి

2. సుగుణములనన్నింటిని గదినందు బంధించి అ
సురబాణమ్ములు సంధించినన్ ఆశ, నమ్మకం, ధైర్యం
అనే త్రిగుణాలు వెంట ఉండి తక్కిన వాటికెల్ల
పంచిన కొలంది పెరుగునే కాని తరగదోయి


3. పేర్మి, ఓర్మి, కూర్మి అనే విత్తులతో నాటిన మొ
క్కలు మొక్కవోని దీక్షతో ఎ'దిగి' అందించిన ఫ
లములు తరాల తీరాలు దాటుతూ వృద్ధి చెంది
పంచిన కొలంది పెరుగునే కాని తరగదోయి

211 వ సమస్యాపూరణం 28.12.2019

1. భాష కమ్మదనుచు తల నిమురు తల్లియంటు
భ్రాంతియేమొ మాతనొదిలి మరొక వైపుకు పరుగు
పెడుతు పెరుగుటకటంచు ద్వంద్వమైన మాటలు
ఫలితమేమి లేని ఊకదంపుడు ఉపన్యాసముల్


2. ఉద్యమించకున్న ఉనికియే పోవునంటు ఉమ్మి వే
స్తే తుడుచుకుపోమంటూ ఎన్నియో సమస్యలపైన ఊ
రందరు కలవగనే చేసే చర్చలే తీసుకోని చర్యలు
ఫలితమేమి లేని ఊకదంపుడు ఉపన్యాసముల్

3. చదువు కొలుపు వద్దంటు కొలువు ఏదైనా మేలె
యని పైకి చెప్పుచు ప్రతి ఒక్కరూ లోలోన మాత్రం
పిల్లలను ఘనమైన చదువులకై పరుగులెత్తించుట
ఫలితమేమి లేని ఊకదంపుడు ఉపన్యాసముల్


212 వ సమస్యాపూరణం శీర్షికన 01.01.2020

ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాయె నేటి జీవన పోరాటముల్


1. ఉదయమే లేచి ఉరుకులతో ఉడికించటా
లతో ఊడిగం చేస్తూ ఊరకున్నారనిపించుకో
కుండా ఉద్యోగాలకేగే ముదితల బ్రతుకుల్
ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాయె నేటి జీవన పోరాటముల్

2. ఉగ్గు పాలు పసి వారికీ మందులు పెద్దలకీ
అందించి అహాలు అందరికీ తృప్తి పరిచి అన్ని
తరాలూ చూస్తూ తన్ను తాను మరిచే వనితలు
ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాయె నేటి జీవన పోరాటముల్

3. తమ ఆశలు వదిలి పెద్దలకై కదిలీ క
దన రంగమైన శాలలకు తరలీ పసి వా
రు నిత్యమూ చేసే పోరాటం ఫలితాలకై ఆరాటం
ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాయె నేటి జీవన పోరాటముల్


214 సమస్యాపూరణం

01 ఫిబ్రవరి 2020


1. అవని యందు ధర్మమనే పూనికయె గలిగన
అంతనే ఆ విధి మన చెంతకు చేరి విరోధులు
ఆపదలు కలిగించకుండా చూచుచూ కాచుచూ
అత్తరువిచ్చు సారసఫలంబులు కోరినంతనే
2. ఆడుబిడ్డలెల్ల కష్టములు చేయుచుంటిరని ఆ
పూరుషావళి పూనుకుని సాంకేతికతతో మర
లెల్ల సిద్ధం చేసి శ్రమలెల్ల తీరుస్తుంటే ఆ దైవం
అత్తరువిచ్చు సారసఫలంబులు కోరినంతనే

3. విద్యలు ఎల్ల సృజనాత్మకంగ తీరిచిదిద్ది ఆ
అర్థులకెల్ల అందజేసిన ఆ ఫలములు మన
కే చేరును బ్రతుకులు వెలుగును ఆనందంగా
  • అత్తరువిచ్చు సారసఫలంబులు కోరినంతనే


225వ సమస్య: ముందు చేతి కందెనురా మధుమాసం ఇపుడేరా
10. May 2020



1. మహియందు ఉంటూ దేహానికి నెప్పి అనుకుంటూ
మది మేను మొర పెట్టుకుంటుంటే మరమ్మతులు
మరచి మరలా మిగిలీ ఉన్న మానవా నేడు
మందు చేతి కందెనురా, మధుమాసం ఇపుడేరా!

2. ఇంతకాలమూ ఇలపై జనుల కోసమూ అని
ఇబ్బంది ఐనా ఇష్టం లేకపోయినా ఓర్చుకొని
ఇప్పుడా త్యాగాన్ని ఇంగితాన్నీ విడచి లేచావా
మందు చేతి కందెనురా మధుమాసం ఇపుడేరా

3. మానవా ధర్మం మరచితివా బాధ్యతను నీవు
విడచితివా మధువుకై లేచితివా కోరినీ
కష్టాలనిలా కొనుగొంటివా నీవడిగిన
మందు చేతి కందెనురా మధుమాసం ఇపుడేరా



235: అక్క 
పక్క వక్క ముక్క తో దత్తపది:

1.అక్కరకు రాని చుట్టముపై మక్కవేలనయా
చుక్క నీరిచ్చి వదిలేయక ముక్కల పులుసు
అన్నం పెట్టి కడుపు నింపి ఆకు వక్కతో! యాహ
పక్కకు పంపక! ఎంత మర్యాద!  ధన్యుడవోయీవూ

2. అక్క వారింట చుక్కను చూచిన చిన్నవాడయ
పక్కకు తిప్పక కనులను తా గనెనామెను
తాంబూలాలకని ఆకు వక్కలిస్తే మక్కువలే
దని ముక్కలు జేసెను మనసునామె అక్కటా!


3.

అక్క"డక్కడ మొలచిన తమలపాకు మొక్క
నుండి కోసి వక్క తోటి వేసికొని పక్కనున్న
ముక్కలు తీసి పేకాడిరి మగపెళ్ళి వారలా
నిగర్వులై యుండుట ఘనత గాదె! వహ్వ వహ్వ!


1.
సంబరాలు చేసికొంద మందరమూ పండుగకు
కుత్సిత భావములన్ని వీడి యందరిచ్చటకు
రారండోయ్ తీయని వేడుక చేసికొందమోయ్
త్రినయనిని త్రిపురాంతకుని పూజించెదము

2.

సందడి చేయగ పిల్లలు పెద్దలు కదలండీ
కునుకును వీడీ లేవండోయ్ భోగి మంటలకు
రారండోయ్ గాలిపటాలు ఎగుర వేయుదమా
త్రివర్ణ పతాకముతో గణతంత్రము చేద్దామా

3.

సంకుచిత భావములు వీడెదమా పరులపై
కుతంత్రము లసలొద్దనుచు యందరము
రామదండులా కలిసి మెలిసి యుండుటే గద
త్రివర్ణ పతాకమునకు గౌరవమ్ము గనుమ


Sunday, March 10, 2019

శ్రీ చీర్యాల లక్ష్మి నరసింహ స్వామి

శ్రీ చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నప్పుడు కలిగిన అనుభూతి తో అంతా "చ" గుణింతం తో మొదలయ్యే పదాలతో వ్రాశాను.

చేతగాని ఉత్తానపాదుని తనయుడినీ
చెడ్డవాడైన హిరణ్యకశిపుని శిశువును
చలనం లేని మరెందరో ఆర్తులనూ
చేరదీసి ఆదరించిన శ్రీ హరీ

చిమ్మ చీకటిని పారద్రోలి
చిన్న వారిమైన మమ్ములను
చలనం కోల్పోయిన మా వంటి వారందరినీ
చేతులు చాచి నిను పిలుచు నీ అర్ధులనూ

చావు కోరుకునే స్థితి నించి
చెమ్మగిల్లిన కన్నీటి బొట్లను తుడిచీ
చుక్కానివై వచ్చి నావ దాటించవేమి
చైతన్యమ్మును ఇచ్చి కాపాడవేమి

చెర యందు బుట్టినా గెలిచిన వాడవూ
చెన్నకేశవ నామధేయుడవూ
చెంచులందూ వెలసీన వాడవూ
చేపగానూ తిలగీన వాడవూ

చేవలేక నీరుగారిన మమ్మూ
చతికిల బడి నీరసమొందిన మమ్మూ
చిత్తశుద్ధితో మాత్రమే నిలబడిన మమ్మృ
చిరునవ్వుతో రక్షించవె ఇకనైనా

చేదు నీటి నూతిన మునిగిన మమ్మూ
చేద వేసి ఒడ్డుకు చేర్చేందుకు రమ్మూ
చిరిగిన బ్రతుకు‌ల నున్న మమ్మూ
చిగురింప చేసేందుకు నింక లెమ్మూ

ఛాయవోలె మాకు వెంటనుండీ
చెలిమి చేసి మాకు పేర్మి పంచీ
చిత్తరువులందు సదా నీవె నిలచీ
చిత్ర విచిత్రాలను మాకు చూపవే

చివరిదాకా కదలక‌ తోడు నిలచీ
చిన్న బుచ్చు కోకుండా మమ్ము కనికరించీ
చిక్కటి కష్టాలను పలుచన చేసీ
చివాలున వాటిని దరిమేయవె

చిత్రగుప్తుని వోలె లెక్కలనూ దేలిచీ
చిక్కని దుష్టులకు శిక్షలు వేయవా
చిలుక వోలె తీయని పలుకులూ చెప్పీ
చక్కనీ ఆనందాల నీయవే

చెంపపై నుండీ క్రిందకూ జారీ
చెక్కిళ్ళ వద్ద వెక్కిళ్ళతో ఆగీ
చైత్రమును కోల్పోయిన మోములను నీవూ
చందురుని వోలె వెలిగించవా నీవూ

చిన్మయానంద మూర్తీ చిద్విలాస రూపీ
చిన్ముద్ర ధారీ చిద్విలాసమును లాల్చీ
చిరుదరహాసమును మాకొసగవే
చిన్నారులనెన్నడున్నూ చెదరనీయకుమా

చంచల లక్ష్మిని హృదయమందు నిలిపీ
చరాచర జగత్తునకు నాథునవై నిలచీ
చెరపలేనంత ప్రేమనూ రాశిగా పోసి
చెప్పలేనంత అనురాగమునీయుమా

కలం పేరు:  నాగిని