Sunday, March 29, 2020

క్షేమము - క్షీణమూ

క్షమయా ధరిత్రి వమ్మ వసుధ నీవు
క్షేమమొక్కటె ఈయవమ్మ ఈ వసంతములో
క్షయము పెంచక క్షామము పంచక
క్షోభలు తీసి వెలుగులు పెనవేయవమ్మ విశ్వ మానవాళికిన్

Sunday, March 15, 2020

శ్రీ చెన్నకేశవ స్వామి

బంగారు కేశములు గల చెన్నకేశవా
మా చెంతకేగి చిక్కులను క్లేశములను దీర్చవా
చేయి పట్టి తండ్రి వోలె నడిపించవా
చేరదీసి తల్లి వోలె ప్రేమ కురిపించవా

Monday, March 9, 2020

ఓం దుం దుర్గయై నమః

తల్లి దుర్గమ్మ తోడుండవమ్మా
తరుణిని ఇక్కట్లను తొలగించవమ్మ

ఇహమునందూ లీనమై నేను
నిను మరిచుండవచ్చు
ఇరుగుపొరుగుల అదురులకూ
బెదిరి జడిసుండవచ్చు
ఇబ్బందులు కలిగించు జనాలతోడ
నేనే సేయుదునంటు జగడమాడుతుండొచ్చు
ఇంటిలోనీవారు పెట్టు చిచ్చుకు
సహియించక సొంతంగా స్పందిస్తుండొచ్చు

ఇన్ని విధములుగా ఇందరమూ ఇంతులమూ
నిను విస్మరించినమని నీవు విస్తుపొందకుమమ్మ

మాతగా మా తప్పులని మన్నించవమ్మా
మా అజ్ఞానమ్ము నీవు అహమనీ ఎంచకమ్మ

మేమంతా ఎటు వెళ్ళిననూ మము విడువకమ్మ
సర్వశ్య శరణాగతి మా అభిమతమమ్మ

కనుక మము కాయుమమ్మ ఓ కాంచనాలమ్మ
కరుణించవమ్మ మము కన్నబిడ్డలుగ నీకు

*******""""""""****************************

వలయములు ఎన్నైనా రానీ
వ్రతము మాకు నీ నామమే తల్లీ
వలదు ఏ చింతా నీ భక్తులకు
వరము నీ స్మరణ అయి ఉండంగ
విఘ్నమేదైన కానీ ఎంతైనా కానీ
విరామం మెరుగని విజయమే నీ పథము
వినయముతో మేము చూసెడిదే నీ పాదము
వినాశకాలన్నీ నిను తలచిననే తొలగిపోవును


వ్యాఘ్ర వాహిని వ్యాధి నివారిణి
వానర పూజిత వ్యాకుల నిర్మూలించే
వింధ్య నివాసిని విపత్తుల దీసే
విజయదుర్గా విమలా దేవి మా వందనమందుకొనుమా

విన్నపాలు వినుమా వారాహీ మాకు
వెలుగులనీయుమా వహ్నిలోచనీ
విధాత రాతలో విఘ్నములు బాపవే
విఘ్నేశ్వర మాతా వేదనలు దీర్చుమా వామకేశీ

విరించి విష్ణు ఇంద్ర పూజితా వాణీ రమా సేవితా
విరోధి మర్దని వింధ్య నివాసిని వారాహీ రూపిణీ
వేంచేయవమ్మా మా హృదయమలకూ దయగల
వేలుపువై మము వెతలనుండీ కాపాడుటకై


*****************************************
దశావతారిణి దశమార్చే శక్తి
దయగలమాత దుష్టుల పాపుల
దనుమాడే ధీర వనిత భువినీ
దివినీ ఏలే దేవత

దుర్గమ్మ దుఃఖార్తి నాశిని దురిత నివారిణి
దైత్య సంహారిణి దుర్గను నివాసిని
దీనుల బ్రోచే దయగల తల్లి తానే
దీవెన లిచ్చే తిరుగు లేని దేవత



***""""""""**"†*"**"""**********************

నెలవంక నిను వీడలేక
నుదుటిపైనా మరి నయనమైనా
నీకడకేతెంచే నీరజ చెలికాడు
నిశి రాతిరి మెరిసే వరమొందాడూ


*******************""""""""""""************

చంద్రవదనమ్మ నీవు చల్లని తల్లివి
చిమ్మ చీకటిలో వెలుగులు చిందే జాబిల్లివీ
చెడు నడతల వారిని చెండాడే చండీశ్వరివి
చెమ్మగిల్లిన మా కళ్ళను తుడిచే ప్రేమ మూర్తివీ
చదువుల‌ తల్లిగా విద్యను ఇచ్చీ చంచలాదేవిగా మా
చేతలయందు శ్రద్ధను పూన్చి సిరులను ఇచ్చే‌ లక్ష్మి దేవివీ
చాముండి గా కోరిన కోర్కెలు తీర్చే దయగల తల్లివి
చెరకుగడతో మాకెపుడు తీపిని పెంచే అమృత రూపిణివి


*****************************************


దుర్గాం దుఃఖార్తి నాశిని దురిత నివారణ చేయవమ్మ

దివ్య శక్తీ దిక్కువు నీవే తల్లీ దిష్టి దరిజేరనీయకూ

దినకరశశి వహ్ని నేత్రీ నీవే జగద్ధాత్రీ దిక్కు సర్వులకూ

దయగల మాతా దమనములు తరుమమ్మా


Sunday, March 1, 2020

గరుడగమన రాగం

శరణు అన్న పలుకు నిన్ను చేరగానే
పరుగున వచ్చెదవు మాకై పరుగున వచ్చెదవు మాకై
|| మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

నీరమందు ఉన్నా నీడవోలె మా వెన్నంటి ఉండే దేవా వెన్నంటి ఉండే దేవా
||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

వరము కోరినంతనే ఫలము ఇచ్చెదవు మా మనమును బ్రోచేదేవా మనమును బ్రోచేదేవా
||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

కానుకంటు మేము ఏమి ఇచ్చినను దయతో గొనియెదవయ్యా దయతో గొనియెదవయ్యా

||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

కరుణయందు కానీ కదనమందు కానీ అద్వితీయుడవయ్యా నీవూ అద్వితీయుడవయ్యా నీవూ

||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||

ఘనమైన పూజలు ఛందస్సు పద్యములు అందించలేమయ్యా స్వామి ఐనా మము బ్రోవమయ్యా దేవా


  • ||మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా మమపాతమపా కురుదేవా||