Thursday, October 30, 2014

What is it all that's needed?

I am searching, I am searching, Oh I am Searching
In the garden of earth, below the sky, I am searching...
Running behind the time, moving across the shores, oh I am desperately searching...
Covering all the water, Leaving aside the sleep, oh I am waiting... waiting for?
...
Tweaking on self, tweaking on self, oh what am I doing what am I doing?!?!
I then started laughing, out of tiredness!! I then started laughing, out of tiredness!!
Only to realize, that I needed a little than what I am actually hunting for...
And guess what they are! It’s nothing than HAPPINESS. And guess where it can be!!
Nowhere other than in the Soul and Heart. This is what a PERSON should know.

Little words

Share the Love, Don’t Scare the people...

Care for the need; don’t tear out the feelings...

...
Play the Game, but not shame the lost...

Get the fame, but do not run badly for the name...

Smile for a while, smile for a while

Have some fun, though you have got to run

Look at the Sun, Rather than taking out a gun...

Keep Praying, not too much preying...

Use the hands to Clap, and not to slap...

Forget the harm, and think of Charm...

Use the Arm for work, but not to Cram others...

Grow well in heights, but without fights...

Rather than cry, do give a better TRY...

Wednesday, October 22, 2014

Dreams - కలలు


Lies within the EYES – that makes our heart an ICE

Often having it is NICE – and sometimes it is SPICE

These dreams are our feeling’s SPYS – of which the poets appraise
 
నవరసాలు అందులో అనుభవిస్తున్నా - నోరు విప్పి
కనిపించేది రెప్ప పాటు కన్నా ఎక్కువే అయినా -
 
Happen in our sleep – but are the reflection of our consciousness
Lies in our Eyes – but are never seen by others, neither in the mirror
They catch our feelings – but we can’t catch them in return
Eyes are two, person is one – and yes, but DREAMS are many!!
 
నీలాల మేఘాలంటి కన్నుల మాటున - నిశి రాతిరి నిదురించే హృదయ స్పందన
నయనాలతో నిత్యం చుస్తున్నా - పట్టి బంధించలేకున్న భావన
మనతొనే వుంటున్నా మనకంటూ అందనిదీ - మనసులోనే వుంటుందీ బయటకంటూ రానిదీ
వద్దన్నా వెంట వస్తుంది - కానీ మళ్ళీ కావాలాంటే దొరకనిదీ కలలు

Tenungu Bhaasha

అక్కటా! ఈ నర జాతి మధ్యములు వగలోలికే పరుల భాషను వలచినారు
తేనెలొలికే తేట తెనుంగు తీయదనం మరచినారు
పాలు వద్దనే పసి వాని వలె పారవైచినారు
ఇంపైన భాష ఇంతేనా అని ఇప్పటి దాకా అలరారిన భాషను కాదని
అరువిచ్చిన పదాలను ఆదరిస్తూ ఆ పరభాషలోనే ఆదమరుస్తూ
ఆనందాన్ని సైతం అనువదిస్తూ అరుణోదయాన్ని ఆలస్యంగా చూస్తూ
అ, ఆ లను అణచి  వేస్తూ అందానికి  అన్య పదాలతో భాష్యం చెబుతూ
ఆవేదనని పెంచుతున్నారు అనంతమైన సొగసును పంచలేకున్నారు 

Sunday, April 6, 2014

ప్రకృతి

నునువెచ్చని ఉషః కిరణాలు సుతిమెత్తని సుమాలు
వర్ణనలకు అందని వర్ణాలతో కుడిన హరివిల్లు
పంచభూతాలు పసిడి లోహాలు పదునాల్గు భువనాలు
లెక్కింపలేని అందమైన జీవరాసులతో కూడినది మన ప్రకృతి


గగనకుసుమమా నీకు గ్రహణమా అద్భుత గ్రహమా ఆపదను గ్రక్కున విడువుమా భానుని చాటున వేకువని దాటి భూమిని చుట్టీ బాలురన్ నీవెంట దిప్పుకొనెడి చాతుర్యమా


చూచుటకు కన్నులు చాలని అందం
శ్వాసించెడి నాసిక పుటలన్ అదిరించేటి సుగంధం
వచియించుటకు వాక్కులకందని వర్ణముల్
వదలివేయుటకు మనసు ఒప్పని బంధం - పుష్పవనం


కురులు అలంకరించేటి
సిరుల గుణం కలిగేవి ఈ
విరులు విరజిల్లాను సౌరభాలు
కరములనందూ ఇమిడేను అందంగాను


వీచే పూవుకు ప్రాణం పోయ ఆర్కుడను కాను
పూరెక్కల సౌరభము మోయ వాయువును కాను
పుష్పము చుట్టూ తిరుగాడే భ్రమరమును కాను
నెలకొరిగిన విరులను తాక పుడమిని కాను
మరి ఏమిటి నేను... ఇదంతా చూచి ఆనందించే మనిషిని... మనిషిలోని మనసును... మనసు పట్టి వ్రాయించే కరమందలి కలమునుండి జాలువారిన కవితను