Sunday, February 14, 2021

Marri Krishna Reddy Gaaru - 9 poems - any Chandassu

 [08/02, 12:40] Durga Madhuri: 


వేద భాస్కరుగనిలను వినుతికెక్కి

వేద ధర్మము నంతటా వెలువరించి

వేద రక్షణ సల్పెడి వేద రత్న!

వందనంబులివియె మీకు వాణి పుత్ర!


భాష్య సూత్ర పరిచయముల్ వ్రాయు మీరు

జ్ఞాన దీప్తి పంచిరిలను జ్ఞాన మూర్తి

మహిని మానవోత్తమ మీకు మాదు చేత

వందనంబులివియె మీకు వాణి పుత్ర!


బుగ్గ నీలమ్మల సుతుడ! బ్రోచినారు

నేడు ధర్మ సూక్ష్మ విషయ నీతులెల్ల

మాకు తెల్పుచు; సహృదయ! మాకు యొజ్జ!

వందనంబులివియె మీకు వాణి పుత్ర


నాల్గు వేదంబు లొక తావి నందు జేర్చి

దివ్య వేదవాణి గ్రంథము దెచ్చి జనకు

హితము కొఱకుఁ పాటుపడు స్నేహితుని కిత్తు

వందనంబులివియె మీకు వాణి పుత్ర!!


యజ్ఞ యాగముల్ జేయుచు యులుపెఱుఁగక

ప్రజకు సిద్ధాంతములనన్ని పరిచయములు

చేసి వారి హృదులనిలచిన ఘనుడవు

వందనంబులివియె మీకు వాణి పుత్ర!


వేద యుపనిషత్తుల నేర్చి వేగిరమ్మె
యెదిగినారు జీవితమందు యేకవీర
వోలె నిలిచి తీర్చిరి మమ్ము వున్నతంగ
వందనంబు లివియె మీకు వాణి పుత్ర!

పామర జనులైనన్ వొంద చ్చు మీరు
వ్రాయు భాష్యముల్ జదివిన! రత మాత
ముద్దు బిడ్డ! యజ్ఞానము మోకరిల్లె
వందనంబులివియె మీకు వాణి పుత్ర!


జాతి భూషణ! జనహిత! యము కలుగు
గాక మీకు వేదోద్ధార! గైకొనమని
మా ప్రణతులు వినయముగ నవి జేేేతు
వందనంబులివియె మీకు వాణి పుత్ర

గ్రంథములను వ్రాసి జనుల రమునందె
నిలిపి జ్ఞాన సంపద వారి నేస్తమైరి
తీర్చుకొనలేము ఋణము యో దీప కళిక!
వందనంబులివియె మీకు వాణి పుత్ర