Wednesday, October 9, 2013

నవ దుర్గ అవతారాల గురించి స్తోత్రములు

శ్రీ నవదుర్గ ల అవతారం

శైలేంద్రుడి తనయా చల్లని తల్లీ శైలి గుణ శీలీ
శేషశయనుని సహోదరీ గురు శిష్యులకు నీవే దరీ
శుభములు కూర్చు శ్రీ శివుని సతీ
శిఖర నివాసినీ శశి శేఖర ధారిణీ
శరత్ కాల సౌందర్యం సదా గోచరించు నీ అందూ
శమనమొందు జనులందరూ నీదు స్మరణ చేసినంతనే
శార్వాణీ శార్గపాణీ శాంతమొసగు స్వరూపిణీ
శ్రేయము నిచ్చును శరణమనంగనే
శూలమును చేబూనీ మా చెంతకు చేరితివీ
కరములయందు కమలములు కల అపరాజితా
శమ, దమనములు దీర్చునూ శక్తి మనకు ఒసగునూ
నిశి రాతిరి వంటి సంసారం దాటితే నీవే ముక్తిధారీ
సకల కష్ట, సంకటాలను దాటితే నీవే అంతిమ దారీ
శిష్ట రక్షణ గావించుమా సదా మాకు శ్రీ గౌరీ
వృషభము నెక్కీ చరియంచితివీ
పృథ్వీ రూపమున నుండితివీ
మూలాధారముతొ యోగోపాసన నేర్పితివీ
ఋతుచక్రమ్ముకు అధిష్ఠాన దేవతవూ
మాతృత్వమ్మును మాకొసగితివీ
మమ్ములను నీవోలె దీర్చితివీ



శైలపుత్రి వమ్మ నీవూ
శేష శయనుని సహోదరి వమ్మా నీవూ
శ్రీ శివునికి సతివమ్మా దేవీ
శుభములు కూర్చుము సదా మీకూ

భక్తవత్సలునికై  తపమాచరించు బ్రహ్మచారిణీ
బోళాశంకరుని శాంతపరుచు శార్వాణి
భాను శశి వహ్ని లోచనీ బహురూప ధారిణీ
బాహు కరములందు అభయవరప్రదాయినీ
భుక్తి, ముక్తి నొసంగు మా మోక్ష దాయినీ
బీజాక్షర మంత్రముల మూలదాయినీ
బిందు మండల నివాసినీ సువాసినుల సౌభాగ్య దాయినీ
బలరామ కృష్ణ ప్రియ సహోదరీ
భువికి అంతయు జననివి నీవే
భువనేశ్వరి నామధేయనివీవే బ్రహ్మాండమ్మునకు నాయకివే
భ్రమరాంబవై మము సదా కాపాడ
బేధభావము చూపని దయామయివే
బాధలు తీసీ మము బాగూ సేయవే
బేలగ మారనీక హేలము చూపువే
బిల్వ పత్రార్చితుని పత్నివి భిక్షుక సంస్తుత వైభవివే
భాషారూపం నీవమ్మా మా భయములనెల్లా ద్రోలమ్మా
బుధార్చితా బహు పదార్చితా
బ్రోచుము మమ్మూ ఎల్లప్పుడూ
వందనమిదె మా వనితలందరివీ
కమండలమును కరమునందూ నిలిపితివీ
జపమాలను ధరియించితివీ
ధరిత్రి పై తపమెంత విలువయొ తెలిపితివీ
తపోధారిని జేరుటకు తపన ఎటులుండవలెనొ తెలిపితివీ
స్వాధిష్ఠానమందు స్థిరమైతివీ
ఏకాగ్రతనూ పట్టుదలనూ మాకందిస్తివీ

చల్లగ చూడవే చందనమందుకొని
చందురుని శిరముపై దాల్చిన తల్లీ

  • అందించుము ఆనందాలు మాకు కల్పవల్లీ




షష్ఠేచ కాత్యాయని షణ్ముఖ మాతృ రూపిణి
సకల వర ప్రదాయిని సమస్త శుభ ప్రదాయిని
సౌభాగ్య కారిణి సర్వ మంగళ స్వరూపిణి
శక్తి నామ ధేయిని సింహవాహిని శ్రీ శివ సతి
అందుకో మా వందనాలు అందించు మాకు నీ దీవెనలు

Tuesday, October 1, 2013

ప్రకృతి - మనిషి

వాన ధారల దారాలల్లి
నేలని తాకింది నింగి
పచ్చని పైరుతో మురిపెంగా కుట్టి
పృధ్వి ని తీర్చింది మొలక
రాలిన పూవుని సైతం అందంగా పరిచి
మెత్తగ మార్చింది వృక్షం
వర్ణం లేని వర్ణన కోరని
నీరు పారింది అంతా తడుపుతూ
కొండ పై నించి దుమికి ఎత్తు పై నించి ఎగిసి
పాల నురగయ్యింది జల పాతం
చక్కని కిరణాల బాణాలొదిలి
వెచ్చదనం పరచాడు ఉదయ భానుడు
చల్లని వెన్నెల జగమంతా పంచి
ఆనందం నింపాడు చందమామ 
అచంచలంగా నిశ్చలంగా
సేవ చేస్తున్నవి ఇన్ని వనరులు
మరి అనంతమైన స్వార్థం తో
ఎందుకు వీటన్నిటినీ తెగ పాడుచేస్తున్నాడు నరుడు




మొక్కలే కదా భవిష్యత్తుకు మొలకలు
చూపవవి ఎటువంటి స్వార్థపు మెలికలు
చేరదీస్తే చెట్లను మనకు మేలు కలుగును
చక్కదనాల చిక్కని చల్లదనాలే మనవగును

పంచాక్షరి

నందీశ్వరుని మువ్వను కాను

నాగేంద్రుని అడుగును కాను

మయూర నర్తనమును కాను

ఢమరుక పదమును కాను

నీలో ఆగ్రహం తెప్పించ

రతీ పతి నీ కాను - అయినా

నీ అనుగ్రహం కోరే భక్తురాలను

నీ అవతారం కనలేని మూఢు రాలను


కృత్తిక నక్షత్రమును నెపముగ దీసుకొని
శిరమున ధరించిన శశితో జత‌ కలిసిన వేళ
కైలాసవాసుని స్మరియించెదమో జనులారా
అనంతమైన మోదమును పొందెదమూ మనసారా


ఆదిత్య పుర వాసుడీతండు
వహ్ని మండల సంస్థిత ఈశ్వరి
వెరసి సృష్టి కి వెలుగు రేఖలు
వెలసిన భక్తుల హృదయములందునా


ఆదిశంకరునికీ ఆ వ్యాసమూర్తికీ
అంధకారము తొలచె జ్ఞానమును పంచె
అదే జ్ఞానమును తన తనయుని వద్ద నుంచియు
తానొకనాడు పొంది గొప్పగా నిలిచే


వెన్నెల నైనా విషమే ఐనా
విబేధం కాక విలీనం చేసిన
వైనం వాహినుడిది ఆ విమలా పతిది
వెలుగును ఇచ్చే దీపం ఆ లింగ రూపునిదీ
విఘ్న నాశనుడు విజ్ఞాన దాయకుడూ
విడదీయలేని సోదరులీయన తనయులు
వర్ణం తెలుపూ వచనం సులువూ స్మరియించుటకూ
వింధ్య నివాసిని విరబోయు నవ్వులు మనకే దివ్వెలు



[20/04, 23:43] Durgamadhuri1: సురగురు పూజిత
సుమ సౌరభార్చిత
సుమంగళి కారక
సంపద దాయక
సుందర రూపా
సుజన రక్షక
సాధు పరిపాలక
సులక్షణ పతి నీవే
శుభములు కూర్చే
శశిధర హిమపురవర
శబ్ద మూలము నీవే
శ్వేత వర్ణమూ నీదే
శీఘ్ర ఫలములనీయవ
శీతలాద్రి వాసా శ్రీ శైలేశా
శ్రీ కంఠా గరళము మింగీ
శ్రేయము జేసితివి లోకాలకూ
వందనమిదే మా అందరిదీ
వదనమున దరహాసమందిన
విమలాపతీ వినీల గగన విహారీ
శిరమున గంగాధారీ


[20/04, 23:43] Durgamadhuri1: ఉమాపతి నీ నామము స్మరియింప
ఉపదేశమె లేదు నాకు ఏ గురువూ ధరియింప
ఉపవీతమె లేదు నాకు నేను ద్విజుడైన కాకున్నా
ఉపయోగము సేయలేను నీ భక్తులకు
ఉద్దీపన సేయవయ్య నా మదిలోన
ఉద్ధరించి కాచవయ్య నను ఈ లోకమందు
ఉపేక్షణ సేయకయ్య నన్ను పరీక్ష అంటూ
ఉపాయమ్ము సేయవయ్య నన్ను నా దారి మార్చీ
ఉపకారము ఇదేనయ నీ దరికి చేర్చు
ఉద్దేశముతోడ నిన్ను అర్చింతునయ్య
ఊరంతా నన్ను ఎగతాళి చేసిన
ఉసూరనేల నన్ను వదలకయ్య



బిల్వ పత్రమే అర్చించగలదు నిను ఓ
భవానీ పతీ భక్తి పరిపూర్ణత తెలియని
బంధ మోహుడని నను కరుణించు
భయహరా కరుణా వరదా ఓ శంకరా



నమః శివాయచ శ్రీ కంఠాయచ
శశి శేఖరాయచ శైలసుతా వరాయచ
శరవణ పితాయచ శారంగధర సఖాయచ
శంభవే నమః శంఖ పాణయే నమః


బద్రీనాథా మా భద్రత మీదయ్యా
భక్త జన పోషా నీ బాధ్యత మేమయ్యా
భయమేల మాకు మా భరోసా నీవయ్యా
భవానీ పతి మా భావము నీవేకాదా


[09/06, 15:31] Durgamadhuri1:


ఝటమున గంగా ప్రవాహము శిరమున శశీ ప్రకాశము
చాల లేదా భిక్షపతీ నీకు
పుష్పము లేల నయ్యా నిత్య అభిషేకీ

కైలాసమంతా కపాలమ్ములే
సుగంధములున్నవా సదా భస్మమే
తప సర్ప జ్వాలల ఉష్ణము
హిమ చంద్రుల తెల్లని చల్లదనమూ

అన్నింటి మిశ్రమం నీ ఆశ్రమం
ఆయువు కోరిన వారికిచ్చేవు ఆశ్రయం
అట్టి చిత్రములెల్ల గనీ
అచ్చెరువొందుట మా వంతూ

ఫణులెల్ల నుండును నీ ఇంట
ఇక చోటేదయ్యా వాటికింకెచటైన
నీ పత్ని కురులట నీ కంఠ సిరులట
నీదు జ్యేష్ఠునికి యజ్ఞోపవీతం
పిమ్మట కనిష్ఠునికీ ఆతని పత్నకీ అవేగా రూపం
కాదే మానస నీదు పుత్రీ నాగాభరణా
కుండలినీ శక్తికీ వాసం పన్నగమే

నంది నీ వాహనం సింహం నీ సతిదట
మూషిక మయూరాలూ అచ్చటే ఉండునట
ఆహా ఏమి వింతలయ్యా శివయ్యా
ఎంత చతురత నీదయ్యా

వ్యాఘ్ర పూజిత నీ అర్థాంగీ
శార్దూల చర్మమ్మె నీ ఆసనం
సమస్త జీవరాశి ఇలా నీ పరం
ఇంక కుసుమాలకేదయ్యా స్థానం


[09/06, 15:53] Durgamadhuri1:

జలజ యద్దుచుండెనా ఝటాధరా
వనజ లైన విరులు నీకూ
ఇరువురూ శశి సూర్య అగ్ని నేత్రలూ
ఇకపైన పంచుకొంటిరా పుష్పముల్
ఇటుల మీరు మాకు ఆదర్శప్రాయుల్
ఉమా మహేశా ఓ అర్థనారీశా
ఉపకారము సేయుడయ్యి పుడమి పై
పేర్మి పంచీ అపాయాలు ద్రుంచీ
బ్రోవవ మమ్మూ మా స్మరణమే నీ భరణమయ్యా

భావన

కన్నులతో అందం చుడాలనుకున్నాను
కలలొనే దాన్ని దాచేసుకున్నాను
కమ్మనయిన కవిత గా మలుచుకుందామనుకున్నాను
కరవైనది పదాలు కాదు భావన అని తెలుసుకున్నాను

Monday, September 30, 2013

ఆమె మీద వర్ణన

నిశి రాతిరి ఆ కురులలో దాగుంది
జాబిల్లి ఆ వదనం లోంచి తొంగి చూస్తోంది
రేయి తెలవారుతున్నట్టుగా భానుడు పొడసూపిట్టుగా
ఆ నుదురు కుంకుమ తో మెరుస్తోంది
ఆదిత్యుడి కిరణాల అంత వెచ్చగా ఆ స్పర్స పలకరిస్తోంది
వీచే గాలి లో లేని చల్ల దనాన్ని   సైతం ఆ కన్నులు కురిపిస్తున్నాయి



గగనమున తొలి సంధ్యలో నిండే స్వర్ణ వర్ణమూ
సంద్రాన లభియించు ముత్యంపు అందమూ
మిళితమై దర్శనమిచ్చే నీ పాదముల యందు
లయమై ముగ్ధ మనోహర నిలయమై

మౌనం - కవిత, సహనం

ఎందుకే మనసా నీకింత మౌనం

వైపు సాగుతోంది నీ పయనం

ఎన్నాళ్ళిలా నిన్ను నువ్వు మరవటం

కలం సాగటానికి పదాలు కరవా
కవిత్వం రాయటానికి భావం బరువా
ఎద పొలము పై పదం పండలేదేమి
వాడిపోని అందం వున్నా ప్రకృతి
అక్షరాల విత్తులు నాటను అంటున్నదా
సప్త వర్ణాల హరివిల్లుల ఆకాశం
వాటికి చినుకులు అందించను అంటున్నదా


సర్దుకుంటే పోయేదానికి సఖులతో సమరమేలా
సాకులెతికి ఉతకనేలా సహనమే సమర్థత కాదా
సంధి ఎప్పుడూ హితమే సుమా
సమస్యలన్నవి ఉండవు వినుమా


ప్రతీ దానికీ పంతమేల
ప్రతీకారానికి అంతమేది
ప్రశాంతతకు మూలం కాదది
ప్రగతి బాటకు తీసుకుపోదది

సమర్ధత అంటే సంధి అనెను కృష్ణుడు
సహనమె సిసలైన ఆయుధం అనెను విదురుడు
సహేతుకమైన ఇట్టి సిద్ధాంతముల్ సడి చేయవే మానవులారా
స్టడీ చెయ్యండి ఈ సత్యాన్ని ఓ మేధావులారా

ఆమె కన్నీళ్ళు

నీలాల ఆమె కళ్ళు వర్షించే మేఘాలను తలపిస్తున్నాయి
కాటుక సరిహద్దుని దాటిన ఆ ధార ముందు కు ఉరకటం తో
నునుపైన చెక్కిళ్ళు నీటి ప్రవాహాలయ్యి
కోయిలకు పాట నేర్పే కంఠాన్ని చేరినాయి 

Friday, August 23, 2013

చందమామ

అనంతమైన కొమ్మకి పూచిన పూవు
శ్వేత వర్ణమును అలుముకున్న సమస్తము కలది గ వుంటుంది
అన్దరికీ బంధువు నంటుంది అయినా అందనంటుంది
ఏమిటది ?


కలువల రేడంట
చక్కని వెలుగంట
కవికుల తోడంటా
చిక్కును వారి కరములకంటా
కనులకు తోడంట
చిమ్మ చీకటి రేతిరినంటా
కానరాడంటా ద్విపక్షమ్మునంతా
చతురత ఇదే చూడురంతా




గగనానికి పూచిన కుసుమమును నేను
గరళ కంఠుని శిర పుర వాసుని నేనూ
గమనమాగని బాటసారిని నేనూ
గుర్రం జాషువా కవితల వెన్నెల నేను
గాయం సేయను కానీ మాయమవుతానూ
గొప్పగ మళ్ళీ మరు పక్షముకై ఎదిగొస్తానూ



అందని వాడంటా‌ అద్దమునె దొరుకునంటా
అమ్మలకు చేరువంటా అందుకే మామంటా
అటులనే బంధమంటా అందరితొ బాంధవ్యమంటా
అమృతముకు సోదరుడంటా అందగాడు అను నామమందుకే
అమాసన రాడు అంటా అసహనమె‌ ఆ నాడు అంతా
అలంకారమె ఆతడెప్పుడూ అక్షరకుల ప్రియుడె ఎప్పుడూ
అవనిజకు సైతం భ్రాతుడితడూ ఆరోగ్య కారకుండందుకే
ఆద్యంతం చిలుకు వెన్నెల ఆనందదాయకుడటులా