Friday, June 17, 2022

1000 లో నుతులపై 200 లో పది

 1. తేటగీతి 1 సూ + 2 ఇం + 2 సూ, యతి 4వ గణము తొలి అక్షరము


ఇంటి దొంగవగుట జూడ హీన గుణము

నరుడ! కష్టపెట్ట వలదు నమ్మినట్టి

సతిని మోసగించిననది చావు సమము

సత్యగుణముతో మసలుమ సతత మిలను


2. మత్తకోకిల ర స జ జ భ ర యతి 11


మాతృ భాషను వీడబోకుమ మానవా యది చేటురా

ప్రీతిగన్ చదివించి నేర్పుము పిల్ల పాపలకున్ సదా

వేతనంబుల విద్యయేలను! వృక్ష మిచ్చెడు నీడయౌ

మాతృభాషను గారవించిన 

మంచి గల్గును సోదరా


3. ఉపేంద్రవజ్రము జ త జ గ గ 


విరోధ భావమ్ములు భీతి గొల్పన్

హరించి పోయెన్ మహి హ్లాదరాశుల్

ధరాతలమ్మంతయు దైన్యమేగా

స్థిరమ్ము గానీయరె స్నేహబుద్ధుల్


4. 15 157 వంశస్థర జ త జ ర 8


శ్రమించు నాడే సుఖ సౌఖ్య మందునే

క్షమన్ వహించంగనె సంతసమ్ములున్

తమస్సు వీడంగ ముదమ్ము దక్కుగా

సమాన రీతిన్ జని సాగు నెమ్మదిన్


5. 46 67 తామరసము (తోదకము)

 న జ జ య 8

వనమున పూచిన పద్మము వోలెన్

ఘనమగు సంపద గల్గినదౌ యీ

దెనుగును మించిన తీపియు లేదే

మననము సేయరె మానక యాంధ్రుల్


6. ఉత్పలమాల,  భ, ర, న, భ, భ, ర, వ, యతి 10

భారత భావి పౌరులగు బాలల చక్కని వృద్ధి కోసమై

తీరుగ దిద్దరే తెవివి తేటలు వారికి గల్గునట్లుగన్!

శౌరుల యొక్క గాథలను చక్కగ దెల్పిన రాటు దేలుచున్

చేరెదరంట నంబరము చీకటి చీల్చెడు కాంతి రేఖలై


7. చంపకమాల,  న, జ, భ, జ, జ, జ, ర, యతి 11

మనసున కల్మషమ్ము తగు మంచిని చేయదు మానవా సదా

వినయ గుణమ్ము కాచునిను! వీడకు సజ్జన సన్నిధానమున్

కనులకు తోచు సర్వమును గాదు నిజమ్మని మున్నెరుంగుమా

ధనమొక మత్తు లోకులకు ధారగ నిచ్చితివా యధోగతే


8. 101 104  

భారవి భ ర భ ర భ ర వ యతి 13

ఒప్పకు మానవా చెప్పుడు మాట తో నొప్పిన గల్గు నొప్పియే

చెప్పకు మెన్నడున్ తప్పుడు పల్కులున్   చేయకు పాప కార్యముల్

తిప్పలు పెక్కులే దెచ్చు ఋణమ్ములాత్మీయులకైన! నమ్మినన్

నొప్పులు దీర్ప రారెవ్వఱు గాన నీ నోములె గాచురా నిన్ను మానవా


9 కందము 

కవనము నాట్యము గానము

కవలిగ శిల్పకళ చిత్ర కళల కలయికే

భువి లలిత కళలు! వానిని

చవి జూసిన వదలలేరు! సత్యము గనుమా

10. ఉత్సాహము


తెలుగు భాష లోన గలవు తేనెలొలుకు 

పలుకులా

వెలుగు లోన గలవు పద్య విద్య నేర్పు ఛందముల్

లలిత లలిత పద సమితిని రసభరితము చేయగా

పలుకు సులభ మైన రీతి పండు భావమంతయున్

Wednesday, June 15, 2022

1000లో నుతులతో పాటూ మరో పది

1. తేటగీతి 1 సూ + 2 ఇం + 2 సూ, యతి 4వ గణము మొ.పా

ఇంటి దొంగవగుట జూడ హీన గుణము

నరుడ! కష్టపెట్ట వలదు నమ్మినట్టి

సతిని మోసగించిన నది చావు సమము

సత్యగుణము తో మసలుమ! సతతమిలను


2. మత్తకోకిల ర స జ జ భ ర యతి 11

మాతృ భాషను వీడబోకుమ మానవా యది చేటురా

ప్రీతిగన్ చదివించి నేర్పరె పిల్ల పాపలకున్ సదా

వేతనంబుల విద్యయేలను! వృక్ష నీడను వంటిదౌ

మాతృభాషను గారవించిన మంచి గల్గును సోదరా


3. ఉపేంద్రవజ్రము జ త జ గ గ 8

విరోధ భావమ్ములు భీతి గొల్పన్

హరించి పోయేనిక హాయి లేకన్

ధరాతలమ్మంతయు దైన్యమేగా

స్థిరమ్ము గానీయరె స్నేహబుద్ధుల్


4. 15 157 వంశస్థర జ త జ ర 8


శ్రమించు నాడే సుఖ సౌఖ్య మందునే

క్షమించి నన్ గల్గును సంతసమ్ములున్

తమస్సు వీడంగ ముదమ్ము దక్కునే

సమాన రీతిన్ జని సాగు నెమ్మదిన్


5. 46 67 తామరసము (తోదకము) న జ జ య 8

వనమున పూచిన పద్మము వోలెన్

ఘనమగు సంపద గల్గినదౌ యీ

దెనుగును మించిన తీపియు లేదే

మననము సేయరె మానక నాంధ్రుల్

6. ఉత్పలమాల,  భ, ర, న, భ, భ, ర, వ, యతి 10

భారత భావి పౌరులగు బాలల చక్కని వృద్ధి కోసమై

తీరుగ దిద్దరే తెవివి తేటలు వారికి గల్గునట్లుగన్!

శౌరుల యొక్క గాథలను చక్కగ దెల్పిన రాటు దేలుచున్

చేరెదరంట నంబరము చీకటి చీల్చుచు కాంతి రేఖలై


7. చంపకమాల,  న, జ, భ, జ, జ, జ, ర, యతి 11

మనసున కల్మషమ్ము తగు మంచిని చేయదు మానవా సదా

వినయ గుణమ్ము కాచునిను! వీడకు సజ్జన సన్నిధానమున్

కనులకు గానుపించునది గాదు నిజమ్మనెఱింగి మేలుకో

ధనమొక మత్తు లోకులకు ధారగ నిచ్చితివా యధోగతే


8. 101 104  భారవి భ ర భ ర భ ర వ యతి 13

ఒప్పకు మానవా చెప్పుడు మాట తో నొప్పిని గల్గు రీతినన్

చెప్పకు నెన్నడున్ తప్పుడు పల్కులున్   చేయకు పాప కార్యముల్

తిప్పలు దెచ్చునే యిచ్చిన యప్పులాత్మీయులకైన! నమ్మినన్

నొప్పులు దీర్ప రారెవ్వఱు గాన నీ నోములె గాచురా నిన్ను మానవా

9

కవనము నాట్యము గానము

కవలిగ శిల్పమ్ము చిత్ర కళలును గలువన్

యవి లలిత కళలు! వానిని

చవి జూసిన వదలలేరు! సత్యము గనుమా


10. ఉత్సాహము


తెలుగు భాష లోన గలవు తేనెలొలుకు సిరులు! యా

వెలుగు లోన గలవు పద్య విద్య నేర్పు ఛందముల్

నలతి యలతి పదములల్లి యద్భుతముగ గూర్చగా

పలుకు సుళువు యాయునట్లు పండు భావమంతయున్

గురువు గారి వృత్తములు reviewed

 1.

అక్షి, స, జ, స గణములు, యతి లేదు*

పసివారి నవ్వులకు తా

పసులైన ముగ్ధులు కదా

వసి వాడనీక చదువుల్

వెస నేర్వరే బ్రతుకునన్ 


2.

సంబుద్ధి వృత్తము 

స త య గణములు


నరులే దుష్టత్వము చూపన్ 

కరువై పోవంగ సురాంశుల్

ధరపై శాంతమ్ము నశించెన్

నరకంబయ్యెన్ జగ మంతన్


లేక తరువాత న్ రాదు. మ్ము తరువాత యు అధికము. 

****************:********

3.

సుగంధి స న య యతి లేదు


నది సాగరములు చెట్లున్

పదిలమ్ముగ గల ధాత్రిన్

ముదమొంది ధరణి జీవుల్

నిదురింతు రెపుడు శాంతిన్ 


4 విమల స మ న ల గ 7*


జలముల్ లేవెందున్ జగతినన్

కలిమే నీరంబౌ గనుక నా

సలిలంబుల్ పారింౘక సదా

నిలుమా నాదర్శనిధివిగన్


5 వర్ణగలాభా స స భ గ గ 7


తగవుల్ పగలున్ దైత్యగుణమ్ముల్

నగవుల్ చెఱగున్ నాశము జేయున్

జగమంత సదా శాంతిని నింపన్

దిగిరావలెనీ దేశము లెల్లన్ 

****************************

6. శీల స స స ల ల 7

పసివారగు పాపలపై మదిఁ

కసి నింపక రక్ష నొసంగిన

కుసుమింతురు! సూక్తులు గావివి

వసివాడక పాపల గాచుము


7. 18. శుభ్రాంసు భ భ జ య జ గ ల 10

బాలిక లైనను వివక్ష ప్రదర్శించనేల! వారి

కాలన పాలనల తో సహకారమ్మునంద జేసి

మేలొనరించిన నిశీ తిమిరమ్ముల్ జయించు శక్తి

జ్వాలగ నిల్చుచు సదా నుపకారంబుల్ చేయువారు


8. 20. గిరిజా మ స మ స స మ ల 10


8. కోపావేశము దెచ్చున్ కీడున్ గుణ హీనులు దుష్టుల్ వీరంచు

నీ పై నూగుచు లోకమ్మెల్లన్ నిను నిందల పాల్జేయున్ నీదు

నోపున్ జూడరు! వేధింపుల్ చేయు జనుల్ మదినిన్ బాధల్ నిండి

వ్యాపించున్ విధమున్ వారెల్లన్ ప్రతి నిత్యము సాధింపుల్ నిల్చు


9. 15 నూపుర భ త ర స ర 7

ఆమని శోభేది?హ్లాదమేది యదృశ్యంబుగా

నీమహిలోతాపమేచు నెంత యుదుర్వారమై

దేమయు లేదింక! దేహముల్ మరి శుష్కించగన్ 

సోముడు చల్లంగ చూచునే కలగా ధారుణిన్

10.  7. సుతలం స ర స ర గణములు యతి 8

జననీ జన్మభూమి! సదా గొల్వరే

వినుడీ మంచి మాట వినిర్మలులై

వినువీధిన్ గమించి విదేశంబులన్

చనినా వీడరాదు స్వదేశంబిలన్


11. 8. ప్రమితా స ర స స 9 

ధన ధాన్యమ్ము లన్నియు ధారుణిపై 

కన రావంచు భీతిగ కర్షకులున్

మనమందున్ పడన్ వగ మార్పును కో

రినివా సంపు పల్లె దరిన్ విడిచెన్


12. 19 మనోమహిత య జ న భ స జ 10

సదామాతృభూమికిసరి సామ్యము జగమ్మందు లేదు

స్వదేశమ్ము నందు ౘదివి సంపద కొఱకై ౘనంగ

విదేశమ్మువైపు యువత! వృద్ధుల నిలయంబు గాద!

నిదానమ్ముగా యువతను నిల్పినను తప్పక మేలు


13 17 కళాశ్రీ భ త భ స య ల ల 9


ఆర్థిక స్వాతంత్య్ర మిచ్చి యతివ వృద్ధి కై యుండిన

వ్యర్థము గానీక యామె ప్రతిభ లోకమెల్లన్ విని

హార్దికమౌ కాంక్ష తోడ నగణితంబు గా సాగుచు 

వర్థిలగా కాంత లెప్డు పరహితంబునే కోరిరి

Below is my version for ర్థ ప్రాస 

ఆర్థిక స్వాతంత్య్ర మిచ్చి యతివ వృద్ధి కై యుండిన

వ్యర్థము గానీక యామె ప్రతిభ లోకమెల్లన్ విని

స్వార్థము లేనట్టి కాంక్ష సహన శీల యై వెల్గుచు

వర్థిలగా కాంత లెప్డు పరహితంబునే కోరిరి



14 13 నిశ్చల2 భ త మ మ త 10


ప్రాణము నిచ్చున్ కదా చెట్లున్ ప్రాణాధారంబౌను

జ్ఞానము తోడన్ ధరన్ లోకుల్ సాగించన్ శ్రద్ధాత్ము

లై నిరతంబీ భువిన్చెట్లన్ రాగాత్ముల్ గా చూచి

పూనిక తోడన్ జనుల్ పెంచన్ పొందున్ సంతోషంబు 

********************

15 15 చంద్రశాల న ర త త గ 8 


నిరత మీధరి త్రిన్ నిశ్చలాత్మలు గా

పరమ పావనుల్ గా భాగ్యదాతల్ సదా

చిరుత వేగమొప్పన్ చేయు వారల్ పనుల్ 

తరుణు లందరున్ మోదమ్ము తో దీక్షతోన్


16 16 పాణీ న ర భ జ ర గ 10

తరువు జీవనాధారము తపించు నిత్యమున్ తా

పరుల సేవకై బాధ్యత వహించు నిల్చునే యా 

హరిత వర్ణ సౌందర్యము హరించ తాపమేచున్ 

నరుడ! బాధ లేపొందు మనజాతి భావి యందున్


17 9 సాక్షీ స స జ మ 7

పసివారికి చూపరేల ప్రేమన్ తా

మసమేలన! సూక్ష్మమున్ గ్రహింపన్ మా

నసమందున వెన్నయుండు నెవ్వేళన్

గసుగాయలుగా గణించ మౌఢ్యంబౌ


18 శ్రీ లలిత స జ త ర ల గ 8

హరితంపు రంగుతోనామనుల్ నశించులే

సరిగంగ పాఱు నా జాలువారదక్కటా

మురికిన్ భరించగన్ ముదంబు కల్గునా వే 

పరి రక్ష సేయకున్నన్ ప్రాభవంబు లేదులే


19 11 సౌరభీ స జ య ర ల గ 10

పురుషాళి భోగము పైనన్ మోహ చింతతోన్

కరుణాంత రంగము వీడన్ గష్టమే కదా 

పరుషంపు మాటలు పల్కన్ పంకమందునన్

చరియించ వైరము తో నాశమ్ము తథ్యమౌ


20 మల్లికా స జ స జ ల గ 10


ౘదువంగ రాదు గద విజ్ఞతా పథమే

నది దూకి నేర్వ దగు యాన సూత్రములన్

పదిలమ్ము గాను మదినింప పాత వెతల్ 

విదితమ్ములౌ భవితలుర్వి జయమ్మిడున్

Wednesday, June 8, 2022

గురువు గారు ఇచ్చిన వృత్తములు

1.

అక్షి, స, జ, స గణములు, యతి లేదు*

పసివారి నవ్వులకు తా

పసులైన ముగ్ధులగునే

వసి వాడనీక చదువుల్

ప్రసరింౘనీమ బ్రతుకున్

2.

సంబుద్ధి వృత్తము స త య గణములు

నరులే దుష్టత్వము చూపన్ 

కరువై పోవంగ సురుల్ యీ

ధరపై శాంతమ్ముయు లేకన్

నరకంబౌనీ జగ మంతన్

3.

సుగంధి స న య యతి లేదు


నది సాగరములు చెట్లున్

పదిలమ్ము గ నిలువ ధాత్రిన్

ముదమొంది ధరణి జీవుల్

నిదురింతు రెపుడు శాంతిన్ 

**

*4 విమల స మ న ల గ 7*


జలముల్ లేవెందున్ జగతి

కలిమంతా నీరే గనుక

సలిలంబుల్ పారింౘకుమ

నిలుమా నాదర్శనిధిగ

**

5 వర్ణగలాభా స స భ గ గ 7


తగవుల్ పగలున్ దైత్యగుణమ్ముల్

నగవుల్ చెఱగున్ నాశము జేయున్

జగమంత సదా శాంతిని నింపన్

దిగిరావలెనీ దేశము లెల్లన్

6. శీల స స స ల ల 7

పసివారగు పాపలపై మదిఁ

కసి నింపక రక్ష నొసంగిన

కుసుమింతురు! సూక్తులు గావివి

వసివాడక వాపల గాచుమ


7. 18. శుభ్రాంసు భ భ జ య జ గ ల 10

బాలిక లైనను వివక్ష ప్రదర్శించనేల! వారి

కాలన పాలనల తో సహకారమ్మునంద జేసి

మేలొనరించిన నిశీ తిమిరమ్ముల్ జయించు శక్తి

జ్వాలగ నిల్చుచు సదా నుపకారంబుల్ చేయువారు

8. 20. గిరిజా మ స మ స స మ ల 10

కోపావేశము దెచ్చున్ కీడును! గుణ హీనులు దుష్టుల్ వీరంచు

నీ పై యూగుచు లోకమ్మంతా నిను నిందల పాల్జేశేరు

యోపున్ జూడరు! వేధిస్తూ నుడివేరిక నీ కథలే చుట్టూపట్ల 

వ్యాపించే విధమున్ వారంతా ప్రతి నిత్యము సాగేరీ రీతి


9. 15 నూపుర భ త ర స ర 7

ఆమని శోభేది?హ్లాదమేదియు లోకంబులో 

నీమహి నిండంగ హెచ్చు యుష్ణము తోవేగగన్ 

దేమయు లేదింక! దేహముల్ మరి శుష్కించగన్ 

సోముడు చల్లంగ చూచునే కలగా ధారుణిన్

నూపుర భ త ర స ర 7

శైలము సంద్రంబు జంతుజూలము లీ ధాత్రి పై

వాలుచు నిల్చేటి వాసమే మన కాధారమే

పాలన కై జూచి ప్రాణ హానికి పూనంగ నీ

మౌలిక జీవంబు మాయమై యునికే కూలునే


10.  7. సుతలం స ర స ర గణములు యతి 8

జననీ జన్మభూమి! సదా గొల్వరే

వినుడీ మంచి మాట విధేయంబుతో

వినువీధంత దాటి విదేశంబులన్

చనినా వీడవద్దు స్వదేశంబిలన్


11. 8. ప్రమితా స ర స స 9 

ధన ధాన్యమ్ము లన్నియు ధారుణిపై 

కన రావంచు భీతిగ రైతు జనుల్

వనవాసమ్ము కేగిరి పట్నము కై

పెనుబాధన్ జవంబిటువీడి భువిన్ 


12. 19 మనోమహిత య జ న భ స జ 10

యదార్థమ్ముగా మన భరతావని తను పెన్నిధైన

స్వదేశమ్ము నందు ౘదివి సంపద కొఱకై ౘనంగ

విదేశమ్మువైపు యువత! వృద్ధుల నిలయంబు గాద!

నిదానమ్ము నైన జనుల నిల్పగలిగినంత మేలు.


13 17 కళాశ్రీ భ త భ స య ల ల 9

ఆర్థిక స్వాతంత్య్ర మిచ్చి యతివ వృద్ధి కై యుండిన

వ్యర్థము గానీక యామె ప్రతిభ లోకమంతా విని

హార్థిక యాకాంక్ష తోడ నగణితంబు గా సాగుచు 

వర్థిలగా కాంత లెప్డు పరహితంబునే కోరిరి


14 13 నిశ్చల2 భ త మ మ త 10

ప్రాణము నిచ్చున్ కదా చెట్లున్ ప్రాణాధారంబౌను

జ్ఞానము తోడన్ ధరన్ లోకుల్ సాగించన్ శ్రద్ధాత్ము

లై నిరతంబీ భువిన్చెట్లన్ రాగాత్ముల్ గా చూచి

పూనిక తోడన్ జనుల్ పెంచన్ పొందన్ సంతోషంబు


15 15 చంద్రశాల న ర త త గ


నిరత మీధరి త్రిన్ నిర్ణ యాత్మలు గా

పరమ పావనుల్ గా భావి సాధింతురీ

ధరనుఁ యోర్మి మీరన్! స్థాపితంబుల్ గదా

తరుణు లందరున్ మోదమ్మందన్ ధరలో


16 16 పాణీ న ర భ జ ర గ 10

తరువు జీవనాధారము తపించు నిత్యమున్ తా

పరుల సేవకై బాధ్యత వహించు నిల్చునే యా

హరిత వర్ణ సౌందర్యము హరించకయ్య యో

నరుడ! బాధ లేకల్గు మనజాతి భవ్యమందున్

17 9 సాక్షీ స స జ మ 7

పసివారికి చూపరేల ప్రేమన్ తా

మసమేలన! సూక్ష్మమున్ గ్రహింపన్ మా

నసమందున వెన్నయుండు వారి చెంతన్

గసుగాయలుగా గణించ నీ లోకుల్

18 శ్రీ లలిత స జ త ర ల గ 8

విరిసే వసంతమే వీడుఁ నీ ధరిత్రి! తా

సరిగంగ పాఱు నా జాలువారదక్కటా

మురికిన్ భరించగన్ ముదంబు కల్గునా వే 

పరి రక్ష సేయకున్నన్ ప్రాభవంబు లేదులే


19 11 సౌరభీ స జ య ర ల గ 10

పురుషాళి భోగము పైనన్ మోహ చింతతోన్

కరుణాంత రంగము వీడన్ గష్టమౌను యీ

పరుషంపు మాటలు పల్కన్ పంకమందునన్

చరియించ వైరము తోడన్ జారబోకుమా


20 మల్లికా స జ స జ ల గ 10


ౘదువంగ రాదు గద విజ్ఞతా పథమే

నదిలోన నేర్వవలె యాన సూత్రములన్

పదిలమ్ము సేసిన పరాభవంపు వెసల్

తుది దాక గాచును నిరోధమౌను వెతల్