Friday, February 18, 2022

10,000 Project

గురువుకు:

శతకము వరుసగ వ్రాసెడి సాహసమ్ము

చేయ బూనితినేడు నే శ్రీ గురువర

దీవెనలడిగితి తొలిగా! దీనురాల

నిరతము నిలపై పద్యము నిలుచునట్లు


మాతా పితలకు భక్తిగ

మీ తనయ ప్రణతులనిడి మీదయ గోరెన్

సీతారాముల గాథలు

గీతాచార్యుని పలుకుల గేయము గూర్చన్

తాతగారు: రామాయణము వ్రాసినారు

పూర్వుల జ్ఞానము మనకు పుష్కలమ్ము

తాతల పలుకులు నెపుడు దారి చూపు

ననుచు నే కోరెద మిమ్ము! వినయముగను

పద్య రచనకు దీవెన! వచనములను


రామ కథను వ్రాసి వచన ప్రక్రియనందు

మార్గదర్శకులుగ మా తరముకు

నిలచినట్టి మీదు నేర్పు నొసగి పద్య

రచన సేయమనుచు లక్ష్యమిమ్మ

గణపతి

పంతము బూనక కపిలా

దంతమునే కలముగా నుదారమ్ముగ తా

నంతయు నిండిన కృష్ణుని

వింతల వ్రాసిన గజముఖ! విఘ్నము లెల్లన్

బాపి నేను పద్యములను వ్రాయగల్గు

శక్తి నొసగుమ! సతతము శైల పుత్ర!

యాగనీక నన్ను సాగుమనుచు వంద

పద్యములను వ్రాయు వరమునిమ్మ

సరస్వతీ మాత

వాణీ వాక్కుల రాణీ.

నాణెమ్ములడుగను కమల నయనా తల్లీ

వీణా పాణీ నీకై

మాణిక్యములీయలేను! మంజుల! జననీ


శతకము వ్రాసెడి తలపులు

సతతము పరుగిడె మనమున శారద జననీ

హితమును కూర్చగ రమ్మా

వెతలను దీర్పెడి సురనుత! వేధ పత్ని

హనుమ

కపివర శ్రేష్ఠా ఛందో

నిపుణా వ్యాకరణములను నేర్పుచు నాకో

ఉపకారము నొసగు మనవి

తపము వలెను రామ కథను తగు రీతిగ నే

వ్రాయ దలచినాను ప్రజ్ఞను దీవింౘ

మనవి గొనుమ హనుమ! మాట రాని

దాన! చేయి పట్టి దాటించి యీస్థితి

గురువు మాట నిలుపు వరమునిమ్మ



రామాయణము

1.

డిండిమ జ, స, న, జ, ర, ప్రాస కలదు, యతి 11 13, 61

అయోధ్యయను రాజ్యమునకు నాధిపత్యుడౌ

సుయోధనుడు నేలెను బహు శోభగన్ దయా

పయోనిధిగ గాని తనదు! వంశ వృద్ధికై

సుయోగము నొసంగు సుతుల చూడ కాంక్ష తో

2.

తరలి వృతము, భ, స, న, జ, న, ర, ప్రాస కలదు, యతి 11

129, 64

నాదశరథుడే గురువుల నానతి గొని వేగమే

వైదికులను పిల్చి మదిని భక్తిగ నిల్పి కోరికల్

వేదనలను దీర్చుటకని వేలుపునగు స్వామినిన్

పాదములను మోపి బ్రతుకు పావనమునొనర్చు సత్


3. మదనవిలసిత / మధుమతి (ద్రుతగతి , చపలా , మధుమతి , లటహ , హరివిలసిత) న, న, గ ప్రాస కలదు, యతి లేదు 38, 131

గతుల కొఱకు తా

వ్రతిగ నిలిచియున్

క్రతువు జరుపుగన్

యతిగ ననలుడున్

4. గుణవతి వృత్తము న, మ గణములు ప్రాస కలదు, యతి లేదు 41, 47

సుచిర కీర్తుండున్

నచట వేంచేసెన్

సచన పల్కుల్తోన్

శుచిగ నందించెన్


5.

అచల వృత్తము: న, న, ల, ల; వృత్తము గనుక  ప్రాస కలదు, యతి లేదు 76, 3

కలశము నమరెను / నొకటిని

ఫలముగ నౘటన

నలువురు తనయులు

కలిగిరి నపుడును

6. ఆటవెలఁది

రాముడును భరతడు లక్ష్మణుండు శతృఘ్న 

నామములను పెట్టి! నయము మీర

రాజపురపు జనులు రాగము పంచుచు

కన్న వారి మదిని కలలు దీర్ప

Or 

కోకనదము భ భ భ స ప్రాస కలదు యతి 7వ అక్షరం 100, 37

రామ శతృఘ్నులు లక్ష్మణ భరతుల్

గామగ హర్షము గల్గెనచటనన్

ప్రేమగ జూచుచు పెద్దలు ముదమున్

స్వామికి హారతి పట్టుచు గడిపెన్

7. కుసుమ (34 in file) ప్రాస కలదు, యతి లేదు, న, ర, రగణములు

చదువు నేర్చుచున్ బాలురే

నెదిగె వేగమున్; ధారుణిన్

కొదవ లేదు ధైర్యంబుకున్

నదటు గాదు నీ వాక్కులున్ (అదటు = అతిశయము, ఆంధ్ర భారతి నిగంటువ)

8. ద్రుతవిలంబితము (సుందరీ , హరిణప్లుతా) న, భ, భ, ర, ప్రాస కలదు, యతి 7

బడప = కష్టము ఆంధ్ర భారతి నిఘంటువు

గడచె వేగమె కాలము ధాత్రినన్

వడిగ శస్త్రము వాడు విధమ్ములున్

నడత నందున నమ్ర గుణమ్ములున్

బడప లేకనె పట్టెను రాముడే


9. కంటక వృత్తము, ప్రాస కలదు, యతి లేదు, భ, భ, గ 98 20

నంత = వినమ్రత, హంత = హింసకుడు, ఆంధ్ర భారతి 

నంతట కౌశికుడే

నంత గుణమ్మున తా

అంతునెఱుంగని యో

హంతల! నంతము కై


10. కలరవము, యతి 8, ప్రాస కలదు, స, న, న, న, ల, గ 196 28

బిగి = ధృడ, ఆంధ్ర భారతి

తగు వీరుడయిన దశరథ సుతునిన్

బిగి నిశ్చయమున పిలచెను తనతో

నగరమ్ము విడచి నడచి నడవులన్

తగు రీతి దిరిగి దరుమవలెననన్


11. చంద్రిక, భద్రిక న న ర, వ, ప్రాస కలదు, యతి 7

యనిన చనెను హ్లాద మోముతో

వనములకును వారిజాక్షుడే

మునుల కొఱకుఁ మోహనాంగుడే

యనుజు డయిన ఆది శేషుతో


12. భ భ న జ న గ కామేశ ప్రాస కలదు యతి 11 95 33

రాణము = నాదము ప్రాసాక్షర పద కోశము

జాణగు తాటకి విడువక జంపు తలపుతోన్

రాణము జేయుచు కదలెను రాక్షసుల గనెన్

బాణము వేయుచున సురుల పాలిట యముడై

ప్రాణము దీసెను సుళువుగ రాముడు గెలిచెన్

13. ప్రియంవద న, భ, జ, ర, 8, ప్రాస కలదు 79 98

అడవి మార్గమున యాన వేళనన్

అడుగు తాకగ నహల్య నాయెనే

బిడిసి పోయినను వేగమే యనెన్

తడియు గొంతునను ధన్యవాదమే

14. సురభూజ రాజము, న, భ, ర, న, న, న, ర, ప్రాస కలదు, యతి 12 81 194

అనల నేత్రుని విల్లు పట్టియు నతి సులభముగ ద్రుంచె తా

ఘనము గా మిథిలా పురమ్మున! కలికి చిలుక కరమ్ముతో

జనము మెచ్చగ చేరె రాజ్యము! సమయము గడువగా విధే

తనకు కష్టము దెచ్చి కానల దరిమె హతవిథీ తుదన్ / హరీ

15. అపరాజితము న, న, ర, స, వ, ప్రాస కలదు, యతి 9  75 4

ధరణిజ చెర పట్టె! దానవుడే పగన్

కరకుగ గొని పోయె కామము పూనికన్

తరలెను తన లంక ద్వారము దాటి యా

తరుణి నిలిపె! నందు దారుణ రీతినన్

16. అశ్వగతి, భ, భ, భ, భ, భ, గ, ప్రాస కలదు, యతి 10 115 7

వానర వీరులు రాముని భార్యను జూచుటకై

యానతి గైకొని వెంటనె అందఱు బాధ్యతగన్

పూనికగా కొనసాగెను భూమికి నల్దెశలన్

కానలు కొండలు దాటిన గానక నాఖరునన్


17. చిత్రపదము: భ భ గ గ ప్రాస కలదు యతి లేదు

మారుతి వేగమె లేచెన్

ధారుణి సీతను జూడన్

నీరును దాటుచు లంకన్

జేరెను! రాతిరి వేళన్

Or as the above is later removed from the list

జలదము భ ర న భ గ ప్రాస కలదు యతి 10 122 58

కారణ జన్ముడౌ ఘనుడు కాంచనుడున్

మారుతి వేగమే యెగిరి మానసమున్

ధారుణి పుత్రి జాడ గన దక్షతతో

నోరిమి గాను లంక చనె నొంటరిగన్

19.

పద్మకము న భ జ జ జ గ ప్రాస కలదు యతి 11 

భరువు = ప్రభువు, ప్రాసాక్షర పద కోశము

మరలె రాఘవుని చెంతకు మారుతి వేగమే

తరువు నీడన ధరాత్మజ దైన్యము దెల్పగన్

సరగు వారధిని గట్టుచు సాగెను నీటిపై

భరువు లక్ష్మణుని గూడియు వానర సేనతో

20. శార్దూల లలితము మ న జ న త న ప్రాస కలదు యతి 13

హంకారము = గర్వము

లంకాయానము కొఱకై వడివడి రాముడు కడలి

హంకారమ్మున దశకంఠుని తగు యస్త్రము నతని

యంకమ్మునిలను ముగించుచు తన యాలిని గలిసి

సంకోచమ్ముల దరిమెన్ తరలెను స్వంత భువికిని


18.ఘారిన = రాత్రి వేళ క్షోణము = నేల, ఆంధ్ర భారతి నిఘంటువు

  1. ప్రతి పాదమునందు 13 వ అక్షరము యతి స్థానము
  2. ప్రతి పాదమునందు భ , భ , భ , భ , ర , స , వ(లగ)
అంబురుహము
శ్రీ ఘు రాముని పత్నిని గన్గొనె శీఘ్రమే వనమందునన్
ఘారిన జూచిన తల్లికి నాథుని గాథ పాడుచు దూకి తా
చేరెను చెంతకు! నుంగరమిచ్చెను చిన్నివాడుగ మారి! యీ
శూరుడు పాఠము జెప్పెను రావణు క్షోణినంతయు గాల్చుచున్

తేనియలు

 [10/02, 14:48] Durga Madhuri: తేనియ 1.


వలదు నరుల నమ్మ వలదు ధరణిఁ

వంచనలను చేసి బాధ పేర్చు

సతము తెలివి తోడ సాగవలయు

జగతి సత్యమిదియె జయముఁ గూర్చు


పేరు: మాధురి

ఊరు: హైదరాబాద్

[11/02, 23:01] Durga Madhuri: తేనియ 2:

మనసు మాట వినదు! మాయ జేయు

లొంగిపోయినంత రోత మిగులు

తేలికవ్వబోకు తెలివి జూపు

ఉండదింక నెపుడు నీకు దిగులు


పేరు: మాధురి

కలం పేరు: నాగిని

ఊరు: హైదరాబాద్

[11/02, 23:49] Durga Madhuri: తేనియ 3:


అన్ని కాలములు మనవి కావని

అణిగి మణిగి యున్న అలుసు కాము

ఎగిరి పడుట యెపుడు హీన గుణము

ఎవరు లేని నాడు నిలువ లేము


పేరు: మాధురి

కలం పేరు: నాగిని 

ఊరు: హైదరాబాద్

[12/02, 23:27] Durga Madhuri: తేనియ 4


పూజలెన్నొ చేసి పుణ్యమొంది

వెనక పాపములను జేయుటేల!

సుగుణ శీలుఁ గాని జనుల విధియు

నెపుడు గాయదండి! శంకలేల!


పేరు: మాధురీ దేవి

కలంపేరు: నాగిని

ఊరు: హైదరాబాదు

చరవాణి: 9963998955

[13/02, 22:26] Durga Madhuri: తేనియ 5


తనువు నాది కాదు మనసు తెలుపు

తలపు పై యధిపత్యముయు లేదు

మరి యింక రంధ్రి యేల నరుడా

మాయ పొరలు విడుమ యనక చేదు

[15/02, 14:15] Durga Madhuri: తేనియ 6

చుట్టూ ఎందఱు ఉన్నా బ్రతుకు

సతతము ఒంటరిదే తోడుగా

ఎవఱూ ఉండరు! ఏలనన! మన

మది తలపెవఱికీ తెలియదుగా

[15/02, 16:06] విజయప్రసాద్ యన్. తేనియలు: మలివయసున తన మనుగడ కొఱకు

యవ్వ కష్టపడుచు యవని నందు

బ్రతుకు రీతిఁ తెలియ పరచుట గని

మెచ్చుకొనగ రండు! మేలు అందు

[16/02, 08:43] Durga Madhuri: పాము దెచ్చి పాలు పోసి పెంౘ

కాటు మాననట్లు మదిని నిండు

కల్మషమును గలిగినట్టి నరుడు

నుసురు నెపుడు తీయుచు నేయుండు

[17/02, 22:18] Durga Madhuri: తేనియ 8


ధైవ నామము తో చేద మనకు

పాప నాశము జరిగి పుణ్యములు

కొంత దక్కు కనుక విడువకుమా

తగ్గును కొన్నియైనా యిడుములు


పేరు:


మాధురీ దేవి

కలం పేరు: నాగిని

ఊరు: హైదరాబాద్

చరవాణి: 9963998955

[19/02, 01:17] Durga Madhuri: తేనియ 9


సైనికులేమన రక్షణ ధరణిన్

రైతులే యాకలి దీర్చు ఘనులు

వైద్యులు ప్రాణము నిలుపును సురులు

వీరందఱనూ గొలువరు జనులు


పరిచయము:


పేరు: మాధురి

కలము పేరు: నాగిని

ఊరు: హైదరాబాదు