Monday, September 30, 2013

మౌనం - కవిత, సహనం

ఎందుకే మనసా నీకింత మౌనం

వైపు సాగుతోంది నీ పయనం

ఎన్నాళ్ళిలా నిన్ను నువ్వు మరవటం

కలం సాగటానికి పదాలు కరవా
కవిత్వం రాయటానికి భావం బరువా
ఎద పొలము పై పదం పండలేదేమి
వాడిపోని అందం వున్నా ప్రకృతి
అక్షరాల విత్తులు నాటను అంటున్నదా
సప్త వర్ణాల హరివిల్లుల ఆకాశం
వాటికి చినుకులు అందించను అంటున్నదా


సర్దుకుంటే పోయేదానికి సఖులతో సమరమేలా
సాకులెతికి ఉతకనేలా సహనమే సమర్థత కాదా
సంధి ఎప్పుడూ హితమే సుమా
సమస్యలన్నవి ఉండవు వినుమా


ప్రతీ దానికీ పంతమేల
ప్రతీకారానికి అంతమేది
ప్రశాంతతకు మూలం కాదది
ప్రగతి బాటకు తీసుకుపోదది

సమర్ధత అంటే సంధి అనెను కృష్ణుడు
సహనమె సిసలైన ఆయుధం అనెను విదురుడు
సహేతుకమైన ఇట్టి సిద్ధాంతముల్ సడి చేయవే మానవులారా
స్టడీ చెయ్యండి ఈ సత్యాన్ని ఓ మేధావులారా

No comments: